MohanPublications Print Books Online store clik Here Devullu.com

వారాణాసిలో ఈ ప్రాంతాలను చూడకపోతే | Varanasi | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu


వారాణాసిలో ఈ ప్రాంతాలను చూడకపోతే | Varanasi | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu varanasi kasi kasi viswanath kasi visweswara kasi lingam kasi yatra kasi tour Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


వారాణాసిలో ఈ ప్రాంతాలను చూడకపోతే

హిందూ పురాణాల ప్రకారం వారణాసి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. హిందూ మంతంలో చెప్పబడే ఏడు పవిత్ర నగరాల్లో కాశీగా కూడా పిలువబడే ఈ వారణాసి అత్యంత పవిత్రమైనది పేర్కొంటారు. అంతేకాకుండా ఆ పరమశివుడు ఇక్కడే నిత్యం కొలువై ఉంటాడని కూడా చెబుతారు. ఇక్కడ మరణిస్తే నేరుగా స్వర్గానికి వెలుతారని హిందువులు నమ్ముతారు. అందువల్లే చాలా మంది తమ జీవిత చరమాంకంలో ఈ పట్టణంలో గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులు, కవులు, కళాకారులు, సాధువులు ఇక్కడకు ఎక్కువగా చేరుకొని భగవంతుడి ధ్యానంలో శేష జీవితాన్ని గడుపుతుంటారు. మరికొంతమంది ఇక్కడ నివశించడానికి వీలుకాకపోతే కనీసం తాము చనిపోయిన తర్వాతనైనా తమ అస్తికలను ఇక్కడి గంగానదిలో కలపాలని తద్వారా మోక్షం కలుగుతుందని నమ్ముతారు. ఇక జలప్రళయం కూడా ఏమి చేయలేదని వారణాసికి పేరు. జల ప్రళయంలో ఈ పట్టణాన్ని ఆ పరమశివుడు తన త్రిశూలంతో ఎత్తి పట్టుకొంటాడని చెబుతారు. అందువల్లే ఇక్కడ మానవాళి ఎన్నో యుగాల నుంచి నివశిస్తోందని చెబుతారు.
ఈ పుణ్యక్షేత్రంలో అనేక చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. అయితే చాలా మంది అక్కడి విశ్వనాథ మందిరాన్న మాత్రమే సందర్శిస్తుంటారు. ఇలాంటి వారి కోసం అక్కడ ఉన్న అతి ముఖ్య పర్యాటక స్థలాల గురించి మీకు అందిస్తున్నాం. అక్కడికి వెళ్లినప్పుడు తప్పక వీటిని సందర్శించండి. రోడ్డు, రైలు, వాయు మార్గంలో వారణాసికి చేరుకోవచ్చు. ఈ వారణాసికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్టు ఉంది. ఇక్కడికి దేశంలోని అనేక ప్రాంతల నుంచి విమానాలు నడుస్తాయి. 
అస్సీ ఘాట్ 
అస్సీ ఘాట్ వారణాసిలో దక్షిణ దిశగా ఈ అస్సీ ఘాట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న పెద్ద లింగం మనలను ఇట్టే ఆకర్షిస్తుంది. భారతీయ సంస్క`తి, సంప్రదాయాలను తమ కెమారాలో బంధించాలనుకొనేవారికి ఈ ప్రాంతం అత్యంత అనువైనది. ముఖ్యంగా సాయంకాలం ఇక్కడ ఇచ్చే గంగాహారతిని చూడటానికి ఎక్కవ మంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు.
దశ్వమేథ ఘాట్ 
వారనాసిలో అత్యంత పవిత్రమైన ఘాట్ గా ఈ దశ్వమేథ ఘాట్ కు పేరుంది. పురాణాలను అనుసరించి బ్రహ్మదేవుడు తన 10 గుర్రాలను ఇక్కడ ఓ యాగం చేస్తూ బలి ఇచ్చినట్లు చెబుతారు. అందువల్లే ఈ ఘాట్ కు దశ్వమేఘ ఘాట్ అని అంటారు. సాయంత్రం పూట ఇక్కడ ఇచ్చే గంగాహారతికి అగ్ని పూజ అని కూడా పేరు. దశ్వమేథ ఘాట్
మణికర్ణికా ఘాట్
