బాస్ ఈజ్ బ్యాక్
Boss is Boss
+++++++++++++++++++++++++
‘బాస్ ఈజ్ బ్యాక్’..
యస్... అయామ్ బ్యాక్
మెగా పంచ్
+++++++++++++++++++++++++
‘బాస్ ఈజ్ బ్యాక్’..
యస్... అయామ్ బ్యాక్
మెగా పంచ్
+++++++++++++++++++++++++
‘స్వయంకృషి’తో పైకొచ్చారు.
బాక్సాఫీస్‌కు ‘ఘరానా మొగుడు’ అయ్యారు.
సినీ ఆలయ కట్టడానికి ‘ముఠా మేస్త్రి’ అయ్యారు.
అభిమాన పీఠానికి ‘ఇంద్ర’ సేనుడయ్యారు.
గుండెల్ని టచ్ చేసే ‘శంకర్‌దాదా’ అయ్యారు.
... ఇది చిరంజీవి ‘పాంచ్ పటాకా’!

సినిమాల్లోని ఈ అయిదు పాత్రలనూ ఆయన ‘మా’ అవార్‌డ్స ఫంక్షన్‌లో మరోసారి నటించారు. సారీ... జీవించారు! అదే - మెగా ‘పంచ్’! మరి... ఇంతకీ ఎంటర్‌టైన్‌మెంట్? అభిమానుల ‘గ్యాంగ్ లీడర్’ అయి, స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు! 150వ సినిమా మైలురాయి దాటేందుకు మొదటి స్టెప్పేశారు!
కంగ్రాట్స్ అండీ! కెరీర్‌లో 150వ మైలురాయిని దాటించే కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు కదా! ఎలా ఉంది?
తొమ్మిదేళ్ళ తరువాత మళ్ళీ పూర్తిస్థాయి పాత్ర, సినిమా చేస్తున్నా! కొన్ని దశాబ్దాల పాటు నాకు అలవాటైన ఆర్క్ లైట్స్ ముందుకి, సెట్స్‌లో అందరి ముందరికీ మళ్ళీ రావడం ఎంతో ఉత్సాహంగా ఉంది.

‘మా’ అవార్డ్స్ ఫంక్షన్‌లో మీ ప్రోగ్రామ్, మీ డ్యాన్‌స ఇప్పుడు హాట్ టాపిక్. మీ కమ్‌బ్యాక్‌కు ఇది టీజర్ అనుకోవచ్చా?
‘మా’ టీవీ వాళ్ళు వచ్చి, అవార్డ్స్ ఫంక్షన్‌లో ప్రోగ్రామ్ చేయమన్నప్పుడు వెంటనే ఒప్పుకోలేదు. చెయ్యడానికి నేను సుముఖంగా లేను. ఒకపక్క కథా చర్చలు, మరోపక్క కాస్ట్యూమ్స్ లాంటి వాటన్నిటితో నిండా మునిగి ఉన్నా. ఆ టైమ్‌లో ఇది ‘ఎక్‌స్ట్రా ప్రెజర్’ అవుతుందనిపించింది. తర్జనభర్జనలు పడ్డా. ఒక పక్కన మైలురాయి సినిమా చేయడానికి సిద్ధమవుతూ, ఇలా కనపడడం ఎంతవరకూ కరెక్ట్ అని కూడా సంశయించాను. కానీ, ‘మా’ టీవీతో మొదటి నుంచి ఆత్మీయంగా, ఒకప్పుడు వ్యాపారాత్మకంగా ఉన్న అనుబంధం రీత్యా వాళ్ళ అభ్యర్థనను తోసిపుచ్చలేకపోయా. ఇది నా ‘కమ్ బ్యాక్’కు కూడా ఒక చిన్న ప్రయోగాత్మక పరీక్షలా ఉంటుందని అంగీకరించా. ఒకసారి ఒప్పుకున్నాక, పూర్తి అంకితభావంతో చేశా.

