MohanPublications Print Books Online store clik Here Devullu.com

దుర్ముఖి నామ సంవత్సర నవనాయకుల పలితాలు

దుర్ముఖి నామ సంవత్సర నవనాయకుల

పలితాలు


దుర్ముఖి నామ సంవత్సర నవనాయకుల పలితాలు.
దుర్ముఖి నామ సంవత్సర నవ నాయకులలో ఏడుగురు శుభులు, ఇద్దరు పాపులు. చతుర్ధశ నాయక విభాగంలో 9 మంది శుభులు, 5 గురు అశుభులు. శుభాదిపత్యం వలన దేశం సుభిక్షంగా ఉండును. పంటలు బాగా పండుతాయి. రాజకీయాలలో స్త్రీల ప్రాబల్యం అధికం. శుభగ్రహ ఆదిపత్యం వచ్చిన బావాలు రక్షణ కలిగి ఉంటాయి. పాపగ్రహ ఆదిపత్యం ఉన్న బావాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
వర్షలగ్నం, జగల్లగ్న కుండలి ద్వారా దేశ భవిష్యత్, ప్రజల భవిష్యత్, వ్యవసాయ, రాజకీయ, వ్యాపార రంగాల భవిష్యత్, ప్రకృతి వైపరీత్యాలు, వర్షయోగాలు, ధరల హెచ్చుతగ్గులు పరిశీలించవచ్చును.
వర్ష లగ్నం:- ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి ప్రవేశించే సమయంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్ధితి గతులను బట్టి వర్ష లగ్న కుండలిని సాధిస్తారు. దృక్ సిద్దాంత రీత్యా అమావాస్య మధ్యాన్నం వరకు ఉండి చైత్ర శుక్ల పాడ్యమి రేవతి నక్షత్రం తృతీయ చరణం నందు వర్ష లగ్నం సింహా లగ్నం అయినది. ధన, లాభాధిపతి అయిన బుధుడు నవమంలో ఉండి తృతీయ స్ధానం పైన దృష్టి కలిగి ఉండుట. తృతీయ, దశమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉండి ధన స్ధానంపైన దృష్టి కలిగి ఉండుట. చతుర్ధ, నవమాధిపతి కుజుడు చతుర్ధ స్ధానం నందు శనితో కలసి ఉండి సప్తమ, దశమ, లాభ స్ధానం పైన దృష్టి కలిగి ఉండుట. పంచమ, అష్టమాధిపతి గురువు లగ్నం నందు రాహువుతో కలసి ఉండుట. షష్టమ, సపమాదిపతి శని చతుర్ధంలో కుజుడితో కలసి ఉండి షష్టమ, దశమ, లగ్నాల పైనా దృష్టి కలిగి ఉంటుంది. లగ్నాధిపతి రవి, వ్యయాధిపతి చంద్రుడు అష్టమంలో ఉండటం జరిగింది.
జగల్లగ్న కుండలి:-
ప్రతి సంవత్సరం సూర్యుడు అశ్వనీ నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించిన సమయంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్ధితి గతులను బట్టి జగల్లగ్న కుండలిని సాధిస్తారు. దృక్ సిద్దాంత రీత్యా చైత్ర శుక్ల సప్తమి పునర్వసు నక్షత్రం ప్రధమ చరణం నందు జగల్లగ్న కుండలి వృశ్చిక లగ్నం అయినది. వృశ్చిక లగ్నంలో శుక్రుడు, కుజుడు ఉండటం. పంచమంలో శుక్రుడు ఉచ్చ స్దితి కలిగి ఉండుట. షష్టంలో రవి, బుధులు, అష్టమంలో చంద్రుడు, దశమంలో గురు రాహువులు కలగి ఉండటం జరిగింది.
సంవత్సరానికి అధిపతులుగా రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అంటూ 9 మంది నాయకులను నిర్ణయిస్తారు.
రాజు:-
చైత్ర శుక్ల పాడ్యమి ఏ వారమో ఆ వారాధిపతిని ఆ సంవత్సరానికి రాజుగా నిర్ణయించాలి. దుర్ముఖి నామ సంవత్సరానికి రాజు శుక్రుడు అయినాడు కావున గోవులు సంపూర్ణంగా పాలిచ్చును. సర్వత్రా వర్షములు బాగా కురిసి పాడి పంటలు బాగా పండును. ఉన్నత విద్యలలోనూ, ఉద్యోగాలలోనూ, పరిపాలనలో స్త్రీలు ప్రముఖ పాత్ర వహిస్తారు. పరిపాలన బాగుండును. భార్యా భర్తలు సౌఖ్యంగా ఉంటారు.
