MohanPublications Print Books Online store clik Here Devullu.com

వర్కవుట్స్‌తోనే బరువు తగ్గరు Wait LossMohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

వర్కవుట్స్‌తోనే బరువు తగ్గరు

Wait Loss


వర్కవుట్స్‌తోనే బరువు తగ్గరు!;---------
‘జాగింగ్‌ చేస్తున్నాం. జిమ్‌కు వెళుతున్నాం. క్యాలరీలు ఖర్చు చేస్తున్నాం. ఇంకేముంది? బరువుతగ్గడం ఖాయం’ అనుకుంటే మీరు పొరబడినట్లే! కేవలం ఎక్సర్‌సైజ్‌లు చేసినంత మాత్రనే బరువు తగ్గిపోరని ఒక తాజా అధ్యయనం తేల్చింది.
క్యాలరీలు ఎలా ఖర్చు అవుతాయి?
క్యాలరీలు అనేవి.. కేవలం వ్యాయామం ద్వారానే కాదు. శరీరంలోని అవయవాల పనితీరు వల్ల కూడా ఖర్చు అవుతాయి. ఆ విధంగా శరీరం ఒక విశిష్టమైన వ్యవస్థగా రూపొందించబడింది.
వ్యాయామంతో ఆరోగ్యం
అధికరక్తపోటు తగ్గుతుంది. గుండెపోటుకు కారణమయ్యే ట్రైకోగ్లిజరైడ్స్‌ నుంచి తప్పించుకోవచ్చు. టైప్‌2 డయాబెటిస్‌, హృద్రోగాల నుంచి బయటపడొచ్చు. డెమెన్షియా, అల్జీమర్స్‌ రిస్క్‌ కూడా తగ్గుతుంది. తగినంత క్యాలరీలను తీసుకుని బరువును నియంత్రించుకున్నప్పుడే పై ఫలితాలు ఉంటాయి.
రన్నింగ్‌, సైక్లింగ్‌ వంటి ఎక్సర్‌సైజ్‌ల వల్ల స్వల్ప బరువు మాత్రమే తగ్గుతారు. వ్యాయామం ద్వారా క్యాలరీలు ఖర్చు కావడానికి, అధిక బరువు తగ్గడానికి సంబంధం లేదు.
ఎక్సర్‌సైజ్‌ ఒక్కటే సరిపోదు
కేవలం వ్యాయామం వల్ల మాత్రమే అధిక బరువు తగ్గరు.
ఎక్సర్‌సైజ్‌ చేస్తున్నంతసేపూ క్యాలరీలు తగ్గుతూ ఉండవు.
91 కిలోల బరువున్న ఒక వ్యక్తి రోజుకు గంట చొప్పున (వారంలో నాలుగురోజులు) నెలరోజులు రన్నింగ్‌ చేస్తే.. కేవలం 2.2 కిలోల బరువు మాత్రమే తగ్గుతాడు.
శక్తి ఎలా ఖర్చు అవుతుంది?
శక్తిని ఖర్చు పెట్టే ప్రక్రియలో 60 నుంచి 80 శాతం మన నియంత్రణలో ఉండదు అన్న విషయాన్ని గమనించాలి.
జీర్ణం కావడానికి 10 శాతం ఎనర్జీ ఖర్చు అవుతుంది.
ఫిజికల్‌ యాక్టివిటీ ద్వారా 10 నుంచి 30 శాతం ఎనర్జీ ఖర్చు అవుతుంది.
మరి, బరువు తగ్గాలంటే
వ్యాయామంతోపాటు ఆహారనియమావళి పాటించినప్పుడే బరువు తగ్గుతారు.
వారానికి ఒకసారి బరువును చెక్‌ చేసుకోవాలి. క్యాలరీలు పరిమితంగా తీసుకోవాలి.
అధిక కొవ్వు కలిగిన ఆహార ఉత్పత్తులను మానేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ప్రపంచమంత సమస్య స్థూలకాయం
1980 నుంచి స్థూలకాయం కేసులు రెట్టింపు సంఖ్యకు చేరాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 13 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నట్లు అంచనా.
మితిమీరి తిన్నప్పుడు మాత్రమే స్థూలకాయం పెరిగే అవకాశం ఉంది.
ఆహార పానీయ సంస్థల ఉత్పత్తులు అనారోగ్యానికి హేతువులు అవుతున్నాయి.

--------------------------LIKE US TO FOLLOW:---------------------

www.mohanpublications.com

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list