MohanPublications Print Books Online store clik Here Devullu.com

నవ్వు.. ఓ మంచి ఔషధం, Smiling is Good for Health

నవ్వు.. ఓ మంచి ఔషధం 
Smiling is Good for Health

నవ్వు.. ఓ మంచి ఔషధం
మనసారా నవ్వడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం. మీరు నవ్వుతూ ఇతరులను నవ్వించడానికి ప్రయత్నిస్తే మీకూ ఆనందం, ఆహ్లాదం కలగడమే కాక ఇతరుల్నీ ఆనందంగా ఉంచుతారు. మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్‌ అవుతారు. నవ్వడం వల్ల ఫేషియల్‌ మజిల్స్‌, చెస్ట్‌, భుజాలు, మెడ, స్కల్‌ మజిల్స్‌ రిలాక్స్‌ అవుతాయి.
నవ్వుతూ బతకాలిరా... అన్నాడో కవి. ఆరోగ్యంగా బతకాలంటే హాయిగా నవ్వాల్సిందే అంటున్నారు నేటి పరిశోధకులు. గుండె ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే మనసారా నవ్వుతూ ఉండండని సూచిస్తున్నారు...
వ్యాయామం చేయాలని మనసులో ఎంత బలంగా ఉన్నా రోజూ ఉదయాన్నే లేచి వాకింగ్‌కో, జాగింగ్‌కో వెళ్లాలంటే ఒక వైపు నిద్ర వస్తూంటుంది.. మరోవైపు బద్ధకం.. ఈ బాధలేవీ లేకుండా ఓ హాస్యరస చిత్రం చూస్తూ హాయిగా నవ్వేయండి. ఫలితం ఒకేలా ఉంటుంది అంటున్నారు అమెరికా పరిశోధకులు. పొద్దున్నే లేచి వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాల వల్ల ఎంతటి లాభం ఉంటుందో మనసారా నవ్వడం వల్ల కూడా ఆరోగ్యానికి అంతే మేలు ఉంటుందని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. అమెరికాలోని మేరీలాండ్ మెడికల్ సెంటర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఆరోగ్యవంతులైన 20 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.
హాస్యాన్ని పండించే ఓ సినిమా చూస్తూ నవ్వుతుంటే రక్తసరఫరా, గుండె పంపింగ్ పనితీరు మరింత మెరుగవుతున్నట్టు పరిశోధకులు గమనించారు. ఏ రకమైన ఏరోబిక్ వ్యాయామం చేసినా పొందే ఫలితాన్నే ఇలా నవ్వడం వల్ల కూడా పొందగలమని ఈ అధ్యయనకారులు అంటున్నారు. దీనివల్ల రక్తసరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగకుండా సాఫీగా సాగుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు యాభైశాతం వరకు గుండెపనితీరు మరింత మెరుగుపడుతుంది. అదే మనసు బాధగా ఉన్నప్పుడు, వ్యతిరేక భావనలతో, డిప్రెసివ్ స్థితిలో ఉన్నప్పుడు మాత్రం గుండె ఇంత సమర్థంగా పనిచేయలేకపోతున్నట్టు ఈ అధ్యయనం తెలుపుతున్నది. సో.. ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటూ హాయిగా నవ్వేయండి.
