MohanPublications Print Books Online store clik Here Devullu.com

క్రోమ్‌లో అదనంగా Google Chrome

క్రోమ్‌లో అదనంగా
Google Chrome


క్రోమ్‌లో అదనంగా!
రోజూ వెబ్‌ విహారం అనివార్యం...మరైతే, బ్రౌజర్‌ ఏది వాడుతున్నారు?క్రోమ్‌ వాడితే...ఇవిగోండి అదనపు సర్వీసులు!జత చేస్తే చాలు...జోరుగా బ్రౌజింగ్‌ చేయవచ్చు!వినూత్నంగా ట్యాబ్‌...
బ్రౌజర్‌లో కొత్త ట్యాబ్‌ని క్లిక్‌ చేస్తే ‘స్పీడ్‌ డయల్‌’ లాంటివి రావడం తెలిసిందే. వాటికి అదనంగా ఇంకేమైనా ఎప్పుడైనా ప్రయత్నించారా? ఉదాహరణకు మీరు వాడే క్రోమ్‌ ఆప్స్‌... పెట్టుకున్న బుక్‌మార్క్‌లు... ఎక్కువగా ఓపెన్‌ చేసిన వెబ్‌ సర్వీసులు... ఇంకా మరిన్ని కొత్త ట్యాబ్‌లో కనిపిస్తాయి. అందుకు Ultimate New Tab సర్వీసు బ్రౌజర్‌లో ఉంటే చాలు. జత చేయగానే U గుర్తుతో కొత్త ఐకాన్‌ అడ్రస్‌బార్‌ పక్కనే వచ్చేస్తుంది. ఇక మీదట మీరు కొత్త ట్యాబ్‌పై క్లిక్‌ చేసి గుత్తగా అన్నింటిని యాక్సెస్‌ చేయవచ్చు. ఓపెన్‌ చేసిన అన్ని ట్యాబ్‌లను Tabs విభాగంలో చూడొచ్చు. ఇదే మాదిరిగా ఎక్కువ సార్లు ఓపెన్‌ చేసిన వాటిని Top Sites విభాగంలో చూడొచ్చు. వాడుతున్న క్రోమ్‌ ఆప్స్‌ని Apps జాబితాలో చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే బ్రౌజింగ్‌ హిస్టరీని కూడా కొత్త ట్యాబ్‌లోనే క్లిక్‌ కొట్టి చూడొచ్చు. అన్ని సర్వీసులూ ట్యాబ్‌ విండోలో అక్కర్లేదు అనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి కొన్నింటిని మాయం చేసే వీలుంది. థీమ్స్‌ని మార్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ ఇమేజ్‌లను మీకు నచ్చినవాటిని పెట్టుకోవచ్చు. Choose File బటన్‌పై క్లిక్‌ చేసి సిస్టంలోని ఫైల్స్‌ని బ్యాక్‌గ్రౌండ్‌ ఇమేజ్‌గా అప్లై చేయవచ్చు. ట్యాబ్‌పైనే కనిపించే ‘నావిగేషన్‌’ మెనూ కింద కనిపించేలా సెట్‌ చేసుకునే వీలుంది. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/5uv9S0
పక్కనే ప్లే అవుతుంది...
