MohanPublications Print Books Online store clik Here Devullu.com

గౌతమీపుత్ర శాతకర్ణి, Gouthami Putra

గౌతమీపుత్ర శాతకర్ణి
Gouthami Putra


గౌతమీపుత్ర శాతకర్ణి;-------
గౌతమీపుత్ర శాతకర్ణి (లేక శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) శాతవాహన రాజులలో 23వ వాడు. అతని తండ్రి శాతకర్ణి తరువాత రాజయ్యెను.
శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించెను. అతని తరువాత శాలివాహనుడు రాజయ్యెను. అప్పటికి రాజ్యమైతే విస్తరించబడ్డది కానీ శత్రుదేశాలనుండి ప్రత్యేకంగా శకులు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉండినది. శాలివాహనుడు శకులను, యవనులను, పహ్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. . భారతీయ పంచాంగం(కాలండరు) శాలివాహనుని పేరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది. ఈయన నహపాణున్ని ఓడించి పెద్ద మొత్తములో లభ్యమవుతున్న జోగళ్‌తంబి నాణకశాల వర్గానికి చెందిన క్షహరత నాణేలపై తిరిగి ముద్రింపజేశాడు.
నాసిక్ లో లభ్యమైన అరుదైన గౌతమీపుత్ర శాతకర్ణి నాణెం
నాసిక్ ప్రశస్తి గౌతమీపుత్ర శాతకర్ణిని అప్రాంత, అనూప, సౌరాష్ట్ర, కుకుర, అకార మరియు అవంతి ప్రాంతాల పాలకునిగా పేర్కొన్నది. ఈ ప్రాంతాలను ఈయన నహపాణుని నుండి హస్తగతం చేసుకొని ఉండవచ్చు. ఈయన తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కను ప్రాంతాలు కూడా తిరిగి సంపాదించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి కాలములో శాతవాహన ప్రాబల్యం దక్షిణాన కంచి వరకు వ్యాపించింది. ఈయన ఆనంద గోత్రీయుల నుండి దక్షిణ మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతాలను జయించినాడని ప్రతీతి. శాలివాహనుడు బనవాసి ప్రాంతాన్ని తన రాజ్యములో కలుపుకొని కర్ణాటకలోని కొంతభాగముపై అధికారము సాధించాడు. ఈయన తరువాత క్రీ.శ.130 ప్రాంతములో ఈయన కుమారుడు వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి రాజ్యం చేపట్టాడు.
గౌతమీపుత్ర శాతకర్ణి, శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికాడు. మరాఠులు, ఆంధ్రులు, కన్నడిగులు నేటికీ శాలివాహన శకాన్ని పంచాంగాలలో ఉపయోగిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి ధరించిన బిరుదులు
త్రిసముద్రపిత్తోయవాహన (తన అశ్వములు మూడు సముద్రాలలో నీరు తాగినవాడు)
శకయవనపల్లవనిదూషణ (శక, యవన మరియు పల్లవుల నాశకుడు)
వ్యక్తిత్వం;-------
గౌతమీపుత్రుని వ్యక్తిత్వం చాలా విశిష్టమైంది. ఈయన మూర్తి ఉన్న నాణేలనుబట్టి ఈయన ధృడకాయుడని, స్ఫురద్రూపియని తెలుస్తున్నది. పరవార విక్రముడు, శత్రుభయంకరుడు, సమరశిరసివిజితరిపుసంఘాతకుడు, ఉదార పాలకుడు, పౌరజన సుఖదు:ఖాలలో భాగస్వామి, వైదికవిద్యాతత్పరుడు, ఆగమనిలయుడు, వర్ణసాంకర్యాన్ని ఆపినవాడు, విద్వద్బ్రాహ్మణ కుటుంబాలను పోషించినవాడు, పరమధార్మికుడు, ధర్మార్థకామ పురుషార్థాలపట్ల శ్రద్ధ వహించినవాడు, ఏకబ్రాహ్మణుడని కీర్తిపొందినాడని ఆయన తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి వల్ల తెలుస్తున్నది. ఇందులో ఉన్న అంశాలు కొన్ని అతిశయోక్తులుగా అనిపించవచ్చు. తల్లి బాలశ్రీ దృష్టిలో పురాణపురుషునితో సమానుడైనా బ్రాహ్మణులను పోషించాడనడానికిగానీ, వర్ణసాంకర్యం మాన్పిన నిదర్శనాలు గానీ లేవు. గౌతమీపుత్ర శాతకర్ణి రాజకీయ కారణాల వల్ల పరమత సహిష్ణుత ప్రదర్శించి బౌద్ధులకు సైతం ధానధర్మాలు చేసాడు. గౌతమీ పుత్రుని బిరుదులు: వినివర్తిత ఛాతుర్వర్న సన్కర ఆగమనిలయ త్రిసముద్రతొయపీతవాహన సర్వమన్దల వాదిత


LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list