గంగాజలం గురించి ఆసక్తికరమైన అంశాలు
గంగాజలం గురించి ఆసక్తికరమైన అంశాలు
భారతదేశంలో గంగాజలానికి చాలా ప్రాధాన్యత ఉంది. గంగాజలం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనదని మన భారతీయులు నమ్ముతారు. అందుకే ఏ ఒక్క పూజ గంగాజలం లేకుండా పూర్తికాదు. గంగాజలంలో మునిగినా, గంగా జలం సేవించినా.. ఎంతో పుణ్యమని విశ్వసిస్తారు. గంగాజలం ఇంతటి ప్రాధాన్యత పొందడానికి కారణమేంటి ? గంగాజలం ఎందుకు అంత పవిత్రమైనది ? శివునికి కొన్ని పవిత్రమైన చిహ్నాలు..! గంగాజలంలో శుద్ధిచేసే తత్వం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. పూజాకార్యక్రమాల్లో గంగాజలం ఉపయోగిస్తే.. ఎలాంటి దోషం ఉన్నా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. పరమ పవిత్రమైన గంగానదిలో మునిగితే.. స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. అందుకే గంగానదిపై అనేక అధ్యయనాలు కూడా జరిగాయి. ఈ అధ్యయనాలు గంగాజలం గురించి ఏం చెబుతున్నాయి.
హిమాలయాల్లో పుట్టిన జలం గంగ. గంగ ప్రవహించే చాలా ప్రాంతం భూబాగంలో రేడియం ఉండటం వల్ల ఈ నీటిలో చైతన్యం కలిగించే శక్తి నిర్లిప్తమై ఉంటుంది. కలరా , అంటువ్యాధుల వంటి క్రిములు గంగాజలంలో బ్రతకలేవు. గంగాజలం సమస్త వ్యాదులను పోగొట్టే అమృత ప్రవాహమని చరకమహర్షి చెప్పారు.మన పాపాలన్నీ కడగడానికి స్వర్గలోకం నుంచి వచ్చిన జలముగా గంగాజలానికి ప్రత్యేకత ఉంది.
భగీరథుడు గంగాజలాన్ని భూమ్మీదకు తీసుకొచ్చాడని పౌరాణిక కథలు వివరిస్తున్నాయి. హిమాలయాల్లోని గౌముఖ్ దగ్గర గంగా నది ముందుగా భగీరథగా ఉద్భవించింది. తర్వాత 75 చదరపు మైళ్లు ఇది ప్రవహించి.. దేవప్రయాగలోని అలకనందలో కలిసిపోతుంది. ఇలా కలవడం వల్ల ఈ నదికి గంగానదిగా పేరు వచ్చింది.
గంగానదుల్లోకి కలిసే మరో పెద్ద నది.. కైలాస పర్వతానికి అతి దగ్గరగా ఉన్న ఘాగరా నది గంగానదిలో కలుస్తుంది. అలాగే కాట్మాండుకి దగ్గరలోని ఘాంటాక్ అనేది పవిత్ర నది. ఈ రెండు నదుల పవిత్ర జలం గంగానదిలో కలవడం వల్ల.. ఈ నీళ్లు చాలా పవిత్రమయ్యాయని ఆధ్మాత్మిక వేత్తలు చెబుతారు.
గంగాజలం హిందువులు విశ్వసించే బ్రహ్మ, విష్ణు, శివులతో కలిసినదిగా చెబుతారు. బ్రహ్మ గంగాజలాన్ని త్రివిక్రముని అవతారంలో మహావిష్ణువు పాదాలు కడగడానికి ఉపయోగించారట. భూమ్మీద ప్రశాంతత కల్పించడానికి తన తల నుంచి గంగాజలాన్ని భూమ్మీదకు పంపడానికి శివుడు అంగీకరించాడు. అందుకే శివుడికి గంగాధరుడు అనే పేరు ఉంది.
మహర్షి వేదవ్యాసుడు గంగా జలాన్ని దుష్టశక్తుల నిర్మూలను ఉపయోగించారట. గంగానదిలో మునగడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. గంగానదిలో చనిపోయిన వాళ్ల అస్థికలు కలపడం వల్ల వాళ్లకు విముక్తి లభిస్తుంది. గంగాజలంలో అనేక గుణాలున్నాయి. ఇందులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల పూజలకు ఉపయోగిస్తారు.
గంగాజలంపై జరిగిన అధ్యయనాల్లో అత్యంత ఆసక్తికర విషయం తేలింది. గంగాజలంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. అందుకే ఈ నీటిని సేవించడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే జలాలలో గంగాజాలం ఒకటి. పవిత్రమైన లేదా మతపరమైన కార్యక్రమాలకు పూర్వ కాలం నుండి గంగా జలాన్ని వాడడం హిందువుల సంప్రదాయం. పుట్టినప్పుడు గాని, మరణించినప్పుడు గాని గంగాజలాన్ని వారిపై చల్లితే వారు పవిత్రులవుతారని హిందువుల నమ్మకం. అందుకే ఎవరైనా గంగా నదిని సందర్శించినప్పుడు తమతో పాటు కొంత గంగాజలాన్ని తెచ్చుకుంటారు. ఈ పవిత్రమైన నీటిని ఇళ్ళలో చల్లితే ఇంటితో పాటు అందులో నివసించే వారు కూడా పరిశుద్ధమవుతారని భావిస్తారు.
అతి పవిత్రంగా భావించే గంగాజాలం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు:
1. గంగాజలాన్ని తీసుకోవడం వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రధానం లభిస్తుందని పురాణాలు అంటున్నాయి.
2. గంగాజలం ఎన్ని రోజులైనా చెడిపోకుండా ఉంటాయి.
3. చనిపోయేటప్పుడు గంగాజలాన్ని పుచ్చుకుంటే పాప విముక్తి చెంది ఆత్మ స్వర్గానికి వెళ్తుందని హిందువుల విశ్వాసం.
4. పూర్వకాలం నుండి గంగాజలాన్ని అమృత జాలంగా భావిస్తున్నారు.
5. గంగానది మొత్తం పడవు 2525 కి.మీ.
6. ప్రపంచంలో అతి పెద్ద నదులలో గంగానది మూడవది.
7. హిమాలయ పర్వతాల నుండి మొదలై ఎన్నో ప్రదేశాలను తాకుతూ ప్రవహించే గంగానది ఎన్నో అమూల్యమైన మూలికలను అడవులలోని చెట్ల ద్వారా గ్రహిస్తుంది.
8. ప్రపంచ జనాభాలో 8.5 శాతం మందికి గంగాజాలం నిత్యం అందుతుంది.
9. కేవలం మనుషులు మాత్రమే కాదు... దేవుళ్ళు (దేవతలు) సైతం గంగాజలాన్ని పవిత్ర జలంగా భావిస్తారు.
10. గంగానదిలో పవిత్ర స్నానం ఆచరిచడం వల్ల పాపాలు తొలగిపోయి కొత్త జీవితం ప్రారంభమవుతుందని ప్రగాడ నమ్మకం.
11. గంగానదిలో పవిత్ర స్నానం ఆచరిచడం వల్ల అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల పితృదేవతలు తరిస్తారట.
12. మరణించిన తరువాత అస్తికలను గంగానదిలో కలపడం హిందువుల సంప్రదాయం. ఇలా చేయడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు.
13. పుట్టిన పిల్లలపై గంగాజలాన్ని చల్లటం వల్ల వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.
LIKE US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565