MohanPublications Print Books Online store clik Here Devullu.com

కుజ దోషం పరిహారాలు, Kuja Dosam Pariharalu

కుజ దోషం పరిహారాలు
 Kuja Dosam Pariharalu

కుజ దోషం పరిహారాలు
కుజ అనగా భూమి పుత్రుడు. ఆధునిక వైజ్ఞానికులు కుడా భూమికి కుజునికి పోలికలు ఉంటాయని నిరూపించారు.
ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం ||
అని మన పూర్వ మహర్షులు వర్ణించారు. ఇనుము,తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని అంటారు వైజ్ఞానికులు.ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు: రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట కుజుడు ఉండకూడదని.
కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు.
పరిహారాలు:-ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉండి కుజ గాయత్రి డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.
కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.
స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.
ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి.సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.ప్రతి రోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.
కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.
రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.
కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు:
కుజదశలో కుజుని అంతర్దశకు....ఉత్తరకాండ ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.
కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ యాభై ఎనిమిదవసర్గ, తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.
కుజ దశలో కేతు అంతర్దశకు-- యుధకాండ నూట పదహారు సర్గ , ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము
కుజ దశలో శని అంతర్దశకు -- అరణ్యకాండ డెభై వ సర్గ -- నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
కుజుదశలో బుధ అంతర్దశ --- బాలకాండ పదహారవసర్గ -- ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
కుజు దశలో గురు అంతర్దశ -- సుందర కాండ యాభై ఒకటి సర్గ--- అరటిపండ్లు నైవేద్యము.
కుజ దశలో శుక్ర అంతర్దశకు --- సుందరాకాండ యాబై మూడు సర్గ -- పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం
.
కుజ దశలో రవి అంతర్దశకు --- బాలకాండ ఇరై మూడు సర్గ -- చామ కారెట్ దుంప నైవేద్యము.
కుజదశలో రవి అంతర్దశకు --- బాలకాండ పదిహేడవ సర్గ-- పాలు, పాయేసం నైవేద్యము



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list