MohanPublications Print Books Online store clik Here Devullu.com

చీమలకు ఆహారం వేస్తే శని గ్రహా భాదలనుండి విముక్తి కలుగుతుంది, Saturn

చీమలకు ఆహారం వేస్తే శని గ్రహా భాదలనుండి విముక్తి కలుగుతుంది
Saturn

చీమలకు ఆహారం వేస్తే శని గ్రహా భాదలనుండి విముక్తి కలుగుతుంది.......
ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా.కాబట్టి శ్రమైక జీవనానికి నిదర్శనమైన చీమలకు ఆహారం వేస్తే శని భాదలనుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.
ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో శని ప్రభావానికి లోనవుతాడు.మందగమనం కలిగినవాడైనందున శనైశ్వరుడు అంటారు. ఈయన నవగ్రహాల్లో అతి శక్తిమంతుడు. ఈయనకు కాకి వాహనం మకరం, కుంభ రాశులకు అధిపతి శని. శనైశ్వరుని భార్య జ్యేష్టాదేవి.
గోచారరీత్యా శని మేషాది రాశుల్లో సంచరిస్తాడు. అంటే 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. ఏల్నాటి శని వల్ల కలిగే కష్టనష్టాలు ఇలా ఉంటాయి.
జాతకునికి గోచారరీత్యా తన జన్మరాశి (జన్మ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి) నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏలినాటి శని అని వ్యవహరించడం జరుగుతోంది.
12 వ రాశిలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు.
జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, లపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం. రుణబాధలు,వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలన సూచనలు.
రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు. రుణబాధలు, అనారోత్యం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి.
జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు. రెండవ పర్యాయము (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి. మూడవ పర్యాయం వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమసయలు, అపమృత్యుభయం వంటి చికాకులు ఎదుర్కొంటారు. అలాగే జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషకారకమే.
అర్ధాష్టమ శని:- జన్మరాశి నుంచి నాలుగువ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.స్ధాన చలనం,స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు,తల్లికి అనారోగ్యం కలుగుతాయి.
అష్టమ శని:- జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి.శత్రు బాదలు,ఊహించని నష్టాలు వస్తాయి.
దశమ శని:- జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.తండ్రితో గొడవలు.
అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు , గోచారం లో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది.శని శ్రమ కారకుడు,వాయు కారకుడు కాబట్టి రోజు ఉదయాన్నే వాకింగ్ కానీ,మేడిటేషన్ (గాలి పీల్చటం వదలటం) చేస్తే శని తృప్తిపడతాడు,శ్రమ కారక జీవులైన చీమలకు పంచదార గాని,తేనే గాని వెయ్యటం వల్ల కూడా శని భాదలనుండి విముక్తి లభిస్తుంది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list