MohanPublications Print Books Online store clik Here Devullu.com

శనిగ్రహ దోషానికి నువ్వులు, Sanigraha Doshaniki Nuvvulu

శనిగ్రహ దోషానికి నువ్వులు
 Sanigraha Doshaniki Nuvvulu
+++++++శనిగ్రహ దోషానికి నువ్వులు++++++++
జాతకంలో ఎవరికైన శని మహాదశ, ఏల్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని జరుగుతున్నప్పుడు శని భగవానుడు అనుకూలంగా లేనప్పుడు బెల్లంతో కలిపిన నువ్వులను ఆవులకు తినిపించటం, పిల్లలకు నువ్వులతో చేసిన నువ్వుండలు పంచటం చేస్తే శనిగ్రహ బాధల నుండి కొంతవరకు విముక్తి కలుగుతుంది. అంతేకాక శని అనుకూలంగా లేనివారికి కాళ్ళ నొప్పులు రావటం ముఖ్యంగా నడుము భాగం నుండి అరిపాదాల వరకు నొప్పులు రావటం జరుగుతుంది. శరీరం మొత్తం నిత్య కార్యక్రమాలకు సహకరించకపోవటం జరుగుతుంది. ఇలాంటి వారు శరీరానికి కొద్దిగా వేడి చేసిన నువ్వుల నూనెను పట్టించటం వలన నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
కాళ్ళ నొప్పులు బాధిస్తుంటే కొద్దిగా వేడి చేసిన నువ్వుల నూనెను మోకాళ్ళ నుండి అరిపాదాల వరకు పట్టించి మర్ధన చేయటం వలన నొప్పుల బాధ తగ్గుతుంది. ఇంకా శని విగ్రహం ముందు ఇనుప దీపపు కుందెలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి కొంతసేపు ఆ దీపపు కాంతి నుండి వచ్చే వాయువును స్వీకరించటం ద్వారా కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవటమే కాకుండా మానసిక చికాకులను, బద్ధకాన్ని, అతినిద్ర మొదలగు వాటినుండి ఉపశమనం పొందవచ్చును. నువ్వులనూనెలో నువ్వులను కలిపి శనిభగవానుని విగ్రహానికి అభిషేకం చేయటం వలన కూడా శనిగ్రహ బాధల నుండి విముక్తి కలుగుతుందని ప్రతీతి. ఇవే కాక నువ్వుల వలన ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే
నువ్వులు బెల్లం కలిపి చేసిన తినుబండారాలు, నువ్వుల నూనెతో చేసిన
వంటకాలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. అందుకే అనాదిగా అవి బాగా
వాడుకలో ఉన్నాయి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అంటూ ఇవి వేరు వేరుగా
క నిపించినా ఈ రెంటిలోనూ పోషకాలు దాదాపు సమానంగానే ఉంటాయి.
మొత్తంగా చూస్తే కాపర్‌, మెగ్నీషియం, సిలికాన్‌, కాల్షియం, జింక్‌, థయామిన్‌,
సెలీనియం వీటిలో సమృద్ధిగా ఉంటాయి.
నిజానికి మాత్రల రూపంలో తీసుకునే కాల్షియం చాలా భాగం జీర్ణమే కాదు. కానీ, నువ్వుల ద్వారా లభించే కాల్షియం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిల్లో 20 శాతం ప్రొటీన్‌ ఉంటుంది. నువ్వుల్లో ఉండే ఫైటో స్టెరాల్స్‌ వల్ల శరీరంలో కొలెసా్ట్రల్‌ ఉత్పత్తి తగ్గుతుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్లనువ్వుల్లో ఫైటో స్టెరాల్స్‌ ఎక్కువగా ఉంటాయి.
నువ్వులు జీర్ణశక్తిని పెంచడంలోనూ, రక్తపోటును తగ్గించడంలోనూ బాగా ఉపయోగపడతాయి. కేన్సర్‌ నిరోధకంగా పనిచేసే ఫైటిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, ఫైటోస్టెరాల్స్‌ కూడా నువ్వుల్లో ఎక్కువే. శరీర వ్యవస్థను నిదానింపచేసే థయామిన్‌, ట్రిఫ్టోఫాన్‌ విటమిన్లు, ఒంటినొప్పుల్ని తగ్గించి మనసును ఉత్తేజితం చేసి, గాఢనిద్రకు దోహదం చేసే సెరొటోనిన్‌ కూడా నువ్వుల్లో పుష్కలంగా ఉన్నాయి.
నువ్వులు ఎముకలను పటిష్టం చేయడం ద్వారా ఎముకలను గుళ్లబరిచే ఆస్టియోపొరోసిస్‌ వ్యాధి రాకుండా కాపాడతాయి. పిడికెడు నువ్వుల్లో లభించే దానికన్నా గ్లాసు పాలల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. వీటిల్లో జింక్‌ కూడా ఎక్కువగానే ఉండడం వల్ల ఎముకల దృఢత్వాన్ని పెంచే లవణాలు లభిస్తాయి. నువ్వుల్లో ఉండే కాపర్‌, ఆర్థరైటిస్‌ సమస్య రాకుండా నివారించడంలోనూ వచ్చిన ఆర్థరైటిస్‌ సమస్యనుంచి విముక్తం చేయడంలోనూ బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా చూస్తే, ఎముకలను, కీళ్లను, రక్తనాళాలను శక్తివంతం చేసే అంశాలు కూడా నువ్వుల్లో ఉన్నాయి.
మద్యపానం వల్ల ఏర్పడే దుష్ప్రభావాల నుంచి కాలేయాన్ని కాపాడటంతోపాటు కాలేయం పనితనాన్ని పెంచే అంశాలు నువ్వుల్లో ఉన్నాయి. నువ్వుల్లోని మెగ్నీషియం ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులు, శ్వాసనాళాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. కాబట్టి మీరు నువ్వుల్ని తినడం మరవొద్దు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list