MohanPublications Print Books Online store clik Here Devullu.com

పితృదేవతల అనుగ్రహం ఉంటే

పితృదేవతల అనుగ్రహం ఉంటే


పితృదేవతల అనుగ్రహం ఉంటే
మాతాపితరలను కలిపి పితరులు అంటాము. వారిని సరిగ్గా చూసుకుని ఆనందపరిస్తే వారు ఆనందించడమేకాక పితృదేవతా వ్యవస్థ ఆనందిస్తుంది. మరి దేవతలకు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. మరి పితృదేవతలకు..?.. ఉంది. బృహద్ధర్మ పురాణంలో `పితృస్తుతి` అనేది ఉంది. ఇది చాలా మహిమాన్వితమైనది. సాక్షాత్తు బ్రహ్మదేవునిచే చేయబడిన స్తోత్రరాజము. దీనిని ప్రతిరోజూ లేదా శ్రాద్ధ దినములందు చదువవలెను. ప్రత్యేకించి మన పుట్టినరోజునాడు తప్పక చదువవలసినది. పితృదేవతల అనుగ్రహం ఉంటే అందరు దేవతల అనుగ్రహం ఉన్నట్లే.
1. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ; సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే.
2. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గీయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయచ.
3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయతే నమ: సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయచ.
4. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మయావపు: సంభావనీయం ధర్మార్ధే తస్మై పిత్రే నమోనమ:
5. తీర్థస్నానతపోజపాది యస్య దర్శనం మహాగురోశ్చగురవే తస్మై పిత్రే నమోనమ:
6. యస్య ప్రణామస్తవనత: కోటిశ: పిత్రుతర్పణం అశ్వమేధశతై: తుల్యం తస్మై పిత్రే నమో నమ:
ఫలశ్రుతి:
(1) ఇదం స్తోత్రం పుణ్యం య:పఠేత్ ప్రయతో నర: ప్రత్యహం ప్రాతురుత్థాయ పితృశ్రాద్ధ దినోపివా
(2) స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞతాది వాంఛితం
(3) నానాపకర్మక్రుత్వాభి య:స్తౌతి పితరం సత: స ధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీభవేత్. పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి.
+++++++++++++++++++++++
పితృ దేవతల అనుగ్రహం ఉంటే......
దేవతలకు కూడా దేవతలలాంటి వారు పితృదేవతలు, వీరి అనుగ్రహాన్ని పొందితే సర్వ శుభాలు, సంపదలు చివరకు దివ్వశక్తులు కూడా సమకూరు తాయని వివరించి చెప్పే కథా సందర్భం ఇది. మత్యని మహాపురాణంలో బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతం అనే అధ్యాయంలో ఇది కన్పిస్తుంది. పూర్వం పాంచాల దేశానికి అణుహుడు అనే రాజుండే వాడు. అయన విభ్రాజం అనే వంశానికి చెందినవాడు. అయనకు బ్రహ్మ దత్తుడు అనే కుమారుడు జన్మించాడు. బ్రహ్మ దత్తుడు పరాక్రమవంతుడేకాక వినయ శీల సంపన్నుడు. చిన్నప్పటి నుంచి అతడికి సర్వప్రాణుల మీద దయ ఉండేది. చిన్న చీమ మొదలు పెద్ద పెద్ద జంతువులు, పక్షుల భాషలు కూడా అతడికి అర్ధమవుతుండేవి. అతడికి యుక్తవయస్సు రాగానే అతడి తండ్రి అయిన అణుహుడు సన్నతి అనే ఒక ఉత్తమ కన్యతో వివాహం జరిపించాడు.
సన్నతి,బ్రహ్మదత్తుల వైవాహిక జీవితం సుఖంగా గడవసాగింది.
ఎందుకు నవ్వుతావు?
