ఆ మాటలు ఆలకించకుంటే..
ముక్కు, చెవులు కోసి తనను అవమానించిన రామలక్ష్మణులపై పగ తీర్చుకోవాలనుకుంది శూర్పణక. అన్న రావణాసురుడి దగ్గరికి వెళ్లింది. ‘రాముడి భార్య సీత మహా సౌందర్యవతి. నీకు మాత్రమే తగినది. ఎలాగైనా సరే.. ఆమెను నీ దానిని చేసుకో!’ అన్నది. రావణుడు ఎంతగానో ఆనందించాడు. అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్న మారీచుడి దగ్గరికి వెళ్లాడు. సీతను అపహరించడానికి అతడి సాయం కోరాడు.
రావణుడి మాటలు విన్న మారీచుడికి నోరు ఎండిపోయింది. ‘ఎవరయ్యా? నీకు ఈ సలహా ఇచ్చింది. ఆ సీతాదేవి సౌశీల్యాన్ని గురించి, రామచంద్రుడి పరాక్రమాన్ని గురించి నీకు తెలిసినట్లుగా లేదే!’ అంటూ వారి గురించి వివరంగా చెప్పాడు. రావణుడు కోపంతో ఊగిపోయాడు. ‘నా మాట వినకపోతే చంపేస్తా’ అని బెదిరించాడు.
అప్పుడు మారీచుడు..
‘‘సులభాః పురుషా
రాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్య చ పథ్యస్య
వక్తా శ్రోతా చ దుర్లభః’’
అంటాడు. ‘రావణా! మనకిష్టమైన మాటలనూ, మనం మెచ్చుకొనే మాటలనూ చెప్పేవాళ్లు ఎంతమందైనా సులభంగా దొరుకుతారు. ఆ మాట మనకు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అనేది వారికి అనవసరం. కానీ మనకు ఇష్టాన్ని కలిగించికపోయినా.. మేలు చేసే మాటను చెప్పే వాళ్లు, చెప్పినా వినేవాళ్లు అన్ని చోట్లా దొరకరు. నీ ప్రయత్నాన్ని మానుకో!’ అన్నాడు.
మారీచుడు చెప్పిన ఈ మాట అక్ష్యర సత్యం. ఈ విధంగా మనకు హితాన్ని చెప్పేవారు తటస్థపడినట్లయితే వారి మాటను శిరసా వహించడం మంచిది. ఈ విషయంలో రెండో ఆలోచనకు తావు ఇవ్వొద్దు.
- డా. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565