కుటుంబమంతా...ఒకే ఆప్ నీడలో
Family members all are in one App
+++++ కుటుంబమంతా...ఒకే ఆప్ నీడలో+++++
అమ్మ చేతిలో ఓ ఫోన్... నాన్న జేబులో ఓ ఫోన్... అన్నయ్యకో ఫోన్... చెల్లాయికో ఫోన్... మొత్తానికి ‘స్మార్ట్’ కుటుంబం... మరి అందరినీ కలిపే ఆప్స్ ఉంటే!వాటితో ఒకరికొకరు అనుసంధానమై ఉంటే! ఇక్కడ ఉన్నవి అలాంటివే! డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు... దూరాల్లో ఉన్నా దగ్గరైనట్టే! ఎక్కడెక్కడున్నా కలిసిమెలిసి ఉన్నట్టే!!కుటుంబంలో అందరివీ వేర్వేరు వ్యాపకాలు. ఎక్కడెక్కడికో ఉరుకులు పరుగులు. చేతిలో ఫోన్లు ఉన్నా కాల్ చేసి మాట్లాడుకునే తీరికలేని పరిస్థితులు. అలాంటి వారి కోసం కొన్ని ప్రత్యేకమైన ఆప్స్ ఉన్నాయి. వాటి ద్వారా రకరకాల సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇంటి పనులు చక్కబెట్టుకోవచ్చు! ఎవరెక్కడున్నారో తెలుసుకోవచ్చు! ఇంకా ఎన్నో చేయొచ్చు! ఉదాహరణకు...
* ఆఫీసు మీటింగులో ఉన్నా... పిల్లలు స్కూలు నుంచి వచ్చారో లేదో అనే ఆలోచన. ఎక్కడున్నారో చూద్దాం అనుకుంటే? మ్యాప్‌లో చూడొచ్చు! అంతేనా... ఇంటికి చేరామనే సందేశాన్ని మెసేజ్ రూపంలో పొందొచ్చు.
* ఇంట్లో పిల్లలకు ఫోన్ ఇస్తే వెంటనే ఏం గేమ్స్ ఉన్నాయో చూస్తారు. ఆడడం మొదలు పెడతారు. అదే ఓ ప్రత్యేక ఆప్ మీ మొబైల్‌లో ఉంటే, పిల్లలు ఇంట్లో చేసే పనులకు మార్కులు వేయవచ్చు. వారు సంపాదించిన మార్కులతో వారికి కావాల్సిన తాయిలాలు కొని ఇవ్వొచ్చు!
* స్నేహితునికి ఫోన్ చేస్తుంటారు. ఎంత సేపటికీ బిజీ.. బిజీ... మీకేమో విసుగు. అవేం లేకుండా కాల్ చేయడానికి ముందే వాళ్లు ఎవరితోనైనా మాట్లాడుతున్నారో లేదో తెలుసుకుంటే?
* వూర్లో నాన్న లేరు. అనుకోకుండా అమ్మకి బాలేదు. మీ దగ్గరేమో ఫ్యామిలీ డాక్టర్ నెంబర్ లేదు. వెంటనే ప్రత్యేక ఆప్‌లోకి వెళ్లి నాన్న ఫోన్‌లోని డాక్టర్ల గ్రూపు నుంచి ఫోన్ నెంబర్ అత్యంత సులువుగా తీసుకోగలితే!
- అలాంటి ఆప్స్ ఏమిటో తెలుసుకోండి మరి!
మ్యాప్‌లో చూడొచ్చు
కుటుంబ సభ్యులు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి అస్తమానం ఫోన్ చేయాలా? అక్కర్లేదు. Family Locater ఆప్‌ను అందుకుంటే సరి. డౌన్‌లోడ్ చేసుకున్నాక కుటుంబ సభ్యులను ఆహ్వానించి సర్కిల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆపై అవసరమైనప్పుడల్లా వాళ్లు ఎక్కడున్నారనే విషయం ఆప్‌లో మ్యాప్ ద్వారా తెలిసిపోతుంది. అవసరం లేనప్పుడు ఈ సదుపాయాన్ని ఆపేసుకోవచ్చు కూడా. అందుకు సెట్టింగ్స్‌లోని లొకేషన్ షేరింగ్ ఆప్షన్‌కు వెళ్లి క్లోజ్ చేస్తే సరి. ఇంకా ఈ ఆప్ ద్వారా సమాచారాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఉదాహరణకు ఇంటికి కావాల్సిన వస్తువులను గ్రాసరీస్ జాబితాలో రాసి పంచుకోవచ్చు. ఎవరెవరు ఏమేమి తేవాలో నిర్ణయించుకోవచ్చు. అనుకోకుండా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు హెల్ప్ అలర్ట్‌లోని ఎరుపు రంగు బటన్ ఒత్తవచ్చు. అప్పుడు అందులో ముందుగానే నిక్షిప్తం చేసిన మూడు అత్యవసర ఫోన్ నంబర్లకు సమాచారం వెళ్లే వీలుంది. ఐఓఎస్‌లోనూ ఈ ఆప్ లభిస్తుంది.
