MohanPublications Print Books Online store clik Here Devullu.com

గోచారరీత్యా గ్రహాలకు శుభస్ధానాలు, Gocharitva Grahalaku Shubhastanalu

గోచారరీత్యా గ్రహాలకు శుభస్ధానాలు
 Gocharitva Grahalaku Shubhastanalu

గోచారరీత్యా గ్రహాలకు శుభస్ధానాలు
గ్రహాలూ నిత్యము చలనము కలిగి ఉంటాయి .స్థిరముగా ఒకదగ్గర ఉండవు . అలా చలనము కలుగుతూ వివిధ రాశులలో తమతమ కక్ష్యలలో భ్రమణము చెందుతూ ఉంటాయి . దీనినే గోచారము అంటారు .
జాతకులు జన్మించిన జన్మ రాశి ఆధారముగా గోచారము ద్వారా ఫలితములు తెలుసుకోవచ్చు .ఒకవేళ జన్మ రాశి తెలియనివారికి పేరును బట్టి నామ నక్షత్రముతెలుసుకొని నామ రాశిని తెలుసు కొని కొంతవరకు ఫలితములు తెలుసుకొన వచ్చును.
గ్రహ బలము ఎంత బాగున్ననూ , గోచారము అనుకూలముగా లేనిచో మానవులు శుభ ఫలితములను పొందజాలరు.గోచారములో గ్రహములు జన్మరాశినుండి వివిధ స్థానములలో ఉన్నప్పుడు ఫలితములు ఏవిధముగా కలుగ చేస్తాయి .
సూర్యుడు జన్మరాశి నుండి 3 6 10 11 స్థానములలోనూ
చంద్రుడు 1 3 6 7 10 11 స్థానములలోనూ
బుధుడు 2 4 6 8 10 11 స్థానములలోనూ
గురుడు 2 5 7 9 11 స్థానములలోనూ
శుక్రుడు 1 2 3 4 5 8 11 12 స్థానములలోనూ
కుజ శని రాహువు కేతువు లు 3 6 11 స్థానములలోనూ ఉన్నప్పుడు శుభ ఫలితములు కలుగ చేయుదురు .
గోచార రీత్యా జన్మ రాశి నుండి పన్నెండు రాశులలో నవగ్రహములు సంచరించేటపుడు కలుగు ఫలితాలు ఈ విధముగా ఉంటాయి .
సూర్యుడు: స్థానభ్రష్టం , భయం , సంపదా , మానభంగం , మహాద్భయం
శత్రు క్షయం , వ్యధా , రోగం , దుఃఖం ,సిద్ది , ధనాదనే
క్రమేణ జన్మ రాష్యాది కురుతేతే పద్మ భాంధవః
తాత్పర్యము : సూర్యుడు జన్మ రాశిలో సంచరించునపుడు స్థాన మార్పిడి , 2 వ రాశికి వచ్చినపుడు భయమును 3 సంపదను 4 మాన హానిని 5 విశేష భయమును 6 శత్రు నాశనం 7 దుఃఖము 8 రోగము 9 విచారమును 10 కార్య సిద్ధిని 11 ధన లాభమును 12 ధన వ్యయమును కల్గించును .
చంద్రుడు : అన్నవృద్ధిం, ధన క్షీణం , ద్రవ్య లాభం , మహాద్గతం
కార్యనాశంచ , విత్తంచ , ద్రవ్యలాభంచ .మృత్యుచః
నృపక్రోధం ,సుఖం , లాభం , ధనక్షీణంటు చంద్రమా
తాత్పర్యము : చంద్రుడు 12 రాశులలో సంచరించునపుడు 1 భోజన సౌఖ్యమును 2 ధన క్షయమును 3 ద్రవ్యలాభమును 4 విశేష రోగ భయమును 5 కార్య నాశనము 6 ధనరాబడిని 7 ద్రవ్య లాభమును 8 మరణ సమాన ఫలితములను 9 రాజ కోపమును 10 సౌఖ్యమును 11 లాభమును 12 ధన నష్టమును కలిగించు చున్నాడు .
కుజుడు : ఖేదం , దౌర్భాగ్యం , సౌభాగ్యే , రిపుపీడాం , రిపోర్భయం
