MohanPublications Print Books Online store clik Here Devullu.com

నేను.. మీ పాంక్రియాస్‌ని, నాలుక, కాలేయం, కిడ్నీలు, Tongue, Liver, Kidney, Pancreas

నేను.. మీ పాంక్రియాస్‌ని,  నాలుక, కాలేయం, కిడ్నీలు, Tongue, Liver, Kidney, Pancreas

+++++++నేను.. మీ పాంక్రియాస్‌ని!+++++++++
నేను గ్రే అండ్ పింక్ కలర్‌లో ఉంటాను. అచ్చం నోటి నుంచి బయటకు చాపిన నాలుక ఆకృతిలో సుమారు 15 సెంటీమీటర్ల పొడవుంటాను. దాదాపు 85 గ్రాముల బరువుంటాను. నేను కడుపులో ఉంటాను. వెన్నెముకకు కాస్త లోపల కాలేయం, కిడ్నీలు, పెద్ద పేగుకు దగ్గర్లో ఉంటాను. ఆనంద్ తిన్న గుట్టల కొద్దీ ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో నేనూ పాలుపంచుకుంటూ ఉంటాను. నేను ఆనంద్ క్లోమ గ్రంథి (ప్యాక్రియాస్)ని.
నేను చాలా బిజీగా పనిచేస్తుంటాను. నా నుంచి స్రవించే హార్మోన్లు లేకపోతే ఆనంద్ తిన్నది జీర్ణం కాదు. ఆనంద్ ఎప్పుడూ ఆహారం అందని వ్యక్తిలా ఎండిపోయినట్లుగా అవుతాడు. ఆనంద్ కనురెప్ప కొట్టినప్పుడల్లా, ఆనంద్ గుండె కొట్టుకున్నప్పుడల్లా... ఆ కణాల మాదిరిగానే అతడిలోని కణాలన్నింటికీ శక్తి కావాలి. ఆ శక్తిని సరఫరా చేయడంలో నేను తోడ్పడుతుంటాను. ఇదే కాదు, మరో కీలకమైన పని కూడా చేస్తుంటాను.
నిజానికి నేను ఒకే ఒక గ్రంథిని కాదు. ఒకే ప్యాకింగ్‌లో లభ్యమయ్యే రెండు గ్రంథులం మేము. రెండు స్రావాలను ఆనంద్ రక్తంలోకి పంపుతూ ఉంటాం. నాలోని ఒక స్రావం ఆనంద్‌లోని ఆహారం నుంచి శక్తిని పుట్టించేందుకు దోహదం చేస్తుంటుంది. ఇక మరో స్రావం అయిన ఇన్సులిన్ శక్తి అందే పని పూర్తయ్యాక ఆ ప్రక్రియను అడ్డగిస్తుంది. ఇలా అనుక్షణం ఆనంద్ రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాన్ని ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఇదే జరగకపోతే ఇప్పుడు చాలామందిలో వచ్చే డయాబెటిస్ సమస్య ఆనంద్‌కు వస్తుంది.
జీర్ణ ప్రక్రియ కోసం నా పని...
ఆహారం జీర్ణం చేసే ప్రక్రియలో భాగంగా నేను దగ్గరదగ్గర రోజుకు ఒక లీటరుకు పైగా జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంటాను. విచిత్రం చూడండి... నా బరువు 85 గ్రాములే గానీ... నా నుంచి రోజూ లీటరుకు పైగానే స్రావాలు వస్తుంటాయన్నమాట. అన్నవాహిక లోంచి కిందికి పోయే క్రమంలో ఆహారం మెత్తగా దాదాపు ద్రవరూపంలో ఉండే ప్రవాహంలా ఉండి, అసిడిక్‌గా ఉంటుంది. మీరు ‘అసిడిటీ, అసిడిటీ’ అంటూ పొట్టలో ఊరే యాసిడ్‌ను నిందిస్తుంటారుగానీ... ఆహారం... అందునా ప్రత్యేకంగా ప్రొటీన్లు జీర్ణం కావాలంటే ఆ యాసిడ్ ఊరక తప్పదు. అదే యాసిడ్ ప్రవాహం పేగుల్లోకి వెళ్తే అది వాటిని కాల్చేస్తుంది. అందుకే ఇక్కడ తప్పకుండా దాన్ని తటస్థం (న్యూట్రలైజ్) చేసే క్షారం (ఆల్కలైన్) ఊరాల్సిందే.
