MohanPublications Print Books Online store clik Here Devullu.com

రజస్వలా ధర్మాలు_RajaswalaDharmalu


                  

రజస్వలా ధర్మాలు


ఈ కాలములో అంటు , ముట్టు అనేవి ఎవరికీ అర్థము కావు. అర్థమయినవారు , తెలిసిన వారు అనేకులు వాటిని పాటించడము లేదు. అదంతా ఒక మూఢ నమ్మకమనీ , అశాస్త్రీయమనీ , ఇంకా రకరకాలుగా హేళన చేసేవారు పుట్టుకొచ్చారు.. మతమార్పిడులకు ఇది కూడా ఒక కారణమట ! అనాదిగా అన్ని మతాలవారూ దీన్ని పాటిస్తున్నారు, అయితే సనాతన ధర్మములో మాత్రము ఇంకా కొద్దో గొప్పో ఇది మిగిలి ఉంది. అంటు , ముట్టు లను గురించిన నేటి శాస్త్రీయమైన / అశాస్త్రీయమైన అవగాహన ఏమిటి అన్నది అటుంచితే , అసలు మన సనాతన ధర్మము దీన్ని గురించి యేమంటున్నది అని తెలుసుకోవడము ముఖ్యము. సనాతన ధర్మములో అంటు , ముట్టు అనేవే లేవని మిడిమిడి జ్ఞానముతో వాదించే పండిత పుంగవులు కూడా పుట్టుకొచ్చారు. కృష్ణ యజుర్వేదము రెండో కాండలో ఐదో ప్రశ్న చాలాభాగము దీనిగురించే వివరిస్తుంది. అందులో ఈ ఉదంతము ఉంది, దీనికన్నా ముందు , ఋగ్వేదపు ( 1-20-6 ) సూక్తము నొకదాన్ని చూద్దాము, ద్వాదశాదిత్యులలో ఒకడైన " త్వష్ట " ను ’ విశ్వ కర్మ ’ అని కూడా అంటారు. ఇతడే దేవ శిల్పి. ఇతడు కశ్యప ప్రజాపతి ( మానస ) పుత్రుడు .ఋగ్వేదము ఇతడిని బ్రాహ్మణుడు అంటే , యజుర్వేదము ఇతడిని ప్రజాపతి యనీ , అథర్వణ వేదము పశుపతి యనీ , శ్వేతాశ్వతరోపనిషత్ ప్రకారము రుద్రశివుడనీ వర్ణిస్తాయి. ప్రహ్లాదుడి కుమార్తె , ’ రచన ’ ఇతడి భార్య. వీరి పుత్రుడు " విశ్వరూపుడు " ఇతడికి మూడు తలలుండుట చేత , " త్రిశీర్షుడు " అంటారు. ఈ విశ్వరూపుడు , ప్రహ్లాదుడి దౌహిత్రుడు కాబట్టి , రాక్షస పక్షపాతి అని పేరు, అయితే కొంతకాలము దేవతల పురోహితుడుగా ఉన్నాడు. అతడి మూడు తలలలో ఒకతలతో సోమపానము చేసేవాడు , ఇంకొక తలతో సురాపానమూ , మూడో తలతో అన్న భక్షణమూ చేసేవాడు. పురోహితుడిగా యాగములు చేయించేటప్పుడు , దేవతలకు హవ్యభాగాన్ని ప్రత్యక్షంగా ఇప్పించేవాడు , అయితే , రహస్యంగా రాక్షసులకు కూడా హవ్యభాగాన్ని ఇప్పించేవాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు , ’ ఇతడు దేవలోకాన్ని రాక్షసుల పరం చేయవచ్చు’ నని బెదరినాడు. కాబట్టి , స్వామిద్రోహి , దేవ ద్రోహి యైన విశ్వరూపుడి మూడు తలలూ తన వజ్రాయుధముతో నరికివేస్తాడు. ( సోమపానము చేయు తల ’ కపింజలము’ అను పక్షిగాను , సురాపానము చేయు తల గుడ్లగూబ గాను , అన్నము తిను తల , ’ తిత్తిరి పక్షి ’ గాను రూపాంతరము చెందుతాయి ) ఆత్మ జ్ఞాని యైన ఇంద్రుడికి దుష్ట శిక్షణ చేసినందువల్ల , బ్రాహ్మణ హత్య పాపము కాదని తెలుసు. అయినా సామాన్యులకు జనాపవాద నివృత్తి చేయుట ఎలాగ అన్న విషయము తెలుపుట కోసము , ఇలా చేస్తాడు. ధర్మ దేవతల ఎదురుగా తన అంజలితో బ్రహ్మ హత్యా పాపాన్ని స్వీకరిస్తాడు. తాను తప్పుచేయలేదన్న భావనతో ఆ పాపాన్ని ఒక సంవత్సరము భరిస్తాడు. అయితే సృష్టిలోని ప్రాణులన్నీ , ఇంద్రుడిని " బ్రహ్మ హత్య చేసినవాడు " అని ఆక్షేపిస్తాయి. కాబట్టి , సామాన్యుల దృష్టిలోకూడా దాని నివృత్తి కోసము బ్రహ్మ హత్యా పాపాన్ని ఇతరులకిచ్చి , తీసుకున్నందుకు ప్రతిగా వారికి వరాలను ఇవ్వాలనుకుంటాడు. మొదట , భూదేవిని ప్రార్థించి , తన పాపములో మూడో భాగాన్ని తీసుకోమని కోరుతాడు. భూమి , వరాన్ని ఇలా అడుగుతుంది , " జనులు నన్ను త్రవ్వేటప్పుడు నేను పీడను అనుభవిస్తాను , దానివలన నాకు హింస కలుగుతుంది. కాబట్టి , నాకు వ్యథ తెలియకుండా , హింస కలుగకుండా చూడు " . ఇంద్రుడు దానికి సమ్మతించి , జనులు భూమిని త్రవ్వేటప్పుడు భూమికి నొప్పి కాకుండానూ , అంతేకాక, ఆ త్రవ్విన చోట ఒక సంవత్సరములోపల దానికదే పూడుకొనే లాగానూ వరమిచ్చి , పాపపు మూడో భాగాన్ని వదిలించుకుంటాడు. బ్రహ్మ హత్యా పాపం తో కూడుకొన్నది కావున తనకుతానుగా పూడుకొన్న అటువంటి బంజరు భూమిని ఎవరూ నివాసము కోసమూ ,
