వానల్లో వెచ్చ వెచ్చగా,
Vanalo vecha vechaga
+++++వానల్లో వెచ్చ వెచ్చగా+++++
విహారయాత్రలకు అనువైన సమయం వానాకాలమే! అలాగని ఈ కాలంలో కూడా వానలు కురిసే ప్రదేశాలకే వెళ్తే ఏం బాగుంటుంది? చిత్తడికి దూరంగా ఏదైనా పొడి ప్రదేశాలు చుట్టొస్తే కొత్త హుషారొస్తుంది. కాబట్టి వర్షాలకు దూరంగా ఈ డ్రై డెస్టినేషన్స్ ప్లాన్ చేయండి.
హిసర్
కొలొనియల్ ప్యాలె్‌సలు, హరప్పా నాగరికత ఆనవాళ్లకు నెలవైన డ్రై ప్లేస్ హర్యానాలోని హిసర్. పొడి వాతావరణం, చల్లని గాలులతో నిండి ఉండే హిసర్ దిల్లీకి 164 కి.మీ దూరంలో ఉంది. హిసర్ అనే అరబిక్ పదానికి కోట అని అర్థం. తవ్వకాల్లో మనుషుల ఆనవాళ్లు దొరికింది కూడా ఇక్కడి అగ్రోహ, బన్వాలీ ప్రాంతాల్లోనే. హిసర్‌లో ఉక్కు ఎక్కువగా ఉత్పత్తవుతుంది. కాబట్టి దీనికి ‘సిటీ ఆఫ్ స్టీల్’ అనే మరో పేరు కూడా ఉంది.
చూడదగ్గ ప్రదేశాలు

సెయింట్ థామస్ చర్చ్: ఏసు 12 మంది శిష్యుల్లో ఒకడైన థామస్ భారత సందర్శనకు గుర్తుగా కట్టిన చర్చి ఇది. చర్చి నిర్మాణం ఐరోపా శైలిని పోలి ఉంటుంది.
అగ్రోహా దేవాలయం: ఈ దేవాలయంలో శక్తిసరోవర్ అనే కొలను, నేచురోపతీ సెంటర్ ఉంటాయి.
దర్గా చార్ కుతాబ్: నలుగురు సూఫీ మతపెద్దల మ్యూజోలియం ఇది. ప్రముఖులైన ఆ నలుగురు జమాలుద్దీన్ హన్సి, బుర్హనుద్దీన్, కుతుబుద్దీన్ మనువర్, నూరుద్దీన్.
ఫిరోజ్ షా ప్యాలెస్ కాంప్లెక్స్: 1345లో ఫిరోజ్‌షా తుగ్లక్ కట్టించిన ప్యాలెస్ ఇది. ఇందులో 20 అడుగుల ఎత్తయిన ఇసుకరాతి స్తూపం ఆధారంగా కట్టిన లట్ కి మసీద్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంది.

ఇలా చేరుకోవాలి
హైదరాబాద్ నుంచి వెళ్లేవారు విమానంలో దిల్లీ చేరుకుని అక్కడినుంచి రోడ్డు ద్వారా హిసర్ చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు 7 వేలు. ట్రైన్‌లోనే నేరుగా వెళ్లాలనుకుంటే దిల్లీ, అక్కడినుంచి ట్రైన్ మారి హిసర్ చేరుకోవచ్చు. విశాఖపట్నం నుంచి వెళ్లాలనుకుంటే నేరుగా ఢిల్లీకి విమానం లేదా ట్రైన్ ద్వారా అక్కడినుంచి హిసర్‌కు ట్రైన్ లేదా రోడ్డు ద్వారా వెళ్లొచ్చు. ప్రయాణ ఖర్చు సుమారుగా 7 వేలు.

జైసల్మేర్
రాజస్థాన్ థార్ ఎడారిలోని ఎక్సాటిక్ సిటీ జైసల్మేర్. 12వ శతాబ్దపు హవేలీలు, కట్టడాలు ఈ ప్రాంతం ప్రత్యేకతలు. ఎడారిలో ఇసుక మేటలు, వాటిలో ఒంటెల ప్రయాణాల కోసం దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది టూరిస్ట్‌లు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. కాబట్టే రాజస్థాన్ మొత్తంలో అత్యంత ముఖ్యమైన దర్శనీయ ప్రదేశంగా జైసల్మేర్ పేరు పొందింది.