ఆనంద్ భోజనానికి కూర్చోగానీ అతడి నరాల నుంచి నాలోని (ప్యాంక్రియాస్‌లోని) చిన్న చిన్న సంచుల్లాంటి తిత్తులకు క్షారాన్ని ఉత్పత్తి చేయమంటూ సిగ్నల్స్ అందుతాయి. అలా సిగ్నల్స్ అందే గుచ్ఛాలంటి ఆ కణాలను ‘అసిని’ అంటారు. అప్పుడు నేను ఆ కణాల ద్వారా క్షారంతో కూడిన స్రావాలను పేగుల్లోకి పంపుతాను. అయితే ప్రవహించేంత మెత్తగా అయిన జీర్ణాహారం‘కైమ్’ వచ్చాక... కడుపులోంచి పేగుల ‘గేట్‌వే’ అయిన డియోడినమ్‌లోకి నేను నా స్రావాలను పంపకాన్ని వేగం చేస్తా. చిన్న పేగుల ప్రారంభంలో ఈ డియోడినమ్ 25 సెం.మీ. ఉంటుంది. ఈ డియోడినమ్‌లో ప్రవహించే ఒక రకం స్రావం రక్తంలో కలిసి మెదడుకు సిగ్నల్స్ పంపింపి, నాలోని ఆల్కలైనర్ (క్షారం) టాప్‌గేర్‌లో ప్రవహించేలా చేస్తుంది.
నేనిలా కడుపులో యాసిడ్‌తో ముక్కలైన ఆహారంలోకి క్షారాన్ని ప్రవహింపజేసి, దాన్ని న్యూట్రలైజ్ చేయడం అన్నది పెద్ద ప్రధానమైన సంగతి కాదు. ఇంకా ఇంతకంటే అద్భుతాలు చేస్తా. మూడు అద్భుతమైన ఎంజైములను నేను ప్రవహించేలా చేస్తాను. అందులో ట్రిప్సిన్ అనేది ప్రోటీన్లను అమైనో యాసిడ్స్‌గా మార్చుతుంది. వీటినే రక్తప్రవాహం అందుకొని ఆనంద్ కండరాలు బాగా పెరిగేలా చేస్తుంది. అమలైజ్ అనే మరో ఎంజైమ్ సహాయంతో పిండి పదార్థాలను చక్కెరగా మారుస్తా. ఇక మూడోదైన లైపేజ్‌తో కొవ్వులను ఫ్యాటీ యాసిడ్స్‌గా మార్చేస్తా. ఈ మొత్తం ప్రక్రియలకు అవసరమైన మొత్తం స్రావాలను స్రవించడానికి నాలోని సగం ‘అసినీ’ కణాలు చాలు. ఒకవేళ నేను పూర్తిగా నాశనం అయిపోయినా... అతడి లాలాజలం, అతడి పేగులు మాత్రమే స్రవించే జీర్ణరసాలు చాలు... ఆనంద్ బతికి బట్టకట్టడానికి. అంత అద్భుతంగా ఆనంద్ మనగడ కోసం ఏర్పాటు చేసింది ప్రకృతి.
ఐలెట్స్ అనే కణాలన్నీ అనునిత్యం మండే ఫర్నెస్‌లు
నాలో చెదిరిపోయినట్లుగా కనిపించే కనీసం పదిలక్షలకు పైగా ఐలెట్స్ అనే ప్రధానమైన కణాలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క కణం... ఒక్కో కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. మీకు వినడానికి 10 లక్షల కణాలు అనే సంఖ్య పెద్దగా అనిపిస్తున్నా... నా 85 గ్రాముల బరువులో వాటి వాటా కేవలం 15 శాతం మాత్రమే. అవన్నీ ఒక్కొక్కటీ ఒక్కో బట్టీలా (ఫర్నెస్‌లా) మండుతూ ఉంటాయి. ఆ బట్టీలో ఆనంద్‌లోని గ్లూకోజ్‌ను నిత్యం మండిస్తూ శక్తిని ఉత్పత్తి చేస్తుంటాయి. అవన్నీ అలా నిత్యం మండుతూ గ్లూకోజ్‌ను మండిస్తూ... ఆనంద్ రక్తప్రవాహంలోని గ్లూకోజ్ ఎప్పుడూ 4.4 గ్రాములకు మించి ఉండకుండా చూస్తుంటాయి. ఒకవేళ నాలోని ‘ఐలెట్’ కణాలు అకస్మాత్తుగా మెరుపుసమ్మె చేశాయనుకోండి. అప్పుడు ఆనంద్‌లోకి గ్లూకోజ్‌కు బదులు మిగతా కణాలు ఈ మంటలు కొనసాగేలా చూడటం కోసం వేరే ఇంధనాలను మండిస్తుంటాయి. దాంతో ఆనంద్‌లోని కొవ్వులు మండిపోతాయి. అతడిలోని ప్రోటీన్లు కండరాలకు అందకుండానే భస్మం అయిపోతాయి. దాంతో ఆనంద్ ఒక బతికి ఉన్న శవంలా మిగిలిపోతాడు. ఎప్పుడూ ఆకలీ... దాహం అంటూ అల్లాడతాడు. చక్కెర మండదు. దాంతో మూత్రంలో చక్కెర పోతుంటుంది. ఒక్కోసారి అలా బయటకు పోయే చక్కెర నాలుగు కిలోల వరకు ఉంటుంది. అలాంటి కండిషన్‌నే డయాబెటిస్ అంటారు. అది రాకుండా పాంక్రియాస్‌నైన నేను కాపాడుతుంటాను.