ప్రోగ్రామ్ కోసం 6 గెటప్పులు, 5 పాత్రలు వేశారట!
(ముఖంలో ఆనందంతో...) అవునండీ! 6 కాస్ట్యూమ్ ఛేంజ్‌లు, 6 మేకప్‌లు, 6 గెటప్పులు... 5 హిట్ సినిమాల పాత్రలు... ఒక దానికి గడ్డం ఉండాలి. మరోదానికి ఉండకూడదు... ఇలా! నాకు కూడా ఉత్సాహం అనిపించింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ప్రయాణాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసేలా 29 ఏళ్ళ నాటి ‘స్వయంకృషి’ (1987) మొదలు ‘ఘరానామొగుడు’ (’92), ‘ముఠామేస్త్రి’ (’93), ‘ఇంద్ర’ (2002), ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్’ (2004) దాకా వైవిధ్యభరితమైన అయిదు హిట్ సినిమాల్లోని పాత్రలు మళ్ళీ యాక్ట్ చేశా. ఈ హిట్ క్యారెక్టర్లన్నీ నన్ను వెండితెరకు పునఃస్వాగతిస్తూ, నాతో ఆత్మీయంగా మాట్లాడేలా ప్రోగ్రామ్‌ని ‘మా’ టీమ్ డిజైన్ చేసింది.

అప్పటి పాత్రల్ని ఇప్పుడు చేయడం రిస్క్ అనిపించలేదా?!
అలా కాదు కానీ, మొదట కొంచెం ఆలోచించా. ఆ తరువాత చేసేశా. అలాగే, నా సినిమాల్లోని సూపర్‌హిట్ పాటలకు యువ హీరోలు డ్యాన్స్ చేయడం, తనికెళ్ళ భరణి గారు గురువుగా, అలాగే దేవిశ్రీప్రసాద్, రాశీఖన్నా, ముమైత్ ఖాన్, ప్రజ్ఞా జైశ్వాల్, తమన్నా నా ఈ ప్రత్యేక యాక్ట్‌లో పాల్గొనడం నాకెంతో సంతోషమిచ్చింది.

అలాగే, ఎన్నడూ వేదికలపై డ్యాన్స్ చేయని మీరు ‘మా’ అవార్డ్స్ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేయడం అందరికీ సర్‌ప్రైజే!
(నవ్వేస్తూ...) నిజానికి, సినీ నటుడిగా జనం మధ్య ప్రత్యక్షంగా ఇలా వేదికపై డ్యాన్స్ చేసింది ఎన్నడూ లేదు. తెలుగు సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకున్నప్పుడు హైదరాబాద్‌లో జరిగిన మూడు రోజుల వేడుకలో ఒకసారి నర్తించా. పరిశ్రమ మొత్తం కలసి చేసిన ఆ పండుగలో నేను, తమ్ముడు (పవన్) కల్యాణ్, ఇతరులం కలసి ‘శంకర్‌దాదా’లోని ‘చైల...చైల...’ పాటకు డ్యాన్స్ చేశాం. అది జరిగి పదేళ్ళు అయిపోయింది. ఆ తరువాత వేదికపై మళ్ళీ డ్యాన్స్ చేయడం ఇదే. రిహార్సల్స్ చూసుకొని, ‘గ్యాంగ్‌లీడర్’ (’91)లోని ‘గ్యాంగ్... గ్యాంగ్... బజావో బ్యాంగ్ బ్యాంగ్’ పాటకు డ్యాన్స్ చేశా. హీరోలు శ్రీకాంత్, సునీల్, నవదీప్, సాయిధరమ్ తేజ్ కూడా నాతో పాటు డ్యాన్స్ చేయడం ఆనందంగా అనిపించింది. అప్పటి ఆ పాట, మ్యూజిక్‌కి డ్యాన్స్ చేస్తుంటే, నా ఒంట్లో తెలియని ఉత్సాహం నిండిపోయిందంటే నమ్మండి! నా నుంచి జనం ఏం కోరుకుంటున్నారో అది ఆ డ్యాన్స్ ద్వారా అందించా. ప్రముఖులందరూ బాగా మెచ్చుకున్నారు.

మరి, మీ ఇంట్లోవాళ్ళ స్పందన ఏంటి?
సంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై నా డ్యాన్స్ చూసి, మా అబ్బాయి రామ్‌చరణ్ ఉద్వేగంతో తనను తాను ఆపుకోలేకపోయాడు. వేదిక కింద వాళ్ళమ్మ చేయి వదిలిపెట్టి, గబగబా పైకి పరిగెత్తుకొచ్చి, నన్ను కౌగలించుకున్నాడు. ఏమివ్వాలో తెలీక, చేతిలోని మంచినీళ్ళ బాటిల్ ఇచ్చాడు.