జైసల్మేర్ ఫోర్ట్: 3,000 మంది ప్రజలు నివసించే అతి విశాలమైన ఫోర్ట్ ఇది. కొన్ని చోట్ల ఇరుకుగా, ఇంకొన్నిచోట్ల విశాలంగా ఉండే దారులు, వాటికి రెండు వైపులా ఉండే ఇళ్లు, దేవాలయాలు, హ్యాండిక్రాఫ్ట్ షాపులు, గెస్ట్‌హౌ్‌సలు, రెస్టారెంట్లతో ఈ ప్రాంతమంతా ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఇంటి అలంకరణకు ఉపయోగపడే వస్తువులు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు.
జైన్ టెంపుల్స్: ఫోర్ట్‌లోనే ఏడు పసుపుపచ్చని ఇసుకరాతి జైన దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాల వేళలు తరచుగా మారుతూ ఉంటాయి. కాబట్టి వెళ్లేముందు ఎంక్వయిరీ చేయాలి. అలాగే ఈ దేవాలయాల్లోకి వెళ్లేముందు బూట్లు, ఇతర తోలు వస్తువులు తీసి వెళ్లాలనేది ఇక్కడి రూల్.
మ్యూజియం: థార్ హెరిటేజ్ మ్యూజియం, డిజర్ట్ కల్చరల్ మ్యూజియంలు సందర్శించి ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు. రాజస్థానీ సంగీతం, సంప్రదాయం, వస్త్రాల గురించిన ఎన్నో విషయాలు తెలుస్తాయి.
నథ్మల్ కి హవేలీ: ఈ 19వ శతాబ్దపు హవేలీని ఒకప్పుడు ప్రధాని నివాసంగా వాడేవారు. అందంగా చెక్కిన ఎక్స్‌టీరియర్స్, మొదటి అంతస్తులోని పెయింటింగ్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పెయింటింగ్స్ తయారీకి 1.5కిలోల గోల్డ్ లీఫ్ వాడారు. ఈ హవేలీ రెండు అర్థ భాగాలను ఇద్దరు సోదరులు పోటీపడి కట్టారు. కాబట్టే రెండు ఒకేలా కనిపిస్తున్నా జాగ్రత్తగా గమనిస్తే వేర్వేరు నైపుణ్యాలు కనిపిస్తాయి.

జన్‌స్కార్ వ్యాలీ
జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలోని మారుమూల ప్రాంతం జన్‌స్కార్ వ్యాలీ. ఓ మూలకు విసిరేసినట్టుండే ఈ లోయ అందాలను చూడటం ఓ ఎత్తయితే కార్గిల్ నుంచి ఈ లోయకు చేరుకోవటానికి చేసే ప్రయాణం మరో ఎత్తు. జన్‌స్కార్ హెడ్ క్వార్టర్స్ పదుమ్. ఇక్కడికి చేరుకోవాలంటే కార్గిల్ నుంచి 250 కి.మీ. ప్రయాణించాలి. జన్‌స్కార్ మరోపేరు ‘ఎండ్ ఆఫ్ ది రోడ్’. ఈ ప్రాంతానికి కార్గిల్ నుంచి సాగే ఒకే ఒక రోడ్డు మార్గం జన్‌స్కార్‌లో ముగుస్తుంది. ఇక ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు చేరుకోవాలంటే ట్రెక్కింగ్ చేయాల్సిందే.
సురు వ్యాలీ
కార్గిల్‌కు జన్‌స్కార్‌కు మధ్యలో ఉండే లోయ ప్రాంతం సురు వ్యాలీ. సముద్రమట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ లోయలో సురు నది సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి ఈ లోయ మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. ఈ నది అవతలవైపున్న ‘సంకూ, కనిఖర్, టంగోల్, పర్కాచిక్’ గ్రామాలు చేరుకోవటానికి రోడ్డు మార్గంతోపాటు అక్కడక్కడా చిన్న చెక్క వంతెనలు కూడా ఉంటాయి. అడుగున నది ప్రవహిస్తుండగా ఈ వంతెనలు దాటడం జీవితంలో మర్చిపోలేని అనుభవం. సురు వ్యాలీకి ఉన్న మరో అట్రాక్షన్ నున్, కున్ అనే రెండు పర్వతాలు. మంచుతో నిండిన ఈ పర్వతాలు వ్యాలీలోని ప్రతి ఊరునుంచి కనిపిస్తూనే ఉంటాయి. ఊళ్లలో చివరిది పర్కాచిక్. అక్కడ ఉండాలనుకుంటే జమ్మూకశ్మీర్ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన ట్రెక్కర్స్ కాటేజిలో ఉండొచ్చు.

