వాట్స్‌ఆప్‌లో ఇవి వాడారా
In WhatsApp these have to use
వాట్స్‌ఆప్‌లో ఇవి వాడారా?
స్మార్ట్ మొబైల్ చేతిలో ఉంటే...అన్నీ వాట్స్‌ఆప్‌లోనే! మరి, మీకు ఈ ఆప్షన్స్ తెలుసా?ఎప్పుడైనా వాడారా?వాడకుంటే ప్రయత్నించండి!
సేవ్ అవ్వకుండా...
ఏవేవో షేర్ చేస్తుంటారు. వాటిల్లో ఫొటోలు, వీడియోలు ఎక్కువే. నెట్‌కి కనెక్ట్ అవ్వగానే అన్నీ ఆటోమాటిక్‌గా గ్యాలరీలోకి డౌన్‌లోడ్ అవుతాయి. ఇలా సేవ్ అవ్వడం కారణంగా మెమొరీ వృథా అయ్యే అవకాశం లేకపోలేదు. మరైతే, ఇలా ఆటోమాటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా బ్లాక్ చేయడం ఎలా? యాపిల్ ఫోన్ యూజర్లకు ఫోన్‌లోనే ప్రత్యేక ఆప్షన్ ఉంది. వాడదాం అనుకుంటే ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘ఫొటోస్’ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి వాడుతున్న సర్వీసుల జాబితా కనిపిస్తుంది. వాటిల్లో నుంచి ‘వాట్స్‌ఆప్’ని డిసేబుల్ మోడ్‌లోకి మార్చేస్తే చాలు.
ఒక్కొక్కరికీ ఒక్కోటి
ఫోన్ రింగ్‌టోన్‌ని విని ఎవరు ఫోన్ చేశారో చెప్పొచ్చు. మరి, వాట్స్‌ఆప్ నోటిఫికేషన్‌ని విని ఎవరు మెసేజ్ పంపారో చూడకుండానే తెలుసుకోవాలంటే? సింపుల్‌గా... ‘కస్టమ్ నోటిఫికేషన్స్’ సెట్ చేసుకుంటే సరి. అది ఎలా సాధ్యం అంటే... మీరు ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఏదైనా గ్రూపు లేదా కాంటాక్ట్‌ని తాకి ఉంచితే డ్రాప్‌డౌన్ మెనూ వస్తుంది. దాంట్లోని ‘వ్యూ కాంటాక్ట్’ని సెలెక్ట్ చేస్తే ‘కస్టమ్ నోటిఫికేషన్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. ‘యూజ్ కస్టమ్ నోటిఫికేషన్స్’ చెక్ చేస్తే అన్నీ ఎనేబుల్ మోడ్‌లోకి వచ్చేస్తాయి. ఇక మీకు కావాల్సినట్టుగా నోటిఫికేషన్స్ సెట్ చేయవచ్చు.
షార్ట్‌కట్‌లు పెట్టారా?
స్నేహితులతో గ్రూపుని క్రియేట్ చేస్తే రోజంతా ఏవేవో అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి... మీరూ ఏదొక అప్‌డేట్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇలాంటప్పుడు అన్ని సార్లూ వాట్స్‌ఆప్ ఆప్‌లోకి వెళ్లి గ్రూపుని సెలెక్ట్ చేయాల్సిందేనా? ఏం అక్కర్లేదు. ఎక్కువ సార్లు యాక్సెస్ చేయాల్సిన కాంటాక్ట్‌లను ఫోన్ హోం స్క్రీన్‌పై షార్ట్‌కట్‌గా పెట్టుకోవచ్చు తెలుసా? అందుకు మీకు కావాల్సిన గ్రూపు లేదా కాంటాక్ట్‌ని కొన్ని సెకన్ల పాటు నొక్కి ఉంచితే డ్రాప్‌డౌన్ మెనూ వస్తుంది. దాంట్లోని ‘యాడ్ ఛాట్ షార్ట్‌కట్’ ఆప్షన్‌ని సెలెక్ట్ చేస్తే చాలు. గ్రూపు లేదా కాంటాక్ట్ ప్రొఫైల్ ఫొటోతో షార్ట్‌కట్ రూపంలో ఫోన్ హోం స్క్రీన్‌పైకి వచ్చేస్తుంది.
