స్మార్ట్‌ఫోన్‌ను చీకట్లో వాడుతున్నారా
Using Smart Phones without Light
+++++++++++++++++++++++
స్మార్ట్‌ఫోన్‌ను చీకట్లో వాడుతున్నారా
+++++++++++++++++++++++
స్మార్ట్‌ఫోన్‌ను చీకట్లో వాడుతున్నారా
+++++++++++++++++++++++
రాత్రి పూట చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి చూడటం వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో కళ్లు పోయే ప్రమాదం కూడా ఉందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్లను పక్కన బెట్టుకుని పడుకోవద్దని అధ్యయనకారులు సూచిస్తున్నారు. రాత్రిపూట పడుకున్నప్పుడు వీటిని వాడడం వల్ల ట్రాన్సియెంట్ స్మార్ట్‌ఫోన్ బ్లైండ్‌నెస్ అనే కండిషన్‌కు గురవుతారని వారు చెప్పారు. చీకట్లో స్మార్ట్‌ఫోన్‌లను చూడడం వల్ల ఒక కన్ను చూపును కోల్పోయే ప్రమాదం ఉందట. ఇంగ్లండ్‌కు చెందిన 22 ఏళ్ల యువతికి రాత్రిపూట నిద్రపోయే ముందు చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ను చూసే అలవాటు ఉందట. ఎడమవైపు పడుకుని కుడి కన్నుతో స్ర్కీన్‌ని చూసేదట. అలా చూసే క్రమంలో ఆమె ఎడమ కన్నుకు దిండు అడ్డంగా వచ్చేది. ఈమె ట్రాన్సియెంట్ స్మార్ట్‌ఫోన్ బ్లైండ్‌నెస్‌కు గురైంది. 40 ఏళ్ల మరో మహిళకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ ఇద్దరి కేసుల్లో ఒక కన్నులోని రెటీనా మాత్రమే వెలుగును చూడగలుగుతుంది. రెండవ కంటిలోని రెటీనా చీకటిగా ఉంది. నిజానికి రెటీనా రకరకాల స్థాయిల్లో లైటింగ్‌ను గ్రహిస్తుంది. దీని పనితీరు ముందు కెమెరా కూడా పనికిరాదు. పైన పేర్కొన్న ఇద్దరు మహిళలను అధ్యయనకారులు ఒకసారి ఎడమ కన్నుతో, ఇంకోసారి కుడి కన్నుతో స్మార్ట్‌ఫోన్‌ని చూడమన్నారు. వారిని పరీక్షించి రాత్రి పూట స్ర్కీన్ చూసే కన్ను చూపును కోల్పోయారని గ్రహించారు. ఈ మహిళల అనుభవం నుంచి పాఠం నేర్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అధ్యయనకారులు స్పష్టం చేశారు. ఇదే పరిస్థితిని మరికొందరు కూడా ఎదుర్కొంటున్నారు. వారికి కూడా కంటి చూపు దెబ్బతిందని తేలింది. సో.. రాత్రుళ్లు చీకటిలో స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ఆపడం మంచిదని గుర్తించండి.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565