MohanPublications Print Books Online store clik Here Devullu.com

రత్నత్రయి, RATNATRAYI

రత్నత్రయి
 RATNATRAYI

RATNATRAYI
తులసి వనంలో తనకు లభించిన గోదాదేవికి పెంపుడు తండ్రియై ఆమెను పత్నిగా సమర్పించడంవలన శ్రీ రంగనాదునికే సాక్షాత్ మామగారైన భట్తనాదుల రచన తిరుప్పల్లాండు.పాండ్య రాజసభలో విష్ణ పారమ్య స్టాపన చేసినప్పుడు స్వామి సంతోషంతోగరుడవాహనా రూడుడై వేంచేయగా ఆయనకు దృష్టి దోషం తగులకుండ విష్ణుచిత్తులు చేసిన మంగళాశాసనమే పండ్రెండు పాశురాలు తిరుప్పల్లాండు.కావ్య సౌందర్యం,భవ్యకల్పన,భక్త్యావేశం గుబాళించే ఈ తిరుప్పల్లాండు సకల దివ్య దేశాలలో నిత్యానుసంధనంలో ఉన్న మహనీయ రచన .
భట్తనాదుల పెంపుడు కుమార్తె గోదాదేవికి శూడికొడుత్త నాచియార్ అని పేరు.ఈవిడే ఆముక్తమాల్యద.శ్రీకృష్ణునికలయిక అభిలషించి వ్రేపల్లెలో గోపికల కాత్యాయని వ్రతం సల్పినట్టుగా ఈమె శ్రీ రంగనాదుని పతిగా వరించి నోము నోచారు.
ముప్పది పాశురాలు రచన తిరుప్పావై.
జ్ఞానభక్తీ వైరాగ్య శిఖామణి తొండరడిప్పోడి ఆళ్వార్ రచించిన రంగనాదుని మేలుకొలుపు తిరుపల్లియెళుచ్చి.ఇది పడి పాశురాల ప్రభంధం.
పైన మూడు ప్రభంధములు ప్రతి వైష్ణవ దేవాలయములలో ప్రతిరోజూ అనుసంధానం జరుగుతుంది.
వీటి అర్ధం తెలుసుకునేందుకు రత్నత్రయి
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
FREE DOWNLOAD


LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list