అర్ధసిద్ధి ,మనర్ధంచ , శస్త్రభాదాం,ధనక్షయం
అశోకంచ, ధనం , క్రూర క్రమేణా కురుతే కుజః
తాత్పర్యము : కుజుడు ద్వాదశ రాశులలో చరించు చున్నప్పుడు 1 దుఃఖము 2 భాగ్య హాని 3 సౌభాగ్యము 4 శత్రువుల వలన భాధలు 5 శత్రు భయము 6 ద్రవ్య సిద్ది 7 కార్య హాని 8 శస్త్రభాద గాయములు ఏర్పడుట 9 ధన వ్యయము 10 దుఃఖ నాశనము 11 ధన యోగము 12 క్రూరత్వము ను కలుగ జేయును .
బుధుడు : బంధనం , హేమలాభంచ . రిపుపీడం , రిపుక్షయం
దారిద్ర్యం ,భూషణం , లాభం, మనసిద్దిం ,ధనక్షయం
ప్రమోదం, మోదసంహారం, బుదః కుర్యాత్క్రమాద్గతః
తాత్పర్యము: బుధుడు పన్నెండు రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము 3 శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును .
గురుడు : దేశ త్యాగం , విత్తం లాభం అనర్ధం ధన నాశనం
సంపద , క్లేశం , ఆరోగ్యం , ధన హానిం ,ధనాగమం
పీడనం లాభ నష్టంచా క్రమేణ కురుతే గురుః
తాత్పర్యము : గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము 3 కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .
శుక్రుడు : ఆరోగ్యం భూషణం లాభం రతించ ప్రియదర్శనం
మానహానిం మహాద్రోగం భూలాభం ధాన్యవర్ధనం
ప్రమోదంచ ధనంచైవ సంతోషం కురుతే భ్రుగు;
తాత్పర్యము : శుక్రుడు ద్వాదశ రాశులలో సంచరించేటప్పుడు 1 ఆరోగ్యము 2 అలంకారము 3 లాభము 4 రతిసౌఖ్యము 5 మిత్రదర్శనము 6 మానహాని 7 విశేషరోగము 8 భూలాభము 9 ధాన్యవృద్ధి 10 ప్రమోదము 11 ధనము 12 సంతోషముల ను కలుగ జేయును .
శని : విపత్తి హానిం సంపత్తి కుక్షిరోగం సుతక్షయం
లక్ష్మీకరం మహర్ధైన్యం మరణం దేహ శోషణం
బంధనం లాభ నష్టంచ క్రమేణ కురుతే శని:
తాత్పర్యము : శని పన్నెండు రాశులలో సంచారము చేయు నపుడు 1 ఆపదలను 2 హానిని 3 సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .
రాహు , కేతువులు : రాహోర్జన్మ గతో భయంచ కలహం సౌభాగ్య మాన
క్షయే ,విత్తభ్రంశం మహాత్శుఖే రిపుభయం చాష్టౌచ
చోరాద్భయం శత్రోర్వుద్ది ధనక్షయం శుభ ఫలం
భ్రుత్యప్యనాశం వ్యయేకుర్యాత్ తత్ఫలమేవ
కేతు రనిశం చేత్యాహు గార్గ్యాతయః
తాత్పర్యము : రాహు కేతు గ్రహములు జన్మరాశి నుండి పన్నెండు రాశులలో సంచరించు సమయమున 1 భయమును 2 కలహాలను 3 సౌభాగ్యమును 4 మానహానిని 5 ధన నష్టములను 6 మహా సుఖములను 7 శత్రువుల వలన భయమును 8 చొర భయమును 9 శత్రు వృద్ధిని 10 ధన క్షయమును 11 శుభ ఫలములను 12 భ్రుత్యునాశనమును కలిగించుదురు .



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list