కప్‌బోర్డ్ లాంటి కాలేయం
నాలోని ఇన్సులిన్ అనేది ఆనంద్ కాలేయాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంటుంది. నిజానికి ఆనంద్ కాలేయం ఒక కప్‌బోర్డులాంటిది. ఆనంద్‌కు అవసరమైన శక్తి ఉత్పత్తి అయ్యాక మిగతా గ్లూకోజ్‌ను అతడు కాలేయం అనే కప్‌బోర్డులో దాచేస్తాడు. ఈ గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ అనే పదార్థంగా మార్చి కాలేయం తనలో దాచేసుకుంటుంది. మళ్లీ ఆనంద్‌కు ఎప్పుడైనా శక్తి అవసరమైనప్పుడు ఆ గ్లైకోజెన్‌ను బయటకు తీసి మళ్లీ గ్లూకోజ్‌గా మార్చుకొని వాడుకుంటూ ఉంటాడు. ఈ ప్రక్రియ నా సహాయంతో జరుగుతుంది. ఇది సరిగా జరగకపోతే... అప్పుడు ఆనంద్‌కు డయాబెటిస్ వచ్చిందని చెప్పవచ్చు.
నా వల్ల వచ్చే జబ్బు డయాబెటిసే అయినా దాన్ని కనుగొనడానికి ఫిజీషియన్లు కనుబొమలు ముడిపడేసేటంతగా ఇతర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒకవేళ నన్ను సరిచేయడానికి సర్జన్ నన్ను చేరదామన్నా... అతడికి అందనంత లోతుగా ఉంటాన్నేను. ఇతర అవయవాలు కొన్నింటిని కోయకుండా సర్జన్ నన్ను చేరడం అసాధ్యం అన్నంత సంక్లిష్టమైన లోతుల్లో ఉంటాన్నేను. ఒకప్పుడు నన్ను తొలగించడం అంటే... అది మృత్యువుకు చేరువకావడమే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒకవేళ నేను సరిగా పనిచేయకపోతే ఇన్సులిన్ బయట నుంచి ఇచ్చి ఆనంద్ ప్రాణాలను పదిలంగా కాపాడవచ్చు. నాకు ఏదైనా సమస్య వస్తే కడుపు పైభాగంలో నొప్పి వస్తుంది. పొట్ట పైభాగంలో పుట్టిన ఇది వీపు వైపు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. నా ఒక్క సమస్యలోనే కాదు... ఆనంద్‌కు అల్సర్, హార్ట్ ఎటాక్, గాల్‌బ్లాడర్ సమస్యలు, పేగుల్లో ఏదైనా అడ్డుపడటం (ఇంటస్టినల్ అబ్‌స్ట్రక్షన్)... ఇలా ఏం జరిగినా ఆనంద్ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఫిజీషియన్‌కు అది ఏ సమస్య అన్నది నిర్ధారణ చేయడానికి పైన చెప్పినట్లు కనుబొమలు ముడిపడతాయి. ఇక ఆ లక్షణాలతో పాటు నీళ్లవిరేచనాలు, బరువు తగ్గిపోవడం, అలసట, తీవ్రమైన నిస్సత్తువ, కామెర్లు వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి.
మరికొన్ని సమస్యలివే...