రంగ్‌దుమ్
పర్కాచిక్ నుంచి పదుమ్ వెళ్లే దారిలో ఉండే పొదరిల్లులాంటి ప్రదేశం రంగ్‌దుమ్. పట్టుమని పది ఇళ్లు, రెండు ఫుడ్ స్టాల్స్, రాత్రి పూట హాల్ట్ కోసం కొన్ని గెస్ట్‌హౌ్‌సలు మాత్రమే ఉండే ఈ ప్రాంతంతో బయటి ప్రపంచానికున్న ఒకే ఒక కనెక్షన్ అక్కడున్న ఏకైక టెలికాం టవర్. ఇక ఇక్కడి నుంచి కనుచూపుమేరలో సురు నదికి మూలమైన డ్రాంగ్ డ్రంగ్ గ్లేసియర్ కనిపించే పెంజి లా చేరుకోవాలి. పెంజి లా దాటితే జన్‌స్కార్. వ్యాలీ చేరుకున్నట్టే!

జన్‌స్కార్ వ్యాలీ ఎట్రాక్షన్స్
ఫుక్తల్ గొంప: పదుమ్ దగ్గరున్న అన్ము అనే ఊరి నుంచి ఐదు గంటలు నడిస్తే పర్వతశిఖరం అంచున వేలాడే 14వ శతాబ్దపు మాన్‌స్టరీని చేరుకోవచ్చు.
బర్దన్ గొంప: జన్‌స్కార్ లోయకు వెళ్లే మార్గంలో పదుమ్ నుంచి బయల్దేరినప్పటినుంచి సుదూరంగా ఓ మాన్‌స్టరీ కనిపిస్తూ ఉంటుంది. అదే 17వ శతాబ్దపు దుగ్ప-కర్గ్‌యుద్ మాన్‌స్టరీ.
రగ్‌దుమ్ గొంప: జన్‌స్కార్‌కు వెళ్లే దారిలో ఎదురయ్యే మొట్టమొదటి బౌద్ధుల గ్రామం రగ్‌దుమ్‌లో ఉంటుంది. నిర్మలమైన ఆకాశం, బలంగా వీచే మంచు గాలులు ఈ ప్రదేశం ప్రత్యేకతలు.

ప్లానింగ్ టిప్స్
జన్‌స్కార్ వ్యాలీకి త్వరగా చేరుకోవాలనుకుంటే క్యాబ్ అద్దెకు తీసుకోవాలి.
బడ్జెట్‌లో ప్రయాణించాలనుకుంటే లడక్‌లోని లేహ్ నుంచి జన్‌స్కార్‌లోని పదుమ్‌కు వెళ్లే వీక్లీ బస్ కోసం ఆగాల్సిందే! బస్ ప్రయాణం మధ్యలో కార్గిల్‌లో ఆగుతుంది. అప్పుడు కార్గిల్‌లో బస్ క్యాచ్ చేయాలి. బస్ జర్నీ ఎంచుకుంటే దారిలోని సురు వ్యాలీలోని సంకూ, పనిఖార్ గ్రామాలను కూడా చూడొచ్చు.
పర్కాచిక్ నుంచి జన్‌స్కార్‌కు సుమోలు అద్దెకు దొరుకుతాయి.
జన్‌స్కార్ ముఖ్య పట్టణం పదుమ్‌లో హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, రెస్టారెంట్లు ఉంటాయి.

హైదరాబాద్ నుంచైతే ఫ్లయిట్‌లో జైపూరుకు అక్కడి నుంచి ట్రైన్‌లో జైసల్మేర్ చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు ఏడు వేలు. ట్రైన్‌లోనే వెళ్లాలనుకుంటే జంషెడ్‌పూర్, అక్కడి నుంచి జైసల్మేర్ వెళ్లొచ్చు. ప్రయాణ ఖర్చు ఐదువేలు. వైజాగ్ నుంచి వెళ్లాలనుకుంటే దిల్లీకి ఫ్లయిట్‌లో చేరుకుని అక్కడి నుంచి ట్రైన్ లేదా రోడ్డు ద్వారా జైసల్మేర్ చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు ఐదు వేలు. విశాఖపట్నం నుంచి జైసల్మేర్ వరకూ ట్రైన్‌లోనే వెళ్లాలనుకుంటే జంషెడ్‌పూర్‌కు అక్కడినుంచి జైసల్మేర్‌కు వెళ్లొచ్చు. ప్రయాణ ఖర్చు నాలుగు వేలు.

హైదరాబాద్ నుంచైతే శ్రీనగర్‌కు విమానంలో వెళ్లి అక్కడి నుంచి కార్గిల్ చేరుకోవాలి. కార్గిల్ నుంచి క్యాబ్ లేదా బస్ ద్వారా జన్‌స్కార్ చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు 9,000. విశాఖపట్నం నుంచైతే లెహ్ లేదా శ్రీనగర్‌కు ఫ్లయిట్‌లో వెళ్లి అక్కడినుంచి కార్గిల్ వెళ్లొచ్చు. ప్రయాణ ఖర్చు పదివేలు.

LIKE US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565