జల దానం
Donate Water
*******జల దానం *****
కాకినాడ నుండి బయలు దేరే కాకినాడ - షిర్డీ రైలు లో ప్రయాణించే వారికి విన్నపము
*****
కాకినాడ...
సామర్లకోట...
రాజమహేంద్రవరం...
నిడదవోలు..
తాడేపల్లి గూడెం..
ఏలూరు...
విజయవాడ ప్రయాణీకులకి విజ్ఞప్తి..!!
**********************************************************************************
నీరు లేక దాహార్తి తో తల్లడిల్లుతున్న లాతూర్ ప్రజలకి అండగా నిలవండి...!!
*****
కాకినాడ...
సామర్లకోట...
రాజమహేంద్రవరం...
నిడదవోలు..
తాడేపల్లి గూడెం..
ఏలూరు...
విజయవాడ ప్రయాణీకులకి విజ్ఞప్తి..!!
**********************************************************************************
నీరు లేక దాహార్తి తో తల్లడిల్లుతున్న లాతూర్ ప్రజలకి అండగా నిలవండి...!!
లాతూర్...ఈ పేరు వినగానే రెండు దశాబ్దాల క్రితం వచ్చిన భూకంపమే మనసులో మెదుల్తుంది. ఆ విపత్తులో దాదాపు పదివేల మంది చనిపోయి ఉంటారని అంచనా. కానీ ఇప్పుడు లాతూర్ అంతకంటే తీవ్రమైన విపత్తు ఉంది. కానీ ఈ విపత్తులో కోల్పోయే ప్రాణాలని లెక్కపెట్టడం సాధ్యమయ్యే పని కాదు. ఇది కేవలం ప్రకృతి సృష్టించిందీ కాదు! లాతూర్ ఇప్పుడు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. అక్కడికి రైల్వే వ్యాగన్లలో నీటిని తరలించాల్సిన దుస్థితి దాపురించింది.
లాతూర్‌కి ‘షుగర్ బెల్ట్ ఆఫ్ ఇండియా’ అని పేరు. ఆ జిల్లాలో విస్తృతంగా చెరకుని పండించడమే దీనిక కారణం. సహకార సంఘాల ద్వారా నిర్వహించే అనేక చెరకు ఫ్యాక్టరీలకు లాతూర్ ప్రసిద్ధి. అదే సమయంలో లాతూర్‌ను తరచూ కరవు కాటకాలు పీడించే చరిత్ర కూడా ఉంది. లాతూర్ చెరకు రైతులు పంటను గుర్తుంచుకున్నారే కానీ, కరువు సంగతి మర్చిపోయారు.
లాతూర్‌లో ప్రస్తుతం తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా దొరకని పరిస్థితి. నీరు లేకపోవడంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఆఖరికి ఆపరేషన్లను కూడా వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. ఇక ఇంటికి నేరుగా మంచినీరు సరఫరా కావడం అనేది ఒక కలగా మారిపోయింది. మొన్నటివరకూ పదిహేను రోజులకు ఓసారి జరిగే ఈ సరఫరా ప్రస్తుతం నిలిచిపోయింది. లాతూర్‌కి మంచినీటిని సరఫరా చేసే ధనేగావ్ జలాశయం ఎండిపోవడంతో ప్రజల దాహాన్ని తీర్చేందుకు అధికారులు తలలు పట్టుకోవలసి వచ్చింది. లాతూర్‌లో ఇంకా ఎక్కడెక్కడ మంచినీరు లభ్యమవుతోందో వివరాలు సేకరించడం మొదలుపెట్టారు అధికారులు. కాస్తో కూస్తో నీరు కనిపిస్తున్న బావులు, చెరువుల వద్ద 144 సెక్షన్లను అమలు చేసి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వార మంచినీటిని సరఫరా చేయడం మొదలుపెట్టారు. అయినా కూడా ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవి చాలలేదు సరికదా, ట్యాంకర్ల నుంచి వచ్చే కొద్దిపాటి మంచినీరు కోసం కొట్లాటలు మొదలయ్యాయి. ఇక పబ్లిక్ ట్యాపు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు సాగించిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దాదాపు పదిగంటల పాటు కుళాయి ముందర నిల్చొంటే కానీ బిందెడు నీళ్లు పట్టుకోలేని పరిస్థితి!
లాతూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో గత నాలుగు నెలలుగా మంచినీటి సరఫరా లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కరువుకాలంలో కూడా డబ్బున్నవాడికి ఎలాంటి బాధా లేదు. 150 రూపాయలు ఖర్చుపెడితే పదిలీటర్ల నీరు శుభ్రంగా దొరుకుతుంది. కానీ అంత ఖర్చుచేయలేని వారు, లాతూర్ జిల్లానే వదిలిపెట్టి వలసపోతున్నారు. పట్టుదలతో అక్కడే ఉన్నా, తాగేందుకు తగినంత నీరు లేకపోవడం వల్ల కిడ్నీ రాళ్లతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం లాతూర్‌కు రైల్వేల ద్వారా మంచినీటిని తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
.
