MohanPublications Print Books Online store clik Here Devullu.com

జీమెయిల్‌ గిమ్మిక్కులు, Gmail

జీమెయిల్‌ గిమ్మిక్కులు, 
Gmail

జీమెయిల్‌ గిమ్మిక్కులు!
అవసరం ఏదైనా... జీమెయిల్‌ ఉండాల్సిందే! ఇన్‌బాక్స్‌ చెక్‌ చేశాకే పని ప్రారంభం!మరి, జీమెయిల్‌ని ఏమేరకు వాడుతున్నారు? ఉన్నవాటితోనే సరిపెట్టుకుంటే పొరబాటే!ఎందుకంటే అదనపు సర్వీసులు ఎన్నో!
మెయిల్స్‌ చూడడం... పంపడం... డ్రాఫ్ట్‌లు పెట్టుకోవడం...స్పాంని తొలగించడం... ఇవేనా? అదనంగా జీమెయిల్‌లో మీరెన్నో కొత్తవి ప్రయత్నించొచ్చు. నెట్‌ ఇంట్లో సందడి చేస్తున్న క్లౌడ్‌ సర్వీసుల్ని మెయిల్‌ ఎకౌంట్‌కి జత చేసి వాడుకోవచ్చు. ముఖ్యమైన మెయిల్స్‌ని తెలివిగా పంపే ప్రయత్నం చేయవచ్చు. పంపినమెయిల్‌ ఓపెన్‌ చేసి చదివారో లేదో తెలుసుకోవచ్చు. ముఖ్యమైన సమాచారంతో కూడిన మెయిల్‌ అయితే పంపిన వ్యక్తి చదివిన తర్వాత ఆటోమాటిక్‌గా తొలగిపోయేలా చేయవచ్చు. చెప్పాలంటే ఇలా చాలానే చేయవచ్చు. ఆ సర్వీసులేంటో... ఆయా చిట్కాలేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!
చదివారా? లేదా?
రోజూ మునివేళ్లపైనే మాటల్ని చేరవేస్తున్న వాట్స్‌ఆప్‌లో ‘టిక్‌ మార్క్‌’ల గురించి తెలుసుగా? పంపిన మెసేజ్‌ని చూశారో లేదో టిక్‌ మార్క్‌తోనే తెలుసుకుంటున్నాం. పంపిన మెసేజ్‌లకు రెండు టిక్‌ మార్క్‌లు వస్తే డెలివరీ అయినట్టుగా... రెండు నీలి రంగు టిక్‌మార్క్‌లు వస్తే వాటిని చూసినట్టుగా తెలుస్తుంది. మరి, వాడుతున్న జీమెయిల్‌లోనూ పంపిన మెయిల్‌ని ఇతరులు చూశారో... లేదోనని తెలుసుకోవాలనుకుంటే? సింపుల్‌... గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్నట్లయితే MailTrack ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నించండి. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి ఎక్స్‌టెన్షన్‌ని ఉచితంగా బ్రౌజర్‌కి జత చేయవచ్చు. ఒక్కసారి ‘మెయిల్‌ట్రాక్‌’ సర్వీసు బ్రౌజర్‌కి జత అయ్యాక మెయిల్‌ ఇతరులకు చేరగానే ఒక నీలి రంగు టిక్‌ మార్క్‌ వస్తుంది. వారు మెయిల్‌ని ఓపెన్‌ చేసి చదివితే రెండు నీలి రంగు టిక్‌మార్క్‌ గుర్తులు కనిపిస్తాయి. ‘రియల్‌టైం’ నోటిఫికేషన్స్‌ ద్వారా కూడా మెయిల్‌ని చదివారో... లేదో డెస్క్‌టాప్‌పైనే చూడొచ్చు. లేదంటే... నోటిఫికేషన్‌ మెయిల్‌ రూపంలో ఇన్‌బాక్స్‌కి వస్తుంది. పంపిన మెయిల్‌లోని లింక్స్‌ని ఎన్నిసార్లు క్లిక్‌ చేశారో కూడా ట్రాక్‌ చేసి చూడొచ్చు. అయితే, పంపిన మెయిల్స్‌ అన్నీ Sent with MailTrack సిగ్నేచర్‌తో చేరతాయి. ఉచిత సర్వీసులో కచ్చితంగా ఎక్స్‌టెన్షన్‌ సర్వీసు సిగ్నేచర్‌ ఉంటుంది. ఒకవేళ సర్వీసు వివరాలు లేకుండా మెయిల్‌ట్రాక్‌ సేవల్ని వాడుకోవాలంటే ప్రీమియం వెర్షన్‌కి అప్‌డేట్‌ అవ్వాల్సిందే. అందుకు సుమారు నెలకి రూ.250 చెల్లించాల్సిందే. మెయిల్‌ట్రాక్‌ ఎక్స్‌టెన్షన్‌ని వాడదాం లింక్‌లోకి వెళ్లండి.
