శ్రీ సీతారామాంజనేయాయనమః శ్రీ సీతారామకధ సుందరకాండము
Sundarakanda
శ్రీ సీతారామాంజనేయాయనమః
శ్రీ సీతారామకధ
సుందరకాండము
(శ్రీ వాల్మీకి రామాయణము మూలము)
రచన:
సుందరదాసు
ఎమ్మెస్. రామారావు
* * *
శ్రీ ఎమ్మెస్. రామారావు గేయ రూపమున తెలుగులో రచించిన సుందరకాండములోని కొన్ని భాగములను పాడగా వింటిని. చేను విన్న చోట్ల రచన రమణీయంగా నున్నది. వారు మధురమైన కంఠము గలవారు. ఎనుబది తొంబది ఏండ్ల వరకు జీవించి శ్రీరామ సేవ, శ్రీ ఆంజనేయ సేవ మరియును చేయుచు చేయుచు, వారి ఇరువురి కృపను సంపూర్ణంగా పొందవలసిందిగా వారిని నేను ఆశీర్వదించుచున్నాను.
మారుతీనగర్ ఇట్లు
విజయవాడ కళాప్రపూర్ణ, కవి సామ్రాట్
23-12-1975 విశ్వనాధ సత్యనారాయణ
కృతజ్ఞత
రాజమహేంద్రవరం నవభారతి గురుకులంలో నేనుండగా, 1972,73,74, సం.లలో శ్రీ తులసీదాస్ హనుమాన్ చాలీసాను, శ్రీ వాల్మీకి రామాయణంలోని సుందరకాండమును, గేయరూపములో తేట తెలుగున అనువదించితిని. అట్టి ప్రశాంత వాతావరణంలో నాకు ఆశ్రయ మెసగిన గురుకుల వ్యవస్థాపకులు శ్రీ తన్నీరు బుల్లెయ్యగారికి నేనెంతో కృతజ్ఞుడను.
సుందరకాండమును నేను పాడి వినుపించగా, శ్రద్ధగా పూర్తిగా విని, వారి అభిప్రాయమును ఇందు ముద్రించుటకు వ్రాసి ఇచ్చిన శ్రీ మల్లంపల్లి శరభేశ్వరశర్మగారికి నేనెంతో కృతజ్ఞుడను.
సంపూర్తిగా వినుటకు సమయము లేక, అక్కడక్కడ కొన్ని భాగములను మాత్రమే విని, వారి అభిప్రాయములను ఇందు ముద్రించుటకు వ్రాసి ఇచ్చిన కళాప్రపూర్ణ. కవిసామ్రాట్, కీర్తిశేషులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి నేనెంతో కృతజ్ఞుడను. రచన సాగుచుండిన కాలములో, గురుకులములో ఉంటూ తరచు వినుచు నన్ను ప్రోత్సహించిన శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావుగారికి కృతజ్ఞుడను.
సుందరకాండ గానమును ఆబాల గోపాలము వినుచు ఆనందించుచు నన్నానందింప చేయుచుండిన తెలుగు వారందరికి నేనెంతో కృతజ్ఞుడను.
ఇట్లు
సుందరదాసు
ఎమ్మెస్. రామారావు
"సుందరదాసు"
శ్రీ ఎమ్మెస్ రామారావు గారి జీవిత చరిత్ర
మా తండ్రి గారైన "సుందరదాసు" శ్రీ ఎమ్మెస్ రామారావుగారు, వారు రచించిన భక్తి గేయాలతోను, తెలుగు హనుమాను చాలీసా, సుందరకాండము, బాలకాండము, అయోధ్య కాండముల గానముతో భారతదేశముననే గాక పాశ్చాత్య దేశములనందలి తెలుగువారి నందరినీ ఉర్రూతలూగించిన మహానుభావులు.
1921 జులై మూడో తేదీన గుంటూరు జిల్లా తెనాలి తాలుకా మోపర్రు గ్రామంలో మోపర్తి రంగయ్య, శ్రీమతి మంగమ్మలకు వారు జన్మించారు. ఆయన చిన్నతనము నుండి పాటలు పాడటము పట్ల ఆసక్తి కనపరచేవారు. 1941వ సంవత్సరములో వారు గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరము చదువుతున్న రోజుల్లో అంతర కళాశాలల లలిత సంగీత పోటీ జరిగినది. అందులో మొదటి బహుమతి వారికి లభించింది. ఆ పోటీ న్యాయ నిర్ణేతలలో ఒకరయిన శ్రీ అడవి బాపిరాజు గారు వారిని చలన చిత్రరంగములో ప్రవేశించమని ప్రోత్సహించారు.
