మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి
++++++మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి..+++++++
కళాశాల జీవితం అనేది విద్యా, కెరీర్‌లో తొలి మలుపు. అది మాత్రమే కాదు.. వ్యక్తిత్వం, ఉద్వేగ జీవితంలోనూ ఇది కీలక దశ! ఎదుటివాళ్లు మనల్ని అంగీకరించాలనే ‘గుర్తింపు కోసం తపన’ (ఐడెంటిటీ క్రైసిస్) అత్యధికంగా ఉండే కాలం ఇదే. అటు కొత్త స్నేహాలూ, మన ఉనికి చాటుకునే ప్రయత్నాల మధ్య అసూయాద్వేషాలూ ఎదురై కుంగిపోతుంటారు చాలా మంది. ఇందుకు కారణం.. మన వ్యక్తిత్వాన్ని అంగీకరించకపోవడం, మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడమేనని చెబుతున్నారు నిపుణులు. మనపై మనకు ఆ ప్రేమని ఎలా సాధించుకోవాలో వివరిస్తున్నారు కూడా..!మనల్ని మనం ప్రేమించడమంటే ఏమిటీ? మనలోని లోపాలు అంగీకరించగలగడం... వాటికి ముసుగులేయ కుండా.. ఎదుటివారికి ధైర్యంగా చెప్పగలగడం. మన నిర్ణయాలూ, పనుల్లో తప్పులు దొర్లితే తిట్టుకోకపోవడం. అంతకన్నా.. వ్యక్తిగా ఉన్నత లక్ష్యాలూ.. ఆనందాలు మనకి మనం కానుకగా ఇచ్చుకోవాలని కోరుకోవడం!! ఈ చివరి విషయం కీలకం. చాలామంది అమ్మాయిలు తమకంటూ ఓ లక్ష్యం పెట్టుకోవడమే.. ‘అతి’ అనుకుంటూ ఉంటారు. చాలా కుటుంబాల్లో అమ్మాయిలను ఇంకా ‘ఒకరింటికి వెళ్లేదానివి.. అలా ఉండు.. ఇలా ఉండకూడదు..!’ అంటూనే పెంచుతున్నారు. సహజంగానే ఇది అమ్మాయిల్లో ‘మన జీవితం పెళ్లికోసమే’ అనే భావన తీసుకొస్తుంది. అందరిలాగే చదవడం, ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకోవడం తప్ప.. అంతకన్నా పెద్ద లక్ష్యాల కోసం తపించడం కనిపించదు! కాస్త ఉన్నంతగా ఆలోచించు అని చెప్పినా ‘మనకంత సీనులేదు..!’ అనేస్తారు. మనం ఏదైనా సాధించగలం.. ఆ అర్హత మనకుంది అనుకోవడం మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారనడానికి తొలి గుర్తు!
అపోహలివి..
* ఎదుటివాళ్లని ప్రేమిస్తే పోలా..?: మనల్ని మనం ఇష్టపడకపోతేనేం.. ఎదుటివాళ్లని బేషరతుగా ప్రేమిస్తే పోలా..! చాలామంది యువత దృక్పథం ఇది. నిజానికి.. తనని తాను లోపాలతో సహా ప్రేమించుకోలేనివారు ఎదుటివాళ్లనీ ప్రేమించలేరు. తన లోపాల్ని తాను భరించి తనని తాను ప్రోత్సహించలేనివారు.. ఎదుటివాళ్ల బలహీనతల్ని ఎలా భరిస్తారు? ఎలా ప్రేమిస్తారు? ఇలాంటివాళ్లు కేవలం ఎదుటివారి లోపాల్ని అంగీకరించినట్టు నటిస్తారంతే. కాబట్టి మీరు ఎదుటివాళ్లని నిస్వార్థంగా అభిమానించాలన్నా, ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడాలన్నా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం తప్పనిసరి.
* స్వానురాగానికి దారితీస్తుందా? : మనల్ని మనం ప్రేమించుకోవడం.. అహంభావానికీ(సుపీరియారిటీ), స్వానురాగానికీ(నార్సిసిజం) దారితీస్తుందా? అనే ప్రశ్న వేస్తుంటారు చాలామంది. అలా కాదు. అహంభావం అంటే మనలో ఆత్మన్యూనతని కప్పిపుచ్చుకుని.. మిగతా వాళ్లకంటే గొప్ప అని చూపించుకునే లక్షణం. స్వానురాగం.. ప్రపంచంలో మనకంటే ఉత్తములులేరనే భావన. ఇవి రెండూ మానసిక లోపాలే. మనల్ని మనం ప్రేమించుకోవడమంటే మన లోపాలన్నింటినీ నిజాయతీగా ఒప్పుకోగలగడం.. ఎదుటివాళ్లనీ అంతే సానుభూతితో చూడటమే.
