MohanPublications Print Books Online store clik Here Devullu.com

ధర్మం జయతి అధర్మం నాశయతి, Dharamam Jayanthi Adarmam Nasayathi

ధర్మం జయతి  అధర్మం నాశయతి, 
Dharamam Jayanthi Adarmam Nasayathi

లంకాధీశుడైన రావణుడు రాముడితో యుద్దం చేసి పరాజయుడై నేలకొరుగుతూ శ్రీరామునితో ఇలా అన్నాడు.
రామా ! నేను నీ కంటే శ్రేష్ఠుడను
ఎలా శ్రేష్ఠుడనో చెబుతాను.
నేను బ్రాహ్మణకులంలో పుట్టాను
నీవు క్షత్రియ వంశంలో పుట్టావు
నీకన్నా నేను వయస్సులోపెద్దవాడిని
నా విభావం నీకన్నా అధికము
నీ అంతఃపురం స్వర్ణమయం
నా లంకాపట్టణమంతా సువర్ణమయం
బలపరాక్రమాలలో నీకంటే గొప్పవాడిని
నీ రాజ్యంకంటే నా రాజ్యం పెద్దది
విద్య, తపస్సులలో నీ కన్నా గొప్పవాడిని
ఇంత శ్రేష్ఠమైన లక్షణములున్నా నేను
నీతో యుద్ధం చేసి పరాజయం పొందాను
దీనికి ఒక కారణం చెబుతాను
‘‘నీ సోదరుడు నీవెంట ఉన్నాడు
నా సోదరుడు నన్ను విడిచి వెళ్ళాడు.
రావణుడి చావుకి రాముడు కారణంకాదు అట్లయితే కోతిమూకెందుకు? రావణుడి చావుకి రావణుడే కారణం, మూర్ఖుడైన రావణుడు అది తెలుసుకోలేక పోవడంవల్లనే ప్రతి నాయకుడయ్యాడు.
‘‘రామో విగ్రహవాన్‌ ధర్మః’’ ‘‘యతో ధర్మ స్తతో జయః’’
ధర్మమే రాముడని కదా దీనియర్థము. ధర్మము ఎక్కడ వుంటుందో జయం అక్కడ వుంటుంది. ఈ వాక్యాలన్నది రాముడు కాదుకదా ? రాముడు తనని తాను పొగుడు కుంటాడా? ఋషులు పెద్దలు అన్నమాటలను నిజం చేశాడు. రాముడు నాయకుడయ్యాడు. విజయం సాధించాడు.
అన్నదమ్ములందూ కలసి వున్నంత మాత్రాన విజయం చేకూరదు. దుర్యోధనాదులు నూరుగురు కలిసే వున్నారు. ఏమయ్యారు? నశించిపోలేదా ? కలిసి వుంటే కొంతకాలం బలగంతో ఆధిపత్యాన్ని సాధించుకోవచ్చు నేమోగాని అంతిమంలో ధర్మమే విజయం సాధిస్తుంది. ఇక్కడ నీతి కలిసి వున్నంత మాత్రం చేత విజయంరాదు. ఇక్కడ రావణబ్రహ్మ లంకా రాజ్యానికి రాజు. ఒక రాక్షసజాతి బ్రాహ్మణుడు. యక్షజాతికి చెందిన కుబేరుణ్ణి ఓడించి తన రాజ్యాన్ని వశం చేసుకొని ఏలినందువల్ల రావణబ్రహ్మకాస్త రాజు అయ్యాడు లంకారాజ్యానికి. అసలు రామావతారంలో రామునికి కూడా తాను మహావిష్ణువన్న సంగతి తెలీయనే తెలియదు. ఒక సామాన్య మానవుడిగాను క్షత్రియ వంశజుడిగాను మాత్రమే తలచాడు. రావణుని అకృత్యాలకు అతడితో తలబడ్డాడు, వధించాడు. రాముడు దేవుడనుకుంటే రామాయణమే లేదు. అదే మాయ.
రావణునికి కూడా రాముడు విష్ణువని తెలియదు. రాముడనే విష్ణువుచేతిలో కనుక రావణుడు మరణిస్తే వచ్చేది మోక్షం. మరి శాపవశాత్తు మూడో జన్మలో శిశుపాలుడిగా పుట్టాలి కదా. అందుచేత ఇక్కడ రాముడు సామాన్య మానవుడే క్షత్రియుడే. రాముడు సామాన్య క్షత్రియుడు మానవుడే కనుక అతడి చేతిలో మరణించినా రావణుడికి మోక్షం రాలేదు. ద్వాపరంలో రాముడు కృష్ణునిగా ఉద్భవించాలి.
హిరణ్యాక్ష హిరణ్యకశిపులు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా పుట్టారు. ద్వాపర యుగంలో శిశుపాల దంత వక్త్రులుగా పుట్టాలి. ఈ మూడో జన్మలో వీరికి మోక్షం విష్ణుసాయుజ్యం, అదికదా ఆనాటి శాప విమోచనం.
అందుచేతే రావణుడు యుద్ధభూమిలో నేలకొరిగిపోతూ సామాన్య మానవుడైన రాముడుతో ఇలా అనడం తప్పుకాదు. ఇలా రావణుడు పలికేడంటే అతనికి పూర్వజన్మ జ్ఞానంలేదని అర్థమవుతోందికదా. ఆ పూర్వ జ్ఞానం ఇక్కడ అతడికి లేకపోవడం వల్లనే రామాయణం నిలిచింది. రాముడు దేవుడని తెలిస్తే ఇన్ని విషయాలలో శ్రేష్ఠుడైన రావణాసురుడు ఇటువంటి ప్రగల్భాలు పలుకుతాడా ? రాముడు నరుడని రామాయణము చదివితేనే రామాయణం అర్థమవుతుంది. పరమార్థమవుతుంది.
యుద్ధంలో నేను నీ ముందు ఓడిపోవడానికి ఒక కారణం
‘‘నీ తమ్ముడు నీ దగ్గర వున్నాడు
నా తమ్ముడు నన్ను వదలి వెళ్ళిపోయాడు.’’
అని కదా రావణుడు రాముడితో అన్నమాటలు.
ఇది సామాన్యుడైన రాముడితో రావణుడు అనతగ్గ మాటలే ఇంట గెలిచి రచ్చగెలు అన్నమాటలు మీరు వినలేదా ?
తోడబుట్టినవాడే తనని వదలి వెళ్ళిపోయాడంటే, రావణుని దగ్గర ధర్మంలేదని విభీషణుడికి తెలిసి వుండచ్చు. కాని తమ్ముడిగా తన ధర్మాన్ని నిలుపుకోలేదనే బాధ ఏమౌతుంది ? ఆ బాధను చెప్పుకోడంలో ఏ తప్పు ఉంటుంది?
ఇంటిగుట్టు లంకకు చేటు అయ్యింది. శరణుజొచ్చిన విభీషణుడితో స్నేహంవల్ల శ్రీరాముడి పని సులువయ్యిందికొంత అనడంలో కూడా ఏ పొరపాటులేదు. కాని విభీషణుడి వల్లనే రాముడు జయించాడు అంటే మాత్రం పొరపాటు.






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list