MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ విష్ణు మహాపురాణం, Sri Vishnu Maha Puranam

శ్రీ విష్ణు మహాపురాణం
Sri Vishnu Maha Puranam


శ్రీ విష్ణు మహాపురాణం (వచనం)300 pages
Sri Vishnu Mahapuranam Vachanam
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
FREE DOWNLOAD
________👇_________

పురాణ వాఙ్మయము పరమార్థ దృష్టి ప్రధానమైన భారతీయ ధర్మదృష్టికి ఆలంబనము. ఐహిక ఆముష్మిక సుఖాలలో, సంపన్నులుగాచేసే ధర్మాలను ప్రతిపాదించటంలో శ్రుతు (వేదము)లతో బాటు పురాణాలకు ప్రామాణ్యం ఉన్నది. బదరికారణ్యంలో గల ప్రాచీన విద్యాపీఠానికి కులపతి అయిన వేదవ్యాసుడు అష్టాదశ మహాపురాణాలను, ఉపపురాణాలను శిష్యులకు బోధించాడు. ఆ అష్టాదశ పురాణాలలోను శ్రీ విష్ణుమహాపురాణం మూడవది. పురాణపురుషుని యొక్క కుడిభుజంతో పోల్చబడింది ఈ పురాణం. విష్ణుపురాణం ప్రసక్తి యజుర్వేదంలో కనిపిస్తున్నది. అంటే వేదకాలంనాటికే ఈ పురాణం వర్థిల్లింది అని భావించవచ్చు.
శ్రీ విష్ణు మహాపురాణం ఆరు అంశాల(విభాగాల)తో ఆరువేల నాలుగువందల పన్నెండు శ్లోకాలలో చెప్పబడిన, విష్ణుమహత్మ్య ప్రతిపాదకమైన విశిష్టపురాణం. శ్రీ విష్ణు ప్రాథమ్యాన్ని, విష్ణుభక్తి స్వరూప వైవిధ్యాన్ని, దాని వైశిష్ట్యాన్ని ప్రతిపాదించేది ఈ పురాణం. త్రిమత ప్రస్థాన ఆచార్యులు శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీమదానంద తీర్థులు తమ తమ భాష్యాది రచనలలో ఈ పురాణాన్ని ప్రామాణికంగా గ్రహించటమే దీని ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. 

LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list