తెలుగు చలనచిత్రరంగములో ప్లేబాక్ గాయకులలో వారు మొదటివారు. 1944వ సంవత్సరము నుండి 1964వ సంవత్సరము వరకు ఇరవై సంవత్సరముల పాటు మద్రాసు నగరములో సినీ నేపధ్య గాయకులుగా వారు గడిపారు. ఆ కాలములో వారు కొన్ని పాటలు సుబ్బారావుగారు రచించిన ఎంకిపాట "ఈరేయి నన్నోల్ల నేరవా రాజా!" వారు పాడిన మొట్టమొదటి సినిమా పాట. ఈ పాటలను ఆయనే పడవ వాని వేషములో పాడారు. సినీ దర్శకులు శ్రీ వై.వి.రావు, శ్రీ కె.ఎస్. ప్రకాశరావు, నటులు శ్రీ నాగయ్య, శ్రీ ఎన్.టి.ఆర్. ప్రభృతుల ప్రోత్సాహంతో వారు అప్పుడు వచ్చిన చాలా సినిమాలలో పాటలు పాడారు.
"దీక్ష, ద్రోహి, మొదటిరాత్రి, పాండురంగ మహాత్యము, నాయిల్లు, సీతారామకళ్యాణము, శ్రీ రామాంజనేయ యుద్ధము" మొదలైన చిత్రములలో వారు పాటలు పాడారు. "పల్లె పడుచు" చిత్రానికి వారు సంగీత దర్శకత్వము కూడా వహించారు.
"దీక్ష" చిత్రంలో "పోరా! బాబు పో!" అనే పాటను, తమిళ సినిమాకు కూడా తమిళములో పాడి గాయకుడిగా వారు తమిళంలోనూ పేరు తెచ్చుకున్నారు.
కన్నడ సినిమా అయిన "నాగార్జున" చిత్రమునకు రాజన్-నాగేంద్ర సంగీత దర్శకత్వములో "శాంతి సమాధాన" అనే పాటను కూడా వారు పాడారు.
శ్రీ ఆంజనేయస్వామి కృప చేత, వారు 1970వ సంవత్సరములో తులసీదాసు రచించిన "శ్రీ హనుమాను చాలీసా" ను తెలుగులో అనువాదము చేశారు. ఆ తర్వాత - శ్రీ వాల్మీకి రామాయణములోని సుందరకాండము, బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండములను గేయ రూపమున రచన చేసారు. ఆకాశవాణిలోను, దూరదర్శన్ లో వారు "సుందరకాండము" ను గానము చేశారు. బాలకాండము, సుందరకాండములను గ్రామఫోను రికార్డుగా కూడా ఇచ్చారు. "అయోధ్య కాండము"ను కాసెట్లకుగాను పాడారు.
1991 సంవత్సరము నుండి "యుద్ధకాండము" ను గేయరూపమున కొంతభాగము రచన చేశారు. రామాయణమును పూర్తిగా గేయ రూపమున భక్తులకు అందించాలని వారి చిరకాల కోరిక, అయితే - వారు గుండెపోటుతో ఏప్రిల్ 20, 1992వ సంవత్సరమున పరమ పదించిరి.
వారు మా మధ్య లేకున్నను, వారి సంకల్పమయిన శ్రీ వాల్మీకి రామాయణమును పూర్తిగా గేయ రూపమున భక్తులకు అందజేయుటకై, మిగిలిన "శ్రీ రామకధ" యుద్ధకాండమును నేను పూర్తి చేయుట జరిగినది. వారు రచించి, గానము చేసిన భక్తి గేయములు, లలితగేయములు, కూడా పుస్తక రూపమున వారి అభిమానులకు అందజేయగలమని నా మనవి.
"శ్రీరామకధ" సుందరకాండమును పారాయణము చేసిన వారికి, కష్టనష్టములు తొలగి, సర్వ సౌఖ్యములు కలుగునని పెద్దలందురు. కనుక, ఈ గ్రంధమును పారాయణము చేసి, భక్తులందరు తరించగలరని నా విన్నపము.
ఈ గ్రంధమును ఎంతో శ్రద్ధతో ముద్రించిన విప్ల కంప్యూటర్ సర్వీసెస్ సిబ్బంది వారికి, ముఖ్యముగా శ్రీ విజయసేనారేడ్డి గారికి, మరియు శ్రీ మారుతిగారికి నా కృతజ్ఞతలు.