https://goo.gl/G5hTTZ
మార్కులతో పోత్సాహం
ఇంట్లో పిల్లల్ని ఎప్పటికప్పుడు ఉత్సాహపరచడానికి వీలు కల్పించే ఆప్ ఒకటుంది. అదే Our home. పిల్లలు ఏమైనా పనులు చేశారనుకోండి. వారికి పాయింట్లు ఇచ్చి ఉత్సాహపరచవచ్చు. ఉదాహరణకు ఇల్లు సర్దితే 20 పాయింట్లు, కూరగాయలు తీసుకొస్తే 30 పాయింట్లు, బట్టలు బీరువాలో సర్దితే 15 పాయింట్లు... ఇలాగన్నమాట. ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయనేది ఆప్ రిపోర్టు ద్వారా కుటుంబ సభ్యులందరికీ తెలుస్తుంది. అలా సంపాదించిన పాయింట్లను ఏం చేయాలో కూడా నిర్ణయించవచ్చు. అంటే ఐస్‌క్రీమ్ కావాలంటే 20 పాయింట్లు, జాలీ ట్రిప్‌కు వెళ్లాలంటే 300 పాయింట్లు అని కొన్ని ఆప్షన్స్ ముందుగా పెట్టుకునే సౌకర్యం ఉంది. దీని ద్వారా ఇంటి పనుల విషయంలో పిల్లలను ఉత్సాహపరచడంతో పాటు ఒక ఆటలాగా వారితో అనుసంధానం కావచ్చు. ఐఓఎస్‌లోనూ ఇది లభిస్తుంది.
https://goo.gl/7g7cSp
ముందే తెలుస్తుంది
కుటుంబ సభ్యుడికో, స్నేహితుడికో ఫోన్ చేయాలి... కానీ అవతలి వారు మీటింగ్‌లో ఉన్నారో, ఏదైనా కాల్ మాట్లాడుతున్నారో తెలియదు. మరెలా? Prevoo ఆప్‌తో సులభంగా తెలుసుకోవచ్చు. మెయిల్ ఐడీ, ఫోను నెంబర్‌తో ఆప్‌లో లాగిన్ అయ్యి స్నేహితులను ఆహ్వానించవచ్చు. ‘ప్రివూ’లో స్నేహితులైన వాళ్లు ఫోన్‌లో బిజీగా ఉన్నారా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఆప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఫోన్ కాంటాక్ట్స్ సింక్ అవుతాయి. లిస్ట్‌లో ప్రతి ఒక్కరి పేరు కింద వాళ్ల స్టేటస్ కనిపిస్తుంది. కాల్ మాట్లాడుతుంటే ‘ఆన్ కాల్’ అని చూపిస్తుంది. ఆ సమయంలో ‘నోటిఫై మీ’ అనే ఆప్షన్ ఒత్తితే... అవతలి వ్యక్తి ఫోన్ కాల్ కట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం కాల్ లేదా మెసేజ్ చేయాలనుకున్న వ్యక్తి ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉన్న విషయం కూడా ఈ ఆప్ ద్వారా తెలుస్తుంది. దీని వల్ల అవతలి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా చూడొచ్చు. కుటుంబ సభ్యుడు స్నేహితుడు ఎక్కడున్నారనే విషయాన్ని మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఆప్షన్ వద్దనుకుంటే సెట్టింగ్స్‌లో ఆప్‌లో Allow location sharing ను ఆఫ్ చేయాలి.
https://goo.gl/67Va8w
వెంటనే పంచుకోవచ్చు
ముఖ్యమైన ఫోన్ నంబర్లన్నీ ఒకే గ్రూపులో పెట్టుకొని... అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులందరూ ఆ ఫోన్ నంబర్లు వాడుకోవాలంటే... అదే Contact box. ఈ ఆప్‌లో అత్యవసరమైన ఫోను నంబర్లు, బంధువుల కాంటాక్ట్ నంబర్లను గ్రూపులుగా పొందుపరుచుకోవచ్చు. తర్వాత ఆ గ్రూపులను ఈ ఆప్ ద్వారా కుటుంబ సభ్యులకు షేర్ చేయొచ్చు. అలా ఆప్‌లో ఒకరు సేవ్ చేసిన నంబర్లను కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు. ఒక ఫోన్‌లో నంబర్లు అప్‌డేట్ చేస్తే అన్నింటిలోనూ వాటికవే అప్‌డేట్ అవుతాయి. అంతేకాదు ఈ ఆప్‌ను కాలర్ ఐడీగానూ వాడొచ్చు.
https://goo.gl/ LZjI9F
గుర్తు చేస్తుంది
సమయానికి మందులు వేసుకోమని సన్నిహితులకి గుర్తు చేసే వీలుంటే? వాళ్లు మందులు తీసుకోకపోతే కుటుంబ సభ్యులకు తెలియాలంటే... అందుకోసం Medisafe ఆప్ సిద్ధంగా ఉంది. ఈ ఆప్ ద్వారా కుటుంబ సభ్యుల మందుల వాడకం గురించి అందరికీ తెలిసేలా చేయొచ్చు. మీ బంధువులను అకౌంట్‌కు జతచేసి మీ వివరాలను వాళ్లతో పంచుకోవచ్చు. ఆప్‌లో మందుల పేర్లు ప్రీలోడెడ్ ఉంటాయి. వాటి నుంచి మనకు కావాల్సిన మందుల పేర్లు, మోతాదును ఎంచుకొవచ్చు. ఎన్ని ట్యాబ్లెట్లు వాడాం... ఇంకెన్ని ఉన్నాయనే విషయమూ ఈ ఆప్ ద్వారా తెలుస్తుంది. రిపోర్టు ఆప్షన్‌తో మీరు మందులు ఎలా వేసుకుంటున్నారనే విషయం మీ ఆప్‌తో అనుసంధానమైన వారికి తెలుస్తుంది. వీటితోపాటు డాక్టర్ అపాయింట్‌మెంట్లు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గరికెళ్లాలి అనే విషయాలనూ పొందుపరుచుకోవచ్చు. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రజర్, పల్స్, బరువు లాంటి విషయాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ మీ ఆరోగ్యం గురించి కుటుంబానికి చెప్పొచ్చు.
https://goo.gl/vrnUL2

LIKE US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565