మెయిల్‌ తొలగిపోవాలా?
ముఖ్యమైన సమాచారాన్ని పంపడం... కొంత సమయానికి పంపిన డేటా ఆటోమాటిక్‌గా తొలగిపోవడం... ఇలాంటి మాయల్ని ఏ జేమ్స్‌బాండ్‌ సినిమాల్లోనో చేస్తుంటాం. కానీ, మీకు తెలుసా? మీరు జీమెయిల్‌ నుంచి పంపే ముఖ్యమైన సమాచారాన్ని ఇదే మాదిరిగా కొంత సమయానికి ఆటోమాటిక్‌గా తొలగిపోయేలా చేయవచ్చు. అందుకు Dmail (Delicious Mail) ఎక్స్‌టెన్షన్‌ ఉంది. ఇదో బీటా వెర్షన్‌. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి బ్రౌజర్‌కి జత చేయాలి. తర్వాత జీమెయిల్‌ని రీలోడ్‌ చేసి ‘డీమెయిల్‌’కి అనుమతి ఇవ్వాలి. దీంతో ప్రత్యేక ఆప్షన్‌లా డీమెయిల్‌ ఎక్స్‌టెన్షన్‌ జీమెయిల్‌లో చేరిపోతుంది. ఇక ఎప్పుడు కంపోజ్‌ మెయిల్‌లోకి వెళ్లినాDmail ఆన్‌లో కనిపిస్తుంది. ఆ పక్కనే Destroy ఆప్షన్‌ ఉంది. పంపుతున్న మెయిల్‌ ఎంత సమయానికి తొలగిపోవాలనేది మెనూ ద్వారా నిర్ణయించొచ్చు. గంట, వారం, నెల రోజుల వరకూ గడువుని పెట్టొచ్చు. గడువు ముగియగానే మెయిల్‌ని ఓపెన్‌ చేస్తే అర్థంకానీ గుర్తులు, అక్షరాలతో కనిపిస్తుంది. ఒకవేళ పంపుతున్న మెయిల్‌ ఎప్పటికీ తొలగిపోకూడదు అనుకుంటే Never సెలెక్ట్‌ చేస్తే సరి. ప్రయత్నిద్దాం అనుకుంటేhttps://mail.delicious.com లింక్‌లోకి వెళ్లండి.
వేటిలో రిజిస్టర్‌ అయ్యారు?
నెట్టింట్లో లెక్కకు మిక్కిలి ఏవేవో సరికొత్త సర్వీసులు పుట్టుకొస్తూనే ఉంటాయి. నచ్చితే ఈ-మెయిల్‌ ఐడీతో రిజిస్టర్‌ అయ్యి వాడేస్తుంటాం. కొన్ని రోజుల తర్వాత మర్చిపోతుంటాం. కానీ, మీరు రిజిస్టర్‌ అయినప్పటి నుంచీ సంబంధిత వెబ్‌ సర్వీసుల నుంచి ఏవేవో మెయిల్స్‌ వస్తూనే ఉంటాయి. వాటిని సెలెక్ట్‌ చేసి డిలీట్‌ చేస్తుంటారు. ఇలా మీరు జీమెయిల్‌తో ఏయే సర్వీసుల్లో రిజిస్టర్‌ అయ్యారో తెలుసుకోవాలంటే? మొత్తం ఇన్‌బాక్స్‌ని స్కాన్‌ చేసి అన్నింటినీ జాబితాగా పొందాలంటే? అక్కర్లేని వాటిని ఒకే క్లిక్‌తో Unsubscribe చేయాలంటే? సింపుల్‌... Unroll వెబ్‌ సర్వీసుని వాడితే సరి. సైట్‌ హోం పేజీలోని Get Started now బటన్‌పై నొక్కి మెయిల్‌ ఐడీని ఎంటర్‌ చేసి ఇన్‌బాక్స్‌ని స్కాన్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలి. దీంతో మెయిల్స్‌ని స్కాన్‌ చేసి ఎన్ని సర్వీసుల్లో మీరు సభ్యులయ్యారో చిట్టా చూపిస్తుంది. వాటిల్లో ఏయే సర్వీసులతో మీకు పని లేదో వాటిని గుర్తించి Unsubscribeచేస్తే సరి. ఇలా మీరు ‘అన్‌రోల్‌’ సర్వీసులో చేసిన స్కానింగ్‌ ప్రాసెస్‌లను Archiveరూపంలో రికార్డ్‌ చేయవచ్చు. అంతేనా... సభ్యులై మీరు వాడుతున్న వాటి జాబితాని మెయిల్‌ రూపంలో పొందొచ్చు. మీరూ మెయిల్‌ని స్కాన్‌ చేసి చూద్దాం అనుకుంటేhttps://unroll.me సైట్‌లోకి వెళ్లండి. ఐఓఎస్‌తో యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఆప్‌ రూపంలోనూ ఇన్‌స్టాల్‌ చేసుకుని సర్వీసుని వాడుకోవచ్చు.