ఇంట్లో... ఆఫీస్‌లో... ఏదో ఒక అవసరానికి యూట్యూబ్‌ చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు యూట్యూబ్‌ చూస్తూనే వెబ్‌ విహారం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడెలా? ఉదాహరణకు జీమెయిల్‌లో మెయిల్స్‌ చెక్‌ చేస్తూనే... పక్కన యూట్యూబ్‌ని చూడొచ్చు. అలాగే, ఏదైనా వెబ్‌ సర్వీసులో మీకు ఇష్టమైన వ్యాసం చదువుతూనే... పక్కనే వ్యాసానికి సంబంధించిన యూట్యూబ్‌ వీడియోని చూడొచ్చు. అదెలా సాధ్యం అంటారా? అయితే, మీరు SidePlayer సర్వీసుని క్రోమ్‌కి జత చేయాల్సిందే. అడ్రస్‌బార్‌ పక్కనే ప్రత్యేక ప్లే గుర్తు కనిపిస్తుంది. ఇక మీదట ఏదైనా వీడియోని మీరు బ్రౌజింగ్‌ చేస్తూనే హాయిగా చూడొచ్చు. అందుకు నలుపు రంగులో కనిపించే ప్లే గుర్తుపై క్లిక్‌ చేస్తే డ్రాప్‌డౌన్‌ బాక్స్‌ వస్తుంది. దాంట్లోని మీరు చూద్దాం అనుకున్న యూట్యూబ్‌ వీడియో లింక్‌ని పేస్ట్‌ చేసి ఎంటర్‌ నొక్కండి. అంతే... కుడివైపు చిన్న బాక్స్‌లో వీడియో ప్లే అవుతూ కనిపిస్తుంది. ఇక మీరు వెబú బ్రౌజింగ్‌ చేస్తూనే వీడియోని చూడొచ్చు. అంతేకాదు... ప్లేయర్‌లోని సెట్టింగ్స్‌ గుర్తుపై క్లిక్‌ చేసి Opacity స్టేటస్‌ బార్‌తో వీడియో ఒపాసిటీని మీకు తగినట్టుగా సెట్‌ చేయవచ్చు.ప్లే అవుతున్న వీడియోపై క్లిక్‌ చేసి ‘పాజ్‌’ చేయవచ్చు. వరుసగా వీడియోలను చూసేందుకు Next ఆప్షన్‌ ఉంది. ప్లేయర్‌పై కనిపించే ‘క్లోజ్‌’ గుర్తుని క్లిక్‌ చేసి వీడియోని తొలగించొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/rQoNlG
వెతుకులాటలో...
ఏదైనా సందేహం వస్తే గూగుల్‌ సెర్చ్‌ చేస్తాం. వెబ్‌ పేజీలు ఓపెన్‌ చేస్తాం. ఆ పేజీల్లోని మేటర్‌ చదివే క్రమంలో ఏదైనా క్లిష్టమైన పదం తారసపడితే! దాని గురించి తెలుసుకోవాలంటే! ఆ పదాన్ని గూగుల్‌ సెర్చ్‌లో వెతకాల్సిందేనా? ఏం అక్కర్లేదు. పదం లేదా వాక్యాన్ని సెలెక్ట్‌ చేసి రైట్‌ క్లిక్‌ చేసి సులభమైన పద్ధతిలో వెతకొచ్చు. అందుకు Context Menu Search సర్వీసుని క్రోమ్‌కి జత చేయండి. ప్రత్యేక ఐకాన్‌ రూపంలో అడ్రస్‌బార్‌ పక్కనే ఒదిగిపోయి అదనపు సేవల్ని అందిస్తుంది. వెతకాలనుకునే పదాన్ని సెలెక్ట్‌ చేసి రైట్‌క్లిక్‌ చేస్తే సెర్చ్‌ గుర్తుతో మెనూ కనిపిస్తుంది. సెలెక్ట్‌ చేస్తే డీఫాల్ట్‌గా (Bing, Wikipedia, Yahoo...) కొన్ని సెర్చ్‌ ఇంజన్ల జాబితా వస్తుంది. వాటిల్లో దేన్ని సెలెక్ట్‌ చేసినా సెర్చ్‌ రిజల్ట్స్‌ ప్రత్యేక ట్యాబ్‌లో ఓపెన్‌ అవుతాయి. ఒకవేళ మీకు గూగుల్‌ సెర్చ్‌ లేదా మరేదైనా సెర్చ్‌ ఫ్లాట్‌ఫాం మెనూలో కావాలంటే? ‘ఆప్షన్స్‌’ విభాగం ఉంది. దాంట్లోకి వెళ్లి మీకు కావాల్సిన సర్వీసుని మెనూకి జత చేయవచ్చు. వార్తలు, మ్యూజిక్‌, సినిమాలు, షాపింగ్‌కి సరిపడే వాటిని కూడా మెనూలో పెట్టుకోవచ్చు. అక్కర్లేని వాటిని మెనూ నుంచి తొలగించొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/JqPazl
ఇక కనిపిస్తుంది...
