MohanPublications Print Books Online store clik Here Devullu.com

చ౦డీ సప్తశతి, Chandi Sapthasathi

చ౦డీ సప్తశతి
Chandi Sapthasathi

చ౦డీ సప్తశతి
పారాయణ........
"అందరికీ ఉపయోగపడేవిధంగా
ఈ పోస్ట్ ని
అందరూ షేర్ చేయగలరు
FREE DOWNLOAD
________👇________
https://ia601509.us.archive.org/…/FACEBOOKmohanpublic…/5.pdf
చ౦డీ సప్తశతి పారాయణ విధానము
శరన్నవ రాత్రులు (దేవి నవరాత్రులు) తొమ్మిది రోజులూ,దుర్గా సప్తశతిని పారాయణ చేయగల వారికి సమస్తసౌభాగ్య ఆయురారోగ్యములు, అఖండ పుణ్యఫల ప్రాప్తిసిద్దించటం అత్యంత సాధారణమైన అంశం. అయితే ఆదుర్గా సప్తశతీపారాయణ క్రమము(విధానం) ఏమిటనేదిచాలా మందికి కలిగే సందేహం! దుర్గాదేవీ భక్తులకు ఈశరన్నవరాత్రుల్లో అనన్య మహిమాన్వితమైన సప్తశతీపారాయణ క్రమం ఇక్కడ ఇవ్వబడింది. ఈ దుర్గా సప్తశతియొక్క విశిష్టతను గుర్చి ముందుగా తెలుసుకోవాలి.
సప్తశతి విశిష్టత: ఇంద్రాది దేవతలను అష్టకష్టాలపాలుచేసిన అసురులు విర్రవీగటం; దేవతల మొరపై కటాక్షించినదుర్గాపరమేశ్వరి తిరిగి దేవతలకు స్వర్గలోక సామ్రాజ్యంఇప్పించడం దుర్గా సప్తశతిలో ప్రధానాంశం.
అయినప్పటికీ ఇందులో లౌకికమైన కొన్ని కథలు కూడాచేరి ఉన్నాయి. తానెంతో ప్రేమతో,'తనవారు'అని భ్రమసినభార్యాపుత్రుల చేతనే బయటకు తరమబడిన వైశ్యప్రముఖుడు 'సమాధి'కథ, శత్రువుల చేత చిక్కి అంతవరకుసమస్త సుఖభోగాలనుభవించిన రాజు'సురధుడు'మన్యాశ్రమం చేరుకున్న వైనం.......తదుపరి-ఆవైశ్యవరుడు,ఈ రాజప్రముఖుడూ కూడా దేవీ అనుగ్రహంచేత తిరిగి తమ-తమ యథాస్థితులనుపొందగలగడం..........ఇత్యాది గాథలు దుర్గాదేవిమహిమను అపురూపంగా చూపిస్తున్నవి.
ఒకప్పుడు దేశంలో ఉపద్రవాలు, కరువు,ప్రకృతివైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఋత్విక్కులచేత ఈదుర్గాసప్తశతి పారాయణ చేయించేవారని శతసంఖ్యపారాయణవల్ల అరిష్టాలు తొలగి అద్బుత ఫలితాలుకలిగాయని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇది కూడామహర్షులే జగత్తుకు తెలియజేసిన అపూర్వసత్యం.
ఇంతటి విశిష్టత కలిగిన ఈ దుర్గా సప్తశతి యందు 13అధ్యాయాలున్నాయి. నవరాత్రి తొమ్మిదిరోజులలోను ఈ13 సంఖ్యగల అధ్యాయాలను ఎలా పారాయణ చేయాలి?అనే సంఖస్య సహజంగానే ఎవరికయినా కలుగుతుంది.ఇందుకు 3 విధాలను ఇక్కడ సూచించటం జరిగింది. దేవీకటాక్షం పొందగోరువారు ఈ 3 విధాలలో ఏదిఎన్నుకున్నాఫలితం పొందడంలో మాత్రం ఎటువంటి తేడాఉండదు. కనుక భక్తులు తమకు అనుకూలమైన రీతినిఎంపిక చేసుకోగలరు.



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list