MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ సాయి బాబా వారు గురువా లేక దేవుడా Sri Sai Baba

శ్రీ సాయి బాబా వారు గురువా లేక దేవుడా 
Sri Sai Baba 
శ్రీ సాయి బాబా వారు గురువా లేక దేవుడా ?
గురువుకి దేవుడికి గల భేదం ఏమిటి ?
శ్రీ సాయి బాబా వారు ఎన్నడూ నేను భగవంతుడను అని అనలేదు , "భగవంతుని విధేయ సేవకుడను అనే వారు." సాయి బాబా వారే కాదు ఆది శంకరులు ,రామానుజాచార్యులు , మధ్వాచార్యులు,గురు రాఘవేంద్ర స్వాముల వారు ,నిన్నటి పూజ్య గురుదేవులు "నడిచే దేవుడు " అని కొనియాడబడిన శ్రీ చంద్రశేఖరేంద్ర మహా స్వామీ వారి వరకు ఏ గురువూ తాను దేవుడను అని చెప్పుకోరు.వారి లీలలను,మహాత్యమును,లక్షణాలను,శక్తి సామర్ధ్యాలను గ్రహించి శిష్యులే వారిని దేవునిగా భావించి పూజించడం చేస్తుంటారు.
కొన్ని సందర్భాలలో గురువు తన మహిమను వెల్లడి చేయక తప్పదు.త్రివిక్రమ భారతి శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారిని కేవలం మానవ మాత్రులుగా భావించి దుషిస్తుండగా స్వామి వారు తమ మహిమను ప్రదర్శించవలసి వచ్చింది.అలానే సాయి బాబా వారు రోజు నూనెను భిక్షగా స్వీకరించి జ్యోతులను వెలిగించేవారు కాని తమ మహిమ చేత వాటిని రోజూ నీళ్ళతో వెలిగించలేదు.అలాంటి సందర్భం వచ్చినప్పుడే వెలిగించారు.ఇలాంటి లీలలెన్నో ప్రతి గురువు సందర్భానుసారంగా చేస్తుంటారు.
గురువు తన మహిమను వెల్లడి చేసిన ప్రతి సారి శిష్యులు భగవంతునిగా ఆరాధించడం మొదలు పెడతారని గ్రహించి వెంటనే సాదారణ మానవునిగా భ్రమింప జేస్తుంటారు.కొద్ది మంది శిష్యులు మాత్రమే ఈ మాయను దాటి పుజించగలరు.
సాయి బాబా వారు గురువా లేక దేవుడా అనే ఆలోచన కుడా వృధా ప్రయాసే.గురువు-దేవుడు ఒక్కరే అని మన వేదాలు ఘోషిస్తుండగా ఇంకా ఇలా తర్కించడం దేనికి.
గురువుకి దేవుడికి గల భేదం ఏమిటి ?
పంచదార - తీపి ఈ రెండిటినీ వేరు చేయడం సాధ్యమేనా ? ఎన్నటికీ కాదు అలానే గురువు - దేవుడు కుడా , వారి మధ్య భేదము లేదు.అజ్ఞానముతో వారిని వేరు చేస్తే మనము కేవలం ఒక మనిషిని ఆరాధించి నట్లే కాని గురువును కూడా కాదు.
వేదాలు , ఉపనిషత్తులు , శాస్త్రాలు , ఇతిహాసాలు , పురాణాలు ఏవి తీసుకున్నా అన్నీ తెలియపరిచే విషయం ఒక్కటే. మనం ఆరాధించవలసిన వారు వీరే " తల్లి , తండ్రి , గురువు , దైవం "
ప్రతి జీవికీ మొదటి గురువు తల్లే.తల్లి తరువాతనే తండ్రి , గురువు దేవుడు ఇంకా ఎవరైనా .మనలోని అజ్ఞాన చీకట్లను తలగించే ప్రతి వారు గురు స్వరూపాలే. సాక్షాత్ పర బ్రహ్మ స్వరూపులైన త్రిముర్త్యాత్మక స్వరూపులు శ్రీ దత్తాత్రేయ స్వాముల వారు పంచభూతాలు మొదలుకొని చీమ, చేప, కొండ చిలువ, పావురం, గ్రద్ద, సాలె పురుగు, తేనేటీగ వరకు మొత్తం 24 మంది గురువులని పేర్కొన్నారు.
శ్రీ దత్తాత్రేయ స్వాముల వారే పర బ్రహ్మ స్వరూపులని త్రిముర్త్యాత్మకులని మన అందరికి తెలిసిన విషయమే , అటువంటి శ్రీ దత్తాత్రేయ స్వాముల వారే ఇంత మందిని గురువులుగా భావించారు.ప్రతి గురువు పుజనీయులే. గురువే సకల దేవతా స్వరూపం.
గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
పై గురు శ్లోకంలో వర్ణించినట్లు గురువు త్రిముర్త్యాత్మక స్వరూపము మాత్రమే కాదు పర బ్రహ్మ స్వరూపము కుడా.గురువుకు భగవంతుడికి ఏ బేధము లేదు.అలా బేధాన్ని చూసేవారికి గురు కటాక్షం ఎలా లభించగలదు ?
ఒకసారి పంతు అనేటటువంటి భక్తుడు,వేరే గురువు తాలూకు శిష్యుడు శ్రీ సాయి బాబా వారి దర్శనానికి వచ్చినప్పుడు శ్రీ సాయి దర్బార్ లోని భక్త సమూహాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోగా,శ్రీ సాయి బాబా వారు గ్రహించి అతని గురువు నందు స్థిర నమ్మకం కలుగజేస్తు అన్న మాటాలు "ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రయము నిలుపుము; ఎల్లప్పుడు నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి యుండుము."
బాబా వారి ఉద్దేశ్యము కుడా ప్రతి గురువు గొప్పవారే పుజ్యనీయులే .ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు.శ్రీ కృష్ణుడు గీతను భోదిస్తూ అర్జునునికి సద్గురువు మరియు అతని శిష్యుడు తన ఆత్మ-ప్రాణముగా పోల్చాడు.
కనుక ప్రతి గురువు పర బ్రహ్మావతారులే,అట్టి సద్గురువును త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిస్తే వారి అనుగ్రహం తప్పక కలుగుతుంది.ఎవరి నమ్మకాన్ని బట్టి వారు ఒక సద్గురువును ఎంచుకుంటారు.అలా ఎంచుకున్న సద్గురువు కృప వారికి కలగాలని ప్రార్దిస్తూ .....
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా రాజాధి రాజ యోగి రాజ పర బ్రహ్మ శ్రీ సచ్చితానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజుకు జై
ఓం సాయిరాం



LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list