MohanPublications Print Books Online store clik Here Devullu.com

విద్యార్థులకు వరం విద్యాలక్ష్మి పథకం, Benifits of students by vidhyalakshmi padhakam

విద్యార్థులకు వరం విద్యాలక్ష్మి పథకం
Benifits of students by vidhyalakshmi padhakam

విద్యార్థులకు వరం విద్యాలక్ష్మి పథకం
ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులను పొందలేకపోతున్న పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన విద్యా రుణాలను పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈఏడాది ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విద్యాలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు 42 రకాల విద్యా రుణాలను అందిస్తారు.
కేంద్ర ప్రభుత్వ పుణ్యమంటూ ఇక నుంచి విద్యారుణం కావాల్సిన అభ్యర్థి తమ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో విద్యాలక్ష్మి పోర్టల్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే చాలు.. అభ్యర్థికి అవసరమైన రుణం పొందే అవకాశం ఇంటి తలుపు తడుతుంది. విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా విద్యా రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేయడం వల్ల అర్హులైన విద్యార్థులు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండానే సులువుగా రుణం పొందగలుగుతారు. ఉన్నత విద్యకు సంబంధించి రుణం కావాలనుకునే విద్యార్థి ఆన్‌లైన్‌లో https://www.vidyalakshmi.co.in/Students/పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే మనం ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి రుణం వస్తుంది?
ఏ బ్యాంకులో ఇస్తారనే విషయాలను ఎస్‌ఎంఎస్‌, ఫోన్‌కాల్‌ ద్వారా సమాచారం అందిస్తారు. రుణం మంజూరయ్యే వరకు ప్రతి విషయాన్ని పోర్టల్‌ ద్వారా అభ్యర్థి సెల్‌ఫోన్‌కు సమాచారం ఇస్తారు. బ్యాంకుల్లో రుణం తీసుకొని ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. రుణాలిచ్చే బ్యాంకులు...స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, విజయాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులు రుణాలు ఇస్తాయి..
ఈ సమాచారాన్ని మీ మిత్రుల కోసం SHARE చేయగలరు

LIKE US TO FOLLOW:---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list