మీ వెన్నంటి నిలిచిన మీ శ్రీమతి స్పందన ఏంటో చెప్పలేదు!
నాకెప్పుడూ వచ్చే తొలి స్పందన మా ఆవిడ సురేఖ నుంచే. ఆ పాత హిట్ గెటప్స్ వేసుకు నటించిన ప్రోగ్రావ్‌ు చూసి, ఆమె ఆ రోజుల్లోకి వెళ్ళిపోయింది. ఇక, స్టేజ్‌పై నా డ్యాన్స్ చూసి, అప్పటి ఆ గ్రేస్, ఆ రిథమ్ సెన్స్, ఆ ఎక్స్ ప్రెషన్స్ అన్నీ అచ్చం అలాగే ఉన్నాయని మెచ్చుకుంది.

ఏళ్ళ క్రితం నాటి పాత్రల్ని మళ్ళీ ఇప్పుడు కెమేరా ముందు నటించారంటే, ఆ పాత్రల మేనరిజమ్స్, డైలాగ్ పలికే పద్ధతి సరిగ్గా అలాగే ఉండేలా మీరు ఏమేం కసరత్తులు చేశారు?
ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలని ‘మా’ టీవీ వాళ్ళతో పలుసార్లు చర్చ జరిగినప్పుడు, ఫలానా క్యారెక్టర్లు చేద్దామని వాళ్ళ క్రియేటివ్ టీమ్ ఎంపిక చేసింది. (ముఖంలో ఆనందంతో...) మీరు నమ్మరు... ఈ ప్రోగ్రామ్ కోసం ఆ సినిమాలు, పాత్రల్ని మళ్ళీ ఒక్కసారి కూడా చూడలేదు. రిహార్సల్సూ ఏమీ చేయలేదు. ఆ గెటప్‌లు వేసుకోగానే, నాకు మళ్ళీ అప్పటి ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మేనరిజమ్స్ అన్నీ వచ్చేశాయి. అదే స్థాయిలో, అంతే ఉత్సాహంతో, అదే రిజల్ట్ వచ్చేలా చేయగలిగా.

దర్శకులు కె. విశ్వనాథ్ ‘స్వయంకృషి’ గెటప్‌లో చూసి, అప్పటిలానే ఉన్నావని మెచ్చుకోవడమెలా అనిపించింది?
(వెలుగుతున్న కళ్ళతో...) అలాంటి మహానుభావులైన దర్శకులు తీర్చిదిద్దిన ఆ పాత్రల్ని మనసా, వాచా, కర్మణా పూర్తిగా లీనమై చేస్తాం. నిజం చెప్పాలంటే, ఆ పాత్రల స్వరూప స్వభావాలు, మాట తీరు మొత్తం నరనరాల్లో ఇంకిపోయాయి. అందుకే, ఒక్కసారి గుర్తుచేసుకోగానే, ఆ పాత్రలన్నీ మళ్ళీ మన ముందుకొచ్చేస్తాయి. గెటప్ వేసుకోగానే ఆ పాత్ర నన్ను ఆవహించిందనిపించేది. ‘ఘరానా మొగుడు’ కామిక్ టైమింగ్, గుంభనంగా, నిండైన విగ్రహంతో ఉండే ‘ఇంద్ర’ హుందాతనం, చిత్రమైన నడకతో అలరించే ‘శంకర్‌దాదా’ కమర్షియాలిటీ, జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి పైకొచ్చిన ‘స్వయంకృషి’లోని ఆ నిజాయతీ లాంటివన్నీ మళ్ళీ నాలో సహజంగా పలికాయి. అలా ఆ పాత్రలకిప్పుడు పునఃప్రతిష్ఠ చేయగలిగా.

ఒకే రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల లోపల 6 గెటప్‌లు, 5 హిట్ పాత్రల షూటింగ్‌లు... చేశారట?
నిజమే. మైండ్‌లో ఏవేం చేయాలి, ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి అన్నది నిర్ణయించేసుకుంటే, రియల్ టైమ్‌లో చేసేయచ్చు. అదే చేశా. ఒక పని ఒప్పుకొనే ముందు వరకు ఆలోచించాలి కానీ, ఒక్కసారి ఒప్పుకున్నాక ఎంత శ్రమించి అయినా అంకితభావంతో చేయాలనేది నేను ఇన్నేళ్ళుగా నమ్మిన, ఆచరించిన సిద్ధాంతం. ఇక్కడా అదే పని చేశా. సినిమా కోసం పెంచుకున్న గడ్డం తీసేసి, ఈ ప్రోగ్రామ్ కోసం నటించా. డ్యాన్స్ చేశా. అందుకే, జూన్ 5 - 6 తారీఖులకే మొదలవ్వాల్సిన నా సినిమా షూటింగ్‌ను కూడా పదిహేను రోజులపైగా వాయిదా వేసుకున్నా.