* ప్రగతిని ఆపేస్తుందా? : ప్రేమించడమంటే మన ఓటమినీ అంగీకరించడమనే చెప్పుకున్నాం కదా! దానర్థం మనం ఎంత ఓడిపోతున్నా.. సంతృప్తిగా ఉండాలని కాదు. గెలుపు కోసం నిజాయతీగా ప్రయత్నిస్తూ.. ఓటమికి కారణం వెతకాలని. అలా వెతికేటప్పుడు తమను తాము ఓ శత్రువులా విమర్శించుకోకుండా.. ఓ స్నేహితుడిలా మంచి చెడులూ విశ్లేషించుకోవాలని.
ప్రేమించడం ఎలా?
* మీలోని బలాలూ, ఇంతవరకూ మీరు సాధించిన విజయాలని ఓ చోట రాయండి. ప్రతిరోజూ మీలోని ఉద్వేగాలను.. నిజాయతీగా ఓ చోట రాసి పెట్టండి. దీన్నే ‘ఎమోషనల్ డైరీ’ అంటారు. ఉద్వేగపరంగా మీరేంటో ఇది చెబుతుంది. వాటిని చూసి కుంగిపోవాల్సిన అవసరం లేకుండా.. మీ విజయాలు, బలాల ప్రస్తావన మిమ్మల్ని నిలవరిస్తుంది. నిబ్బరాన్ని అలవరుస్తుంది.
* ఆ గొంతుకని గమనించండి.. : మనం ఏ పని చేస్తున్నా.. మనసులో ఎప్పుడూ ఓ గొంతు వినిపిస్తూ ఉంటుంది. దాన్నే ‘ఇన్నర్ చాటర్’ అంటుంటారు. ఇందులో 75 శాతం ప్రతికూల భావనలే ఉంటుంటాయి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడో.. మన లోపాల వల్ల తీవ్ర నష్టం జరిగినపుడో తీవ్రంగా విమర్శించేది ఆ లోపలి గొంతే! దాన్ని ఆపలేంకానీ.. నియంత్రించగలం. అందుకు ఒకటే దారి.. ఉద్వేగాలకు గురికాకుండా దాన్ని గమనిస్తూ ఉండటం. సాధనతో దీన్ని సాధించొచ్చు.. ప్రయత్నించి చూడండి.
* ఒక్కోసారి.. పరిస్థితులన్నీ తారుమారు అవుతూ ఉంటాయి. ప్రతికూల భావాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ‘ఇది ఎక్కువ కాలం నిలవదు. ఈ గడ్డు పరిస్థితుల్నీ దాటేస్తాం..!’ అని పదేపదే అనుకోండి. కచ్చితంగా బయటపడతారు.
* చుట్టూ ఉన్నవారు.. : మన చుట్టూ ఉన్నవారి ప్రభావం మనపై ఎక్కువ. కాబట్టి మీలో ఎప్పుడూ ప్రతికూల భావాల్ని చొప్పించేవారు, ‘అబ్బే.. నువ్వు పనికిరావు!’ అనే వ్యాఖ్యానాలు చేసేవారికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. అలాంటివాళ్లు ఎంత విమర్శిస్తున్నా ‘అవును.. అవి నా లోపాలే. కచ్చితంగా అధిగమిస్తా!’ అని చెప్పే పరిణతి సాధించండి.
* శారీరకంగా : మన శారీరక ఆరోగ్యంపై దృష్టిపెట్టడం మనల్ని ప్రేమించుకుంటున్నాము అనేందుకు ఓ సూచన! కాబట్టి రోజూ వ్యాయామం చేయండి. అది మీకు శారీరక దారుఢ్యాన్నే కాదు.. మానసిక బలాన్నీ కలిగిస్తుంది.
ఆ సాహసం చేయండి..
ఎదుటివాళ్లు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని అనుకుంటాం కదా! మీ లోపాలూ, తెలివి తక్కువ తనాలూ, రోజువారి అలవాట్లవల్ల మీరేదైనా సంక్షోభంలో పడ్డప్పుడూ మిమ్మల్ని మీరు అంతే ప్రేమతో ఆదరించుకోండి. ఇది చెప్పినంత సులభం కాదు.. చాలా పరిణతి, సంయమనం కావాలి. అందుకోసం మీరు గట్టిగా ప్రయత్నించాలి..! ఎందుకంటే.. ఈ ప్రపంచంలో మిమ్మల్నెవరూ పూర్తి బేషరతుగా ప్రేమించలేరు.. మీరు తప్ప!

-------------------------LIKE
US TO FOLLOW:---------------------
www.mohanpublications.com
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565