ఎక్కువ సార్లు పాస్‌వర్డ్‌ని తప్పు టైప్‌ చేస్తున్నారా? టైప్‌ చేసిన పాస్‌వర్డ్‌ని సాధారణ టెక్స్ట్‌ రూపంలో ఓ మారు చూసుకునే వీలుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే, మీరు ShowPassword సర్వీసుని వాడాల్సిందే. దీన్ని క్రోమ్‌కి జత చేయడం ద్వారా టైప్‌ చేసిన పాస్‌వర్డ్‌ని సాధారణ టెక్స్ట్‌లా చూడొచ్చు. ఉదాహరణకు ఇంట్లో ఒక్కరే ఉన్నారు. మీ పాస్‌వర్డ్‌ని ఇతరులెవరూ గమనించే అవకాశం లేదు. అప్పుడు స్వేచ్ఛగా మీరు టైప్‌ చేసిన పాస్‌వర్డ్‌ కరెక్టో... కాదో... చూసుకోవచ్చు. సర్వీసుని బ్రౌజర్‌కి జత చేసిన తర్వాత ఏదైనా వెబ్‌ సర్వీసుని ఓపెన్‌ చేసి లాగిన్‌ వివరాల్ని టైప్‌ చేయండి. ఎంటర్‌ నొక్కడానికి ముందు టైప్‌ చేసిన పాస్‌వర్డ్‌ని చూద్దాం అనుకుంటే మౌస్‌ పాయింటర్‌ని పాస్‌వర్డ్‌పైకి తీసుకొస్తే చాలు. చుక్కలు కాస్తా ఇంగ్లిష్‌ అక్షరాలుగా కనిపిస్తాయి. ఒకసారి సరి చూసుకుని లాగిన్‌ అవ్వొచ్చు. ‘షో పాస్‌వర్డ్‌’ సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. అందుకు ‘ఆప్షన్స్‌’ మెనూ ఉంది. సెలెక్ట్‌ చేసి పాస్‌వర్డ్‌ని ఎలా చూడొచ్చో దీంట్లో నిర్ణయించొచ్చు. మౌస్‌ పాయింటర్‌ని కాకుండా కీబోర్డ్‌ నుంచే పాస్‌వర్డ్‌ని చూద్దాం అనుకుంటే Press Ctrl Key ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయండి. దీంతో టైప్‌ చేసిన పాస్‌వర్డ్‌ని చూసేందుకు కేవలం కీబోర్డ్‌లోని ‘కంట్రోల్‌’ మీటని నొక్కితే చాలు. ఇదే మాదిరిగా బాక్స్‌లో ‘డబుల్‌ క్లిక్‌’ చేసి కూడా పాస్‌వర్డ్‌ని చూడొచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌:https://goo.gl/LD4jsM
జీబీల్లో పంపొచ్చు...