ఈ 23న కొత్త సిన్మా షూటింగ్ మొదలైంది. చాలా రోజుల తర్వాత ఫస్ట్ రోజు సిన్మా షూటింగ్ అనుభవం ఎలా ఉంది?
బాగుంది. నిజానికి, షూటింగ్‌కు మూడు రోజుల ముందే మేకప్, కాస్ట్యూమ్స్‌తో టోటల్ గెటప్ వేసుకొని, ఫస్ట్ లుక్స్ తీసుకున్నాం. కెమేరాకు కొంత ఎక్స్‌పోజయ్యా. ఆ క్లిప్పింగ్స్ చూసి, అందరూ బాగుందన్నారు. మా దర్శకుడు వి.వి. వినాయక్ ‘కెమేరా ముందు ఇన్నేళ్ళ గ్యాప్ మీలో కనపడడం లేదు. ఇరవై ఏళ్ళ క్రితం నాటి చిరంజీవిలా కనిపిస్తున్నారు. ఇది మాకూ, సిన్మాకూ ఫస్ట్ సక్సెస్’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడే సగం సక్సెస్ అయ్యామన్నారు. డెరైక్టర్‌తో సహా అందరూ అలా చాలా భరోసా వ్యక్తం చేయడం మంచి అనుభూతి. ఇది శుభ శకునం.

ఈ సిన్మాతో నిర్మాతైన మీ అబ్బాయి రామ్‌చరణ్ రియాక్షన్?
చరణ్ తన సినిమా ‘ధ్రువ’ షూటింగ్‌కి తప్పనిసరై, కాశ్మీర్‌లో ఉండాల్సొచ్చింది. మనిషి అక్కడ ఉన్నాడనే కానీ, మనసంతా ఇక్కడే ఉంది. ‘తొలి రోజు షూట్ స్టిల్స్ చూసినవాళ్ళు, క్లిపింగ్స్ చూసినవాళ్ళు, నీ మేక్ ఓవర్ బాగుందని చెప్పారు’ అంటూ వాడు నాతో మాట్లాడాడు. తను దగ్గర లేకపోవడం వెలితిగా ఫీలయ్యాడు.

ఎన్నో సినిమాలు, పాత్రలు అవలీలగా చేసిన మీరు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారేం?
తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ పూర్తిస్థాయి సిన్మా చేస్తున్నా. అందులోనూ ఒక మ్యాజికల్ నంబర్ సినిమా. ఫ్యాన్‌సలో అంచనాలు, ఉత్సాహం చాలా ఉంటాయి. వాటికి దీటుగా ఉండాలనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. అన్ని వర్గాల వారినీ తృప్తిపరిచేలా జాగ్రత్త తీసుకున్నాం. అందుకనే సరైన కథ, కథనాన్ని ఎంచుకోవడానికి ఇంత శ్రమించాం.

ఎన్నో కథలు విన్నా, చివరకు తమిళ ‘కత్తి’ రీమేక్‌ను ఎంచుకున్నారు. కథ, మీరు చేసుకున్న మార్పులు తృప్తినిచ్చాయా?
వెరీమచ్ శాటిస్‌ఫైడ్! చాలా తృప్తికరంగా వచ్చింది.

మరి, జనం కోరే ఫైట్స్, డ్యాన్స్‌లు, కామెడీ పంచ్‌లు..?
అన్నీ ఉంటాయి (నవ్వు). ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఎవరినీ అసంతృప్తికి లోను చేయదు. (నవ్వుతూ) మీరు పెట్టలేదేమో మేం (మీడియా) పేరుపెట్టేశాం (నవ్వేస్తూ...) మీరు పేరు పెట్టేశారా! అయితే, చెప్పండి! మీరిచ్చిన టైటిల్ బాగుంటే, అదే తీసుకుంటాం.జోక్స్ పక్కనపెడితే,

‘మా’ ప్రోగ్రామ్‌తో టీజర్ ఇచ్చారు. అసలు సిన్మాలో ఈ ‘కత్తి లాంటోడు’ని చూడడానికి ఎంత కాలం?
ఏ అవాంతరాలూ లేకుండా అన్నీ అనుకున్నట్లు జరిగితే, రానున్న సంక్రాంతికి తెరపై కనిపిస్తా.