విభాగాలుగా...
డాక్యుమెంట్‌లు, లింక్‌లు, ఫొటోలు, వీడియోలు... ఇలా అన్నింటినీ వాట్స్‌ఆప్‌లో పంచుకుంటున్నాం. మరి, ఈ మొత్తం కంటెంట్‌ని విభాగాల వారీగా క్రమ పద్ధతిలో అమర్చుకుని బ్రౌజ్ చేసి చూడొచ్చు తెలుసా? ఐఫోన్ యూజర్లకు కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అదే ‘మీడియా’. హోం స్క్రీన్‌లో మూడు చుక్కల్ని సెలెక్ట్ చేస్తే... డ్రాప్‌డౌన్ మెనూలో Media ఆప్షన్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేస్తే Media, Documents, Links అన్ని విభాగాలుగా కనిపిస్తాయి. దీంతో సులువుగా బ్రౌజ్ చేసి చూడొచ్చు.
అందరికీ ఒకేసారి...
గ్రూపుల్లో తెర మాట్లాడేసుకుంటారు. అందరికీ సమాచారాన్ని ఒకేసారి తెలిసేలా చేస్తారు. కానీ, గ్రూపులో లేని ఓ పది మందికి సమాచారాన్ని ఒకేసారి పంపాలంటే? ఉదాహరణకు పుట్టిన రోజు వేడుకకి సంబంధించిన ఆహ్వానాన్ని గ్రూపులోనే కాకుండా వాట్స్‌ఆప్ కాంటాక్ట్ జాబితాలోని ఇతరులకీ పంపాలంటే? అప్పుడు సులువైన పద్ధతిలో అందరికీ ఒకేసారి పంపడానికి ‘బ్రాడ్‌క్యాస్ట్’ చేయవచ్చు తెలుసా? అందుకు వాట్స్‌ఆప్ హోం స్క్రీన్‌లోని మూడు చుక్కల్ని సెలెక్ట్ చేయాలి. డ్రాప్‌డౌన్ మెనూలో ‘న్యూ బ్రాడ్‌క్యాస్ట్’ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి ఎవరికైతే సమాచారాన్ని పంపాలో వారి కాంటాక్ట్‌లను బ్రాడ్‌క్యాస్ట్ జాబితాగా పెట్టుకోవచ్చు. ప్లస్ గుర్తుని తాకితే మొత్తం కాంటాక్ట్‌లు జాబితాగా వచ్చేస్తాయి. వాటిల్లో కావాల్సిన కాంటాక్ట్‌లను చెక్ చేసి బ్రాడ్‌క్యాస్ట్ లిస్ట్‌గా సెలెక్ట్ చేసి ‘క్రియేట్’ ఆప్షన్‌ని తాకితే చాలు. కొత్త బ్రాడ్‌క్యాస్ట్ లిస్ట్ సిద్ధం అవుతుంది. ఇంకేముందీ... మెసేజ్‌ని టైప్ చేసి అందరికీ ఒకేసారి సెండ్ చేయవచ్చు. గ్యాలరీ నుంచి ఫొటోలనూ సెలెక్ట్ చేసి పంపొచ్చు.
చదివారా? లేదా?