మంత్రి:-
సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన వారాధిపతి మంత్రి అవుతాడు. మేష సంక్రమణం బుధవారం జరుగుటచే బుధుడు మంత్రి అయినాడు కావున పరిపాలన విషయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. నాయకుల మధ్య నిందారోపణలు ఉంటాయి. పారిశ్రామిక, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతాయి.
సేనాధిపతి:-
సూర్యుడు సింహారాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు సేనాధిపతి అవుతాడు. సింహా సంక్రమణం బుధవారం జరుగుటచే బుధుడు సేనాధిపతి అయినాడు. మేఘాలు గాలికి ఎగరగొట్టబడి అరుదుగా వర్షిస్తాయి. పంటలు బాగా పండుతాయి. భార్యా భర్తలు సౌఖ్యంగా ఉంటారు. స్త్రీలపైన అఘాయిత్యాలు జరుగును. శత్రువులను రక్షణ శాఖ సమర్ధవంతంగా ఎదుర్కోనగలదు.
సస్యాధిపతి:-
సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు సస్యాధిపతి అవుతాడు. కర్కాటక సంక్రమణం శనివారం జరుగుటచే శని సస్యాధిపతి అవుతాడు. పంటలు మధ్యస్తంగా పండుతాయి. కొర్రలు, ఉలవలు, శెనగలు, మినుములు, పెసలు, నువ్వులు విస్తారంగా పండుతాయి. నల్లధాన్యాలు, నల్ల భూములు విశేషంగా ఫలిస్తాయి.
ధాన్యాధిపతి:-
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు ధాన్యాధిపతి అవుతాడు. ధనస్సు సంక్రమణం శుక్రవారం జరుగుటచే శుక్రుడు ధాన్యాధిపతి అవుతాడు. వర్షాలు సకాలంలో బాగా కురుస్తాయి. అన్నీ ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. ప్రజలు ఆరోగ్యం బాగుంటుంది.
అర్ఘాధిపతి (అర్ఘాధిపతి అంటే ధరలకు అధిపతి) :-
సూర్యుడు మిధునరాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు అర్ఘాధిపతి అవుతాడు. మిధున సంక్రమణం బుధవారం జరుగుటచే బుధుడు అర్ఘాధిపతి అవుతాడు. బంగారం, వెండి, ప్లాస్టిక్, చింతపండు, నూనెలు ధరలు అధికంగా ఉంటాయి. అపర ధాన్యాలు అధికంగా పండుటచే ధరలు అందుబాటులో ఉంటాయి.
మేఘాధిపతి:-
సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు మేఘాధిపతి అవుతాడు. సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి బుధవారం ప్రవేశించుట చేత బుధుడు మేఘాధిపతి అవుతాడు. పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. ఈదురు గాలుల ప్రభావంతో కొన్ని చోట్ల పంట నష్టం జరుగుతుంది.
రసాధిపతి:-
సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు రసాధిపతి అవుతాడు. తులా సంక్రమణం సోమవారం జరుగుటచే చంద్రుడు రసాధిపతి అవుతాడు. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఖర్జూరాలు, తేనె, పాల పధార్ధాలు, పంచదార, చెరకు ధరలు అధికంగా ఉండును.
నీరసాధిపతి:-
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు నీరసాధిపతి అవుతాడు. మకర సంక్రమణం శనివారం జరుగుటచే శని నీరశాధిపతి అవుతాడు. బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు దుర్లభంగా ఉంటూ ఇనుము, తగరం నూనె మొదలుగునవి వృద్ధి చెందుతాయి.


LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list