MohanPublications Print Books Online store clik Here Devullu.com

గుడి-గంటలు, Gudhi Gantallu

గుడి-గంటలు
Gudhi Gantallu

++++++++++గుడి-గంటలు+++++++++
దైవాన్ని ప్రార్థించేందుకు, భజించేందుకు ఆలయాలకు వెళ్తాం. కొన్ని క్షేత్రాల దర్శనం కోసం దూరప్రాంతాలకీ వెళ్తాం. ఆలయాలు మనిషికి, భగవంతుడికి మధ్య సంబంధం పెంచే పవిత్ర స్థలాలు. ఆ నిర్మాణాలన్నీ సామాన్యమైనవి కావు. అవి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యాలకు స్థావరాలు.
వేదకాలం నుంచి మానవుడు క్షేత్ర నిర్మాణాలను దైవత్వానికి ప్రతీకలుగా మలచుకొన్నాడు. దేవాలయాలు కళాత్మకమైనవి. అంతకు మించి, అవి విజ్ఞాన కేంద్రాలు. ఆలయాల్లోని మూర్తుల పరిమాణాలు, వాటి దిశ, పవిత్రత, ప్రవేశ ద్వారం, ధ్వజస్తంభం... వెరసి- ఆ నిర్మాణాలు అభివృద్ధి చెందిన విజ్ఞానాన్ని ప్రతిబింబించే శిల్పశాస్త్రానికి నిలువెత్తు దృష్టాంతాలు.
ఒకప్పటి పాలకులు, పాలితులు ఆలయ నిర్మాణాలకు అవసరమయ్యే ధనానికి పరిమితులు ఏర్పరచుకోలేదు. పదిహేను ఎకరాల్లో వేల గజాల నడవా, స్తంభాల నిర్మాణం, అతిపెద్ద తూర్పు రాజగోపురంతో సహా రామనాథస్వామి (రామేశ్వరం) ఆలయ నిర్మాణానికి నలభై సంవత్సరాల కాలం పట్టింది. ఆలయ నిర్మాణం, ఆగమశాస్త్ర విధివిధానాలకు రైభ్యుడు అనే మహర్షి ఆద్యుడని చెబుతారు. పురాతన కాలంనాటి దేవాలయ నిర్మాణాలను శోధించగలిగితే, ఆ శాస్త్రజ్ఞుల(రుషుల) ప్రజ్ఞ, అద్భుతాలను సృజించగల శక్తి అవగతమవుతాయి. దేవాలయంలోని మూలవిరాట్టును పంచభూతాలు ఆవహించి ఉంటాయని, అందువల్లనే ఆ మూలమూర్తి నుంచి శక్తి ప్రసరిస్తూ ఉంటుందని చెబుతారు.
ఆలయాలన్నీ శక్తి కేంద్రాలే. భారతీయ సంప్రదాయ పూర్వ వైభవాలను పరిశీలిస్తే, దేవాలయ నిర్మాణ నేపథ్యం తాలూకు విశిష్టత అవగతమవుతుంది. అక్కడికి చేరుకోగానే ఆధ్యాత్మిక ఆనందానుభూతి కలుగుతుంది. ఫలితంగా మానవ శరీరంలోని మణిపూరక చక్రం, మూలాధార చక్రం చైతన్యవంతమవుతాయని అనుభవజ్ఞులు చెబుతారు.
పూర్వం భూమి అయస్కాంత తరంగాలు చాలా తీవ్రంగా ఉన్న స్థలంలో దేవాలయ నిర్మాణం చేపట్టేవారు. ఆ తరంగాలను ఆనాటి రుషులు, వేద విజ్ఞానులు ఎలా గుర్తించేవారో తెలియదు. తరంగాలు ఎక్కువగా ఉన్న స్థలంలో, అనుకూల శక్తి పుష్కలంగా లభిస్తుంది. మూల విరాట్టును అక్కడే ఏర్పాటు చేసేవారు. ఆ స్థాపన తరవాతే ఆలయ నిర్మాణం జరిగేది.