ఛాట్ మెసేజ్‌లు, ఫొటోలు లేదా వీడియోలు ఇలా ఏవైనా... మీరు చూసినట్టుగా అవతలి వారికి ఎలా తెలుస్తుంది. రెండు టిక్‌మార్క్‌లు నీలి రంగులోకి మారతాయి. దీన్నే ‘రీడ్ రిసిప్ట్స్’గా పిలుస్తున్నారు. ఈ ఆప్షన్‌ని డిసేబుల్ చేయడం ద్వారా మీరు చూసినట్టుగా ఇతరులకు తెలియదు. ఒకవేళ మీకూ ఈ ఆప్షన్‌ని డిసేబుల్ చేయాలనే ఆలోచన ఉంటే వాట్స్‌ఆప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ఎకౌంట్’ని ఓపెన్ చేయండి. మెనూలో వచ్చిన ‘ప్రైవసీ’ ఆప్షన్‌ని సెలెక్ట్ చేస్తే ‘రీడ్ రిసిప్ట్స్’ చెక్ చేసి కనిపిస్తుంది. డిసేబుల్ చేద్దాం అనుకుంటే ఆప్షన్‌ని అన్‌చెక్ చేస్తే చాలు. ఇక మీరు చూసినట్టుగా నీలి రంగు టిక్ మార్క్‌లు కనిపించవు. ఇదే మాదిరిగా వాట్స్‌ఆప్‌ని చివరిసారిగా ఎప్పుడూ చూశారో తెలుసుకోగలిగే ‘లాస్ట్ సీన్’ ఆప్షన్‌ని కూడా మార్పులు చేయవచ్చు. చివరిగా చూసిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటే ‘లాస్ట్ సీన్’ని Nobody ఆప్షన్‌కి సెట్ చేయాలి.
మూడు రకాలుగా...
ఛాట్ మెసేజ్‌ల్లో ఏదైన మేటర్‌ని ‘బోల్డ్’ చేయాలంటే? యాపిల్ యూజర్లు ఐఫోన్‌లో చేయవచ్చు. ఎలాగంటే... స్టార్ (asterisks) గుర్తుని మేటర్ ప్రారంభంలో, చివర్లో ఎంటర్ చేసి పోస్ట్ చేస్తే చాలు. మేటర్ బోల్డ్ అయ్యి పోస్ట్ అవుతుంది. ఉదాహరణకు
* all of this will be bold
* అని టైప్ చేయాలన్నమాట.
* ఇక మేటర్‌ని ఇటాలిక్స్‌గా మార్చేందుకు మేటర్‌కి ముందు, వెనకా అడ్డగీతని (underscore) టైప్ చేసి పోస్ట్ చేయాలి. ఉదాహరణకు ఇలా _this will be italicised_ ఇదే మాదిరిగా మేటర్‌ని strikethrough టెక్స్ట్‌గా పోస్ట్ చేసేందుకు మేటర్ ముందు, వెనక tilde (~) గుర్తుని టైప్ చేయాలి. ఉదాహరణకుఇలా~this will be strikethrough text~
నెంబర్‌ని మార్చాలంటే?
కాంటాక్ట్‌లు, ఛాట్ మెసేజ్‌ల్లో ఎలాంటి మార్పు లేకుండా కొత్త ఫోన్ నెంబర్‌కి వాడుతున్న వాట్స్‌ఆప్ ఎకౌంట్‌ని మార్చాలంటే? సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ఎకౌంట్’ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. వచ్చిన మెనూలోని Change Number ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి పాత, కొత్త ఫోన్ నెంబర్లను ఎంటర్ చేయడం ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ ముగుస్తుంది. కొత్త ఫోన్ నెంబర్‌తో పాటు కొత్త ఫోన్‌లోకి మారుద్దాం అనుకుంటే... ముందుగా పాత ఫోన్‌లోని వాట్స్‌ఆప్ డేటాని సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాడుతున్న మెయిల్ ఎకౌంట్‌కి బ్యాక్‌అప్ చేయాలి.
నచ్చిన మెసేజ్‌లు
ఛాట్ మెసేజ్‌ల్లో కొన్ని ఆసక్తికరమైనవి ఉంటాయి. వాటిని చదివిన తర్వాత ప్రత్యేకంగా ఎక్కడైనా సేవ్ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చిందా? అయితే, మీరు Starred Messages గురించి తెలుసుకోవాల్సిందే. వాట్స్‌ఆప్‌లో బుక్‌మార్క్ ఆప్షన్‌లా పని చేస్తుంది. బాగా ఆకట్టుకున్న ఫొటో, మెసేజ్, వీడియో ఏదైనా సెలెక్ట్ చేస్తే పై భాగంలో స్టార్ గుర్తు కనిపిస్తుంది. దాన్ని తాకితే సెలెక్ట్ చేసింది ఏదైనా బుక్‌మార్క్ అవుతుంది. ఇలా మార్క్ చేసిన వాటిని ఎప్పుడైనా చూడాలి అనుకుంటే ఛాట్ హోం పేజీలోని మూడు చుక్కల్ని సెలెక్ట్ చేయాలి. వచ్చిన డ్రాప్‌డౌన్ మెనూలోని Starred Messages ఆప్షన్‌ని తాకితే అన్ని జాబితాగా కనిపిస్తాయి.
