MohanPublications Print Books Online store clik Here Devullu.com

మానసాదేవి ఆస్తీక నాగదోష నివారణ స్తోత్రం, Manasa Devi Asthika Nagadosha Nivarana Stotram

మానసాదేవి ఆస్తీక నాగదోష నివారణ స్తోత్రం
Manasa Devi Asthika Nagadosha Nivarana Stotram

మానసాదేవి ఆస్తీక నాగదోష నివారణ స్తోత్రం
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
బ్రహ్మవైవర్త పురాణం ఆధారంగా కశ్యప మహర్షి యొక్క మానస పుత్రిక వాసుకి సోదరి జరత్కారువు అనే మానసాదేవి ఆస్తీక నాగదోష నివారణ స్తోత్రం గురు ముఖంగా ఉపదేశం పొంది పఠించిన వారికి రాహువు పంచమంలో ఉండటం వలన వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉండటం వలన వచ్చే బందన దోషం, గ్రహాలన్నీ రాహు కేతువుల మద్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురు చండాల యోగం, సర్ప భయాలు, రాహు దశ, కేతు దశ, కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాలను బాధలను తొలగించుకోవటానికి మానసాదేవి ఆస్తీక నాగదోష నివారణ స్తోత్రం పఠిస్తే దోషాలు, కష్టాలు, బాధలు మబ్బు తెప్పల్లా తేలిపోతాయని పురాణ వచనం.
నాగుల పీడ నివారణ ఇలా.. ఆస్తీక ఆస్తీక ఆస్తీక అని అనుకోండి.. పాములు మిమ్మల్ని ఏమీ చేయవు’ అని ఈనాటికీ పెద్దలు అంటూ ఉండటం కనిపిస్తుంటుంది. ఈ ఆస్తీక మంత్రం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటీ? ఆస్తీక అనే పేరు వినగానే భయంకరమైన విషసర్పాలు సహితం ఏమీ చేయకుండా సౌమ్యంగా పక్కకు ఎందుకు తొలగిపోతాయి అనే విషయాల్ని వివరించే కథా సందర్భం ఇది. పూర్వం జనమేజయ మహారాజు తన తండ్రి పరీక్షిత్తు మహారాజును పొట్టనపెట్టుకున్న తక్షకుడు అనే మహాసర్పంపై ప్రతీకారం తీర్చుకోవటానికి సర్పయాగాన్ని తలపెట్టాడు. ఆ యాగాగ్నిలో మహామహా సర్పాలు పడి సర్పజాతి నశించి పోసాగింది. సర్పప్రముఖులలో ఒకడైన వాసుకి ఈ విషయాన్ని తెలుసుకొని ప్రాణభయంతో గజగజలాడిపోయాడు. అప్పటికీ నాగశ్రేష్ఠులు వేలు, లక్షలు సర్పయాగాగ్నిలో పడి నశించిపోయారు. వాసుకి అలా ప్రాణభయంతో వణికిపోతున్న సమయంలో ఆయన సోదరి జరత్కారువు అనే నాగకన్య చూసింది. అన్న భయపడుతుండటం ఆమెను బాధించింది. అంతటి కష్టకాలంలోనూ ఆమెకు వెంటనే ఓ ఆలోచన వచ్చింది. గతంలో ఆమె అన్న తన పేరే ఉన్న జరత్కారువు అనే మునికి తననిచ్చి వివాహం చేసింది సర్పజాతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే. వెంటనే ఆమె జరత్కారువు అనే మునివల్ల తనకు జన్మించిన కుమారుడైన ఆస్తీకుడిని పిలిచింది. ఆస్తీకుడు తన తల్లి పక్షాన ఉన్న నాగజాతి అంతా నాశనమవుతున్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ సర్పాల వినాశనానికి కద్రువ అనే వారి తల్లి శాపమే ప్రధాన కారణమని గ్రహించాడు. కానీ బ్రహ్మవరం కారణంగా జరత్కారవు అనే ఒకే పేరున్న ఇద్దరు దంపతులకు జన్మించిన బాలుడి వల్ల సర్పవినాశనం ఆగిపోతుంది. అలా జన్మించింది తానే కనుక తన వల్లనే సర్పయాగం ఆగిపోయి సర్పజాతికి మేలు కలగాలి. ఈ విషయాన్ని మననం చేసుకుంటూ తన మేనమామ వాసుకికి ధైర్యం చెప్పి సర్పయాగాన్ని ఆపటానికి సంకల్పించుకొని ముందుకు నడిచాడు ఆస్తీకుడు. తక్షకుడికి విముక్తి ఆస్తీకుడు జనమేజయ మహారాజు