యాగముల కోసము ఉపయోగించరాదు. తర్వాత ఇంద్రుడు, వృక్షములను , సస్యములనూ ప్రార్థించి , బ్రహ్మ హత్యా పాపంలో ఇంకో భాగాన్ని తీసుకొమ్మని కోరుతాడు. అప్పుడా సస్యజాలము , "జనులు మమ్మల్ని కత్తరించుటవలన మేము నశిస్తుంటాము, కాబట్టి మేము నాశనము కాకుండా వరమియ్యి " అని అడుగుతాయి. ఇంద్రుడు ఒప్పుకుని , " నరికినచోట అనేక చిగుళ్ళు మొలవనీ " అని వరమిచ్చి , పాపపు రెండో భాగం వదిలించుకుంటాడు. అందుకే , చెట్లను కొట్టివేస్తే అక్కడే అనేక చిగుళ్ళు పుట్టుకొస్తాయి. అయితే , అది బ్రహ్మ హత్యా పాపంతో కూడుకున్నది కాబట్టి , ఆ కొట్టివేసిన చోట , గట్టియైన రసము ( బంకపాలు లేదా జిగురు) కారుతుంది. కాబట్టి ఆ రసమును తాగరాదు. ( కల్లు వచ్చేది ఇలాగే , అందుకే కల్లుతాగుట నిషేధము. ) కాబట్టి , ఎరుపు రంగుతో ఏదైతే కారుతుందో , లేక , కొట్టివేసిన చోటే బయటికి కారుతుందో , అది తినుటకు యోగ్యము కాదు. అయితే , కొట్టివేయకుండానే కారే రసాలకు ఈ నిషేధము లేదు. ఆ తర్వాత , మిగిలిన బ్రహ్మ హత్యా పాపంలోని మూడోభాగాన్ని తీసుకోమని ఇంద్రుడు , స్త్రీ సమూహాలను కోరుతాడు. అప్పుడు స్త్రీలు , " నిషిద్ధ దినములలో పురుష సంయోగము వల్ల కలిగే దోషము లేకుండా , దానివలన గర్భమునకు హాని కలుగకుండా వరమునియ్యి " అని అడుగుతారు. ( పురుష సంయోగము కేవలము సంతాన ప్రాప్తికే అయిననూ , ప్రసవము వరకూ , ఇచ్చానుసారముగా పురుష సంయోగమును యే దోషమూ లేకుండా పొందుటకు యోగ్యతను పొందుతారు ) ఆ వరము వలన , ప్రథమ రజోదర్శనముతో మొదలు పెట్టి , ఋతుకాల సంబంధమైన వీర్య సంయోగము వలన సంతానము పొందుతారు , ప్రసవము అయ్యేవరకూ , ఇచ్చానుసారము పురుష సంయోగము పొందే శక్తిని పొందుతారు. అయితే , అది బ్రహ్మహత్యా సంబంధమయినది కాబట్టి , ఆ పాపము స్త్రీల రజోరూపమైనది. అనగా రజస్సును అంటిపెట్టుకొని ఉండును.
రజస్వల అయిన స్త్రీ మలిన వస్త్రములను ధరించినదానితో సమానము. అట్టి రజస్వలతో ఎవరూ సంవాదములు చేయరాదు. పక్కన కూర్చొనరాదు. ఆమె ముట్టిన అన్నమును తినరాదు. బ్రహ్మ హత్యారూపాన్ని శరీరం లో ధరించినది కావున , స్త్రీలకు ప్రియమైన అభ్యంగనాది తైలములను రజస్వలలు తీసుకోకూడదు. సౌందర్య సాధనములను వాడరాదు. ( ఇతర వస్తువులను తీసుకొన వచ్చును ) ముఖ్య నియమములు :- ఎవడైతే రజస్వలతో సంయోగిస్తాడో , ఎవడైతే ఆ సంయోగము వలన పుట్టునో , వాడు నీలాపనిందల పాలై కష్టములనుభవిస్తాడు. అడవిలో రజస్వలతో సంయోగఫలముగా పుట్టినవాడు , దొంగ అవుతాడు. సిగ్గుతోగానీ , భయం తోగానీ , నిరాకరించిన స్త్రీని ఎవరైనా కూడితే , ఆమెకు పుట్టువాడు , సభలలో మాట్లాడుటకు సిగ్గుపడి , తలవంచుకొనెడు పుత్రుడు అవుతాడు యే రజస్వల అయితే స్నానము చేస్తుందో , ఆమెకు , నీటిలో మునిగి చనిపోగల సంతానము కలుగును ( రజస్వలలు ఆ మూడు రోజులూ స్నానము చేయరాదు) యే రజస్వల అభ్యంగన స్నానము చేస్తుందో , ఆమెకు కుష్టు రోగము , చర్మ రోగములు కల సంతానము కలుగును. యే స్త్రీ అయితే గోడలమీద బొమ్మలు వేస్తుందో , ఆమెకు కేశములు లేని , బట్టతల కలుగువారునూ , దుర్మరణము / అకాల మరణమునకు పాలగువారు పుడతారు. ఎవతె కంటికి కాటుక పెట్టుకొనునో , ఆమెకు , కళ్ళులేనివారు , నేత్రరోగులు పుడతారు. ఎవతె , దంతధావనము చేయునో ( వేపపుల్లతో ) ఆమెకు పాచి పళ్ళు , పుచ్చుపళ్ళు కలవారై పుడతారు. యేస్త్రీ గోళ్ళను కత్తరించుకొనునో , ఆమెకు వికృత గోళ్ళు కలవారు పుడతారు. యేస్త్రీ గడ్డి కోస్తుందో , చాపలల్లుతుందో , ఆమెకు నపుంసకులు పుడతారు. ఎవరైతే పగ్గములను ( తాళ్ళను ) పేని తయారు చేస్తారో , ఆ స్త్రీలకు ఉరిపోసుకొని చచ్చువారు పుడతారు. యేస్త్రీ ఆకులతో నీరు తాగునో , ఆకులలో భోజనము చేయునో , ఆమెకు ఉన్మాదులు / పిచ్చివారు పుడతారు. ఎవరైతే అగ్నిలో కాల్చిన మట్టికుండలలో నీరు తాగుతారో , ఆమెకు మరుగుజ్జులు ( పొట్టివారు ) పుడతారు. ఈ నియమాలు మూడురాత్రుల కాలము ముగియువరకూ పాటించవలెను. పచ్చికుండలలో , పచ్చి మూకుడులలో నీళ్ళు తాగడము , భోజనము చేయడము చేయవచ్చును. ఈ నియమాలు పాటిస్తే ఉత్తమ సంతానము కలుగును. ఇతరులకు కామోద్రేకము కలుగులాగ ప్రవర్తించరాదు. ఈ నిషిద్ధ కార్యములకు ఫలము అరిష్టమే కాబట్టి , అరిష్టము తెచ్చు యే పనినీ చేయరాదు. శ్రద్ధాళువులు సనాతన ధర్మపు సాంప్రదాయములను , ఆచారములను పాటించి శుభమును పొందెదరు గాక .

