MohanPublications Print Books Online store clik Here Devullu.com

శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె, In Body Main Part is Heart



శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె
In Body Main Part is Heart

గుప్పెడంతే ఉంటుంది కానీ
శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె.
ప్రస్తుతం పరిగెడుతున్న ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నాడు, ఆ జేబులు వెనక ఓ గుండె ఉంటుందనీ నిర్లక్ష్యంతో వ్యవహరించిన ప్రతీసారీ శత్రువు క్రమక్రమంగా శరీరంలో బలపడుతున్నాడని గ్రహించటంలో అనాసక్తిగా ఉన్నాడు.
అదే సమయంలో గుండెపోటు, ఛాతి నొప్పి ఇలాంటి సమస్యలు ఒక్కసారిగా దాడి మొదలెడతాయి వీటి బారిన పడకుండా గుండెకి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుని ఉండటం చాలా అవసరం. గుండె పోటు విషయంలో అయితే మనం గ్రహించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, అలా కాకుండా గుండెపోటు ముందుగా కనపడే లక్షణాలు తెలుసుకుంటే చాలా వరకు జాగ్రత్త పడొచ్చు ………..
1. జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌ర‌చుగా వ‌స్తున్నా, అవి ఓ ప‌ట్టాన త‌గ్గ‌కున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా నిలుస్తాయి. దీంతోపాటు ద‌గ్గు కూడా ఎక్కువ‌గా వ‌స్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి.
2. హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాల్లో మ‌రొక‌టి శ్వాస ఆడ‌క‌పోవ‌డం. గాలి పీల్చుకోవ‌డంలో త‌ర‌చూ ఇబ్బందులు వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి.
3. ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటున్నా, ఏదో బ‌రువుగా ఛాతిపై పెట్టిన‌ట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచ‌నే అవుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆలోచించ‌కూడ‌దు. వైద్యున్ని సంప్ర‌దించి త‌క్ష‌ణ‌మే త‌గిన చికిత్స చేయించుకోవాలి.
4. మ‌త్తు మ‌త్తుగా నిద్ర వ‌చ్చిన‌ట్టు ఉంటున్నా, చెమ‌ట‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నా అనుమానించాల్సిందే. అవి కూడా హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది.
5.విప‌రీతంగా అల‌సిపోవ‌డం, ఒళ్లంతా నొప్పులుగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు త‌ర‌చూ క‌నిపిస్తుంటే వాటిని అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి కూడా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా ప‌నిచేస్తాయి.
6.ఎల్ల‌ప్పుడూ వికారంగా తిప్పిన‌ట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌క‌పోతున్నా, గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌ర‌చూ వ‌స్తున్నా, క‌డుపు నొప్పి వ‌స్తున్నా వాటిని కూడా హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలుగానే భావించాలి.
7. కంటి చివ‌ర్ల‌లో కురుపుల వంటివి వ‌స్తే వాటిని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయి ఉండ‌వ‌చ్చు.
8.కాళ్లు, పాదాలు, మ‌డిమ‌లు అన్నీ ఉబ్బిపోయి క‌నిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచ‌న‌లుగా భావించాలి.
9. శ‌రీరం పై భాగం నుంచి ఎడ‌మ చేతి కిందిగా నొప్పి వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి. అంతే కాదు ఒక్కోసారి ద‌వ‌డ‌ల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించ‌వ‌చ్చు.
10. గుండె సంబంధ స‌మ‌స్య‌లు ఉంటే గుండె కొట్టుకోవ‌డం కూడా ఎప్పటిలాగా ఉండదు. కాబ‌ట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హార్ట్ బీట్‌ను కూడా గ‌మ‌నిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధార‌ణ బీట్ క‌నిపిస్తే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి. నిర్లక్షం చేసిన ప్రతీసారి మరణానికి ఒక్కోఅడుగు దగ్గర అవుతున్నట్టే……

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list