MohanPublications Print Books Online store clik Here Devullu.com

మెడ నొప్పి ఎందుకొస్తుందంటే? NECK-PAIN

మెడ నొప్పి ఎందుకొస్తుందంటే? 
NECK-PAIN
మెడ నొప్పి ఎందుకొస్తుందంటే?
[NECK-PAIN]
శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయా రైన వెన్నెముక. మనం వంగినా, లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కులే తోడ్పడుతాయి. నడుము, మెడ ప్రాంతంలో ఉండే డిస్కులు అరిగిపోవడం వల్ల లేదా డిస్కులు ప్రక్కకు తొలగడంవల్ల నడుము, మెడ నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి, నడుము నొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే నడుము నొప్పి (లంబార్‌ స్పాండిలోసిస్‌), మెడ నొప్పి (సర్వికల్‌ స్పాండిలోసిస్‌) ఇప్పుడు వయస్సుతో నిమిత్తం లేకుండా ఇటీవల యుక్తవయస్సులో ఉన్న వారు కూడా ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మారుతున్న జీవన శైలి విధానమే. మెడనొప్పి, నడుము నొప్పే అని నిర్లక్ష్యం చేయడం తోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవు తున్నది. అలా కాకుండా సమస్య తొలి దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవు తుంది. వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్‌ (మృదులాస్థి) అనే మెత్తని ఎముక ఉం టుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్‌ తోడ్పడు తుంది. ఈ ఎముక ఒక్కొక్క సారి పెరిగి ఆస్టియోఫైట్స్‌ ఏర్పడు తాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పు ల వల్ల తీవ్రమైన నడుము, మెడ నొప్పితో బాధపడతారు. ఇలాంటి సమస్యలనే లంబార్‌ స్పాండిలోసిస్‌, సర్వికల్‌ స్పాండిలోసిస్‌ అంటారు.డిస్క్‌ సమస్య లకు కారణాలు
– ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వల్ల వస్తుంది.
– స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీల్లో అసం బద్ధ భంగిమల్లో కూర్చోవడం
– ప్రమాదాలలో వెన్నుపూసలు దెబ్బ తినడం లేదా పక్కకు తొలగడం
– కంప్యూటర్స్‌ ముందు ఎక్కువసేపు కదల కుండా కూర్చుని విధులను నిర్వర్తించడం
– ఈ సమస్యకు మరొక ప్రధాన కారణం స్థూలకాయం.
– ఒకేచోట గంటల తరబడి కదలకుండా పని చేయడం
– శక్తికి మించిన బరువులెత్తడం, హఠాత్తుగా నడుము, మెడ వంచడం వంటి పనుల వల్ల వస్తుంది.
– ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా ఏమైనా దెబ్బలు తాకినప్పుడు, శరీరం కుదుపునకు లోనైనప్పుడు
– శరీరానికి తగినంత కాల్షియం అందన ప్పుడు నొప్పి వస్తుంది.
– నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్‌ లోపించడం వంటివి డిస్క్‌ సమ స్యలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
లక్షణాలు
డిస్క్‌ పక్కకుజారినప్పుడు అది వెన్ను పామును నొక్కు తుంది. దీనివల్ల నొప్పి మొద లవుతుంది. ఆ నొప్పి కాళ్లు, చేతులకు కూడా పాకుతుంది.
నడుము నొప్పి లక్షణాలు
నడుము నొప్పి తీవ్రంగా ఉండి, నడుము ఎటువైపు కది ల్చినా, వంగినా, నడిచినా నొప్పి తీవ్రత పెరుగుతుంది.
– నాడులు ఒత్తిడికి గురి కావడం వల్ల నొప్పి ఎడమకాలు లేదా కుడి కాలుకు వ్యాపించి బాధిస్తుంది.
– నడుము కింది భాగం, ఎడమ కాలు లేదా కుడి కాలుకు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి.
– హఠాత్తుగా వంగినా, బరువులు ఎత్తినా, నడుము వంచినా తీవ్ర మైన నడుము నొప్పితో బాధపడతారు.
మెడ నొప్పి లక్షణాలు. – మెడనొప్పి తీవ్రంగా ఉండి, మెడ ఎటు వైపు కదిల్చినా నొప్పి తీవ్రత పెరుగుతుంది.
– నాడులు ఒత్తిడికి గురి కావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు వ్యాపిస్తుంది.
– తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, తల తిప్పినట్లుగా అనిపిస్తుంది. చెయ్యి పైకి ఎత్తడం కష్టంగా ఉంటుంది.
– నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు తూలుతున్నట్లుగా అనిపిస్తుంది.
జాగ్రత్తలు
డిస్క్‌ సమస్యలతో వేధించబడేవారు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది.
వాహనం నడిపేప్పుడు, కుర్చిలో కూర్చునప్పుడు నడుము, మెడ నిటారుగా ఉండే విధంగా సరైన స్థితిలో కూర్చోవాలి.
బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవడం తప్పనిసరి. బల్ల మీద కాని, నేల మీద కాని పడుకోవాలి.
ప్రతి నిత్యం వ్యాయామం, ప్రాణా యామం, యోగా చేయాలి. తల కింద ఎత్తయిన దిండ్లు వాడకూడదు. మెడ, నడుమును ఒకే సారి అకస్మాత్తుగా తిప్పకూడదు. నొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయా మాలు డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే చేయాలి. నొప్పి రాకుండా ఉండటానికి సమతులాహారం తీసుకుంటూ స్థూలకాయం రాకుండా జాగ్రత్త పడటం ఈ సమస్యకు మేలైన నివారణామార్గం.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list