MohanPublications Print Books Online store clik Here Devullu.com

నీలి తెరల మధ్య చిక్కుకున్న మనిషి | Blue Light Effect on Eye | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu

నీలి తెరల మధ్య  చిక్కుకున్న మనిషి | Blue Light Effect on Eye | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Retina Eye effect eye syndromes Mobile PC Tablet Blue light life generations

నీలి తెరల మధ్య 
చిక్కుకున్న మనిషి! 



‘తెర’ జీవితాలంటే సాధారణంగా సినిమా నటులవే అనుకుంటుంటాం గానీ వాస్తవంలో ఇప్పుడు మనందరివీ ‘తెర’ జీవితాలే! లేస్తూనే మొబైల్‌ ముఖం చూస్తాం. ఇంట్లో, ఆఫీసులో కంప్యూటర్ల ముందే పని. కాస్త సమ యం చిక్కితే టీవీకి అతుక్కుపోతాం. ప్రయాణాల్లోనూ మొబైళ్లు, ట్యాబ్లెట్లే. ఇలా మన జీవితంలో అత్యధిక భాగం ఏదో ఒక ‘తెర’ ముందే గడిచి పోతోంది. మన జీవితాల్లో ఈ ‘స్క్రీన్‌ టైమ్‌’ అన్నది సగటున రోజులో 6 గంటలకు పైగా ఉంటోంది. ఈ స్క్రీన్‌లన్నింటి నుంచీ వెలువడే నీలి కాంతి (బ్లూ లైట్‌) మన కంటికీ, ఒంటికీ కూడా సమస్యలు తెచ్చిపెడుతోందని పరిశోధనా రంగం గుర్తించింది. దీన్నుంచి తప్పించు కోవటం తక్షణావసరమనీ హెచ్చరి స్తోంది. మరి మనల్ని పూర్తిగా ఆవరించిన ఈ ‘నీలి విప్లవాన్ని’ మనం ఎదుర్కొనేదెలా? భయపెడుతున్న నీలి కాంతి!
ఒకప్పుడు పగలంతా పనులు చేసుకునే వాళ్లం.
పొద్దుగూకుతూనే పడుకునేవాళ్లం. అంతే!
అది సహజమైన జీవనశైలి. సూర్యుడొక్కడే మనకు కనిపించే కాంతి. మనుషులూ ఆయనతోనే లేచేవారు, ఆయనతో పాటే విశ్రమించేవాళ్లు. మనిషీ ప్రకృతీ మమేకమై నడిచిన రోజులవి. కానీ ఇప్పుడు రాత్రికి అర్థం మారిపోయింది. పగటికంటే రాత్రి మిరుమిట్లు ఎక్కువై పోతున్నాయి. రాత్రి జీవితం పగటికంటే సుదీర్ఘమైనదిగా కూడా తయారవుతోంది. దీన్ని మన ఘనతగా చెప్పుకొంటున్నాంగానీ దీనికి మనం చెల్లిస్తున్న మూల్యం కూడా ఎక్కువేనని వైద్యరంగం ఇప్పుడిప్పుడే స్పష్టంగా గుర్తిస్తోంది. రాత్రి కృత్రిమ కాంతులు చూసి మన మెదడు భ్రమపడుతోంది. ఏది శ్రమించే సమయమో, ఏది విశ్రమించే సమయమో తెలియక గందరగోళపడుతోంది. ఇది ఒక సమస్య అయితే .. మన చుట్టూ ఉన్న కృత్రిమ కాంతిలో ఉండే ‘బ్లూ లైట్‌’ వల్ల కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయని పరిశోధనా రంగం గట్టిగా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మనం రోజంతా మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ట్యాబ్లెట్ల వంటి డిజిటల్‌ తెరల ముందర గడుపుతుండటం వల్ల తీవ్ర అనర్ధాలు సంప్రాప్తిస్తున్నాయి. దీన్ని గర్తించి జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అని హార్వర్డ్‌తో సహా ప్రపంచ పరిశోధకులంతా నొక్కి చెబుతున్నారు.