ఆంగ్ల సామెత ప్రకారము ‘‘లాఫ్టర్ ఈజ్ ది బెస్టు మెడిసన్’’ అంటే నవ్వే మంచి ఔషధం అని. నవ్వు నవ్వించు అని అనే మనవారి ఉద్దేశమూ అదే . ఎప్పుడు నవ్వు ముఖంతో కన్పిస్తే కొన్ని దేశాలలో ‘‘వీడు నమ్మదగిన వాడు కాదు’’ అని తీర్మానం చేస్తారు. అలాంటి వారి మధ్య ‘‘చిరునవ్వు వెలయంతా’’ అని పాడేవారు ఉన్నారు.
ఎవరు ఎక్కువగా నవ్వుతారు? మగవారా? లేక ఆడవారా? డాక్టరు మోరా రిపోల్ గారు స్పానిష్ భాషా పత్రిక అయిన ‘‘రివిస్తా క్లినికా ఎస్సనోల’’ (Rev Clin Esp. 20011 Apr 11)లో స్ర్తిలే ఎక్కువగా నవ్వుతారు అని తేల్చి చెప్పారు. నవ్వు వలన శారీరక బాధలు తగ్గుతాయి. నవ్వినప్పుడు బాధలను మర్చిపోతాం. నవ్వుల వలన మెదడులో ‘ఎండార్ఫిన్లు’ విడుదలయి బాధలను తొలగిస్తాయి. ‘ఎండార్ఫిన్లు’ అంటే సహజంగా నొప్పిని తీసివేసే మందులు. అవి శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి. నవ్వు మానసిక వొత్తిడిని తొలగించి శరీర రక్షణ శక్తిని పెంచుతుంది. ఎం.పి. బెన్నట్టు ప్రభృతులు ‘‘ఆల్టర్నేటివ్ తెరపీస్ ఇన్ హెల్త్ మెడిసన్’’ అనే పత్రికలో (Altern Ther Health Med. 2003 Mar-April 9 (2): 38-45) నవ్వులవలన నేచురల్ కిల్లర్ కణాల సంఖ్య పెరుగుతుందని తెలియచేసారు.
‘‘నవ్వు నాలుగు విధాల చేటు’’ అని మనవారు ఊరికినే అనలేదు. ‘‘పిచ్చి నవ్వు’’ (Pathological laughter) వారు కనిఫిస్తే వారి మెదడులో లోపం ఉంది అని గ్రహించాలి. ఎఫ్.ఎ. గాన్డిం వారి బృందము ‘‘జర్నలు ఆఫ్ న్యూరాలజి, న్యూరో సర్జెరీ, సైఖియాట్రి’’ (J Neurol Neurosurg Psychiatry. 2001 Dec: 71(6):802-4) అనే ఫత్రికలో మెదడులో పాంసు, సెరిబెల్లం వంటి భాగములలో రక్త ప్రసారము తగ్గిపోయి పిచ్చి నవ్వు వస్తుంది అని చెప్పారు. అధికంగా నవ్వితే కళ్ళు తిరిగి పడిపోతారు అని డాక్టరు నిషిడ గారు ‘‘జర్నలు ఆఫ్ మెడికల్ రిపోర్ట్సు’’ అనే పత్రికలో (J Med Case Reports. 2008 Jun 7:2:197)‘లాఫ్ సింకోపి’ అన్న వ్యాధిపై రాసిన వ్యాసంలో తెలియజేసారు.
నవ్వే ఔషధమైతే ఎక్కడ అమ్ముతారు? దాని వెల ఎంత? అని అడగేవారు భారత దేశంలో ఉన్నారు. నవ్వు స్వయం జనితం గదా! ఎక్కడ కొనవలసిన అవసరం లేదు. ఖరీదు అంటారా, అమూల్యం. అందుకనే మనసారా నవ్వండి. నలుగురు కలిసి నవ్వితే, ఇంకా బాగుంటుంది. చాలా సంవత్సరాల క్రితం డాక్టరు మదన్ కాటారియా గారు భారత దేశమంతా 3,000 నవ్వుల క్లబ్బులను స్థాపించాలని ప్రయత్నం చేసారు. జపాను వంటి దేశాలలో విరామ సమయంలో ఆఫీసుల నుండి బయటకు వచ్చి బాహాటంగా నవ్వుతున్నారు. నవ్వితే బోలెడన్ని కేలరీలు ఖర్చు అవుతాయట! వ్యాయామం చేసి నవ్వితే మీ గుండెలు మెరుగుపడి, మీ ముఖవర్చస్సు వెలిగిపోతుందట! ఇక ఆలస్యంఎందుకు?నవ్వండీ..


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list