ఇట్లు
ఎం. నాగేశ్వరరావు
("సుందరదాసు " ఎమ్మెస్ రామారావుగారి కుమారుడు)
ఎం. నాగేశ్వరరావు
("సుందరదాసు " ఎమ్మెస్ రామారావుగారి కుమారుడు)
సమర్పణ
శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీ హనుమాను గురుదేవుల పాదపద్మములకు
"శ్రీరామరక్ష - సర్వజగద్రక్ష"
శ్లో. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో సమామ్యహం II
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో సమామ్యహం II
శ్రీ హనుమంతుని ద్వాదశ నామములు
హనుమా నంజనానూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణ సఖః పింగక్షో అమితవిక్రమః I
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశ గ్రీవన్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ II
రామేష్టః ఫల్గుణ సఖః పింగక్షో అమితవిక్రమః I
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశ గ్రీవన్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ II
హనుమంతుని ఈ పండ్రెండు నామములు పరుండబోవు నపుడు, ప్రయాణ సమయమున పఠించిన మృత్యుభయముండదు. సర్వత్ర విజయము కలుగును.
హరేరామ హరేరామ రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే
-: గురు ప్రార్ధన :-
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద
పలికిన సీతారామ కధా - నే
పలికెద సీతారామ కధ ... ... ... IIశ్రీII
పలికిన సీతారామ కధా - నే
పలికెద సీతారామ కధ ... ... ... IIశ్రీII
సుందరదాసు
ఎమ్మెస్ రామారావు
1 వ. సర్గ
1. శ్రీహనుమంతుడు - అంజనీసుతుడు
అతి బలవంతుడు - రామభక్తుడు |
అతి బలవంతుడు - రామభక్తుడు |
లంకకు బోయి - రాగల ధీరుడు
మహిమోపేతుడు - శత్రు కర్శనుడు |
మహిమోపేతుడు - శత్రు కర్శనుడు |
జాంబవదాది - వీరులందరును
ప్రేరేపించగ - సమ్మతించెను |
ప్రేరేపించగ - సమ్మతించెను |
లంకేశ్వరుడు - అపహరించిన
జానకీమాత - జాడ తెలిసికొన | .... ||శ్రీ||
జానకీమాత - జాడ తెలిసికొన | .... ||శ్రీ||
2. తన తండ్రియైన - వాయుదేవునకు
సూర్య చంద్ర బ్ర | హ్మాది దేవులకు |
సూర్య చంద్ర బ్ర | హ్మాది దేవులకు |
వానరేంద్రుడు | మహేంద్రగిరిపై
వందనములిడే | పూర్వాభిముఖుడై |
వందనములిడే | పూర్వాభిముఖుడై |
రామనామమున | పరవశుడయ్యె
రోమ రోమమున | పులకితుడయ్యె |
రోమ రోమమున | పులకితుడయ్యె |
కాయము బెంచె | కుప్పించి ఎగసె
దక్షిణదిశగా - లంక చేరగ .... ||శ్రీ||
దక్షిణదిశగా - లంక చేరగ .... ||శ్రీ||
3. పది యోజనముల - విస్తీర్ణముగ - ము
| ప్పది యోజనముల - ఆయతముగ |
| ప్పది యోజనముల - ఆయతముగ |
| మహామేఘమై | మహార్ణవముపై
| మహావేగమై | మహాకాంతియై |
| మహావేగమై | మహాకాంతియై |
వారిధి దాటేడు - వాతాత్మజుపై
కురిపించిరి సుర | లు పుష్పవర్షములు |
కురిపించిరి సుర | లు పుష్పవర్షములు |
సాగనంపునటు | ల ఎగసిన తరువులు
సాగరమున రా | ల్చె పుష్పబాష్పములు |
సాగరమున రా | ల్చె పుష్పబాష్పములు |
4. పవన తనయుని - పదఘట్టనకే
పర్వతరాజము - గడగడ వణకే |
పర్వతరాజము - గడగడ వణకే |
ఫల పుష్పాదులు - జలజల రాలె
పరిమళాలు గిరి | శిఖరాలు నిండె |
పరిమళాలు గిరి | శిఖరాలు నిండె |
పగిలిన శిలల - ధాతువు లెగసె
రత్న కాంతులు - నలుదిశల మెరసె |
రత్న కాంతులు - నలుదిశల మెరసె |
గుహలను ధాగిన - భూతము లదిరి
దీనారముల - పరుగిడే బెదిరి | .....
దీనారముల - పరుగిడే బెదిరి | .....