అన్ని వివరాలతో...
మెయిల్‌ చివర్లో పేరు, ఫోన్‌ నెంబర్‌ వివరాలు రాసి పంపుతాం. అదే ‘సిగ్నేచర్‌’.ఎప్పటికప్పుడు టైప్‌ చేయకుండా ఆటోమాటిక్‌గా ఈ సిగ్నేచర్‌ని మెయిల్‌ చివర్లో జత అయ్యేలా చేసేందుకు జీమెయిల్‌లోనే ఆప్షన్‌ ఉంది. సెట్టింట్స్‌లోని ‘జనరల్‌’ మెనూలోకి వెళ్లి Signature ద్వారా జత చేయవచ్చు. అయితే, ఈ బిల్ట్‌ఇన్‌ ఆప్షన్‌లో కొన్ని పరిమితులతోనే సిగ్నేచర్‌ని జత చేయవచ్చు. కాస్త క్రియేటీవ్‌గా మీ ఫొటోతో పాటు పేరు, ఫోన్‌ నెంబర్లు, సైట్‌, సోషల్‌ నెట్‌వర్క్‌ ప్రొఫైల్స్‌, యూట్యూబ్‌ ఛానళ్లు... ఇలా మరిన్ని అదనపు వివరాలతో సిగ్నేచర్‌ని క్రియేట్‌ చేసేందుకు ప్రత్యేక సర్వీసు ఉంది తెలుసా? అదేWiseStamp. దీన్ని ఎక్స్‌టెన్షన్‌ రూపంలో జీమెయిల్‌కి జత చేసి వాడుకోవచ్చు. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌లోకి వెళ్లి ఎక్స్‌టెన్షన్‌ని క్రోమ్‌కి జత చేయగానే ప్రత్యేక ఐకాన్‌ రూపంలో ‘వైజ్‌స్టాంప్‌’ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి Edit Signature మెనూలోకి వెళ్లి మీకు కావాల్సిన వివరాలతో సిగ్నేచర్‌ని క్రియేట్‌ చేసుకోవచ్చు. అయితే, సర్వీసులో మీరు సభ్యులవ్వాల్సిందే. ఉచిత సర్వీసుతో సిగ్నేచర్‌ని క్రియేట్‌ చేస్తే వివరాల కిందే Free email signature by WiseStamp వాక్యంతో పాటు లింక్‌ కనిపిస్తుంది. ఇలాంటి వివరాలేవీ ఉండకూడదు అనుకుంటే ప్రీమియం వెర్షన్‌ని వాడాల్సిందే. ఎక్స్‌టెన్షన్‌ డౌన్‌లోడ్‌ లింక్‌https://goo.gl/gMfUOL
‘ల్యాబ్‌’లో కొన్ని...
షార్ట్‌కట్‌ మీటలు...