రైలులో ప్రయాణించే షిర్డీ ప్రయాణీకులు తమ వెంట ఒక 5 లీటర్ల త్రాగు నీరు
(మినరల్ వాటర్ కాదు) తీసుకు వెళ్ళి లాతూర్ రోడ్ స్టేషన్ లో ఈ అవసరానికై
ఉంచిన డ్రమ్స్ లో పోయగలరు...!! దాహార్తి తో అక్కడ జనం తల్లడిల్లడమే
కాకుండా అక్కడ ఆవులూ పశువులూ మృతి చెందుతున్నాయి...!!
.
మీ ప్రయాణ అవసరానికి తాగడానికి నీరు పెట్టుకొని కేవలం లాతూర్
ప్రజలకోసం ఐదు లీటర్లు పక్కన పెట్టుకొని వారికిఅందించగలరు..!!
.
రైలు ఎక్కెదాకానే మొయల్సిన పని కాబట్టి...
కాస్త శ్రమదానం అనుకుని ఈ మంచి కార్యక్రమం లో పాల్గొనండి..!!
.
కాకినాడ - విజయవాడ నుండి షిర్డీ వెళ్లే రైలు
లాతూర్ రోడ్ స్టేషన్ రాత్రి 9-55 కి చేరుకుంటుంది..!!
.
సికిందరాబాదు నుండి బయలుదేరే అజంతా ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులుకూడా తమవెంట
నీరు తీసుకువెళ్ళి దాహార్తీతో అలమతిస్తున్న మహారాష్ట్ర ప్రజలకి అందించగలరు..!!
.
ఈ కార్యక్రమాన్ని కేవలం 5 లీటర్ల మంచి నీరు అన్న భావనతో కాకుండా
మన భారతదేశంలో ప్రజలు ఒకరికి కష్టం వచ్చినపుడు మరొకరు
ఎంత అండగా ఉంటారో ప్రపంచ దేశాలకి ఒక సందేశం గా మిగిలిపోవాలి..!!
.
ఇలా మహారాష్ట్ర వైపు వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ విధిగా ఈ చిన్న సాయాన్ని
అందించి తోటి భారతీయుడిగా మీవంతు కర్తవ్యాన్ని నెరవేర్చండి..!!
.
రైలులో ప్రయాణించే షిర్డీ ప్రయాణీకులు తమ వెంట ఒక 5 లీటర్ల త్రాగు నీరు
(మినరల్ వాటర్ కాదు) తీసుకు వెళ్ళి లాతూర్ రోడ్ స్టేషన్ లో ఈ అవసరానికై
ఉంచిన డ్రమ్స్ లో పోయగలరు...!! దాహార్తి తో అక్కడ జనం తల్లడిల్లడమే
కాకుండా అక్కడ ఆవులూ పశువులూ మృతి చెందుతున్నాయి...!!
.
మీ ప్రయాణ అవసరానికి తాగడానికి నీరు పెట్టుకొని కేవలం లాతూర్
ప్రజలకోసం ఐదు లీటర్లు పక్కన పెట్టుకొని వారికిఅందించగలరు..!!
.
రైలు ఎక్కెదాకానే మొయల్సిన పని కాబట్టి...
కాస్త శ్రమదానం అనుకుని ఈ మంచి కార్యక్రమం లో పాల్గొనండి..!!
.
కాకినాడ - విజయవాడ నుండి షిర్డీ వెళ్లే రైలు
లాతూర్ రోడ్ స్టేషన్ రాత్రి 9-55 కి చేరుకుంటుంది..!!
.
సికిందరాబాదు నుండి బయలుదేరే అజంతా ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులుకూడా తమవెంట
నీరు తీసుకువెళ్ళి దాహార్తీతో అలమతిస్తున్న మహారాష్ట్ర ప్రజలకి అందించగలరు..!!
.
ఈ కార్యక్రమాన్ని కేవలం 5 లీటర్ల మంచి నీరు అన్న భావనతో కాకుండా
మన భారతదేశంలో ప్రజలు ఒకరికి కష్టం వచ్చినపుడు మరొకరు
ఎంత అండగా ఉంటారో ప్రపంచ దేశాలకి ఒక సందేశం గా మిగిలిపోవాలి..!!
.
ఇలా మహారాష్ట్ర వైపు వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ విధిగా ఈ చిన్న సాయాన్ని
అందించి తోటి భారతీయుడిగా మీవంతు కర్తవ్యాన్ని నెరవేర్చండి..!!