గర్భగుడి మూడు వైపులా మూసి ఉండటం గమని స్తుంటాం. ఈ ఏర్పాటు వల్ల, మూల విరాట్టులో అన్ని శక్తులూ కేంద్రీకరించి ఉంటాయి. అక్కడ వెలిగించే జ్యోతులు ఉష్ణశక్తికి కారణమవుతాయి. గుళ్ళొ గంటల ధ్వని, స్వరయుక్తమైన మంత్రోచ్ఛాటన వల్ల అర్చకులతో పాటు దర్శనానికి వెళ్ళినవారూ భక్తితో పరవశులవుతారు. శరీరంలో సవ్యమైన రక్తప్రసరణ కారణంగా ఉద్వేగం, ఆర్తి, ఆర్ద్రత కలిగి కనుకొలకుల్లో నీరు చేరుతుంది. పరిమళాలు వెదజల్లే పూలతో అర్చన, కర్పూర హారతుల వల్ల మనిషిలో అలౌకిక భావనలు కలుగుతాయి. ప్రదోషకాలం (సాయంకాలం)లో ఆలయాలను దర్శిస్తే, ఆ శక్తులన్నీ ఏకమై భావాతీత అనుభూతి కలుగుతుందని శంకర భగవత్పాదులు రాసిన ‘ఉపదేశ సహస్రి’ తెలియజెబుతోంది.
ఆలయాల్లో తులసి, పచ్చకర్పూరం మిశ్రమం చేసిన తీర్థాన్ని సేవించడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయంటారు. పాలు, పెరుగు కలిపిన పంచామృతం రోజూ సేవిస్తే వూబకాయం రాదని చరకుడు పేర్కొన్నాడు. ఆ పంచామృతాన్ని దేవాలయాల్లో తీర్థంగా ఇస్తారు.
ఆలయాల్లోని గంటల వెనక సైతం వైజ్ఞానిక సంపద ఉంది. తగరం, సీసం, రాగి, తుత్తునాగం, కంచు లోహాల సమ్మేళనంతో గంటల్ని తయారుచేస్తారు. వాటిని మోగించడం వల్ల వెలువడే శబ్ద తరంగాలు మనిషి కుడి ఎడమల మేధస్సులో సమంగా వినిపిస్తూ సృజన శక్తిని చైతన్యపరుస్తాయి. గుడిగంటల శబ్దతరంగాల వల్ల మనిషి శరీరంలోని అనాహత చక్రం చైతన్యవంతం అవుతుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయన్నది మరో నమ్మకం. మానవుడు, దైవం మధ్య అనుబంధాన్ని పెంచే ఆలయాలన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలే! - అప్పరుసు రమాకాంతరావు
+++++++గుడి గంటలు మ్రోగిన వేళ++++++++
దేవునికి హారతినిచ్చే సమయంలో గంట కొడుతుంటారు. దేవాలయాల్లోనూ, ఇంట్లో పూజ సమయంలోనూ గంట కొట్టడం మనం చూస్తుంటాం. సృష్టిలో పలురకాల దుష్టశక్తులుంటాయి. ఇవన్నీ మనం దైవ ప్రార్థన ద్వారా అందుకునే పూజాఫలాన్ని అందుకునే సమయంలో ఆటంకాలు కలిగిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వాటిని పారదోలేందుకు ఘంటనాదం చేస్తుంటాం. అయితే గుడిలోనూ, ఇంట్లోనూ పూజలకు వాడే గంటలు వేర్వేరుగా వుంటాయి. దేవాలయంలో పెద్ద గంటలు వుంటాయి. అదే ఇంటిలో పూజా సమయంలో మనం ఒక చేతితో చిన్న గంటను మోగించి మరో చేతితో హారతి ఇస్తాం. గంట శబ్ధం మంగళకరం, శుభకరం. అందుకనే మన సంప్రదాయంలో గంటకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. తిరుమలలో శాత్తుమొర... తదితర సమయాల్లో గంటలు మోగిస్తారు. ఈ శబ్దాలను బట్టి భక్తులు దర్శనాలకు సిద్ధమవుతుంటారు.
సాధారణంగా పూజ ప్రారంభంలో ఈ క్రింది మంత్రం చెబుతూ ఘంటానాదం చేస్తాము.
శ్లో!! ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం !
......కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనం !!
అంటే, ఘంటానాదం వలన దేవతలకు స్వాగతం తెలుపుతూ రాక్షసులకు గమనం చెప్పడం.
అనగా మనం దేవతా మందిరం లోకి ప్రవేశించగానే, పై మంత్రం చెబ్తూ ఘంటానాదం చేయాలి.
