ఇది ఆండ్రాయిడ్ బాస్
This is Android Boss
ఇది ఆండ్రాయిడ్ బాస్!
ఆండ్రాయిడ్ ఎప్పుడూ ప్రత్యేకతల మయమే.. అందరికీ సాధ్యం కాని పనులు చేస్తుంటుంది...అందుకే మన్ననలు పొందుతుంటుంది...అలాంటి కొన్ని ఆప్షన్లు, ఆప్‌లు ఇవిగో!స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ ఫోన్లదే హవా! దేశంలోని మొబైల్ వినియోగదారుల్లో ఎక్కువమంది ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లే వాడుతున్నారు. అందులోని కొన్ని ప్రత్యేక ఫీచర్లు, ఆప్‌లు వినియోగదారులను ఆకట్టుకోవడమే దీనికి కారణం. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ల్లో లేని కొన్ని ఆప్షన్లు, ఆప్‌లు ఆండ్రాయిడ్‌లో ఉన్నాయి. ‘ఇది ఆండ్రాయిడ్ బాస్’ అని చెప్పుకోగలిగే కొన్ని సౌలభ్యాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి!
డ్రూప్... కాల్
మీ స్నేహితునికి ఫోన్ చేస్తే బిజీ టోన్ వస్తోంది. ఫేస్‌బుక్‌లో మాట్లాడదామని ఓపెన్ చేస్తే ఆన్‌లైన్‌లో లేడు. వాట్సాప్‌లోనూ అదే పరిస్థితి. దీంతో అతనికి మెసేజ్ చేశారు. ఇలా ఏది చేయాలన్నా ఆయా ఆప్‌లు ఓపెన్ చేయాల్సిందే. అలా కాకుండా ఫోన్ నెంబరు క్లిక్ చేయగానే దాని కిందే మెసేజ్, వాట్సాప్, ఫేస్‌బుక్, హైక్... ఇలా సోషల్ నెట్‌వర్క్ ఆప్షన్లన్నీ వస్తే బాగుంటుంది కదా. Drupe ఆప్ ద్వారా ఇది కుదురుతుంది. ఈ ఆప్ ఇన్‌స్టాల్ చేయగానే కాంటాక్ట్ లిస్ట్‌లో పేర్లు కనిపిస్తాయి. తెరపై కుడివైపు కాల్, హైక్, మెసేజ్, మెయిల్, ఫేస్‌బుక్ మెసెంజర్ లాంటి ఆప్ ఐకాన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన కాంటాక్ట్‌ను డ్రాగ్ చేసి పక్కన కనిపించే ఐకాన్స్‌పై వేస్తే సరి. కాల్ ఐకాన్‌పై వేస్తే కాల్ వెళ్తుంది. మెసేజ్ ఐకాన్‌పై వేస్తే ఆ నెంబరుకు మెసేజ్ పంపించొచ్చన్నమాట.
* https:\\goo.gl\N2Ag2V
* https:\\goo.gl\N2Ag2V
ఒకే ఫోన్... రెండు ఆప్స్
డ్యూయల్ సిమ్ ఫోన్లలో రెండు సిమ్‌లు వేసుకుంటున్నాం. ఒక నెంబరు ఆఫీసు పనుల కోసమైతే, ఇంకోటి సొంత అవసరాల కోసం. ఈ రెండు నెంబర్లకు వాట్సాప్ వాడాలంటే కుదరని పని. కానీ అలా చేయడానికి కొన్ని ఆప్స్ సిద్ధంగా ఉన్నాయి. వాటితో వాట్సాప్ మాత్రమే కాదు... మీ మొబైల్‌లోని అన్ని ఆప్‌లను రెండుగా వాడుకోవచ్చు. అవే 2 Accounts, Parllel. వీటిని ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఏయే ఆప్‌లు రెండేసి కావాలో ఎంచుకునే ఆప్షన్ వస్తుంది. అలా ఎంచుకున్న ఆప్‌లన్నీ ఆ ఆప్‌కు సంబంధించిన ఫోల్డర్‌లో చేరుతాయి. ఇక ఆ ఆప్‌లను రెండో ఐడీలతో వాడుకోవచ్చు.
* https:\\goo.gl\YOx7GN
* https:\\goo.gl\cP6O5Z
* https:\\goo.gl\YOx7GN
* https:\\goo.gl\cP6O5Z
మెసేజ్‌ల్లో మెరుపులు
మీ ఫోన్ కొచ్చే మెసేజ్‌లు ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే ఎలా? కొంచెం మార్చి చూడాలనుకుంటే దానికీ ఆప్స్ సిద్ధం. దీనికి మీరు చేయాల్సిందల్లా Textra, Chomp SMS, True Messenger లాంటి ఆప్‌లు డౌన్‌లోడ్ చేసుకొండి. వీటి ద్వారా మీ ఫోన్ మెసెంజర్ కనిపించే తీరు మారుతుంది. బ్యాక్‌గ్రౌండ్, పేర్లు కనిపించే విధానం కొత్తగా ఉంటాయి. ట్రూ మెసెంజర్ ఆప్... ట్రూ కాలర్ ఆప్‌లా పని చేస్తుంది. అపరిచిత వ్యక్తుల నుంచి మెసేజ్ వస్తే ట్రూకాలర్ మాదిరిగా ఆ నంబరు ఎవరిదనే పేరు కూడా వస్తుంది. దీంతో ఫేస్‌బుక్ మెసెంజర్‌ను కూడా ఫోన్ మెసేజ్‌లు చూసుకోవడానికి వాడుకోవచ్చు.