నాకు వచ్చే మరో సాధారణ సమస్య ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’. పాంక్రియాస్‌కు వచ్చే ఇన్ఫెక్షన్ పేరే పాంక్రియాటైటిస్. నా పక్క అవయవానికి శస్త్రచికిత్స చేసే సమయంలో నాకు చిన్న దెబ్బతగిలినా, చీరుకుపోయినా లేదా నాకు ఎవైనా పుండ్లు పడినా, నాలో ఇన్‌ఫ్లమేషన్ వచ్చినా. ఆనంద్ అదేపనిగా ఆల్కహాల్ తాగుతూ ఉన్నా నాకు ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’ రావచ్చు.
అన్నట్టు కాలేయంతో పాటు గాల్ బ్లాడర్ నుంచీ, నా నుంచి స్రావాలు చిన్న పేగుల్లోని భాగమైన డియోడినమ్‌లోకి వెళ్లడానికి ఒకే గొట్టం ఉంటుంది. ఈ పైప్ సరిగా పనిచేయక ప్లంబింగ్ సమస్య వచ్చిందనుకోండి. గాల్‌బ్లాడర్ నుంచి ముందుకు వెళ్లాల్సిన స్రావాలు వెనక్కు తన్నాయనుకోండి . అలా జరిగితే ఆ స్రావాలు నన్ను దెబ్బతీస్తాయి. ఒక్కోసారి ఆ పరిస్థితి నన్ను పూర్తిగా నాశనం చేయవచ్చు. ఒక్కోసారి గాల్‌స్టోన్ ఏర్పడి నేను స్రవించిన స్రావాలకు అడ్డుపవచ్చు. అలా జరిగితే నేను స్రవించే జీర్ణస్రావాలు వెనకకు వచ్చి నన్నే జీర్ణం చేసేయవచ్చు. ఇదే జరిగితే అనంద్‌కు అది సాధారణంగా అందరూ ఊహించేదానికంటే పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ అవుతుంది. క్యాన్సర్లలో అతి చెడ్డదైన రకాలలో ఒకటైన అడినోమా అనేది ఒక రకం క్యాన్సర్ ట్యూమర్. ఇది ఉంటే నాలోని ఇన్సులిన్ స్రావాలు ఎక్కువగా స్రవిస్తుండవచ్చు. ఇలా జరిగిందంటే ఒకసారి పరీక్ష చేయించుకోవాలి.
ఇప్పటివరకూ నేను ఎలాంటి ఇబ్బందీ తెచ్చిపెట్టకుండా ఆనంద్‌లో పనిచేశా. కాకపోతే ఇంతకుముందులా కాకుండా ఈమధ్య వయసుకు తగినట్లుగా ఆనంద్ కాస్త ఎక్కువ తింటే కడుపు ఉబ్బరం వంటివి వస్తున్నాయనుకోండి. అయితే ఇంతకు ముందులాగే ఆనంద్ అదేపనిగా ప్లేట్లు ప్లేట్లు లాగించడం, అదే పనిగా మద్యం గ్లాసులు గ్లాసులు తాగడం చేశాడనుకోండి. నేను ఇంతకు ముందులాగే చూసిచూడనట్టుగా పోయే రకాన్ని కాదు.
గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ అనే పదార్థంగా మార్చి కాలేయం తనలో దాచేసుకుంటుంది. ఎప్పుడైనా శక్తి అవసరమైనప్పుడు ఆ గ్లైకోజెన్‌ను బయటకు తీసి మళ్లీ గ్లూకోజ్‌గా మార్చుకొని శరీరం వాడుకుంటూ ఉంటుంది.. ఈ ప్రక్రియ ప్యాంక్రియాస్ సహాయంతో జరుగుతుంది. ఇది సరిగా జరగకపోతే... డయాబెటిస్ వచ్చిందని చెప్పవచ్చు.
నేను సరిగా పనిచేయకపోతే డయాబెటిస్ తప్పదు...
నేను జీర్ణప్రక్రియలో పనిచేయడం కంటే ఇన్సులిన్ స్రవించడం అన్నది నేను నిర్వహించే విధుల్లోకెల్లా ప్రత్యేకమైనది. ఒకవేళ నేను ఈ పనిని సక్రమంగా చేయలేకపోతే ఈ ప్రపంచంలోని అనేక మందిలా ఆనంద్ డయాబెటిస్ పాలవుతాడు.
డా॥డి.నాగేశ్వర్‌రెడ్డి
ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
గ్యాస్ట్రో ఎంటరాలజీ, హైదరాబాద్
టాగ్లు: నాలుక, కాలేయం, కిడ్నీలు, Tongue, Liver, Kidney, Pancreas


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list