MohanPublications Print Books Online store clik Here Devullu.com

అష్ట దిక్పాలక స్తుతి, Astha Diggajala Suthi

అష్ట దిక్పాలక స్తుతి
Astha Diggajala Suthi


అష్ట దిక్పాలక స్తుతి..
హరి శిఖి ధర్మ దైత్య వరుణానిల యక్ష శివుల్, గజాజ కా
సర నర నక్ర కైణ హయ శక్వర యానులు, వజ్ర శక్తి ము
ద్గర శర పాశ కుంత సృణి కార్ముక హస్తులు, భోగ శుద్ధి సం
గరజయ శౌర్య సత్త్వ జవ కావ్య విభూతులు మాకు నీవుతన్.
ప్రతి పదార్థాలు ....
హరి = (తూర్పు దిక్కును పాలించే) ఇంద్రుడు
శిఖి = (ఆగ్నేయ దిక్కును పాలించే) అగ్ని
ధర్మ = (దక్షిణ దిక్కును పాలించే) యమధర్మరాజు
దైత్య = (వైరృతి దిక్కును పాలించే) నిరృతి
వరుణ = (పశ్చిమ దిక్కును పాలించే) వరుణుడు
అనిల = (వాయవ్య దిక్కును పాలించే) వాయువు
యక్ష = (ఉత్తర దిక్కును పాలించే) కుబేరుడు
శివుల్ = (ఈశాన్య దిక్కును పాలించే) ఈశానుడు అనే అష్టదిక్పాలకులు,
గజ = ఐరావతమనే ఏనుగు
అజ = పొట్టేలు
కాసర = దున్నపోతు
నర = మానవుడు
నక్రక = మొసలి
ఏణ = జింక
హయ = గుఱ్ఱం
శక్వర = ఎద్దు
యానులు = వాహనాలుగా గలవారు,
వజ్ర = వజ్రం
శక్తి = బల్లెం
ముద్గర = గద
శర = బాణం
పాశ = నాగపాశం
కుంత = ఈటె
సృణి = అంకుశం
కార్ముక = విల్లు
హస్తులు = చేతుల్లో ధరించేవారు,
భోగ = సుఖం
శుద్ధి = పవిత్రత
సంగరజయ = యుద్ధంలో విజయం
శౌర్య = శూరత్వం
సత్త్వ = బలం
జవ = వేగం
కావ్య = క్షేమం
విభూతులు = సంపదలను
మాకు + ఈవుతన్ = మాకు ఇచ్చెదరు గాక!
తాత్పర్యం .............
ఏనుగు వాహనంగా, వజ్రం ఆయుధంగా గలిగి తూర్పుదిక్కును పాలించే ఇంద్రుడు సుఖాన్ని,
పొట్టేలు వాహనంగా , బల్లెం ఆయుధంగా గలిగి ఆగ్నేయదిక్కును పాలించే అగ్ని పవిత్రతను,
దున్నపోతు వాహనంగా, గద ఆయుధంగా గలిగి దక్షిణదిక్కును పాలించే యముడు యుద్ధవిజయాన్ని,
మానవుడు వాహనంగా, బాణం ఆయుధంగా గలిగి నైరృతిదిక్కును పాలించే నిరృతి శూరత్వాన్ని,
మొసలి వాహనంగా, నాగపాశం ఆయుధంగా గలిగి పశ్చిమదిక్కును పాలించే వరుణుడు బలాన్ని,
జింక వాహనంగా, ఈటె ఆయుధంగా గలిగి వాయవ్యదిక్కును పాలించే వాయువు వేగాన్ని,
గుఱ్ఱం వాహనంగా, అంకుశం ఆయుధంగా గలిగి ఉత్తరదిక్కును పాలించే కుబేరుడు క్షేమాన్ని,
ఎద్దు వాహనంగా , విల్లు ఆయుధంగా గలిగి ఈశాన్యదిక్కును పాలించే ఈశానుడు సంపదలను
మాకు ప్రసాదింతురు గాక!

LIKE US TO FOLLOW:---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list