MohanPublications Print Books Online store clik Here Devullu.com

రస‘పట్టు’ గుట్టుమట్లు

రస‘పట్టు’ గుట్టుమట్లు


+++++++++రస‘పట్టు’ గుట్టుమట్లు!:+++++++++
చాలా వివాహిత జంటలలో శృంగారం మొక్కుబడిగా సాగుతుంటుంది. కారణం లైంగిక విజ్ఞానలేమి. పరస్పరం ఎదుటివారికేం కావాలో తెలియకపోవడం..
భర్తలు తెలుసుకోవాల్సినవి
* శారీరక పరిశుభ్రత విషయంలో మగాళ్లు ఆడవాళ్లకంటే వెనకబడే ఉంటారు.. నోరు తెరిస్తే సిగరెట్‌/ పాన్‌ కంపు, ఒళ్లంతా చెమట వాసన! ఇవన్నీ భార్యలకు నచ్చవు. అంచేత స్నానంచేసి మౌత్‌ఫ్రెషనర్‌లాంటివి వాడుకుంటూ ముందడుగు వేయడం మేలు. తమ ఇబ్బందుల్ని వారు నేరుగా చెప్పలేకపోవచ్చు. కానీ ఈ సత్యం పతిదేవుళ్లందరూ మనసులో పెట్టుకోవాలి.
* శృంగారానికి సంబంధించి మగాడి దైహిక, మానసిక స్థితులకు భిన్నం స్త్రీ ప్రకృతి. పురుషుడిలా కాక మెల్లమెల్లగా పతాకస్థాయికి చేరుకుంటుందామె. కనుక సున్నిత½ంగా దేహవీణ మీటుతూ ఆమెను సన్నద్ధం చేయాలి. దేహంలో ఏ భాగాన్ని తాకితే ఎలా స్పందిస్తోందో గ్రహిస్తూ ప్రణయ ద్వారాలు తీయాలి. తద్వారా ఇద్దరూ పారవశ్యంలో ఓలలాడడానికి వీలవుతుంది.
* సిగ్గుతెరలలో దాగే ఆమెను నవ్విస్తూ, కవ్విస్తూ మృదుమధురంగా మాట్లాడుతూ మాట్లాడిస్తూ బిడియాన్ని పోగొడుతూ మదనసామ్రాజ్యానికి మహారాణిగా సంభావిస్తూ, ప్రోత్సహిస్తూ అడుగులు కదపాలి. కొద్దిగా కవిత్వం ఒలకబోయగలిగితే ఇంకా మంచిది..
* చిత్రాల్లో నీలిచిత్రాల్లోలా శృంగారం సాగాలని ఆరాటపడకండి. వాటికీ జీవితానికీ తేడా ఉంటుంది.. ఆమెను భావోద్వేగాలున్న సాటి మనిషిగా చూడాలి తప్ప శృంగారానికి పనికొచ్చే బొమ్మగా భావించకూడదు.
* చాలామంది చేసేతప్పు రసరాజ్యంలో విహరించినంత సేపూ విహరించి తమ తపన తీరంగానే చటుక్కున పక్కకు తిరిగి గురకపెట్టేయడం. భాగస్వామి పరిస్థితిని పట్టి్టంచుకోకపోవడం.. ఇది దారుణం.. పరమ స్వార్థం కూడా. కనీసం మెల్లగా లాలించి, కౌగిలిలోకి తీసుకోవడం కూడా ఉండదు. ఆమె కొంచెం చొరవ చూపితే విసుగు. ఆమె భావనల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ మెల్లగా కార్యక్రమాన్ని ముగించడం మేలు.
* శృంగార పరంగా ఆమె ­హలు, అభిరుచులు అనేకం ఉంటాయి. అవి అర్థం చేసుకోవడానికి మనసు ఉండాలి. తనకేం కావాలో ఆమె తన దేహభాష ద్వారానే వెల్లడిస్తుంటుంది.. అలా ఆమె మనసెరిగి మసలుకునేవాడే మాధవుడు.. మా‘ధవుడు’! అందుకని ఆమె మనసులోతుల్లోకి చూడగలగాలి. ఏ తంత్రి మీటితే ఏ రాగం పలుకుతుందో అనురాగం వెల్లువవుతుందో తెలియడం అవశ్యం.
భార్యలు తెలుసుకోవాల్సినవి
* పడకగదిలో భార్య తనకేం పట్టనట్టు రబ్బరు బొమ్మలా పరుండడం ఏ భర్తకూ ఇష్టం ఉండదు. స్పందన, ప్రతిస్పందన లేకుండా మొక్కుబడిగా కళ్లుమూసుకుంటారు చాలా మంది మహిళలు. ‘శృంగారం కేవలం మగాడికి సంబంధించిన అంశం కాసేపు కళ్లు మూసుకుంటే పోలా’ అన్నట్లు చైతన్య రహితంగా ఉండే ధోరణి ఏ భర్తకీ నచ్చదు. అనుభూతి ఆస్వాదనకు తమవంతు సహకారం అందిస్తేనే ఇద్దరికీ విజయం సిద్ధిస్తుంది.
* ప్రతిసారీ పురుషుడే చొరవతీసుకుని ప్రణయ విహారానికి తయారవడం సహజం. భాగస్వామి తనంత తానుగా చొరవ చూపకపోవడం అతనికి విసుగు అన్పిస్తుంది. భార్యే చొరవ తీసుకోవాలనీ ఆమె స్వయంగా తనను పడక గదికి ఆహ్వానించాలని అతను కోరుకుంటాడు. ప్రతిసారీ కాకపోయినా అడపాదడపా ఆమె అలా చొరవచూపితే అతను మరింత ఉత్తేజితుడవుతాడు..
* తమ అంగసౌష్టవం గురించి చాలా మంది మహిళలకు అనుమానాలెక్కువ.. అందంగా లేమేమోనని! అందుకే ముడుచుకుపోతుంటారు. అది భర్తలకు నచ్చదు. పడకగదిలో అందాల ఆరబోతకు వెనుకాడే వారిని చూసి భర్తలు నిరుత్సాహానికి గురవుతారు. ఈ విషయం ప్రతిభార్యా గుర్తించాలి.
* భావప్రాప్తి విషయంలో భార్యలు అస్సలు బయటపడరు. భర్త అడిగితే అసలు నిజం చెప్పకుండా అతన్ని తృప్తిపరచడానికి అలవోకగా అబద్ధమాడేస్తారు. తృప్తి విషయమై వారలా అబద్ధాలు చెప్పడం ఎందుకని బాధపడతారు భర్తలు. కనుక ఆ విషయంలో నిజాయితీగా ఉండాలి భార్యలు.
* రసధునిలో తేలియాడాలని భర్తలు ఉవ్విళ్లూరేవేళ చాలా మంది భార్యలు యాంత్రికంగా ఒళ్లప్పగిస్తూనే ఇంట్లో సమస్యల గురించి, ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా భర్తలకు నచ్చని అంశాలు ప్రస్తావిస్తూ ‘మీ అమ్మ అలా అంది.. మీ చెల్లెలు ఇలా చేసింది’ అంటూ విమర్శిస్తూ చిరాకు తెప్పిస్తారు. ‘కార్య’ విముఖుల్ని చేస్తారు.
ఆడా మగా ఇలాంటి లోపాల్ని సవరించుకుంటే ఎవరికివారే సరస బృందావనంలో రాధాకృష్ణుల్లా విహరించవచ్చు అంటారు నిపుణులు.
-సీపీ కంతేటి


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list