జీమెయిల్‌లోనూ షార్ట్‌కట్‌ మీటలు వాడొచ్చు తెలుసా? ఒకవేళ ఇప్పటి వరకూ మీరు వాడకుంటే సెట్టింగ్స్‌లోని ‘ల్యాబ్స్‌’ మెనూలోకి వెళ్లిండి. అక్కడ జాబితాగా వచ్చిన సర్వీసుల్లోని Custom Keyboard Shortcuts ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేయాలి. దీంతో సెట్టింగ్స్‌లో ‘కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌’ విభాగం కనిపిస్తుంది. టేబుల్‌లోని షార్ట్‌కట్‌లను వాడుకుని జీమెయిల్‌లోని పనుల్ని చికెటికెలో చక్కబెట్టేయవచ్చు. మెయిల్‌ని కంపోజ్‌ చేయాలంటే కీబోర్డ్‌లోని C నొక్కితే చాలు. రిప్లై ఇవ్వాలనుకుంటే R నొక్కాలి. ఇలా అన్నీ షార్ట్‌కట్‌లతోనే! ఉన్నవే కాకుండా మీకు నచ్చిన షార్ట్‌కట్‌లను కూడా ఎసైన్‌ చేసుకునే వీలుంది.
ట్యాబ్‌లోనే...
ఇన్‌బాక్స్‌కి ఎన్ని మెయిల్స్‌ వచ్చాయో చూడాలంటే? బ్రౌజర్‌లో ఎక్కడున్నా మెయిల్‌ని ఓపెన్‌ చేసిన ట్యాబ్‌లోకి వచ్చి క్లిక్‌ చేసి చూడాల్సిందేనా? ఏం అక్కర్లేదు. మెయిల్‌ని ఓపెన్‌ చేసిన ట్యాబ్‌పైనే జీమెయిల్‌ ఐకాన్‌ గుర్తులోనే కనిపించేలా చేస్తే! ల్యాబ్స్‌లోని Unread message icon ఆప్షన్‌తో సాధ్యమే. ఒక్కసారి దీన్ని ఎనేబుల్‌ చేసి చూడండి.
కుడివైపు...
జీమెయిల్‌లో ఎడమవైపు ఉన్న ఛాటింగ్‌ విండోని కుడివైపు పెట్టుకోవచ్చు. అందుకు ల్యాబ్స్‌లోని Right-Side Chat ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేస్తే సరి. కుడివైపు సెట్టింగ్స్‌ ఐకాన్‌ కిందే కాంటాక్ట్‌తో ఛాట్‌బాక్స్‌ వచ్చేస్తుంది.
అక్కడే ప్రివ్యూ...
పికాసా సర్వీసు నుంచి మీకెవరైనా ఫొటోలు పంపితే మెయిల్‌లోనే ప్రివ్యూ చూడొచ్చు. అందుకు Picasa previews in mail ఎనేబుల్‌ చేయండి.
ముందే నిర్ణయించొచ్చు
ఉరుకుల పరుగుల జీవితం. ఫోన్‌లోనో... సిస్టంలోనో... రిమైండర్‌ పెట్టుకుంటేగానీ పనుల్ని సమయానికి పూర్తిచేయడం లేదు. మరి, పంపాల్సిన మెయిల్స్‌ మాటేంటి? ముందే షెడ్యూల్‌ చేసుకుని మెయిల్స్‌ కూడా పంపేస్తే పని సులువు అవుతుంది కదా! అయితే, మీరుMail2Cloud ఎక్స్‌టెన్షన్‌ గురించి తెలుసుకోవాల్సిందే. బ్రౌజర్‌కి జత చేయగానే మెయిల్‌లోని Send ఆప్షన్‌ పక్కనే ప్రత్యేక గుర్తుతో చేరిపోతుంది. ఎప్పుడైనా నిర్ణీత తేదీ, సమయానికి మెయిల్‌ ఆటోమాటిక్‌గా సెండ్‌ అయ్యేలా చేసేందుకు ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేసిSend Later మెనూలోకి వెళ్లాలి. తేదీ, సమయాన్ని ఎంటర్‌ చేసి ‘సెండ్‌’ చేస్తే చాలు. ఎంపిక చేసుకున్న సమయానికి మెయిల్‌ డెలివరీ అవుతుంది. అలాగే, మీరు పంపిన మెయిల్స్‌లోని ఎటాచ్‌మెంట్స్‌ని ఎన్నిసార్లు ఓపెన్‌ చేసి చూశారో తెలుసుకునేందుకుAttachment Track ఆప్షన్‌ ఉంది. అంతేనా... మీరు పంపిన మెయిల్‌ వ్యక్తికి చేరిన 5 నిమిషాల తర్వాత ఆటోమాటిక్‌గా తొలగిపోయేలా చేసేందుకు Self Destruct మెనూని సెలెక్ట్‌ చేయాలి. ఒకేసారి ఎక్కువ మందికి మెయిల్‌ పంపేటప్పుడు ‘ప్రైవేటు డెలివరీ’ మోడ్‌తో సురక్షితం చేయవచ్చు. ఎక్స్‌టెన్షన్‌ కోసం https://goo.gl/ HS0KW1 లింక్‌ని చూడండి.
