జ్యేష్ఠులకిప్పుడు పెళ్లి కూడదా?
వధువు, వరుడు జ్యేష్ఠ సంతానం (ఇంట మొదట పుట్టిన వారు) అయితే, వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం తగదు. దీనినే త్రిజ్యేష్ఠం అంటారు. సాధారణంగా భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి మనసే ప్రధానం. జ్యోతిష సంప్రదాయంలో చంద్రుడిని మనఃకారకుడిగా అభివర్ణించారు. వివాహ ముహూర్త నిర్ణయంలో చంద్రబలం తప్పనిసరిగా చూడాలని కూడా చెబుతారు. జ్యేష్ఠ మాసంలో.. పౌర్ణమి నాటి చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కూడి ఉంటాడు. వధూవరులిద్దరూ జ్యేష్ఠ సంతానమైతే... జ్యేష్ఠమాసంలో నిర్ణయించే ముహూర్తానికి చంద్రబలం చాలదని జ్యోతిశ్శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అందుకే జ్యేష్ఠ మాసంలో ఇంట్లో జ్యేష్ఠుల వివాహం అంత ప్రశస్త్యం కాదని నిర్ణయించారు.
Hey there,
ReplyDeleteNice blog
check out our blogs
buy youtube subscribers USA