నీలికాంతి ప్రభావం మన మీద
ఎలా ఉంటుందో తెలుసా?
* ప్రధానంగా ఈ నీలి కాంతి మన నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్‌ అనే హార్మోను ఉత్పత్తిని, విడుదలను ప్రభావితం చేస్తుంది. దీంతో ‘నిద్ర-మెలకువ’లను నియంత్రించే సర్కాడియన్‌ రిథమ్‌ అస్తవ్యస్తమవుతోంది. ఇతర హార్మోన్లూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
* నీలికాంతి నేరుగా కంటిలోని రెటీనా పొర మీద పడుతుంది. ఫలితంగా రెటీనా పొర బలహీనపడి చూపు సమస్యలు తలెత్తుతున్నాయి.
మన కనుగుడ్డులో వెనక భాగాన ఉండే ‘రెటీనా’ పొర అత్యంత సున్నితమైనది. దీనికి ప్రమాదకరమైన కాంతి సోకటం మంచిదికాదు. అతినీలలోహిత కిరణాల వంటివాటిని మన కను గుడ్డు మీద ముందుండే తెల్లటి కార్నియా పొర, దాని వెనక ఉండే కటకం (లెన్సు) చాలా వరకూ అడ్డుకుంటాయి. కానీ అవి బ్లూలైట్‌ను మాత్రం ఆపలేవు. దీంతో బ్లూ లైట్‌ నేరుగా కంటిలోకి వెళ్లి సున్నితమైన రెటీనా మీద పడి, దాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలం ఈ కాంతికి ప్రభావితమైతే చూపు కన్ను, చూపు యంత్రాంగం మొత్తం అలసిపోతోంది. చూపు మందగిస్తుంది. దీన్నే ‘డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌’ అంటారు. డిజిటల్‌ స్క్రీన్లు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా, స్పష్టంగా ఉండేందుకు ఎల్‌ఈడీ తెరలను (బ్యాక్‌ లిట్‌ ఎల్‌ఈడీ) ఎక్కువగా వాడుతున్నారు. వీటి నుంచి చాలా శక్తిమంతమైన నీలికాంతి వెలువడుతుంది. ఇప్పుడు స్క్రీన్లు అన్నింటా దీన్నే విరివిగా వాడుతుండటం వల్ల మన కంటికి ఈ బ్లూలైట్‌ తాకిడి మరింత ఎక్కువైపోతోంది. రోజూ డిజిటల్‌ పరికరాలు వాడుతున్న వారిలో దాదాపు 70% మంది దీనికి సంబంధించిన ఏదో లక్షణాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు మనల్ని ఆకట్టుకుంటున్న ఎల్‌ఈడీ వంటి మిరుమిట్లు గొల్పుతున్న లైట్లన్నింటి నుంచీ కూడా ఈ నీలికాంతి వెలువడుతుంటుంది.
ఏమిటీ నీలి కాంతి?
కాంతి అంటే మనం ఏమో అనుకుంటాంగానీ.. వాస్తవానికి అది విద్యుదయస్కాంత అణువుల ప్రవాహం! ఈ అణు ప్రవాహం తరంగాల రూపంలో ఉంటుంది. అలాగే మనం మనం కంటికి కనిపించేదే కాంతి అనుకుంటాంగానీ.. వాస్తవానికి కాంతిని విశ్లేషించి చూస్తే దానిలో మన కంటికి కనిపించేది కొంత భాగమే. గామా కిరణాలు, ఎక్స్‌-కిరణాలు, అతినీల లోహిత (యూవీ) కిరణాలు, పరారుణ (ఇన్‌ఫ్రారెడ్‌) కిరణాలు.. ఇలా కాంతిలో చాలా ఉంటాయి కానీ అవన్నీ మన కంటికి కనిపించవు. కాంతి వర్ణ పటంలో మన కంటికి కనిపించేది.. ఇంద్రధనస్సులో ఉన్నట్టు ఏడు రంగులుండే (ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం మొ।।) భాగం మాత్రమే. ఈ కనిపించే రంగులన్నింటిలోకీ చాలా ప్రత్యేకమైనది నీలి రంగు. ఇది అత్యధిక శక్తిని విడుదల చేస్తుంది. అందుకే మన మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. ఈ ‘బ్లూ లైట్‌’ వెలుతురు అంతటా ఉంటుంది. సూర్యకాంతిలో కూడా ఉంటుంది. కాకపోతే పగటిపూట ఈ కాంతి వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. అది మనలో చురుకుదనాన్ని పెంచుతుంది. స్పందనలను, భావోద్వేగాలను మెరుగుపరుస్తుంది. ఇంత వరకూ మంచిదే. కానీ ఈ బ్లూలైట్‌ మన సెల్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ నోట్‌బుక్స్‌ వంటి డిజిటల్‌ తెరల నుంచి, అలాగే ఎల్‌ఈడీ, ఫ్లోరసెంట్‌ లైట్ల నుంచి కూడా విడుదల అవుతుంటుంది. కావటానికి సూర్యకాంతితో పోలిస్తే వీటి నుంచి వెలువడేది తక్కువే. కానీ మనం రోజంతా అధిక సమయం ఈ స్క్రీన్ల మధ్యే, వీటికి దగ్గరగా గడుపుతుండటం, రాత్రిపూట కూడా వీటితోనే సాంగత్యం చేస్తుండటం వల్ల ఇప్పుడు ఈ నీలి కాంతే ప్రమాదకరంగా పరిణమిస్తోంది.
కానీ ఈ పరికరాలు వాడకుండా నేటి మన జీవితాన్ని ఊహించటం కూడా కష్టం. అందుకే ఇప్పుడు ‘బ్లూ లైట్‌’ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఎక్కువ అవుతోంది.
తెరల మధ్యే తెల్లవారుతోంది!
ఉదయం లేస్తూనే మొబైల్‌ చూడటంతో మొదలయ్యే మన జీవితం రోజంతా డిజిటల్‌ స్క్రీన్ల మధ్యే గడిచిపోతోంది. ఇలా రోజులో అధిక భాగం ఏదో ఒక డిజిటల్‌ స్క్రీన్‌ను, చాలా దగ్గర నుంచి చూస్తుండటం క్రమేపీ పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతోందని, దీనివల్ల ఒకప్పటి కంటే ఇప్పుడు కంటి వ్యాధులు, నిద్ర సమస్యలు పెరిగిపోతున్నాయని పరిశోధకులు గుర్తించారు.
ప్రపంచ వ్యాప్తంగా 60% జనాభా రోజులో 6 గంటల కంటే ఎక్కువ సమయమే డిజిటల్‌ తెరల ముందు గడుపుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కుర్రకారు సగటున రోజులో 1012 గంటలకు పైగా ఈ స్క్రీన్స్‌తో గడుపుతున్నారు. రోజూ డిజిటల్‌ పరికరాలు వాడుతున్న వారిలో 70% మంది దీనికి సంబంధించిన ఏదో లక్షణాలతో సతమత మవుతున్నారు.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list