ఒ రోజున బ్రహ్మ దత్తుడు, సన్నతి ఇద్ధరూ వన విహారానికి వెళ్లారు. హాయిగా వనంలో తిరుగు తున్న సమయంలో బ్రహ్మదత్తుడికి ఓరెండు చీమలు కన్పించాయి. భార్యాభర్తలైన అ రెండు చీమలూ సరసాలాడుకోవటం చూసి నవ్వొచ్చింది.
శృంగారమనేది సర్వప్రాణులలోనూ ఎంతో అనందదాయకమైన విషయం కదాని అశ్చర్యంగా అతడు తనలో తాను నవ్వుకున్నాడు. రాజు అలా నవ్వటాన్ని చూసిన సన్నతి తనను చూసే తన భర్త ఎగతాళిగా నవ్వుతున్నాడని అనుకుంది. తన వైపు నుంచి ఏదన్నా తప్పు జరిగిందేమోనని అను కొంటూ అదే విషయాన్ని గురించి బ్రహ్మదత్తుడిని అడిగింది. అతడు నిన్ను చూసి కాదులే నేను నవ్వుతోంది అని అన్నాడు. మరెందుకు నవ్వుతు న్నావో చెప్పమని ఆమె అడిగింది. అప్పుడు ఆ రాజు
ఆమెకు చీమల విషయాన్ని చెప్పాడు. చీమల భాష నీకెలా తెలుసునని ఆమె అడిగింది. నేనెక్కడా నేర్చుకోలేదు కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసులే అని అన్నాడు రాజు ఆమాటలను ఆమె నమ్మకపోగా రాజు హేళనగా నవ్వింది తనను చూసేనని మరీమరీ బాధపడుతూ రాజుకు దూరంగా జరిగింది. ఆ పరిస్ధితిని ఎలా చక్క దిద్దాలో అయనకు అర్ధం కాలేదు, తనకు చేతనైనదల్లా ఒక్క శ్రీమహావిష్ణువు ధ్యానమే కనుక అయనను గురించి ఆ మరుక్షణం నుంచే తీవ్రంగా ధ్యానం చేశాడు. ఆ రోజు రాత్రికి శ్రీమహావిష్ణువు కలలో కన్పించి, మరునాడు ఓ వృద్ధ బ్రహ్మణుడు బ్రహ్మదత్తుడికి కన్పిస్తాడని అతడే అంతటినీ వివరించి చెప్పగలడని అన్నాడు.
పితృశ్రాద్ధప్రభావం కలలో విష్ణువుకు కన్పించిన విషయాన్ని రాజు ఉదయాన్నే తన భార్యకు, అంతరంగికులైన మరో ముగ్గురు మంత్రులకు చెప్పాడు. అంతేగాక ఆరోజు సాయంత్రం తన భార్యను ముగ్గురు మంత్రులను వెంట పెట్టుకొని మళ్లీ విహారానికి బయలుదేరాడు. అలా వెళ్లేటప్పుడు కలలో విష్ణువు చెప్పినట్లు దోవలో ఓ వృద్ధ బ్రహ్మణుడు కన్పించాడు. అయనను బ్రహ్మ దత్తుడు ఏదో అడగబోయాడు. ఆ లోపునే ఆవృద్థ బ్రహ్మణుడు మాట్లాడుతూ గత జన్మలో బ్రహ్మదత్తుడు పితృ
శ్రాద్ధాన్ని సక్రమంగా శాస్త్రవిధిగా నియమ నిష్ట లతె అచరించినందువల్లనే అతడికి సర్వశుభాలు, సర్వప్రాణుల భాషలు తెలుసుకోగల శక్తి లభించిందని వివరించాడు. ఆ మాటలను వినగానే రాజు ఆశ్చర్య చకితుడయ్యాడు. ఆ వృద్ధుడు బ్రహ్మదత్తుడి మూడు, నాలుగు గత జన్మల గురించి కూడా వివరించి చెప్పటంతో మరీ మరీ ఆనందపడి అతడికి అనేకానేక కాను కలను ఇచ్చి సంతృప్తిపరచి పంపాడు. అప్పటికి
అక్కడే ఉన్న సన్నతికి విషయమంతా తెలిసి తన భర్త గొప్పతనాన్ని గురించి తెలుసుకొని ఆనందించింది.భారతీయ సంప్రదాయంలో పితరులకు శ్రాద్ధాదులను క్రమం తప్పకుండా సమర్పించట మనే సంప్రదాయం ఉంది. పితృదేవతలు శ్రాద్ధంతో సంతృప్తి చెందుతారు. దానికి బదులుగా వారు తమకు శ్రాద్ధం ఇచ్చిన తమ వంశం లోని వారికి సంపదలు, సంతానం, విద్య, భోగభగ్యాలు ఆరోగ్యం అన్నీ సమకూరు స్తారన్నది నమ్మకం. ఈ నమ్మకాన్ని సమర్ధించే కథే ఇది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list