ఫోను, ఫేస్‌బుక్‌.. అప్పుడు వద్దు!

జుట్టుకు ఆలివ్‌నూనె.. కలబంద
నల్లని ఒత్తైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు. కానీ హార్మోన్ల ప్రభావం, అనారోగ్యాలు... వంటివాటితో పాటు మరికొన్ని కారణాలు తోడైతే.. జుట్టు విపరీతంగా రాలుతుంది. మరి దానికి ఏంటి పరిష్కారం అంటారా..
* కొందరి జుట్టు కాలంతో పని లేకుండా పొడిబారినట్లు అవుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే రాలడం ఖాయం. ఇలాంటప్పుడు ఆలివ్‌, కొబ్బరి నూనెల్ని సమపాళ్లలో తీసుకుని మరిగించాలి. దాన్ని తలకు పట్టించి బాగా మర్దన చేయాలి. ఆపై గంటాగి గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరి. జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
* తలస్నానం చేసినా కొన్నిసార్లు జుట్టులో మెరుపు కనిపించదు. బలహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు గ్రీన్‌టీని మరగకాచి చల్లార్చి..అందులో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె కలిపి జుట్టు కుదుళ్ల నుంచీ కొసల వరకూ తడపాలి. అరగంట తరవాత తలస్నానం చేస్తే జాలువారుతూ మెరిసిపోతుంది. రాలే సమస్యా తగ్గుతుంది.
* జుట్టు బలహీనంగా మారి వూడిపోతున్నప్పుడు.. కొబ్బరిపాలల్లో చెంచా ఆలివ్‌నూనె, కాస్త కలబంద గుజ్జు, మూడు గుడ్లలోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరవాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరి.


వెన్ను నొప్పి తగ్గిస్తాయి ఈ దిండ్లు!
ఒక్కసారి పరుపూ, దిండ్లూ కొన్నామంటే.. వాటి మన్నిక పోయినా సరే.. ఏళ్ల తరబడి వాడేస్తుంటాం. ఆ నిర్లక్ష్యమే మనకు మెడ, వీపు, నడుము నొప్పులకు కారణం అవుతుంది. ఓ స్నేహితురాలికి ఎదురైన ఈ సమస్యను గుర్తించిన మేఘన.. పరుపులూ, దిండ్ల తయారీ మొదలుపెట్టింది. అవీ సాధారణమైనవి కావు. మెడా, నడుము నొప్పుల్ని తగ్గించేవి. అదెలా అంటారా.. చదవండి మరి.

