గో మూత్రంలో బంగారం.. గుజరాత్‌లో కలకలం.
+++++++++గో మూత్రంలో బంగారం..
గుజరాత్‌లో కలకలం.!++++++++++
గుజరాత్‌లో కలకలం.!++++++++++
గోమాత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గోవును తాకితే పాపాలు హరిస్తాయన్నది భారతీయుల విశ్వాసం. అయితే గో మాత మూత్రంలో బంగారం ఉందన్న విషయం తాజాగా వెలుగు చూసింది. గో మూత్రంలో బంగారం..టైటిల్ చూడగానే ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ ఇదంతా ఏ కలలోనో.. కల్పితమో కాదు మన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో వెలుగు చూసిన విషయం. అయితే గో మూత్రంలో బంగారం ఉంటుందని మన పూర్వీకులు చెబుతుండేవారు. ఆ మాటలు ఇప్పుడు శాస్త్రీయంగా, అక్షరాలా నిజమయ్యాయి. గో మూత్రంలో బంగారం దాగుందని పరిశోధకులు చేసిన వినూత్న ప్రయోగంలో తేలింది. ఈ వార్త గుజరాత్ రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ యూరిన్ బంగారాన్ని చూసేందుకు జనాలు క్యూ కట్టారట.
సుమారు 400 గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రాలను సేకరించిన జేఏయూ(జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్శిటి) పరిశోధకుడు ప్రయోగం చేశారు. గోవుల నుంచి లీటర్ మూత్రాన్ని సేకరించి పరిశీలించగా మూడు నుంచి 10గ్రాముల బంగారం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఈ బంగారం అయాన్ల రూపంలో ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన కోసం ‘గ్యాస్ క్రోమటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ’(జీసీ-ఎంఎస్) పద్ధతిని వినియోగించి విశ్లేషించామని మీడియాకు వెల్లడించారు.అంతేకాదు ఇతను ఒక్క గోవు మూత్రంతోనే కాకుండా ఒంటెలు,గేదెలు, మేకల నుంచి మూత్రం సేకరించి ప్రయోగం చేశాడు. అయితే వాటిలో యాంటి బయోటిక్ పదార్థాలు కనిపించలేదు ఆఖరిగా గో మూత్రంలో బంగారం ఉందని తేల్చిచెప్పాడు. పూర్వీకులు చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకున్న బయోటెక్నాలజీ పరిశోధకుడు డాక్టర్ బి.ఏ గొలాకియా జీసీ-ఎంఎస్ పద్దతితో సక్సెస్ అయ్యాడు. ఇది వరకు గో మూత్రంలో ఔషధ గుణాలే కాదు బంగారం ఉందన్న విషయాన్ని బయటపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే.
LIKE US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565