ఇంకా....దేవతలకి అభిషేకం చేసే సమయంలో, యజ్ఞోపవీతం వేసే సమయంలో, ధూపం వేసే సమయంలో, హారతి నీరాజనం ఇచ్చే సమయంలో ఘంటానాదం చేయాలి !
కొంత మంది ' నైవేద్యం ' పెట్టె సమయంలో కూడా ఘంటానాదం చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే..
..
శ్లో!! ఘంటానాదం తధా వాద్యం నృత్యం గీతం తధైవచ !
.....నైవేద్య కాలే యః కుర్యాత్ రౌరవాద్ నరకం వ్రజేత్ !!
పై శ్లోకం ఆధారంగా నైవేద్య సమయంలో ఘంటానాదం, వాద్యము,నృత్యం చేయడము,పాట పాడటము ఇలాంటివి నైవేద్య సమయంలో కనుక చేస్తే ' రౌరవాది నరకం ' ప్రాప్తిస్తుంది.
కనుక నైవేద్యం సమయంలో ఘంటానాదం చేయరాదు.
( శ్రీ వైష్ణవ ఆగమ పద్ధతిలో వారు తప్పక ఘంటానాదం చేస్తారు పై వివరణ వారికి ఎంత మాత్రం సంబంధం లేదు. ఇందులో వాదనలకు తావులేదని మనవి )
ఆలయంలో దైవదర్శనం కోసం భగవంతున్ని అర్చించేటప్పుడు మనం గంటను మ్రోగిస్తుంటాం.గంటను మ్రోగించగా వచ్చే శబ్దానికే ఘంటానాదం అని పేరు. శబ్దం ధ్వని, నాదము అని రెండు విధాలు. ధ్వని అంటే ఒకసారి వినబడి ఆగిపోయేది, నాదం అంటే కొద్దికాలంపాటు అవిచ్ఛన్నంగా సాగే శబ్దం. నాద శబ్దంలో "న" అంటే ప్రాణమని, "ద" అంటే అగ్నియని, ప్రాణాగ్నుల కలయికనే నాదం అని అంటారు. నాదము కూడా "ఆహతనాదము" మరియు "అనాహత నాదము" అని రెండు రకాలు. ఆహతనాదము అంటే చెవికి శ్రావ్యంగా వినిపించి, అనందాన్నిరసానుభూతిని కిలిగించే శబ్దము. ఇక అనాహతనాదం అంటే చెవికి వినబడకుండా మానసికంగా సాధకులైన యోగులకు, మహాత్ములకు మాత్రమే వినిపించేది.
ఆలయంలో మొదలు గంటను మ్రోగించే దైవాన్ని దర్శిస్తాము. ఘంటానాదం నిత్య చైతన్య స్వరూపుడై, సకల చరాచర జగత్తుని పాలిస్తూ అనుక్షణం ఈ జగత్తును రక్షించే భగవంతుని నిద్రనుండి మేల్కొల్పడానికో లేక ఈ జగత్తంతా వ్యాపించి, అన్నింటా అంతర్యామిగా వుంటూ, అన్నీ తెలిసిన ఆ భగవానునికి మన రాకను గురించి ప్రత్యేకంగా తెలుపడానికో కాక ఒక పవిత్రమైన ఓంకార శబ్దాన్నిపుట్టించి పరిసరాలన్నీ పవిత్రం చేయడానికి మ్రోగిస్తున్నామని తెలుసుకోవాలి. భగవంతుని దర్శించే ముందు మనం బాహ్యంగానే కాకుండా అంతరంగంలో కూడా పరిశుద్ధంగా వుండాలి.
ఘంటానాదం వలన మనము ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొంది, మనస్సును భగవంతునిపైన లగ్నం చేయగలుతాము. అంటే ఘంటానాదం చంచలమైన మన మనస్సును దైవంపై కేంద్రీకృతమయ్యేందుకు ఉపకరిస్తుంది.
ఇక ఆలయాలయందు మహామంగళహారతుల సమయంలోను, మహానివేదన సమయంలోనూ, నీరాజనాన్ని అర్పించేటప్పుడు గంటతోపాటు ఇతర వాయిద్యాలను కూడా మ్రోగిస్తారు. ఈ వాయిద్యఘోష వలన ఇతర ధ్వనులు, భక్తుల అనవస మాటలు విడనాడి, ఏకాగ్రచిత్తులయి భగవంతునిపై మనస్సును పూర్తిగా లగ్నం చెయ్యగలరు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list