ఓం’కారం మహత్యం
OmKara Mahostavam
ఓం’కారం మహత్యం
ప్రతి మంత్రానికి ముందు ‘ఓం’కారం ఉంటుంది. ‘ఓం’కారాన్నే ప్రణవం అని కూడా అంటారు. పరమాత్మను శబ్దరూపంలో ‘ఓం’కారంతో సూచిస్తారన్నమాట. ఏ ప్రార్థన, పూజలైనా ఓంకారంతో మొదలౌతుంది. ఇది ఏకాగ్రతకు, ధ్యానానికి సహాయకారిగా ఉంటుంది. ‘ఓం’కారంలోని ‘అ, ఉ, మ’ అనే అక్షరాలు మూడు అవస్థలైన జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థలకు అనుభవాలకు సంకేతం. మూడు అక్షరాలు కలిపి ‘ఓం’ కారంగా ఉచ్చరింపబడినపుడు నాలుగవ స్థితియైన తురీయావస్థను చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది.
స్త్రీలు “ఓం కారాన్ని” చదవరాదని ఒక నియమం పెట్టారు.ఎందుకంటే ఓంకారాన్ని బిగ్గరగా జపించేటప్పుడు దీర్ఘమైన,క్రమమైన,నెమ్మదైన విధానంలో శ్వాసను బయటకు విడువవలసి ఉంటుంది.ఓంకారంలో ఇలాంటి శబ్ధ తరంగాలు ఉత్పన్నమౌతున్న మద్య భాగంలో గర్భాశయం ఉన్న కారణంగా ఈ శబ్ధ తరంగాలు గర్భాశయాన్ని విరుద్దంగా ప్రభావితం చేయటం,మూత పడిపోవటం వంటివి జరిగే ప్రమాదం ఉంది అని స్త్రీలు “ఓంకారం”జపించరాదనే నియమం పెట్టారు.
న్యూయార్క్, క్యాలిఫోర్నియా, బోస్టన్‌లో ధెరపిస్ట్స్ ఓంకార నాదంపై ల్యాబరేటరీలలో పరిశోధనలు చేశారు. కడుపునొప్పి, మెదడు, గుండె సంబంధ వ్యాధిగ్రస్తులు ఓంకారాన్ని చేసి రోగ విముక్తురైనారట. ప్రణవ నాదం వల్ల ఉదరం, ఛాతి మెదడులో కదలికలు కల్గి నూతనోత్తేజం కల్గిస్తాయి. న్యూయార్కలోని కొలంబియా ప్రెస్బిస్టీరియన్ హాల్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ధెరపిస్టులు రోగులను సర్జరీకి ముందు ఓంకార జపం చేయిస్త్తున్నారు. అంతేకాక, సర్జన్లు, నర్సులలో ఓంకార జపం చేసినందువల్ల 'ఆపరేషన్ సస్కెస్' ధృడ నమ్మకం కలుగుతుందని తెలియ జేశారు. శరీరంలో ఒత్తిడి పెరిగితే, స్టెరాయిడ్స్ శాతం పెరుగుతాయి. ఆపరేషన్‌కు ముందు, తర్వాత ధ్యానం, ఓంకారం చేస్తే, స్టెరాయిడ్స్ శాతం గణనీయంగా తగ్గుతాయి. డా||హెర్బర్ట్ గత 40 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్ భగవద్గీతలో 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ శ్లోకంలో ఎవరైతే అంతిమ ఘడియలలో ఓంకారాన్ని జపిస్తారో వారు మోక్షాన్ని పొందుతారన్నారు.సామవేదంలోని సన్యాస ఉపనిషత్తులో 'ఎవరైతే ఓంకార జపాన్ని 12 నెలలు చేస్తారో వారు భగవంతుని సాక్షాత్కారం పొందుతారన్నది. మహర్షివేద వ్యాసుడు 'మంత్రాణాం ప్రణవసేతు: అంటూ అత్యంత ప్రాధాన్యాన్ని ఓం కారానికి కల్పించారు.యజుర్వేదం ఓంకారంలో బ్రహ్మయిమిడి ఉన్నాడన్నది. మహర్షి పుష్కరుడు 'ఎవరైతే ఓం కారాన్ని నాభివరకూ నీటిలో వుండి జపిస్తారో వారి సర్వపాపాలు హరిస్తాయన్నారు.
మానసిక అశాంతిని తొలగించటానికి ప్రణవ నాదం బాగా పనిచేస్తుందనేది సాధకుల ద్వారా విశ దమైనది. నాభినుండి వచ్చే తరంగాలు మొత్తం దేహంపై ప్రభావాన్ని కలుగ జేస్తాయి. నిర్మలమైన ప్రదేశంలో కూర్చొని ఓంకారాన్ని నినదిస్తే, చక్కటి ఫలితాలు లభిస్తాయనేది పరిశోధకులు తేల్చి చెప్పారు. ముఖ్యంగా బ్రహ్మముహూర్తాన, గోధూళివేళ అనగా సాయం సమయాన, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఓంకారాన్ని జపించాలి.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565