గృహంలో బరువులు ఎటు ఉండాలి
Vasthu
గృహంలో బరువులు ఎటు ఉండాలి.
ఇంటి నిర్మాణంలో వాస్తు ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకొన్నదో... ఆ తర్వాత ఇంటిలోపల సామాన్ల అమరిక, బరువులు ఏ దిశలో వుంచాలో? ఎక్కువ ఖాళీ స్థలాన్ని గదుల్లో ఏఏ దిశల్లో వదలాలో తెలియచేసేది కూడా వాస్తు శాస్త్రమే. పొరపాట్న ఉంచకూడని దిశలో ఏమాత్రం బరువైన సామాన్లను పెట్టామో ఇక ఆ ఇంటి వాస్తు ప్రమాదకరంగా మారిపోతుంది. ఇలాంటపుడు రకరకాలైన అనారోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు, పిల్లల అభివృద్ధి, ప్రమాదాలు పిలవని పేరంటాల్లా వస్తాయి.
ఇంటి గదుల్లో ఉత్తరం, తూర్పు, ఈశాన్యం కంటే నైరుతి, పడమర, వాయవ్యం పల్లంగా వుండి, తూర్పు ఈశాన్యాలలో బాగా బరువైన , కొద్దిగా బరువున్న సామాన్లను గాని, చెక్కతో చేసిన వస్తువులను గాని ఆ ఇంట్లో ని గదుల్లోని ఆయా దిక్కుల్లో వుంచితే ఇంట్లోని యజమానికి, యజమానురాలికి చాలా సంవత్సరాల పాటు మందులు వాడితేనే కాని తగ్గని వ్యాధులు తగులుకుంటాయి. ఆగ్నేయభాగం మరియు దక్షిణభాగంలో బాగా ఎత్తుగావుండే ఎలాంటి ఇనుప వస్తువులని పెట్టకండి. అలా కనుక వుంచితే స్త్రీ సంబంధమైన వ్యాధులు తరచుగా బాధిస్తుంటాయ. అనుకోకుండా సర్జరీ కూడా అవసరం పడొచ్చు. ఉచ్ఛస్థానంలో సింహద్వారాలను పెట్టిన ఇళ్లలో చాలా వరకు ఆ ద్వారాలకు వ్యతిరేక దిశలో ఎటువంటి బరువులను పెట్టకండి. ఇంట్లో పడే సూర్యకిరణాలను యధేచ్ఛగా పడే విధంగా తూర్పు దిశగా ఎటువంటి బరువులను పెట్టకండి.
ఇంటిలోని దిక్కుల్లోని మూలల విషయంలో చాలా జాగ్రత్త పడండి. బరువులను ఎలా పడితే అలా మూలలో పెట్టకండి. మూలల్లో నైరుతి మూలకు ఎంతైనా బరువును మోసే దిశగా పేరు తెచ్చుకుంది. ఎలాంటి మెటల్ వస్తువులనైనా ఈ దిశ ఆహ్వానిస్తుంది. కాకపోతే అగ్నికారకమైన గ్యాస్ సిలెండర్లను, ఇనుప స్టౌలను మాత్రం ఈ మూలలో వుంచకండి. బ్రతుకు బూడిదగా మారుతుంది. ఇంట్లో అగ్ని ప్రమాదాలు, ఇంటి కరెంట్ సీలింగ్‌లోని కరెంటు తీగలు తగలపడే ప్రమాదం వుంటుంది. ఈ దిశలోని మూలల్లో ఎలాంటి వెంటిలేటర్లు వున్నా అవి మూసుకుపోని విధంగా బరువులని పెట్టుకోండి. ఇంకా పడమర వాయవ్య మూలగా, దక్షిణ ఆగ్నేయ మూలగా కిలోల కొద్దీ బరువులను పెట్టినా ఎటువంటి చెడుఫలితాలు చుట్టుకోవు. ఇక ఇనుప బీరువాలను కాని చెక్క బరువులను కాని కిటికీల క్రింద లేదా దిశా మూలల్లో వంకరగా పెట్టకండి. మీ జీవితం రకరకాలుగా అగమ్య గోచరంగా మారిపోతుంది.
దక్షిణ నైరుతి దిశలోని గదిలోని తూర్పు దిశామూలలకు తేలిక పాటి బరువులే కదాని వేటినన్నా పెట్టారో ఫలితాలు ప్రమాదకరంగా వుంటాయి. అలాంటి గదిలో సంసారం చేసే ఆడవారికి రక రకాలైన చర్మవ్యాధులు, అధిక రక్తస్రావం, శరీరమంతా కురుపులు తదితర రోగాల బారిన పడతారు. అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్ కాని, బావి లేదా బోర్‌వెల్, సెప్టిక్ ట్యాంక్‌లాంటి మొదలైన నిర్మాణాలు వుంటే వాటిమీద ఎలాంటి బరువైన పూల కుండీలను కాని, టూవీలర్ వాహనాలను కాని, కార్లను కాని వుంచకండి. అలాంటి ఇంట్లో వుంటున్న మగ వారు కాని, ఆడవారు కాని ఆత్మహత్యల పాలవుతుంటారు. ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. జీవితాంతం తలలో చుండ్రు బాధిస్తుంటుంది. తల వెంట్రుకలు విపరీతంగా రాలిపోయ చర్మరోగం బారిన పడతారు. గదుల్లోని కిటికీల క్రింద అలమర్లను పెట్టి వాటిలో ఎలాంటి బరువైన వస్తువులను పెట్టకండి. ఏ దిశగా కాని, ఏ మూలగా కాని ఎలాంటి ఫర్నీచర్‌ని గాని, మంచాలని గాని గోడలకు తగలకుండా వేసుకోండి.
.
.
.
.
"అందరికీ ఉపయోగపడేవిధంగా
ఈ పోస్ట్ ని
అందరూ షేర్ చేయగలరు
ఈ పోస్ట్ ని
అందరూ షేర్ చేయగలరు
PRICE LIST :------
http://www.mohanpublications.com/docs/catalogue2015.pdf
http://www.mohanpublications.com/docs/catalogue2015.pdf
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565