క్లౌడ్‌ సర్వీసులన్నీ...
లోకల్‌ స్టోరేజ్‌ డ్రైవ్‌లనే కాకుండా క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసుల్ని కూడా విరివిగా వాడేస్తున్నాం. ఎప్పుడంటే అప్పుడు... ఎక్కడంటే అక్కడ డేటాని యాక్సెస్‌ చేస్తున్నాం. మరి, జీమెయిల్‌లో ఏవైనా ఎటాచ్‌మెంట్‌ ఫైల్స్‌ని క్లౌడ్‌ సర్వీసుల నుంచి తీసుకోవాలంటే? మీరు వాడుతున్న అన్ని క్లౌడ్‌ స్టోర్‌లను జీమెయిల్‌కి జత చేసి వాడేస్తే! సరాసరి జీమెయిల్‌ నుంచే ఆయా సర్వీసుల్లోని ఫైల్స్‌ని సెలెక్ట్‌ చేసుకుని ఎటాచ్‌ చేస్తే! ఎలా సాధ్యం అనేగా! ఏముందీ Cloudyఎక్స్‌టెన్షన్‌ని ఒకసారి ప్రయత్నించి చూడండి. బ్రౌజర్‌కి జత చేయగానే మెయిల్‌ సర్వీసులో ఒదిగిపోతుంది. ఇక మీరు వాడుతున్న క్లౌడ్‌ సర్వీసులోకి లాగిన్‌ అయ్యి ఎటాచ్‌ చేయాల్సిన ఫైల్స్‌ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ https://goo.gl/FDuIwg
సెట్‌ చేసిన సమయానికే...
సిస్టంలో ఏదో ముఖ్యమైన పనిలో ఉంటారు. ఇంతలో ఇన్‌బాక్స్‌కి ఏదో మెయిల్‌ వస్తుంది. చూస్తే అదో ఈ-షాపింగ్‌ ప్రకటన. తిరిగి మళ్లీ పనిలో నిమగ్నమయ్యారు. మళ్లీ ఇంకో మెయిల్‌ నోటిఫికేషన్‌... ఓపెన్‌ చేసి చూస్తే అదో సోషల్‌ నెట్‌వర్క్‌ అప్‌డేట్‌... ఇలా పదే పదే ఇన్‌బాక్స్‌ని చెక్‌ చేయడం వల్ల పని ఆటంకం ఏర్పడడంతో పాటు, సమయం వృథా అవుతుంది. అందుకే రోజులో మీరు నిర్ణయించిన సమయానికి ఇన్‌బాక్స్‌కి మెయిల్స్‌ వచ్చేలా చేయాలంటే? అందుకో సర్వీసు ఉంది. అదే BatchedInbox. ఉచితంగా సర్వీసుని వాడుకోవచ్చు. జీమెయిల్‌ ఐడీ వివరాలతో లాగిన్‌ అయితే ఇన్‌బాక్స్‌ పక్కనేBatchedInbox కనిపిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి రోజులో ఏ సమయానికి మెయిల్స్‌ డెలివరీ అవ్వాలో నిర్ణయించొచ్చు. ఒకవేళ గంటకి ఒకసారి మెయిల్స్‌ని వచ్చేలా చేసేందుకుEvery hour on the hour చెక్‌ చేయాలి. ‘టైంజోన్‌’ అక్కడే సెలెక్ట్‌ చేసుకోవాలి. మీకు వచ్చే మెయిల్స్‌ అన్నీ దాంట్లోకి చేరతాయి. ప్రయత్నించి చూద్దాం అనుకుంటేwww.batchedinbox.com సైట్‌లోకి వెళ్లండి.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list