* https:\\goo.gl\Iq1Jl8
* https:\\goo.gl\X9MyoK
* https:\\goo.gl\Iq1Jl8
* https:\\goo.gl\X9MyoK
ఒక్క టచ్‌లో
5 అంగుళాలు, 5.5 అంగుళాల తెరలున్న స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నాం. అయితే అన్నివేళలా ఈ పెద్ద స్క్రీన్‌లను వినియోగించడం కష్టం. ఒకే వేలుతో మొత్తం మెనూ, సెట్టింగులను కంట్రోల్ చేసే ఆప్ ఉంటే బాగుంటుందనిపించిందా? అలాంటివారి కోసం CM swife, Easytouch లాంటి ఆప్‌లున్నాయి. వీటి ద్వారా ఒకే టచ్‌తో ఫోన్ మెనూ, సెట్టింగ్స్ యాక్సెస్ చేయొచ్చు. CM swife ఇన్‌స్టాల్ చేసుకున్నాక మీ ఫోన్ తాకే తెర అడుగున ఎడమ, కుడివైపు మూల నుంచి చేత్తో పైకి స్వైప్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. అందులో సెట్టింగ్స్, ఆప్స్, రీసెంట్స్ లాంటి ఆప్షన్లు ఉంటాయి. ‘ఈజీ టచ్’ ఆప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే తెరపై గుండ్రని నల్లటి బాల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సెట్టింగ్స్, తరచుగా వాడే ఆప్స్ కనిపిస్తాయి.
* https:\\goo.gl\z6h28h
* https:\\goo.gl\ROs6nc
* https:\\goo.gl\z6h28h
* https:\\goo.gl\ROs6nc
సందేశాల బ్యాకప్
బ్యాంకు మెసేజ్‌లు, ఆఫీసు మెసేజ్‌లు, ఫ్రెండ్స్ పంపే సందేశాలు... ఇలా మీ ఫోన్‌లో వందల కొద్ది మెసేజ్‌లు నిండిపోయాయి. ఇవన్నీ అలా ఫోన్‌లో ఉంచితే ఏదైనా మెసేజ్ అవసరమైనప్పుడు వెతకడం కష్టమవుతుంది. అలా కాకుండా వీటన్నింటినీ మీ కంప్యూటర్‌లో చూసుకుంటే బాగుంటుంది కదా. దీని కోసం మీరు SMS Backup and Restore ఆప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. ఎంచక్కా దీని ద్వారా మీ ఫోన్‌లోని మెసేజ్‌లు, కాల్ రిజిస్టర్‌ను బ్యాకప్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆ ఫైల్‌ను మెయిల్ ద్వారా పంపించుకోవచ్చు. ఫోన్లు మార్చే సమయంలో కాల్స్, మెసేజ్‌లను ఈ ఆప్ ద్వారా ఒకఫోన్ నుంచి మరో ఫోనుకు సులభంగా తీసుకోవచ్చు. ఫోను పోయిన పక్షంలోనూ ఈ ఆప్ ద్వారా బ్యాక్ అప్ చేసుకున్న కాల్స్, మెసేజ్‌ల వివరాలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి.
* https:\\goo.gl\qg3wLA
* https:\\goo.gl\qg3wLA
బ్యాటరీపై కన్ను
మీ ఫోన్ బ్యాటరీ ఆరోగ్యం ఎలా ఉంది... ఛార్జర్ ఎలా పని చేస్తోంది? వీటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో Ampere ఆప్ ఉండాల్సిందే. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే... మీ ఫోన్ మోడల్, ఓఎస్, బ్యాటరీ సామర్థ్యం లాంటి వివరాలు చూపిస్తుంది. ఫోను బ్యాటరీ వోల్టేజీ, వినియోగం ఎలా ఉందనే వివరాలూ తెలుస్తాయి. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఈ ఆప్ ఓపెన్ చేస్తే... మీ ఛార్జర్ ఎలా పని చేస్తుంది, దాని ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలూ తెలుస్తాయి. ఇలా ఈ ఆప్ ద్వారా బ్యాటరీ, ఛార్జర్‌పై ఓ కన్నేయొచ్చు.
* https:\\goo.gl\UyPC0Zs
* https:\\goo.gl\UyPC0Zs
LIKE
US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565