సాధారణ ఫోమ్‌ కాకుండా మెమరీ ఫోంతో దిండ్లూ, పరుపులూ, కుషన్లు తయారుచేయడం మేఘన ప్రత్యేకత. దీన్ని వ్యోగాములు వాడేందుకు 1970లో నాసా అందుబాటులోకి తెచ్చిందని చెబుతుంది మేఘన. శరీర ఉష్ణోగ్రతకూ, ఆకృతికి తగినట్లుగా మారడం ఆ ఫోం ప్రత్యేకత. అలాగే సాధారణ దిండ్లూ, పరుపులూ కొంతకాలం వాడాక ఆకృతి కోల్పోవడం చూస్తూనే ఉంటాం. కానీ దీంతో చేయడం వల్ల అవి ఎక్కువకాలం మన్నడమే కాదు.. ఆకృతీ త్వరగా కోల్పోవు. పైగా నొప్పిని నివారించే ప్రత్యేకత కూడా ఈ ఫోంకి ఉంది. అవన్నీ గుర్తించాకే మెమరీ ఫోంతో ప్రత్యేకంగా ఉత్పత్తులు తయారుచేసి అమ్ముతోంది. మేఘన చదివింది డిగ్రీ. స్వస్థలం దిల్లీ. తండ్రికి సాధారణ ఫోం తయారీ సంస్థ ఉంది. ఓసారి ఆమె స్నేహితురాలు దిండ్లు వాడటం వల్ల వీపు నొప్పి వచ్చిందని డాక్టర్‌ దగ్గరకు వెళ్లింది. ఆ డాక్టర్‌ వెంటనే దిండ్లు మార్చమని సలహా ఇచ్చారట. తరవాత ఆమె మేఘనను కలిసి తన సమస్య వివరించి సలహా అడిగింది. అప్పటికి ఏదో చెప్పినా.. తరవాత దాని గురించి ఆలోచించింది మేఘన. అలా దొరికిన పరిష్కారమే ‘ది వైట్‌ విల్లో’ సంస్థ. రెండేళ్లక్రితం దాన్ని ప్రారంభించినా, అంతకుముందే మెమరీ ఫోం ఎక్కడ దొరుకుతుంది.. దానివల్ల కలిగే లాభాలు, మన్నే కాలం, మార్కెట్లో ఎలా విడుదల చేయాలి... ఇలా ఎన్నో విషయాలపై తనదైన అధ్యయనం చేసింది.
సమస్య తప్పలేదు..: చివరకు రెండేళ్లక్రితం దిండ్లూ, పరుపుల తయారీ మొదలుపెట్టినా.. వాటిని ఎలా, ఎక్కడ అమ్మాలో అర్థంకాలేదు. కారణం ఖరీదు ఎక్కువ కావడమే. పైగా మెడా, వీపూ, నడుమునొప్పి లేకుండా చేస్తుందని చెబితే ఒక్కరూ నమ్మలేదని అంటుంది మేఘన. ఓ వైపు వినియోగదారులకు వాటి ప్రత్యేకతల్ని వివరిస్తూనే, మరోవైపు వైద్యులకూ చెప్పడం మొదలుపెట్టింది. కొత్తల్లో అయితే ఒకటీ అరా మాత్రమే కొనేవారు. కనిపించిన ప్రతీవారితో మాట్లాడటం, ఉత్పత్తుల గురించి వివరించడం, మరికొంత అధ్యయనం చేశాక ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు మొదలుపెట్టింది. వినియోగదారులు పెరిగేసరికీ, వస్తువుల్ని సమయానికి వారి ఇళ్లకు చేరవేసేందుకు సరైన కొరియర్‌ సేవలు వెతుక్కోవడం కూడా తనకెదురైన సవాలే అంటుందామె. దాన్నీ అధిగమించింది. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో దిండ్లూ, పరుపులూ, కుషన్లూ.. తయారుచేస్తోంది.

అందరికీ అందుబాటులో...: ఈ రెండేళ్లలో రకరకాల దిండ్లు ప్రవేశపెట్టింది. మేఘన. కొత్తగా తల్లులైన వారికీ, ప్రయాణాల్లో సౌకర్యంగా ఉండేందుకూ, మెడ నొప్పి, వీపు నొప్పులు ఉన్నవారికీ.. ఇలా దాదాపు ఇరవైరకాల దిండ్లూ, కుషన్లూ తయారుచేస్తోంది. పరుపులు కూడా ఉంటాయి. ‘ప్రస్తుతం మా దగ్గర పదిహేను మంది ఉద్యోగులు ఉన్నారు. ఆన్‌లైన్లో ఆర్డరు చేసుకుంటే పంపిస్తాం. ఇప్పటికయితే ప్రతినెలా పదిహేను వందలవరకూ అమ్ముతున్నాం. ఏడాదికి ఇరవై లక్షల రూపాయల వరకూ ఆదాయం అందుతోంది. ఒక్కో దిండు ఖరీదు పన్నెండు వందల రూపాయల వరకూ ఉంటుంది. అంత ధరా అనే వారికి ముందు మా ఉత్పత్తిని వాడి చూడండని చెబుతా. తరవాత కచ్చితంగా బాగుందనే చెబుతారనుకోండి. భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనేదే నా లక్ష్యం.