వారణాసిలో మణికర్ణికా ఘట్ ను అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భక్తులు భావిస్తారు. ఇక్కడే చనిపోయిన వారి అస్తికలను గంగానదిలో కలుపుతుంటారు. ఇక్కడ రాత్రి పూట గంగానదిలో విడిచే దీపాలు ఆ ప్రాంతం అందాలను రెట్టింపు చేస్తాయి. అంతేకాకుండా సూర్యాస్తమయం ఇక్కడ చూడటానికి బాగుంటుంది.
కాశీ విశ్వనాథ దేవాలయం
కాశీ విశ్వనాథ దేవాలయాన్ని ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భావిస్తారు. వారణాసిలో ఎక్కువ మంది వెళ్లే దేవాలయాల్లో ఈ విశ్వనాథ దేవాలయం మొదటి స్థానంలో ఉంటుంది. తెల్లవారుజాము 3 గంటల నుంచి 11 గంటల వరకూ, అదే విధంగా మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ, అటు పై గంట విరామం తర్వాత అంటే తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకూ దేవాలయాన్ని భక్తుల కోసం తెరిచి ఉంచుతారు.
తులసీ మానస్ దేవాలయం
తులసీదాస్ రామాయణాన్ని హింది భాషలో రామచరిత మానస్ రూపంలో ఇక్కడే రాసాడని చెబుతారు. ఈ దేవాలయాన్ని బిర్లా కుటుంబం 1964లో నిర్మించింది. మార్బల్ తో నర్మించిన ఈ దేవాలయం గోడలమే రామాయనానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను మనం చూడవచ్చు.
దుర్గా దేవి దేవాలయం
ఈ దుర్గా దేవాలయాన్నే మంకీ టెంపుల్ అని కూడా అంటారు. ఈ దేవాలయంలోని మూలవిరాట్టు అయిన దుర్గాదేవి స్వయంభువుగా వెలిసిందని నమ్ముతారు. ఈ దేవాలయాన్ని 18 వశతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ కోతులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల దీనిని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు.
గ్యాన్ వాపీ వాల్ 
కాశీ విశ్వనాథ దేవాలయం గోడకు ఆనుకొనే ఈ గ్యాన్ వాపీ మసీదు ఉంటుంది. ఇక్కడ ఉన్న ఓ గోడను గ్యాన్ వాపీ వాల్ అంటారు. ఈ మసీదును ఔరంగజేబు నిర్మించాడు. ఇండో పర్షియన్ శైలిలో ఈ గోడ చూడ ముచ్చటగా ఉంటుంది. ఇక్కడ శివలింగం చూడటానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
రామ్ నగర్ మ్యూజియం 
తులసీ ఘాట్ కు ఎదురుగానే ఈ రామనగర్ కోట ఉంటుంది. ఈ కోటలోపలే మ్యూజియం కూడా. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వస్తువులు, ఆభరణాలను మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు. ముఖ్యంగా ఏనుగు దంతాలతో తయారుచేసిన పాత్రలు, అలంకార వస్తులువులు ఇక్కడ చాలా ఆకట్టు కొంటాయి.
చూనార్ కోట
వారణాసికి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఈ చూనార్ కోట ఉంటుంది. ఈ కోట మొత్తం ఇండో పర్షియన్ వాస్తును అనుసరించి నిర్మించారు. గోపురాలు చాలా అకట్టు కొంటాయి. దీనిని బాబర్ నిర్మించినట్లు చెబుతారు. చరిత్ర పై ఆసక్తి ఉన్నవారు ఇక్కడకు ఎక్కువగా వెలుతుంటారు.
సార్నాథ్
వారణాసికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సార్నాథ్ ప్రముఖ బౌద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బుద్దుడు మొదటిసారిగా ఈ సార్నాథ్ లోనే మొదటి ఉపన్యాసాన్ని ఇచ్చినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్నటు వంటి స్తూపాలు, మ్యూజియం, అశోక స్థంబం, విహారాలు, మనలను బౌద్ధ, బుద్ధిని జీవన శైలిని తెలుసుకోవలన్న ఆసక్తిని పెంపొందిస్తాయి.

1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list