5. భయపడి పోయిరి - విద్యాధరులు
పరుగిడ సాగిరి - తపోధనులు |
పరుగిడ సాగిరి - తపోధనులు |
తమ తమ స్త్రీలతో - గగనానికెగిరి
తత్తర పాటున - వింతగ జూచిరి |
తత్తర పాటున - వింతగ జూచిరి |
గగనమార్గమున - సిద్ధచారణులు
పోవుచు పలికిన - పలుకులు వినిరి |
పోవుచు పలికిన - పలుకులు వినిరి |
"రామభక్త హను | మానుడీతడని
సీత జాడగని - రాగలవాడని .... ...." ||శ్రీ||
సీత జాడగని - రాగలవాడని .... ...." ||శ్రీ||
సగరుడు మైనాకునితో :-
6. రఘుకులోత్తముని - రామచంద్రుని
పురుషోత్తముని - పావనచరితుని |
పురుషోత్తముని - పావనచరితుని |
నమ్మిన బంటుని - అనిలాత్మజుని
శ్రీ హనుమంతుని - స్వాగతమిమ్మని |
శ్రీ హనుమంతుని - స్వాగతమిమ్మని |
నీకడ కొంత వి | శ్రాంతి దీసికొని
పూజలందుకొని - పోవచ్చునని |
పూజలందుకొని - పోవచ్చునని |
సగర ప్రవర్దితుడు - సాగరుడెంతో
ముదమున బలికె - మైనాకునితో ......... ||శ్రీ||
ముదమున బలికె - మైనాకునితో ......... ||శ్రీ||
7. కాంచన శిఖర - కాంతులు మెరయ
సాగరమున మై | నాకుడు ఎగయ |
సాగరమున మై | నాకుడు ఎగయ |
నీలాకాశము - నలువంకలను
బంగరు వన్నెలు - ప్రజ్వరిల్లెను |
బంగరు వన్నెలు - ప్రజ్వరిల్లెను |
ఆంజనేయుని - అతిధిగ బిలువ
మైనాకుడు ఉ - న్నతుడై నిలువ |
మైనాకుడు ఉ - న్నతుడై నిలువ |
ఎందరో సూర్యులు - ఒక్కమారుగ
ఉదయించినటుల - తోచె భ్రాంతిగా.... ..... ||శ్రీ||
ఉదయించినటుల - తోచె భ్రాంతిగా.... ..... ||శ్రీ||
8. మైనాకుడు ఉ | న్నతుడై నిలిచె
హనుమంతుడు ఆ | గ్రహమున గాంచె |
హనుమంతుడు ఆ | గ్రహమున గాంచె |
ఇదియొక విఘ్నము - కాబోలునని |
వారిధి బడద్రోసె - ఉరముచే గిరిని |
వారిధి బడద్రోసె - ఉరముచే గిరిని |
పర్వత శ్రేష్ఠుడా - పోటున క్రుంగె
పవన తనయుని - బలముగని పొంగె
పవన తనయుని - బలముగని పొంగె
తిరిగి నిలిచె హను | మంతుని బిలిచె
తన శిఖరముపై - నరుని రూపమై .... ..... ||శ్రీ||
తన శిఖరముపై - నరుని రూపమై .... ..... ||శ్రీ||
మైనాకుడు - హనుమంతునితో :-
9. "వానరోత్తమా | ఒకసారి నిలుమా
నా శిఖరాల | శ్రమదీర్చుకొనుమా |
నా శిఖరాల | శ్రమదీర్చుకొనుమా |
కందమూలములు - ఫలములు తినుమా
నా పూజలు గొని - మన్ననలందుమా |
నా పూజలు గొని - మన్ననలందుమా |
శతయోజనముల - పరిమితము గల
జలనిధి నవలీల - దాటిపోగల |
జలనిధి నవలీల - దాటిపోగల |
నీదు మైత్రి కడు - ప్రాప్యము నాకు
నీదు తండ్రి కడు - పూజ్యుడు నాకు" ||శ్రీ||
నీదు తండ్రి కడు - పూజ్యుడు నాకు" ||శ్రీ||
10. "కృతయుగంబుగ - విచ్చల విడిగ
గిరులెగిరెడివి - రెక్కలు కలిగి |
గిరులెగిరెడివి - రెక్కలు కలిగి |
ఇంద్రుడలిగి లో | కాలను గావగ
గిరుల రెక్కలను - ముక్కలు జేయగ |
గిరుల రెక్కలను - ముక్కలు జేయగ |
వాయుదేవుడు - దయగొని నన్ను
వే వేగముగ - వారిధి జేర్చెను |
వే వేగముగ - వారిధి జేర్చెను |
దాగియుంటినీ - సాగరమందు
దాచుకొంటినా - రెక్కలపొందు" .... ||శ్రీ||
11. పర్వతోత్తముని - కరమున నిమిరి
పవన తనయుడు - పలికె ప్రీతిని |
దాచుకొంటినా - రెక్కలపొందు" .... ||శ్రీ||
11. పర్వతోత్తముని - కరమున నిమిరి
పవన తనయుడు - పలికె ప్రీతిని |
"ఓ గిరీంద్రమా! - సంతసించితిని
నీ సత్కారము - ప్రీతి నందితిని |
నీ సత్కారము - ప్రీతి నందితిని |
రామ కార్యమై - ఏగుచుంటిని
సాధించు వరకు - ఆగనంటిని |
సాధించు వరకు - ఆగనంటిని |
నే పోవలె క్షణ | మెంతో విలువలే
నీ దీవనలే - నాకు బలములే" ....