ఇమేజ్‌, పీడీఎఫ్‌... ఫైల్‌ ఏదైనా ఆన్‌లైన్‌లో ఇతరులతో షేర్‌ చేయాలంటే? క్లౌడ్‌ సర్వీసుల్లోకి అప్‌లోడ్‌ చేయాలి. లేదంటే... మెయిల్‌లోకి ఎటాచ్‌ చేసి సెండ్‌ చేయాలి. అదీ నిర్ణీత మెమొరీతో కూడిన ఫైల్స్‌ని మాత్రమే పంపగలం. ఇవేం లేకుండా సులువైన పద్ధతిలో జీబీల కొద్దీ డేటాని పంపొచ్చు తెలుసా? అందుకు Send Anywhere సర్వీసు ఉంది. దీన్ని క్రోమ్‌ బ్రౌజర్‌కి జత చేసి వాడుకోవచ్చు. క్రోమ్‌ వెబ్‌స్టోర్‌ నుంచి బ్రౌజర్‌కి యాడ్‌ చేయగానే ప్రత్యేక ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి సిస్టంలోని ఆడియో, వీడియో, ఇమేజ్‌, డాక్యుమెంట్‌, పీడీఎఫ్‌... ఫైల్‌ ఏదైనా సెలెక్ట్‌ చేసి డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో సెలెక్ట్‌ చేయాలి. దీంతో క్షణాల్లో ఫైల్‌ అప్‌లోడ్‌ అయ్యి ప్రత్యేక డౌన్‌లోడ్‌ లింక్‌ సిద్ధం అవుతుంది. ఆ లింక్‌ని మెయిల్‌, వాట్స్‌ఆప్‌, మెసేజ్‌ చేస్తే చాలు. ఇతరులు ఎవ్వరైనా ఫైల్‌ని పొందొచ్చు. ఇక నెట్టింట్లో తారసపడిన ఏదైనా ఇమేజ్‌, పీడీఎఫ్‌ ఫైళ్లను పంపాల్సి వస్తే! సింపుల్‌గా ఇమేజ్‌పై రైట్‌క్లిక్‌ చేసి Image Share with Send Anywhere ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. చిటికెలో డౌన్‌లోడ్‌ లింక్‌ క్రియేట్‌ ప్రత్యక్షమవుతుంది. లింక్‌ని షేర్‌ చేస్తే చాలు. ఇతరులు లింక్‌పై క్లిక్‌ చేసి ఇమేజ్‌ని పొందొచ్చు. ఇదే మాదిరిగా పీడీఎఫ్‌ని పంపాల్సివస్తే PDF Share with Send Anywhere ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. ఈ సర్వీసుని వాడుకుని జీమెయిల్‌లో ఫైల్స్‌ని ఎటాచ్‌ చేసి పంపొచ్చు. సర్వర్‌లోకి అప్‌లోడ్‌ చేసిన పైల్‌ వారం రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే... లింక్‌ని షేర్‌ చేసిన తర్వాత ఆ గడువులోపే ఫైల్‌ని ఇతరులు పొందగలరు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/jO19Tq
విభాగాలుగా...
రోజూ ఏవేవో అవసరాలు... అన్నింటికీ నెట్టింటినే ఆశ్రయిస్తున్నాం. ఇంటి అవసరాలకు కొన్ని సైట్‌లు... షాపింగ్‌కి కొన్ని... ఆఫీస్‌ అవసరాలకు ఇంకొన్ని... రోజువారీ అప్‌డేట్స్‌ కోసం న్యూస్‌ సైట్‌లు... ఇలా అనేక వెబ్‌ సర్వీసుల్లో విహరిస్తుంటాం. మరి, వాటన్నింటినీ పదే... పదే... ఒక్కోటి ఓపెన్‌ చేయకుండా విభాగాలుగా (Session) సేవ్‌ చేసుకుంటే? Session Buddy సర్వీసుతో ఇది చాలా సులభం. బ్రౌజర్‌కి జత చేసిన తర్వాత ఓపెన్‌ చేసిన ట్యాబ్‌లను విడిగా ‘సెషన్స్‌’ రూపంలో విభజించి బ్రౌజింగ్‌ చేయవచ్చు. ఇలా ఓపెన్‌ చేసిన సెషన్స్‌ని భవిష్యత్‌ అవసరాల కోసం కావాలంటే సేవ్‌ చేసుకునే వీలుంది. Window1, Window2, Window3... పేర్లతో మీరు ఓపెన్‌ చేసిన సెషన్స్‌ని చూడొచ్చు. ఏదైనా సెషన్‌ని సేవ్‌ చేసేందుకు బాణం గుర్తుతో కనిపించే Save ఐకాన్‌ని సెలెక్ట్‌ చేయాలి. సేవ్‌ చేసిన అన్ని సెషన్స్‌ని Saved Sessions మెనూలో చూడొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/2o3xpT


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list