ఫోను, ఫేస్‌బుక్‌.. అప్పుడు వద్దు! 

ఇలా చదువు పూర్తి చేస్తూనే... అలా క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు యువత. అంతవరకూ బాగానే ఉంది కానీ చాలాసార్లు ఫోన్లూ ఇతరత్రా వ్యవహారాలతో మనసు పక్కదారి పడుతుంటుంది. ఆ ప్రభావం పనిపై పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. 
* మిమ్మల్ని పక్కదారి పట్టించే విషయాలేంటో గుర్తించి ఒక జాబితాగా రాసుకోండి. సాధారణంగా మనం రాసే విషయాల్లో ఫోన్‌లో మాట్లాడటం, సామాజిక మాధ్యమాల కోసం ఎక్కువ సమయం కేటాయించడం వంటివే ఉంటాయి. కాదు.. వ్యక్తిగత విషయాలు కూడా అంటారా? వాటినీ రాయండి. 
* ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లకు రోజులో కొంత సమయం పెట్టుకుని అప్పుడు మాత్రమే చూడండి. అత్యవసర ఆఫీస్‌ మెయిళ్లని కూడా రెండు గంటలకోసారి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. 
* మీరు చేయాలనుకున్న పనుల జాబితాను ఓ వరుసలో రాయండి. అందులో యాంత్రికంగా చేసే పనులని కాకుండా కాస్త సృజనాత్మకత నిండిన వాటిని ముందు వరుసలో ఉంచండి. వీలైతే పది నిమిషాల్లో చేసే పనిని ముందు చేయండి. అదిచ్చే కిక్‌ మరో పనిని వేగంగా చేసేందుకు కావాల్సిన ఉత్సాహాన్నిస్తుంది. 
* నిద్రతో రాజీపడొద్దు. ఫోనులకోసం కేటాయించే సమయాన్ని మంచి నిద్రకోసం కేటాయించండి. ఎక్కడలేని విశ్రాంతి దొరుకుతుంది.


వారానికోసారైనా హలో!
స్నేహితుల్ని చేసుకోవడం సులువే. కానీ ఆ బంధాన్ని పదిలపరచుకోవాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ అవేంటో చూసేద్దామా..
చనువు వద్దు: కొన్నేళ్ల బట్టీ తెలిసిన స్నేహితులైనా సరే చనువు తీసుకోవడం, వ్యక్తిగత విషయాల్లో తల దూర్చడం సరికాదు. ఏదయినా సరే.. వాళ్లు చెప్తేనే వినాలి. అవసరమైతేనే సలహా ఇవ్వాలి.
భావవ్యక్తీకరణ ముఖ్యం: స్నేహితుల మధ్య ఉన్నప్పుడు పదే పదే ఫోన్లు చూసుకుంటూ, ఇతరులతో ఛాటింగ్‌ చేస్తుంటారు కొందరు. మీరు అవతలివారి మాటలకు ప్రాధాన్యం ఇవ్వరనే విషయం ఆ చర్య వల్ల అర్థమవుతుంది. మరెలా అంటారా.. స్నేహితులు ఎదురుగా ఉన్నప్పుడు పూర్తిగా వాళ్లతోనే మాట్లాడాలి. వాళ్లు చెప్పేది వినాలి.
నమ్మకం ముఖ్యం: స్నేహితులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలనూ లేదా చెప్పిన రహస్యాన్నీ మూడో వ్యక్తికి చెప్పకుండా ఉండటం, ఏ సమస్య వచ్చినా మీరు వాళ్లకు అండగా ఉంటారనే ధైర్యాన్ని ఇవ్వడమే నమ్మకాన్నిస్తుందని మరవకండి.
సమయం కేటాయించాలి: చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వేరే ప్రాంతంలో ఉంటున్నా సరే.. స్నేహితులకోసం కొంత సమయం కేటాయించాలి. అలాగని రోజూ మాట్లాడక్కర్లేదు. కలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కనీసం వారం లేదా పదిహేను రోజులకోసారి వారితో ఫోను మాట్లాడటం, లేదా కలిసి గడిపేలా చూసుకోవాలి.
వాదన వచ్చిందా: గట్టిగా అరవడం, మీ మాటే నెగ్గాలని చూడటం, అదేపనిగా వాదించడం ఇవేవీ చేయకూడదు. సమస్య ఎలాంటిదయినా సరే.. అవతలివారు చెప్పేదీ వినాలి. కేవలం సమస్య, దానికి సంబంధించిన పరిష్కారం గురించే ఆలోచించాలి. ఒకవేళ పొరపాటు మీదని మీకనిపిస్తే.. ఏ మాత్రం ఆలోచించకుండా క్షమాపణ చెప్పేందుకూ సిద్ధంగా ఉండాలి.


రోజులో మూడుసార్లు హెవీగా తినడానికి బదులు రోజుకి ఐదారుసార్లు కొద్దికొద్దిగా తినడం మంచిది. ప్రతి భోజనానికి మధ్యలో రెండు మూడు గంటలు విరామం ఇవ్వాలి. దీని వల్ల మెటబాలిజం వేగవంత మవు తుంది. తద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.