నీ దీవనలే - నాకు బలములే" ....
12. అనాయాసముగ - అంబర వీధిని
పయనము జేసేడు - పవన కుమారుని |
పయనము జేసేడు - పవన కుమారుని |
ఇంద్రాదులు మ | హర్షులు సిద్ధులు
పులకాంకితులై - ప్రస్తుతించిరి |
పులకాంకితులై - ప్రస్తుతించిరి |
రామ కార్యమతి - సాహసమ్మని
రాక్షస బలమతి - భయంకరమని |
రాక్షస బలమతి - భయంకరమని |
కపివరుడెంతటి - ఘనతరుడోయని
పరిశీలనగా - పంపిరి సురసను .....
పరిశీలనగా - పంపిరి సురసను .....
13. నాగమాత సుర | సదను జాకృతి గొని
ఎగసి మాటాడే - హనుమంతుని గని |
ఎగసి మాటాడే - హనుమంతుని గని |
దేవతలంపిరి - నిన్ను మ్రింగమని
ఆకొనియుంటి నా - నోటబడు" మని |
ఆకొనియుంటి నా - నోటబడు" మని |
ఘోరమౌ బుసల - నోటిని దెరచె
క్రూరమౌ కరకు - కోరలు మెరసె |
క్రూరమౌ కరకు - కోరలు మెరసె |
కేసరీ సుతుడు - చిరునగ వొలుకగ
కరములు మోడ్చి - పలికెను తీరుగ .... ||శ్రీ||
కరములు మోడ్చి - పలికెను తీరుగ .... ||శ్రీ||
హనుమంతుడు సురసతో :-
14. "ఓ సురసా! ఇది - సమయము కాదు
నన్నాప నీకు - న్యాయము కాదు |
నన్నాప నీకు - న్యాయము కాదు |
రామ కార్యమై - లంకకు ఒంటిగ
సీత జాడగన - ఏగుచుంటిగ |
సీత జాడగన - ఏగుచుంటిగ |
తల్లి జాడ తెలి | సి తండ్రికి దెలిపి
మరలి వచ్చి నీ - నోట బడుదును" |
మరలి వచ్చి నీ - నోట బడుదును" |
అని హనుమంతుడు - చిరునగ వొలుకగ
తీరుగ బలికె - స్వామి సాక్షిగ ..... ||శ్రీ||
తీరుగ బలికె - స్వామి సాక్షిగ ..... ||శ్రీ||
సురస హనుమంతునితో :-
15. "ఎపుడో నన్ను - నిన్ను మ్రింగమని
వరమొనగి మరీ - బ్రహ్మ పంపె" నని |
వరమొనగి మరీ - బ్రహ్మ పంపె" నని |
అతిగా సురస - నోటిని దెరచె
హనుమంతుడలిగి - కాయము బెంచె |
హనుమంతుడలిగి - కాయము బెంచె |
ఒకరినొకరు మిం | చి కాయము బెంచిరి
శత యోజనములు - విస్తరించిరి |
శత యోజనములు - విస్తరించిరి |
పై నుండి సురలు - తహతహలాడిరి
ఇరువురిలో ఎ | వ్వరిదో గెలుపనిరి ..... ||శ్రీ||
ఇరువురిలో ఎ | వ్వరిదో గెలుపనిరి ..... ||శ్రీ||
16. సురస ముఖము వి | శాల మౌటగని
సూక్ష్మ బుద్ధిగొని - సమయమిదేనని |
సూక్ష్మ బుద్ధిగొని - సమయమిదేనని |
క్షణములోన అం | గుష్టమాత్రుడై
ముఖము జొచ్చి వెలి - వచ్చె విజయుడై |
ముఖము జొచ్చి వెలి - వచ్చె విజయుడై |
పవన కుమారుని - సాహసము గని
దీవించె సురస - నిజరూపము గొని |
దీవించె సురస - నిజరూపము గొని |
సాధుసాధు యని - సురలు నుతించిరి
జయ హనుమాయని - దీవన లోసగిరి ||శ్రీ||
జయ హనుమాయని - దీవన లోసగిరి ||శ్రీ||
సురస ముఖము జొచ్చి|
విజయుడై వెలివచ్చె మారుతి |
17. | ఘనా ఘన, ఘన - విన్యాసితము
నారద తుంబురు - గాన శోభితము |
నారద తుంబురు - గాన శోభితము |
గరుడ గంధర్వ - వాహనాంచితము
దేవ విమాన - యానభాసితము |
దేవ విమాన - యానభాసితము |
సూర్యచంద్ర న | క్షత్ర మండితము
బ్రహ్మనిర్మితము - ప్రణవాన్వితము |
బ్రహ్మనిర్మితము - ప్రణవాన్వితము |