జీడ్రైవ్‌లోకే బ్యాక్‌అప్
వాట్స్‌ఆప్ డేటా అనుకోకుండా తొలగిపోతే వెంటనే రీస్టోర్ చేస్తాం. కానీ, మీరు వాడే ఫోన్ పోగొట్టుకుంటే? కొత్త ఫోన్‌లో వాట్స్‌ఆప్ మొత్తం డేటాని రీస్టోర్ చేయాలంటే? అప్పుడెలా డేటాని బ్యాక్‌అప్ చేసేది? సింపుల్... కొత్త వాట్స్‌ఆప్ వెర్షన్‌లో డేటా గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాక్‌అప్ అవుతుంది. సెట్టింగ్స్‌లోని Chats->Chat backup-> లోకి వెళ్లి బ్యాక్‌అప్ అయ్యే విధానాన్ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు జీడ్రైవ్‌లోకి డేటా రోజూ బ్యాక్‌అప్ అవ్వాలంటే Back up to Google Drive ఆప్షన్‌ని Daily ఉండేలా సెట్ చేయాలి. ఒకవేళ మీకు రోజూ అక్కర్లేదు అనుకుంటే Weekly, Monthly సెట్ చేయవచ్చు. మీరు చేస్తేనే బ్యాక్‌అప్ అవ్వాలంటే Only When i tap "Back Up"ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. జీడ్రైవ్‌లోకి వీడియోలు కూడా బ్యాక్‌అప్ అవ్వాలనుకుంటే Include videos ఆప్షన్‌ని చెక్ చేయండి.
‘క్లియర్’ చేశారా?
ఎప్పటికప్పుడు బ్యాక్‌అప్ చేస్తున్నారు. మరైతే... గ్రూపులు, కాంటాక్ట్‌ల్లోని పాత ఛాట్ మెసేజ్‌లను వాట్స్‌ఆప్‌లో ఉంచుకోవడం ఎందుకు? క్లియర్ చేసుకుంటే మంచిది కదా! మరైతే, ఒకేసారి కాంటాక్ట్‌ల్లోని మెసేజ్‌లను క్లియర్ చేయాలంటే? Settings > Chats and Calls > Chat History మెనూలోకి వెళ్లాలి. వచ్చిన మెనూలోని Clear All Chats ఆప్షన్‌తో అన్ని మెసేజ్‌లను ఒకేసారి తొలగించొచ్చు.
ఎన్‌క్రిప్షన్ మోడ్‌లో...
కొత్తగా వాట్స్‌ఆప్‌లోకి చేరిన మరో ఆప్షన్ end-to-end encryption.మీరు లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ అయితే ఛాటింగ్ మొత్తం ఎన్‌క్రిప్షన్ మోడ్‌లోనే! అంటే... మీ మెసేజ్‌లు, వాయిస్ కాల్స్‌ని ఇతరులెవరూ యాక్సెస్ చేయడానికి వీలుండదు.
డేటా కంట్రోల్
వాట్స్‌ఆప్‌ని యాక్సెస్ చేసే సమయంలో నెట్‌వర్క్ డేటా వాడకంపై ఓ కన్నేస్తున్నారా? లేదంటే... మీ డేటాకి రెక్కలొచ్చినట్టే! అందుకే మొబైల్ నెట్‌వర్క్‌ని కావాల్సినట్టుగా సెట్ చేసుకునే వీలుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి Data Usage ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. Media auto-download ఆప్షన్స్‌ని కావాల్సినట్టుగా మార్పులు చేయవచ్చు.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565