MohanPublications Print Books Online store clik Here Devullu.com

MOHAN PUBLICATIONS Price List

అర్ధరాత్రి ఆకలేస్తే? MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

                        అర్ధరాత్రి ఆకలేస్తే?
 దువుల వేళ ప్రాజెక్టు రిపోర్టులూ, ఉద్యోగమన్నాక ప్రత్యేక అసైన్‌మెంట్లూ, అవి రెండూలేకపోతే ఏదో ఒక మంచి సినిమా.. కారణం ఏదైనాకానీ మనం అర్ధరాత్రిపూట మేల్కొని ఉండటం తప్పడంలేదు. అలాంటప్పుడు ఆకలేస్తే ఏదో ఒకటి తినడం మామూలే. కానీ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆహారం ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. జీర్ణశక్తి అత్యంత తక్కువగా ఉండే సమయం అది. కాబట్టి కెలొరీలూ, నూనెలూ, కొవ్వులూ తక్కువుండే ఆహారాన్ని ఎంచుకోవాలి. మచ్చుకివి చూడండి..


పెరుగు: ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయిందులో. జీర్ణశక్తికి దోహదపడే ప్రొ-బయోటిక్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయికాబట్టి ఏ సమస్యా ఉండదు. కెలొరీల సమస్యేలేదు. చల్లదనం వల్ల కాస్త చురుగ్గానూ అనిపిస్తుంది.కీరా.. క్యారెట్‌: తొంభై ఆరుశాతం నీరు ఉంటుంది ఇందులో. ఆకలి అదుపులో ఉండి కడుపునిండిన భావన కలుగుతుంది. పైగా శరీరంలోని నీటిశాతం తగ్గదు. అర్ధరాత్రి మేల్కొని ఉండటం వల్ల కళ్లు ఎర్రబారడం, వేడిచేయడం వంటి సమస్యల్ని తగ్గించొచ్చు. సన్నగా తరిగిన క్యారెట్లు కూడా ఇదే ఫలితాన్నిస్తాయి.గుడ్లు: ఉడకబెట్టుకుని తినేయడం.. మంచిది. పోషకాలు పుష్కలంగా అందుతాయి. అప్పటికప్పుడే ఆకలి తీరుతుంది. చక్కగా ఆమ్లెట్‌ వేసుకోవచ్చు.. కానీ నూనె కాస్తంత చూసి వాడాలి.


పాప్‌కార్న్‌: ఉప్పు శాతం ఎక్కువగా ఉండే బంగాళాదుంప చిప్స్‌ కన్నా పాప్‌కార్న్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. వాటిని ఇంట్లోనే తయారుచేసుకుని.. కొద్దిగా ఉప్పు చల్లుకుంటే చాలు. కెలొరీల సమస్య ఉండదు. తేలిగ్గా అరుగుతాయి.వేడి తగలకుండా వ్యాయామం.. MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

వేడి తగలకుండా వ్యాయామం..
 వ్యాయామం వల్ల మేలెంతో చెప్పక్కర్లేదు. కానీ వేసవి వస్తే చాలామంది వ్యాయామం విషయంలో తటపటాయిస్తుంటారు. అధికవేడి వల్ల చెమట ఎక్కువగా బయటకుపోయి.. నీరసం రావడం, చిరాగ్గా అనిపించడం ఓ కారణం. ఆ సమస్య రాకుండా ఇలా చేయండి..

* ఆరుబయట చేసే పరుగూ, వేగవంతమైన నడక కంటే నీడపట్టున చేసే వ్యాయామాలకి ప్రాధాన్యం ఇవ్వండి. తప్పనిసరైతే ఉదయం ఎనిమిదిలోపు, సాయంత్రం ఆరుతర్వాతే నడకవంటి వ్యాయమాలు చేయండి. అప్పుడే ఎండ వేడి నుంచి తప్పించుకోగలుగుతారు. ముఖచర్మం ఆరోగ్యం కోసం కచ్చితంగా సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోండి.
* వ్యాయామం కోసం ఎంచుకునే దుస్తులు శరీరానికి తగిన గాలినందించేలా ఉండాలి. చెమటని ఇట్టే పీల్చుకునేవై ఉండాలి. టీ షర్ట్‌లు, ట్యాంక్‌ టాప్‌లు, షార్ట్‌ల వంటివి చక్కగా సరిపోతాయి ఈ కాలానికి.
* వ్యాయామం చేసేప్పుడు కచ్చితంగా నీళ్ల సీసా దగ్గర పెట్టుకోండి. అలసట అనిపించినప్పుడు గటగటా తాగేయకుండా కొద్దికొద్దిగా చప్పరించండి చాలు.
* నీళ్లు మరీ అధికంగా తాగితే.. ఎక్కుసార్లు మూత్రం పోవడం వల్ల శరీరంలో సోడియం నిల్వలు తగ్గిపోతుంటాయి. కాబట్టి నీళ్లకి ప్రత్యామ్నాయంగా పళ్లరసాలు, కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్‌ సాల్ట్‌ వంటివి తీసుకోండి. శరీరం తాజాగా ఉంటుంది.
ఉంగరాలకు వేలాడే అందాలు MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

          ఉంగరాలకు వేలాడే అందాలు
 సొగసైన చేతివేళ్ల అందం ఇనుమడించాలంటే చూడచక్కని ఉంగరం దానికి తొడగాల్సిందే. అది ఏదో ఒకటిలే అనుకుంటే ఎట్లా... ఎప్పటికప్పుడు వచ్చే మార్పులూ, ఆధునికతనూ చేర్చుకోవాలి. అప్పుడే కదా వన్నెలీనేది! మరిప్పుడు ఉంగరాల ప్రస్తావన ఎందుకు అంటారా? బంగారంతో చేసినా, రాళ్లే పొదిగినా, ఫంకీ రింగులే తొడిగినా వాటికి వేలాడే అందాలు తోడైతే వారెవ్వా ఎంతందమో అనిపిస్తాయి. అలాంటి డిజైన్లలో కొన్నింటి పరిచయం ఇది.. ఓ చూపు చూసేయండి.
 https://m.facebook.com/Mohan-publications-420023484717992/

జాతకచక్రం