ఆహారంలో 65 నుంచి 70 శాతం కార్బోహైడ్రేట్స్, 15 నుంచి 20 శాతం ప్రొటీన్స్, 10 నుంచి 15 శాతం ఫాట్స్‌ ఉండేలా చూసుకోవాలి. తినేటప్పుడు బాగా నములుతూ మెల్లిగా తినాలి. ఇలా చేయడం వల్ల దేహానికి తగినంత ఆహారం కడుపులో చేరగానే మెదడు నుంచి ఇక చాలనే సంకేతాలు జారీ అవుతాయి. ఆహారం పరిమాణం తగ్గుతుంది.



పొగాకు... హెల్త్‌కు దగా ఆకు!- Poga, Cancer



పొగాకు... హెల్త్‌కు దగా ఆకు!
నేడు పొగాకు వ్యతిరేక దినం

పొగాకు ఆరోగ్యానికి ‘దగా ఆకు’ అనీ, అనేక రకాల క్యాన్సర్‌ రూపాలలో ఇది మనకు చేసే దగా అంతా ఇంతా కాదని ఎన్నెన్నో ‘నో టొబాకో డే’ సందర్భాల్లో అనేక మార్లు చెప్పుకున్నాం. అది వెలువరించే దాదాపు 7,000 రకాల హానికరమైన రసాయనాల గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అందులో 60కి పైగా క్యాన్సర్‌ను తెప్పించేవే అని ఆందోళన పడ్డాం. అయినా ఇంకా చాలామంది సిగరెట్‌ తాగడాన్ని స్టైల్‌ సింబల్‌గానో, పొగాకు నమలడాన్ని స్ట్రెస్‌ నుంచి బయటపడవేసే మార్గంగానో భావిస్తున్నారు. కానీ వాస్తవం కూడా పొగాకు లాగే చాలా చేదు.ఆరోగ్యానికి అది ఎంతో చేటు. ఆ విషయాన్ని కాస్త విభిన్నంగా, వివరంగా చెప్పుకుందాం.
ఊపిరితిత్తుల సౌధం ధ్వంసం ఇలా!
మీకు తెలుసా? మన ఊపిరితిత్తులు బహుళ అంతస్తుల సముదాయం లాంటివి. ఎలా అంటారా? గాలి పీల్చుకునేందుకు ఉపయోగపడే ప్రధాన నాళం ముక్కు దగ్గర్నుంచి మొదలై గొంతు దగ్గర రెండుగా చీలుతుంది. ఒకటే ఉన్న నాళాన్ని ట్రాకియా అంటారు. అది రెండుగా చీలినప్పుడు ఆ రెండు నాళాలను బ్రాంకై అంటారు. ట్రాకియా ఒక అంచె లేదా మొదటి అంతస్తు అనుకుందాం. అప్పుడు బ్రాంకై రెండో అంతస్తు. అలా ఊపిరితిత్తుల మల్టీ స్టోరీడ్‌ బిల్డింగ్‌లో చివరిది 28వ అంతస్తు. ఆ చిట్టచివరి అంతస్తులో చిట్టిచిట్టి గదులు 30 కోట్లు ఉంటాయి. ఆ గాలిగదులనే ‘ఆల్వియోలై’ అంటారు. అక్కడ వాయువుల మార్పిడి జరుగుతుంది. ఇక మన బహుళ అంతస్తుల భవనాల పరిభాషలోనే చెప్పుకోవాలంటే... గాలి మార్పిడి జరిగేలా వీలు కల్పించేందుకు చివరి అంతస్తు మీద ఉండే ‘పెంట్‌హౌజ్‌’లు 30 కోట్లు అన్నమాట! మనం సిగరెట్‌ తాగుతున్నామంటే చివరి గాలి గది కూడా కూలిపోయేలా పునాది నుంచి ధ్వంసం చేస్తున్నామన్నమాట. సిగరెట్‌ తాగేటప్పుడు నోటి నుంచి ముక్కుల నుంచి వెలువడుతున్న ఆ పొగలే... భవనం కూలిపోయేటప్పుడు వెలువడే దుమ్మూధూళీ అని గుర్తుపెట్టుకోండి. మళ్లీ ఎప్పుడూ పొగ తాగాలనిపించదు.
మెదడును మాయ చేసే నికోటిన్‌
మనం సిగరెట్‌ తాగే సమయంలో లోపలికి తీసుకునే రసాయనాలన్నింటిలోనూ మనల్ని బానిసగా చేసుకునేది ‘నికోటిన్‌’ మాత్రమే. ఇది అంత హానికరం కాదుగానీ... మిగతా 7000 రసాయనాలూ బాగా హానిచేసేవి. ఇక అందులోని 60 మాత్రం ఒక్కసారి పీల్చినా క్యాన్సర్‌ తెచ్చిపెట్టగల సామర్థ్యం ఉన్నవే. అందుకే మనల్ని బానిసగా మార్చుకునే ఈ నికోటిన్‌ను తక్షణమే వదిలించుకోవాలి. అప్పుడు మిగతా 7000 రసాయనాలనూ తేలిగ్గా దూరం పెట్టవచ్చు. అయితే వదిలించుకోవాలనుకున్న సమయంలో ఈ నికోటిన్‌ సామాన్యమైన మాయలు చేయదు! ఇవి చేసే మాయలు ఎన్నో తెలుసా? మెదడును అనేక రకాల భ్రమల్లో ఉంచుతుందిది. నోరు దాహంతో పిడచగట్టుకుపోయేలా చేస్తుంది. అయోమయంలో ముంచేసి గడబిడగా గందరగోళంగా ఉండేలా చూస్తుంది.
