MohanPublications Print Books Online store clik Here Devullu.com

ధూమావతి మహా విద్య Dhumavathi Maha Vidhya

ధూమావతి మహా విద్య
 Dhumavathi Maha Vidhya

-----------:ధూమావతి మహా విద్య :------
జ్యేష్టమాసం శుక్ల అష్టమి రోజున ధూమావతి పూజ, హోమం జరుపుకుంటారు. ధూమావతి అష్ట దారిద్రాలను నివారించి అప మృత్యువును హరిస్తుంది. శత్రువులను అంత మొండిస్తుంది. అతి శీఘ్రగతిన భక్తులను అనుగ్రహించుటలో ఈమెకు ఈమె సాటి. ధూమావతి మాహాశక్తి శని దోషాలను, రాహు దోషాలను, కాలసర్ప యోగాలను, నాగదోషాలను అతి శీఘ్రగతిన తొలగిస్తుంది.
రురుడనే రాక్షసుని కుమారుడు దుర్గముడు. బ్రహ్మ వలన వరం పొంది సమస్త వేదాలాను అపహరించుకుపోయాడు. వేదోక్త కర్మలు, యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగింది. దేవతల ప్రార్ధనలు విని, వేద పునరోద్ధారణకు దేవి నడుం కట్టింది. ఆ దేవి శరీరం నుండి ఉధ్బవించిన మూర్తులే : కాళి, తార, ఛిన్నమస్త, బగళాముఖి, మాతంగి, ధూమావతి, భువనేశ్వరి, షోడశి, కమలాత్మిక, భైరవి. ఇందులో ధూమావతి మహాశక్తి సంపన్నురాలు. ఈమెను ధూమ, ధూమావతి, ధూమ్రావతి, వృద్ధకాళీ అను పేర్లతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ధూమావతి అమ్మవారి గురించి రెండు కధలు ప్రచారంలో ఉన్నాయి. ధూమావతి మహాశక్తి విధవ. ఈ విధంగా కావటానికి ఒక పురాణ గాధ ఉంది. ఒకానొక సందర్భంలో పార్వతీ మాతకు ఆకలి వేసి ఆకలి తీర్చమని పరమేశ్వరుణ్ణి వేడుకుంది. ఆకలి తీర్చటం పరమేశ్వరుని వల్ల కాలేదు. ఆకలికి తాళలేని పార్వతి పరమేశ్వరుణ్ణి మ్రింగి వేస్తుంది. దానితో అమ్మవారి శరీరం నుండి భయంకరమైన ప్రగలు కక్కి అమ్మ వార్ధక్యాన్ని, వైధవ్యాన్ని, చిత్త చాంచల్యాన్ని పొంది విరబోసిన జుట్టుతో, భీకరమైన రూపముతో, చిరిగిన వస్త్రాలతో ఒక చేత చీపురు, ఒక చేత చాట,కాక ధ్వజాన్ని కలిగిన రాధాన్ని అధిరోహించి వికటాట్టహాసాలు చేస్తూ ధూమావతిగా మారినది. ఐ మహాశక్తి మృత్యుంజయుడయిన పరమేశ్వరుణ్ణి మ్రింగిన దేవత.
ఇంకొక కధ ప్రకారం శుంభ నిశుంభులను రాక్షసులు శివుని మెప్పించి పురుషుని వలన మరణం లేకుండా వరం పొందుతారు. ఆ వర గర్వంతో దేవతలను యజ్ఞ హవిస్సులను సైతం హరించసాగారు. దేవతలు వెళ్లి శివునితో మొరపెట్టుకున్నారు . శివుని అర్థబాగమైన గౌరి తన శరీరమునుండి ఒక స్తీమూర్తిని అవతరింపజేసింది ఆమె పేరు కౌశిక. కౌశిక తక్షణం అక్కడ మాయమై రక్కసిద్వయ నగరపొలిమేరల్లో జగదేక సుందరిగా రూపుదాల్చింది. ఆమె రూపలావణ్యాలకు కళ్ళు చెదిరిన చండ ముండులనే రాక్షసులు ఆ వార్త శుంభ నిశుంభులకు చేరవేయ్యనిదే ఉండలేకపోయారు.
అంతటి జగదేకసుందరిని పొందితీరని బ్రతుకు వ్యర్ధం అన్నట్లు ఆమె అంద చందాల్ని వర్ణించడంతో, క్రమంగా వారిలో పట్టుదల పెంచారు. అలాగే జరుగుతుందని, అంబకీ తెలుసు! అంతేకాదు! వాళ్ల వద్ద నుంచి దూతలు వచ్చి - తనను రమ్మంటారనీ ఆ ఆమ్మకు తెలుసు!