| నిరాలంబ నీ | లాంబరము గనుచు
మారుతి ఏగెను - వేగము పెంచుచు | ||శ్రీ||
మారుతి ఏగెను - వేగము పెంచుచు | ||శ్రీ||
18. జలనిధి తేలే - మారుతి ఛాయను
రాక్షసి సింహిక - అట్టె గ్రహించెను |
రాక్షసి సింహిక - అట్టె గ్రహించెను |
గుహనుబోలు తన - నోటిని దెరచెను
కపివరుని గుంజి - మ్రింగజూచెను |
కపివరుని గుంజి - మ్రింగజూచెను |
అతిబలవంతుని - ఆంజనేయుని
కదలనీయక - తికమక పరచెను |
కదలనీయక - తికమక పరచెను |
మును సుగ్రీవుడు - గురుతుగ దెల్పిన
ఛాయాగ్రాహి అ | దేనని తెలిసెను | ||శ్రీ||
ఛాయాగ్రాహి అ | దేనని తెలిసెను | ||శ్రీ||
19. | మహామేధావి - కపి కుంజరుడు
క్షణములో నాయె - సూక్ష్మరూపుడు
క్షణములో నాయె - సూక్ష్మరూపుడు
మెరపువోలె మెర | సి సింహిక ముఖమును
చొచ్చి చీల్చి వెలి | వచ్చి నిల్చెను |
చొచ్చి చీల్చి వెలి | వచ్చి నిల్చెను |
సింహిక హృదయము - చీలిక లాయెను
సాగరమునబడి - అసువులు బాసెను |
సాగరమునబడి - అసువులు బాసెను |
దేవ గంధర్వ - సిద్ధగణంబులు
పవనకుమారుని - పొగడిరి ఘనముగ | ||శ్రీ||
పవనకుమారుని - పొగడిరి ఘనముగ | ||శ్రీ||
20. వారిధి దాటేను - వాయు కుమారుడు
లంక జేరెను - కార్యశూరుడు |
లంక జేరెను - కార్యశూరుడు |
కేతకోద్దాల - నారికేళాది
ఫలవృక్షములతో - నిండినది |
ఫలవృక్షములతో - నిండినది |
పూతీవెలతో - సుందరమైనది
రంగు రంగులతో - శోభిల్లునది |
రంగు రంగులతో - శోభిల్లునది |
సువేలాచల - శిఖరమది
హనుమంతుడు తొలు | త వాలినది | ||శ్రీ||
హనుమంతుడు తొలు | త వాలినది | ||శ్రీ||
21. పెంచినకాయము - చిన్నది చేసి
తదుపరి కార్యము - యోచన జేసి
తదుపరి కార్యము - యోచన జేసి
నలువంకలను - కలయ జూచుచు
నిజరూపమున - మెల్లగసాగుచు |
నిజరూపమున - మెల్లగసాగుచు |
త్రికూటాచల - శిఖరముపైన
విశ్వకర్మ వి | నిర్మితమైన |
విశ్వకర్మ వి | నిర్మితమైన |
స్వర్గపురముతో - సమానమైన
లంకాపురమును - మారుతి గాంచెను | ||శ్రీ||
లంకాపురమును - మారుతి గాంచెను | ||శ్రీ||
__: 1 వ. స. సంపూర్ణము :__
2వ. సర్గ
1. కర్ణి కార కర | వీర ఖర్జూర
శింశుప అశోక - కోవిదార |
శింశుప అశోక - కోవిదార |
సాలరసాల - సప్త పర్ణ
నాగకేసర - నారికేళాది |
నాగకేసర - నారికేళాది |
తరువులు ఎంతో - కనుల పండువుగ
ఫలపుష్పములతో - నిండుగ యుండుగ |
ఫలపుష్పములతో - నిండుగ యుండుగ |
రావణుండు పరి | పాలించు లంకను
కలయ జూచుచు - మారుతి సాగెను.... ||శ్రీ||
కలయ జూచుచు - మారుతి సాగెను.... ||శ్రీ||
2. పద్మోత్పలాధి - పుష్పచయములు
నిండారగ అల | రారు అగడ్తలు |
నిండారగ అల | రారు అగడ్తలు |
హంస కారండవ - జలపక్షులు గల
రమణీయమైన - నడబావులు |
రమణీయమైన - నడబావులు |
కేళీ విలాస - జలాశయములు |
వివిధ వినోద ఉ | ద్యాన వనములు |
వివిధ వినోద ఉ | ద్యాన వనములు |
రావణుండు పరి | పాలించు లంకను
కలయజూచుచు - మారుతి సాగెను..... ||శ్రీ||
కలయజూచుచు - మారుతి సాగెను..... ||శ్రీ||