రాజకీయాల వల్ల మీ అభిమానులకూ, మీకిష్టమైన నటనకూ దూరమయ్యాననే బాధ ఏమైనా...?
కొన్నేళ్ళుగా నా శక్తియుక్తులన్నీ రాజకీయాలపై పెట్టా. దాంతో, సినిమాలపై దృష్టి పెట్టలేకపోయా. అంతే!

ఈ సినిమా తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తారా?
ఎందుకు చేయను! అవకాశం ఉన్నంత వరకు చేస్తా. 150 చేశాక... 151... 152... ఇలా చేసుకుంటూ వెళ్ళడానికి అడ్డంకులు, అభ్యంతరాలు ఏముంటాయి!

అయితే, ఇక రానున్న కొద్దినెలలు పూర్తిగా షూటింగ్‌తో బిజీ..
ఒక పక్కన షూటింగ్ చేస్తూనే, రాజ్యసభ సభ్యుడిగా, రాజకీయ నాయకుడిగా మా పార్టీకీ, ప్రజలకూ సేవ చేస్తా. సో... మీ సినీప్రియుల మాటల్లో ‘బాస్ ఈజ్ బ్యాక్’! (నవ్వేస్తూ...) యస్... అయామ్ బ్యాక్.

నటన అంటే మీ నరనరాల్లో జీర్ణించుకుపోయింది. కానీ, ఇప్పటికీ ఇంత యంగ్‌గా, అందంగా కనిపిస్తున్నారు. ఆ రహస్యమేమిటో మాతో పంచుకోవచ్చుగా?
(నవ్వేస్తూ...) రాజకీయాల్లో ఉంటూ ఫిజిక్‌ని గతంలో కొంత నిర్లక్ష్యం చేసినమాట వాస్తవం. కానీ, సినిమా చేయాలనుకున్నప్పుడు శారీకంగా ఫిట్‌నెస్ లేకపోతే, పాత్రకు న్యాయం చేయలేం. అలాగే, మానసికంగా ఎంత యాక్టివ్‌గా ఉన్నా, ఫేస్ కేర్ నుంచి అన్నీ చూసుకోవాలి. అందుకే, మళ్ళీ కొన్ని నెలలుగా అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో పెడుతున్నా.
యువ హీరోలే అసూయపడేలా ఇంత ట్రిమ్‌గా మారారు. బరువు కూడా బాగా తగ్గారు. ఏం చేస్తున్నారు?
రోజూ గంటన్నర సేపు జిమ్‌లో వ్యాయామం చేస్తు న్నా. అలాగే, ఆహారపుటలవాట్లు జాగ్రత్తగా చూసుకుంటున్నా. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటూ, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండేలా జాగ్రత్తపడుతున్నా. ప్రత్యేకంగా ఒక డైటీషియన్‌ని (ఆహార నిపుణుడు) పెట్టుకున్నా.

అవునూ... ఇంతకీ సినిమాకి డ్యాన్స్ ప్రాక్టీస్ మాటేంటి?
అది ఒంట్లోనే ఉంది. ఇప్పుడు మ్యూజిక్ పెట్టినా, డ్యాన్స్ చేసేస్తా (నవ్వులు). అప్పటి సినిమాల్లో ఆ ఏజ్‌లోని పాత్రల్ని తిరిగి ఇప్పుడు పోషిస్తుంటే, ఎలా కనపడతానో అనే మీమాంస నాకూ వచ్చింది. కానీ, ఆ గెటప్, కాస్ట్యూమ్స్‌తో ఇప్పుడు నటిస్తున్నప్పటికీ... సెట్స్‌లో, తర్వాత ఫంక్షన్‌లో రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. అచ్చం మళ్ళీ అప్పటిలానే ఉన్నారని పెద్దలు, అభిమానులు అందరూ అన్నారు. అది నాలో ఉత్సాహం నింపింది. కొత్త సినిమాకి సిద్ధమవుతున్న నాలో మళ్ళీ ఒక ఎంతో ఆత్మవిశ్వాసం వచ్చింది - డాక్టర్ రెంటాల జయదేవ

LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565