జలదానం ప్రాముఖ్యత
జలదానం ఎంతో పుణ్యమిస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే పుణ్య ఫలం ఒక్క జల దానం వలన వస్తుందని చెప్పబడింది. అందుకే ప్రతి చోటా చలివేంద్రాలు పెట్టి దాహం తీర్చే ఆచారం మనకి ఎప్పటి నుండో వస్తున్నదే. ఈ చలివేంద్రాలు పితరులకు, దేవతలకు, మనుష్యులకు, అందరికీ ఇష్టమైనదే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తృప్తిపరుస్తుంది. పూర్వికులంత పుణ్య లోకాన్ని పొందుతారు. నీటిని దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది.
జలదానం ప్రాముఖ్యత గురించి స్కాందపురాణంలోని ఒక కధ ఉంది.పూర్వకాలంలో సూర్యవంశంలో హేమాంబరుడనే రాజు రాజ్యపాలన చేసేవాడు. అతడు గోదాన, భూదాన, సువర్ణదానాది పధ్నాలుగు రకాల దానాలు చేస్తూ అసరకర్ణునిగా పేరుగాంచాడు. అయితే అత్యంత ప్రశస్తమైన జలదానాన్ని మాత్రం విస్మరించాడు. కులగురువైన వశిష్ఠుడు ఉద్భోధించినా, లెక్కచేయక కొంతకాలానికి గర్విష్ఠియై సద్బ్రాహ్మణులను లెక్కచేయక, సజ్జనులను విడిచి దుష్టులకే పెద్దపీట వేసి గతితప్పడం వల్ల తరువాత వరుసగా మూడుజన్మలలో గ్రద్దగాను, మూడు జన్మలలో కాకిగాను, ఐదుజన్మలలో కుక్కగాను జన్మించి, అటు పిమ్మట మిథిలానగర రాజైన శ్రుతకీర్తి ఇంట బల్లియై జన్మించి గోడమీద ఈగలను, పురుగులను తింటూ కాలం గడుపుతున్నాడు.
ఒకసారి శ్రుతకీర్తి ఇంటికి విద్యాధరుడు అనే ఋషిపుంగవుడు మార్గాయాసం తీర్చుకోవడానికి రాగా, రాజు అతనికి పాదప్రక్షాళన చేసి ఆ జలాన్ని తన శిరస్సున చల్లుకొని, తన పరివారంపై కూడ చల్లుతుంటే అందులో రెండుచుక్కలు వచ్చి గోడమీద ఉన్న బల్లిపై పడ్డాయి. ఆ జలమహిమవల్ల ఆ బల్లికి పూర్వజన్మ జ్ఞానం కలిగి, ఆ మునిపుంగవుని పాదాల చెంత వాలి, మహాత్మా! నన్ను రక్షించండి అని ప్రార్థించింది. విధ్యాధరుడు, మనిషిలా మాట్లాడుతున్న ఆ బల్లిని చూసి ఆశ్చర్యపడి, నీవెవరివని ప్రశ్నించగా, అది తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపి, తనకి ఈ విధమైన జన్మలు కలగడానికి కారణం ఏమిటి? తరుణోపాయం సెలవీయమని వేడుకుంది.
ఋషి తన దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకుని హేమాంబరా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక దానాలు చేసినా, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన విప్రునికి జలదానం చేయలేదు. అదికాకుండా వేదవిదులైన విప్రులను విడిచి మంత్రం రాని వేదవిహీనులైన వారికే దానాలు చేసావు. అందుకే నీకీ దుస్థుతి కలిగింది. నేను చేసిన వ్రత ఫలాన్ని నీకు ధారపోస్తాను, దానివల్ల నీకు బల్లి రూపం నుండి విముక్తి కలిగిస్తానని, తానుకొన్నిదినాలు ఆచరించిన వ్రతఫలాన్ని ధారపోస్తూ ఆ నీటిని బల్లిపై విడువగానే, అది రత్న కిరీటకేయూరాలతో మహారాజు రూపుదాల్చి విద్యాధరునికి నమస్కరించి నిలిచి, కృతజ్ఞతలు తెలుపగా, ఇంతలో స్వర్గం నుండి విమానం వచ్చి ఆ హేమాంబరుని స్వర్గలోకానికి తీసుకుపోయింది. అతడు పదివేల సంవత్సరాలు అన్నిభోగాలు అనుభవించి, తిరిగి ఇక్ష్వాకువంశంలో కాకుస్థుడుగా జన్మించాడు.
సర్వతీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలం, అన్నదానాల వల్ల వచ్చే పుణ్యఫలం ఒక్క జలదానం చేస్తే వస్తుందని చెప్పబడింది. వేసవికాలంలో వచ్చే ఎండల్లో వెళ్ళే బాటాసారుల కోసం, ఒక కుండలో నీళ్ళను ఏర్పాటు చేసి, అడిగిన వాళ్లకు ఇస్తే, అదే జలదానమవుతుంది. ఇలా జలదానం చేయడం వల్ల, దానం చేసినవారితో పాటు వారి ఆప్తులందరికీ విష్ణు సాయుజ్యం కలుగుతుంది.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565