అలావచ్చిన దూతలతో "నాకో ప్రతిజ్ఞ వున్నది. యుద్ధంలో నన్ను గెలిచిన వాళ్లని తప్ప, ఇతరుల్ని పెళ్లాడను నేను. చేవ వుంటే యుద్ధానికి రమ్మని మీ వాళ్ళకు చెప్పు!" అన్నది అమ్మ.
తమనొక కుమారి ఆ విధంగా సవాలుచేయడమా అనే గర్వంతో "ఆ పిల్లకి మన తడాఖా తెలీనట్లుంది. ఓరీ ధూమ్రాక్షా! మాయచేసి ఐనా సరే! ఆ కన్నెను లాక్కురా!" అని ఆజ్ఞచేశాడు నిశుంభుడు.
ధూమ్రాక్షుడు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా సైన్య సమేతుడై వెళ్లాడు - అక్కడకు.
సైన్యంతో సహా ధూమ్రాక్షుడ్ని కేవలం తన హుంకార ధ్వనితో బూడిదగా మార్చి నిశుంభుని పురానికి పంపింది కౌశికి. ఆ విధంగా ఒక రక్కసి మూక నంతటినీ ధూళిలో కలిపేసినందు వల్ల ఆవిడకు 'ధూమావతి' అనే పేరు సార్థకమైంది. శత్రువుల్ని నామ రూపాల్లేకుండా మట్టుబెట్ట దలచినవారు ధూమావతిని ఆరాధిస్తారు. అనగా ఆమెను ఉపాసించు వారికి శత్రుభయం ఉండదు.
ధూమ్రాక్షుడ్నే వధించిందంటే, ఆమె సుకుమారి అయివుండదని - ఏ దైవ మాయాశక్తో అయివుంటుందని గ్రహించుకున్న నిశుంభుడు మెరికల్లాంటి రాక్షసవీరులను ఏరి, ఆమె పైకి యుద్ధానికి పంపాడు.
చండ, ముండ, రక్తబీజాదులు కూడా ఆమె ధాటికి మరణించారు.
కాలకేయాది మహావీరుల్ని వెంటబెట్టుకుని అన్నదమ్ములిద్దరూ కదనానికి కదిలారు.
వారిని చూస్తూనే కౌశికి వింటినారి సంధించింది. పెనుఘోషతో ధనుష్టంకారం చేసింది.
అంతవరకూ కేవలం ఆమె సోయగాలను విని మాత్రమే ఉన్న శుంభ నిశుంభులు, ప్రత్యక్షంగా అప్పుడు చూశారు ఆమెను.
నిజమే! ఆవగింజంతయినా తమవాళ్లు అతిశయోక్తి చెప్పలేదు. 'ఇటువంటి పిల్లతోనా మారణక్రీడ?'...అలా అనుకున్న తక్షణం, యుద్ధ సన్నద్ధులై వచ్చికూడా - "పిల్లవు! మాతో పోరుకంటే పొందు నీకులాభం! వచ్చి శరణుకోరి శయ్యాగృహం చేరు. సుఖించు - సుఖపడు!" అని మెల్లమెల్లగా నచ్చజెప్ప జూశారు.
"పిరికిపందల్లారా! ఇంత సైన్యాన్ని తెచ్చుకొని కూడా ఇంకా దీనాలాపాలు ఏల? సత్తావుంటే సమరంలో చూపండి! ముందే చెప్పినట్లుగా, నన్ను యుద్ధంలో ఓడిస్తే నేను ఇంకెక్కడికి పోగలను?" అనేసరికి, పౌరుషం పొడుచుకొచ్చిన శుంభ నిశుంభు లిద్దరూ వివిధ ఆయుధాల్ని ఆమెమీద ప్రయోగించారు. అన్నీ ఆమె శరపరంపర ముందు నుగ్గునుగ్గు అయిపోయాయి.
ఇక - చివరగా తన దగ్గర మిగిలినదీ అజేయమైనదీ అయిన గదాయుధాన్ని ప్రయోగించాడు నిశుంభుడు. కౌశికి త్రిశూలం ప్రయోగించింది - అందుకు ప్రతిగా. అది, గదను పడగొట్టి నిశుంభుడిని రెండుగా చీల్చుకుంటూ వెళ్లిపోయింది.
హాహాకారాలతో రాక్షసులు విషణ్ణ వదనులు కాగా, సోదరుడిని కోల్పోయిన క్రోధం తన కళ్లకు మరింత జ్వలితం చేయగా శుంభుడు విరుచుకు పడ్డా డామెమీద.
శుంభుని దగ్గర ఇంతకాలం అజేయంగా ఉన్న ఖడ్గాన్ని తుత్తునియలు చేసి, తన శూలాయుధ ప్రయోగంతో శుంభుని తలను కూడా ఎగుర మీటింది అమ్మవారు. శుంభ నిశుంబుల వధ పూర్తయింది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list