ఈ క్షణమో, మరుక్షణమో ప్రాణాలు పోతాయేమో అన్న భ్రాంతినీ, ఆందోళననూ కలిగిస్తుంది. ఈ మాయలన్నింటినీ చేసి మళ్లీ సిగరెట్‌ తాగితేగానీ ఊరుకోనంతగా ప్రేరేపిస్తుంది. అయితే మానాలనే సంకల్పం బలంగా ఉన్నవారిలో పైన పేర్కొన్న లక్షణాలు కాసేపలా బాధపెట్టాక క్రమంగా తగ్గిపోతాయి. కానీ కొంతమందికి విత్‌డ్రావల్‌ సింప్టమ్స్‌ మరీ ఎక్కువగా ఉంటాయి. అందుకే సిగరెట్‌ మానాలనుకునేవారికి నికోటిన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఈ రకమైన చికిత్సలో భాగంగా నికోటిన్‌ను వేర్వేరు రూపాల్లో అందిస్తారు. అందులో నికోటిన్‌ బిళ్లలు ముఖ్యమైనవి. ఇవేగాక నేసల్‌ స్ప్రేలు, ఇన్‌హేలర్‌లు, లాజెంజెస్‌లు కూడా ఉంటాయి. వాటన్నింటి సహాయంతో సిగరెట్‌ మానేస్తే ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
ఒక్క పఫ్‌.. హెల్త్‌ ఉఫ్‌...
మనం ఒక సిగరెట్‌ తాగినప్పుడు ఒక 100 చదరపు మీటర్ల వైశాల్యంలోని 30 కోట్ల గాలి గదుల్లో, 2400 కిలోమీటర్ల నిడివి ఉండే ఊపిరితిత్తుల రక్తనాళాల పొడవునా ప్రతి భాగం పొగచూరిపోతుంది. మనం ఈ 30 కోట్ల గదులను దూరి బయటకు వచ్చేందుకు ఒక్కొక్క సెకన్‌ సమయం తీసుకున్నా గదులన్నీ పూర్తి చేసేందుకు పట్టే సమయం దాదాపు 10 ఏళ్లు (కచ్చితంగా చెప్పలంటే తొమ్మిదిన్నర ఏళ్లకు కాస్త పైచిలుకు). కానీ సిగరెట్‌ అంత సమయం తీసుకోదు. ఒక్క పఫ్‌లో అన్ని గదులనూ, అన్ని రక్తనాళాలనూ, అన్ని గోడలనూ చుట్టుముడుతుంది. అన్నింటినీ పొగచూరిపోయేలా చేస్తుంది. అన్ని భాగాలను తూట్లు పొడుస్తుంది.
లంగ్స్‌... పొగచూరిన వంటగదులే 
ప్రతిరోజూ మనం దాదాపు 22 వేల సార్లు శ్వాసిస్తాం. రోజుకు సగటున 16 వేల లీటర్ల గాలిని పీలుస్తాం. అంత గాలినీ ఒక్క సిగరెట్‌తో కలుషితం చేసేస్తాం. అంతేకాదు... మన ఊపిరితిత్తుల బహుళ అంతస్తుల భవనంలో ఎస్కలేటర్లు కూడా ఉంటాయి. ఆ ఎస్కలేటర్లను వైద్య పరిభాషలో సీలియా అంటారు. మ్యూకస్, సీలియా కలిసి ఉండే ఈ ఎస్కలేటర్లను ‘మ్యూకోసీలియా ఎస్కలేటర్స్‌’ అని కూడా అంటారు. మనకు సరిపడని దుమ్ము, ధూళి, పొగ లాంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వాటిని ఈ ఎస్కలేటర్లు ఊపిరితిత్తులనుంచి బయటకు వెళ్లేలా చేస్తాయి. కానీ అవి బయటకు పంపించే కాలుష్యం కంటే మనం లోపలికి పంపించే పొగ ఎక్కువ. దాంతో అవి అలసిపోతాయి. ఊపిరితిత్తుల లోపలి భాగం... పాత ఇండ్ల వంటగదుల్లా పొగచూరి... మసిబారిపోతాయి.
తాగే వారికే కాదు... పక్క వారికీ...!
సిగరెట్‌... దానిని తాగేవాళ్లతోపాటు ఇంట్లో వారి ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. మరొకరు వదిలిన పొగను పీల్చడాన్ని ‘ప్యాసివ్‌ స్మోకింగ్‌’ అంటారు. నేరుగా పొగతాగడం వల్ల ఎంత హాని జరుగుతుందో... ప్యాసివ్‌ స్మోకింగ్‌తోనూ అంతే హాని జరుగుతుంది. ఒక అధ్యయనంలో తేలినదేమిటంటే... ప్రతి ఏడాదీ ప్యాసివ్‌ స్మోకింగ్‌ వల్ల 34,000 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోనూ, 46,000 మంది గుండెజబ్బులతోనూ చనిపోతున్నారు. అంతేకాదు... ఈ ప్యాసివ్‌ స్మోకింగ్‌ వల్ల