చేస్తున్న సర్పయాగం దగ్గరకు వెళ్లాడు. అక్కడ చేస్తున్న యజ్ఞం ఉత్తమోత్తమంగా విరాచ్కీజిజిల్లుతోంది. యజ్ఞశాల సూర్యాగ్ని సమానమైన తేజస్సు కలిగిన సభ్యులతో నిండిఉంది. ఆస్తీకుడు అలాంటి యజ్ఞ మండపంలోకి ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తుంటే ద్వారపాలకులు అతడిని అడ్డగించారు. ఆస్తీకుడు వారినేమీ అనకుండా యజ్ఞాన్ని స్తుతించాడు. ఆ తర్వాత జనమేజయ మహారాజు, అక్కడున్న రుత్విక్కులను, సభ్యులను, అగ్నిదేవుడిని స్తుతించాడు. దీంతో జనమేజయ మహారాజుతో సహా అక్కడున్న వారంతా ఆస్తీకుడికి ప్రసన్నమయ్యారు. రాజు బ్రాహ్మణ బాలకుడైన ఆస్తీకుడిని చూసి ముచ్చటపడ్డాడు. వెంటనే రాజు ఆ బాలకుడితో ఏదైనా వరం కోరుకో అని అన్నాడు. యజ్ఞశాలలో మరోపక్క సర్పయాగం జరుగుతూనే ఉంది. ఎన్నెన్నో సర్పాలు యజ్ఞగుండంలో వచ్చిపడుతూనే ఉన్నాయి. రాజు రుత్విక్కులతో తన ప్రధాన శత్రువైన తక్షకుడు అనే నాగరాజును మంత్రశక్తితో పిలవండి అని ప్రేరేపిస్తూనే ఉన్నాడు. తక్షకుడు స్వర్గలోకంలో దేవేంద్రుడిని ఆశ్రయించి ఉన్నాడు. అయినాసరే రుత్విక్కులు చేస్తున్న యాగ మంత్రశక్తికి కట్టుబడి ఇంద్రుడితో సహా తక్షకుడు కదలి రావలసి వచ్చింది. చివరకు మంత్రశక్తి కారణంగా ఇంద్రుడు తక్షకుడిని వదిలేశాడు. ఇక తక్షకుడొక్కడే యజ్ఞాగ్నికి ఆహుతి అయ్యేందుకు ప్రాణభయంతో విలవిల్లాడుతూ వస్తూ ఉన్న సమయంలో ఆస్తీకుడు జనమేజయ మహారాజును సర్పయాగాన్ని ఆపటమే తనకు కావలసిన వరమని అన్నాడు. తక్షకుడు తన ప్రధాన శత్రువే అయినా జనమేజయడు ఇచ్చిన మాటకు కట్టుబడి అక్కడున్న రుత్విక్కులు అందరి సూచన మేరకు ఆస్తీకుడు అడిగిన వరాన్ని ఇచ్చి యాగాన్ని ఆపాడు. స్తుతించిన వారికి మేలు రాజు దగ్గర వరం తీసుకొని ఆస్తీకుడు ఇంటికి చేరి తన తల్లికి జరిగిందంతా చెప్పాడు. యాగంలో నశించిపోగా మిగిలిన సర్పాలన్నీ అక్కడికి వచ్చి ఆస్తీకుడికి కృతజ్ఞతలు చెప్పి తమను కష్టాల నుంచి గట్టెక్కించినందుకు ఏం కావాలంటే అవి చేస్తామని ఏం కావాలో చెప్పమని పదేపదే అడిగాయి. ఈ కథను చదివితే అప్పుడు ఆస్తీకుడు నాగులందరితో ఇలా అన్నాడు Ôప్రసన్నచిత్తంతో ధర్మమయమైన ఈ కథను చదివేవారెవరికీ నాగులవల్ల ఎలాంటి భయమూ కలగకూడదు. ఈమేరకు తనకు మాట ఇమ్మన్నాడు నాగులతో ఆస్తీకుడు. వెంటనే ఆ నాగులన్నీ అమిత ప్రేమతో ఆ కోరికను తీరుస్తామని అన్నాయి. రాత్రి అయినా, పగలు అయినా ఎప్పుడైనా సరే జరత్కారువు అనే ముని వల్ల జరత్కారువు అనే నాగకన్యకు జన్మించి జనమేజయుడి సర్పయాగంలో సర్పాలను రక్షించిన ఆస్తీకుడిని నేను స్మరిస్తున్నాను. ఓ నాగులారా.. మీరు నన్ను హింసించకండి. మహాసర్పమా ఇక్కడి నుంచి నన్నేమీ చేయకుండా తప్పుకొని వెళ్లిపో, జనమేజయుడి సర్పయాగ అంతకాలంలోని ఆస్తీకుడి మాటలను స్మరించు’.. ఇలా ఎవరైనా స్తుతి చేసినపుడు వారిని విడిచిపోతామని, తొలగిపోని సర్పం నశిస్తుందని నాగులన్నీ ఆస్తీకుడికి మాట ఇచ్చాయి. ఇలా ఆస్తీకుడు తన మాతృవంశం వారిని రక్షించి వారివల్ల లోకోపకారకమైన తగిన వరం పొందాడు. ఆ కారణంవల్లే దోవలో వెళ్లేటప్పుడు పాములుంటాయని భయం ఉన్నప్పుడు ఆస్తీక.. ఆస్తీక.. ఆస్తీక.. అని పెద్దగా అనుకోమని పెద్దలు చెబుతుంటారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list