3. స్వర్ణమయమైన - ప్రాకారములు
విశాలమైన - తిన్నని వీధులు |
విశాలమైన - తిన్నని వీధులు |
మత్స్య మకర ల | తాది పతాకలు
ఎత్తున ఎగిరే - కోట బురుజులు |
ఎత్తున ఎగిరే - కోట బురుజులు |
ఏడంతస్తుల - తెల్లని మేడలు
ఎటుజూచిన - తీర్చిన గృహములు |
ఎటుజూచిన - తీర్చిన గృహములు |
రావణుండు పరి | పాలించు లంకను
కలయజూచుచు - మారుతి సాగెను ||శ్రీ||
కలయజూచుచు - మారుతి సాగెను ||శ్రీ||
4. ఘన జఘనము | వప్ర ప్రాకారము
నవ్యాంబరము - విపులాంబువు |
నవ్యాంబరము - విపులాంబువు |
కర్ణాభరణము | లు కోట బురుజులు
కేశాంతములు శ | తఘ్నీ శూలములు
కేశాంతములు శ | తఘ్నీ శూలములు
సుందరమైన - స్త్రీ రూపమున
విశ్వకర్మచే - నిర్మితమైన |
విశ్వకర్మచే - నిర్మితమైన |
రావణుండు పరి | పాలించు లంకను
కలయజూచుచు - మారుతి సాగెను ||శ్రీ||
కలయజూచుచు - మారుతి సాగెను ||శ్రీ||
5. కరకు కత్తులు - విల్లంబులు
శూల పట్టసా | ది ఆయుధ ధారులు |
శూల పట్టసా | ది ఆయుధ ధారులు |
కామరూపులు - మాయో పేతులు
ఘోరకిరాతకు | లు ఘాతకులు
ఘోరకిరాతకు | లు ఘాతకులు
అతిబలవంతులు - క్రూరకర్ములు
నిశాచరులు - రాక్షస వీరులు
నిశాచరులు - రాక్షస వీరులు
రావణుండు పరి | పాలించు లంకను
కలయ జూచుచు - మారుతి సాగెను ||శ్రీ||
కలయ జూచుచు - మారుతి సాగెను ||శ్రీ||
6. సామముచే స్వా | ధీనము గారు
దానముచే అ | ధీనము గారు
దానముచే అ | ధీనము గారు
భేదముచే బల | హీనులు గారు
దండముచే రణ | భీరులు గారు
దండముచే రణ | భీరులు గారు
సామ దాన భే | ద దండములందు
రాక్షస వీరులు - చిక్కనివారు |
రాక్షస వీరులు - చిక్కనివారు |
రావణుండు పరి | పాలించు లంకను
కలయజూచుచు - మారుతి సాగెను .... ||శ్రీ||
కలయజూచుచు - మారుతి సాగెను .... ||శ్రీ||
__: 2 వ. స. సంపూర్ణము :__
3వ. సర్గ
1. అనిలకుమారుడా - రాత్రివేళను
సూక్ష్మరూపుడై - బయలుదేరెను |
సూక్ష్మరూపుడై - బయలుదేరెను |
రజనీకరుని - వెలుగున తాను
రజనీచరుల - కనులబడకను |
రజనీచరుల - కనులబడకను |
పిల్లివలె పొంచి - మెల్లగ సాగెను
ఉత్తర ప్రాకార - ద్వారము జేరెను |
ఉత్తర ప్రాకార - ద్వారము జేరెను |
లంకా రాక్షసి - కపివరు గాంచెను
గర్జన జేయుచు - అడ్డగించెను ....... ||శ్రీ||
గర్జన జేయుచు - అడ్డగించెను ....... ||శ్రీ||
లంకా రాక్షసి మారుతితో :-
2. కొండ కోనల | తిరుగాడు కోతివి
ఈ పురికి ఏ | పనికై వచ్చితివి |
ఈ పురికి ఏ | పనికై వచ్చితివి |
లంకేశ్వరుని - ఆనతిమేర
లంకాపురికి - కావలియున్న |
లంకాపురికి - కావలియున్న |
లంకను నేను లం | కాధిదేవతను
నీ ప్రాణములను - నిలువున దీతును |
నీ ప్రాణములను - నిలువున దీతును |
కదలక మెదలక - నిజము బల్కు" మని
లంక ఎదుర్కొనె - కపికిశోరుని .... ||శ్రీ||
లంక ఎదుర్కొనె - కపికిశోరుని .... ||శ్రీ||
మారుతి లంకతో :-
3. "అతి సుందరమీ - లంకాపురమని
ముచ్చట బడి నే - చూడవచ్చితిని |
ముచ్చట బడి నే - చూడవచ్చితిని |
