స్లిమ్ గా తయారు కావడానికి ఆరోగ్య సూత్రాలు , Tips About Slim
మనము ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా ,ఎంత హుందాగా తయారు అయినా పొట్ట ఎక్కువగా ఉంటే బాగోదు.అందం కోసమే కాకున్నా ,ఆరోగ్య రీత్యా కూడా పొట్ట లో కొవ్వు అధికంగా పెరగడమనేది మంచిది కాదు.పొట్ట పెరుగుతూ ఉండడం వలన మనలో బద్దకం కూడా బాగా పెరుగుతుంది. దీనివలన కూడా చాల ఇబ్బంది పడతాము .అందుకే ఈ క్రింది సూత్రాలను పాటించి పొట్ట తగ్గించుకొండి .
1.సరైన నిద్ర
మనిషి కి రోజుకు కనీసం 8 గంటలు నిద్ర ఉండాలి.పడుకునేటప్పుడు బోర్లా పడుకోండి.దీని వలన పొట్టలో కొవ్వు కరుగుతుంది.
2.సాల్ట్ తక్కువగా తినాలి
బీపీ ఉన్న వాళ్ళే సాల్ట్ తక్కువగా తినాలి అనుకుంటారు .కాని సాల్ట్ ఎక్కువగా తినడం ఎవ్వరికి మంచిది కాదు.
సాల్ట్ ఎక్కువగా తినడం వలన ఫ్యాట్ పెరుగుతుంది.
3.లోతుగా శ్వాస పీల్చాలి
శ్వాస లోతుగా పీల్చడం వలన ఆరోగ్యానికి చాల మంచిది.ప్రతి రోజు శ్వాసకు సంబందించిన వ్యాయామాన్ని చెయ్యండి.
4.నీరు అధికంగా కలిగిన ఆహారం
శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడి, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే నీరు అధికంగా కలిగిన ఆహారం తీసుకోవాలి.వాటర్ మెలోన్ ,పీయర్స్ వంటివి తింటే మంచిది.
5.జంక్ ఫుడ్ ని తినకండి
జంక్ ఫుడ్,ఫ్రై ఐటమ్స్ ,చిప్స్ ఇలాంటివి ఖచ్చితంగా వదిలెయ్యాలి .వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
6.ఎక్కువగా నీరు త్రాగండి
ఎక్కువగా నీరు త్రాగడం ద్వారా కూడా పొట్ట తగ్గించుకోవచ్చు .దీని వలన చాలా ప్రయోజనాలున్నాయి .
7.స్లో గా తినండి .
ఆహారాన్ని తినేటప్పుడు నిదానంగా తింటే మంచిది.నిమ్మదిగా తినడం వలన తక్కువ తింటాము .ఇంకా కొవ్వు తగ్గి బరువు కూడా తగ్గుతాము .
8.వ్యాయామం
పొట్టకు సంబందించిన వ్యాయామం చెయ్యండి .క్రమం తప్పకుండ ప్రతి రోజు పొట్టకు సంబంధిన వ్యాయామములు చెయ్యడం వలన మంచి ఫలితం ఉంటుంది.
9.నడవండి
నడక అన్నిటికంటే ఈజీ అయినది .ప్రతి రోజు కొంచెం దూరమైన నడవడం వలన పొట్ట తగ్గడమే కాకుండా ,కాళ్ళు కూడ సన్న పడతాయి.
10.తినిన వెంటనే పడుకో వద్దు
కొంతమందికి మద్యాహ్నం తినగానే పడుకోవటం అలవాటు .దీని వలన పొట్ట బాగా పెరుగుతుంది .ఆహారం తీసుకున్న వెంటనే పడుకోవద్దు .
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565