మీకు ఎపుడైనా ఒక వాహనం వివరాలు తెలుసుకోవాలంటే
To Know Vehicles Details
మీకు ఎపుడైనా
ఒక వాహనం
వివరాలు తెలుసుకోవాలంటే
ఒక వాహనం
వివరాలు తెలుసుకోవాలంటే
నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఇక కుర్రకారు విషయం చెప్పనవసరం లేదు.... పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతున్న దొంగలా వాహనాలను అతి వేగంగా నడిపిస్తారు. వీరి వల్ల కేవలం వారికే కాదు... పక్క వాళ్లకి కూడా ప్రాణాపాయం ఉంటుందన్న సంగతి మరిచిపోయి... వాహనాలను ఇష్టం వచ్చినట్టు నడిపిస్తారు. ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా.. ర్యాష్డ్రైవింగ్ చేసే వారిపై కంప్లైంట్ చేయడానికి మన భారత ప్రభుత్వం ఓ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది.
భారత ప్రధానమంత్రి ప్రవేశ పెట్టిన డిజిటల్ ఇండియాలో ఇది ఒక భాగం. వెహికల్ ఐడెంటిఫికేషన్ ఎస్ఎమ్ఎస్ సిస్టం - ద్వారా ఏ వాహన యజమాని పేరైనా యిట్టె తెలుసుకోవచ్చు. VAHAN అని టైప్ చేసి.. స్పేస్ (space) ఇచ్చి వాహనం యొక్క నెంబర్ ను (Vehicle Number) జత చేసి... 7738299899 నెంబర్ కు ఎస్ఎమ్ఎస్ (SMS) చేయాలి. వాహన యజమాని యొక్క వివరాలతో మీకు రిప్లై వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, ఆక్సిడెంట్ లకు పాల్పడిన వారిపై కంప్లైంట్ చేయడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది.
LIKE
US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565