ఈ మాత్రమునకు - కోపమెందుకులే
పురము గాంచి నే - మరలి పోదులే"
పురము గాంచి నే - మరలి పోదులే"
అని నెమ్మదిగా - పలుకగా విని
అనిలాత్మజుని - చులకనగా గొని
అనిలాత్మజుని - చులకనగా గొని
లంకా రాక్షసి - కపికిశోరుని
| గర్జించి కసరి | గద్దించి చరచెను ||శ్రీ||
| గర్జించి కసరి | గద్దించి చరచెను ||శ్రీ||
4. సింహనాదమును - మారుతి జేసె
కొండంతగ తన - కాయము బెంచె
కొండంతగ తన - కాయము బెంచె
వామహస్తమున - పిడికిలి బిగించె
ఒకే పోటున - లంకను గూల్చె |
ఒకే పోటున - లంకను గూల్చె |
కొండబండలా - రక్కసి డొల్లె
కనులప్పగించి - నోటిని దెరచె |
కనులప్పగించి - నోటిని దెరచె |
అబలను జంపుట - ధర్మము కాదని
లంకను విడిచె - మారుతి దయగొని ||శ్రీ||
లంకను విడిచె - మారుతి దయగొని ||శ్రీ||
వామ హస్తమున పిడికిలి బిగించే
ఒకే పోటున లంకను గూల్చె|
ఒకే పోటున లంకను గూల్చె|
లంకారాక్షసి మారుతితో :-
5. "ఓ బలభీమా - వానరోత్తమా |
ఓ మహాత్మా - మన్నింపుమా |
ఓ మహాత్మా - మన్నింపుమా |
ఇంతకాలముగ - లంకను గాచితి
నేటికి నీచే - ఓట మెరిగితి |
నేటికి నీచే - ఓట మెరిగితి |
ఈ నా ఓటమి - లంకకు చేటని
పూర్వమే బ్రహ్మ - వరమొసగె" నని |
పూర్వమే బ్రహ్మ - వరమొసగె" నని |
లంకారాక్షసి - నిజము దెల్పెను
హనుమంతుని ఉ | త్సాహ పరచెను ...... ||శ్రీ||
హనుమంతుని ఉ | త్సాహ పరచెను ...... ||శ్రీ||
6. "నందికేశ్వరుల - శాపమున్నది
లంక వినాశము - మూడనున్నది |
లంక వినాశము - మూడనున్నది |
స్వేచ్చగబోయి - లంకను జూడుము
వేగమె పోయి - సీతను గాంచుము |
వేగమె పోయి - సీతను గాంచుము |
రావణుడాదిగ - రాక్షసులందరు
సీత మూలమున - అంతమొందెదరు |"
సీత మూలమున - అంతమొందెదరు |"
ఇది నిజమౌనని - మీదే జయమని
లంకా రాక్షసి - పంపె హరీశుని ..... ||శ్రీ||
లంకా రాక్షసి - పంపె హరీశుని ..... ||శ్రీ||
__: 3 వ. స. సంపూర్ణము :__
4వ. సర్గ
1. కోటగోడ అవ | లీలగ బ్రాకెను
కపికిశోరుడు - లోనికి దుమికెను |
కపికిశోరుడు - లోనికి దుమికెను |
శత్రుపతనముగ - వామపాదమును
ముందుగ మోపెను | ముందుకు సాగెను |
ముందుగ మోపెను | ముందుకు సాగెను |
ఆణి ముత్యముల - తోరణాల గల
రమ్యతరమైన - రాజవీధుల |
రమ్యతరమైన - రాజవీధుల |
వెన్నెలలో లం | కాపురి శోభను
శోధనగా హ | రీశుడు గాంచెను..... ||శ్రీ||
శోధనగా హ | రీశుడు గాంచెను..... ||శ్రీ||
2. సువర్ణ మయ - సౌధరాజముల
ధగధగ మెరసే - ఉన్నత గృహముల |
ధగధగ మెరసే - ఉన్నత గృహముల |
కలకలలాడే - నవ్వుల జల్లులు
మంగళ కరమౌ - నృత్య గీతములు |
మంగళ కరమౌ - నృత్య గీతములు |
అప్సరసల మర | పించు మదవతుల
త్రిస్థాయి బలుకు - గాన మాధురులు |
త్రిస్థాయి బలుకు - గాన మాధురులు |
వెన్నెలలో లం | కాపురి శోభను
శోధనగా హ | రీశుడు గాంచెను .... ||శ్రీ||
శోధనగా హ | రీశుడు గాంచెను .... ||శ్రీ||
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565