ఆస్తమా, నిమోనియా, బ్రాంకైటిస్, తలనొప్పి, దగ్గు వంటి అనారోగ్యాలూ, అనర్థాలూ, ఆపదలూ అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా సొంత తల్లిదండ్రులు తమ పిల్లలకు క్యాన్సర్‌నూ, ఆస్తమా, ఎంఫసిమా, నిమోనియా, బ్రాంకైటిస్, దగ్గూ ఆయాసాలు లేదా నెలలు నిండటానికి ముందే ప్రసూతి (ప్రీ–టర్మ్‌ డెలివరీ), మృతశిశువు జన్మించడం (స్టిల్‌ బర్త్‌), పుట్టిన శిశువు బరువు బాగా తక్కువగా ఉండటం, పుట్టిన శిశువు అకస్మాత్తుగా చనిపోవడం, ముత్యాల గర్భం, పుట్టిన పిల్లల్లో గ్రహణం మొర్రి కనిపించడం (క్లెఫ్ట్‌ పాలెట్‌) లాంటి అనర్థాలను గిఫ్ట్‌గా ఇస్తారా ఎవరైనా?
సిగరెట్‌ కాలుస్తున్న విస్తీర్ణం?
మన ఊపిరితిత్తుల నిర్మాణమే ఒక అద్భుతం. అవి కేవలం 2.3 కిలోగ్రాముల బరువుతో, జానెడు పొడవు మాత్రమే ఉండే గాలితిత్తులని మనకు అనిపించవచ్చు. వాటి నిర్మాణ అద్భుతాన్ని మడతలు విప్పి చూస్తే ఊపిరితిత్తుల గొప్పదనం అర్థమవుతుంది. ముక్కు చివర ఉండే వాయునాళం (ట్రాకియా) శ్వాసవ్యవస్థలోని మొదటి అంతస్తు అయితే, బ్రాంకై రెండో అంతస్తు అయితే, ఊపిరితిత్తుల్లోని గాలిగది (ఆల్వియోలై) చివరి అంతస్తు అని మనం చెప్పుకున్నాం కదా. శ్వాసవ్యవస్థలోని 14వ అంతస్తు నుంచి మరింత సన్నగా చీలే ఈ ఊపిరితిత్తుల్లోని గాలినాళాల నిర్మాణాలు కంటికి కనిపించనంత సంక్లిష్టంగా ఉంటాయి. అంటే 28వ అంతస్తుకు చేరేటప్పటికి ఎంత సంక్లిష్టంగా ఉంటాయో ఊహించుకోండి. అలా ఆ 28 అంతస్తులన్నింటినీ చదునుగా పరిచామనుకోండి. ఆ విస్తీర్ణం ఒక టెన్నిస్‌ కోర్టు పరిమాణమంత! దాదాపు 100 చదరపు మీటర్లు.
ఇక ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల పొడవు 2400 కిలోమీటర్లు. ఇంత విస్తృతమైన దాన్ని మనం కర్చిఫ్‌ మడతలు వేసినట్లుగా జానెడు పొడవుకు మడిచి, ఛాతీలో అమర్చుకున్నాం. కర్చిఫ్‌ను ఒకచోట కాలిస్తే... ఒక్క రంధ్రం పడుతుంది. అదే కర్చిఫ్‌ను 28 మడతలు వేశాక... ఒక్క చోట కాల్చి మడతలు విప్పితే... ప్రతి మడతలోనూ కాలిన రంధ్రం ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి. మనం ఒక్క సిగరెట్‌ తాగిన ప్రతిసారీ ఊపిరితిత్తులకు ఎన్నెన్ని రంధ్రాలు పెడుతున్నామో! ఒకసారి అణుబాంబు వేసినప్పుడు మాడిపోయే ప్రదేశపు విస్తీర్ణం కంటే సిగరెట్‌తో పదే పదే మాడ్చేసే ప్రాంతపు విస్తీర్ణం చాలా చాలా ఎక్కువ.
పొగ మానితే తక్షణ ప్రయోజనాలు...
∙ఆహారం రుచి తెలియడం ∙వాసన గ్రహించే శక్తి సాధారణ స్థాయికి రావడం ∙దుర్వాసన పోయి శ్వాస, జుట్టు, బట్టలు తాజా వాసనతో ఉండటం ∙పళ్లు, గోళ్లు పచ్చబారకుండా మిలమిల మెరుస్తూ ఉండటం ∙మెట్లెక్కడం, చిన్న చిన్న పనులు తేలికవడం.
దీర్ఘకాలిక ప్రయోజనాలు
సిగరెట్‌ మానేసిన తొమ్మిది నెలల్లో దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలపడి శ్వాస సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇన్ఫెక్షన్స్‌ ముప్పు తొలగిపోతుంది. ఏడాది తర్వాత కరోనరీ హార్ట్‌ డిసీజ్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఐదేళ్లు మానేస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇక 15 ఏళ్ల పాటు మానేస్తే... మామూలు మనిషి అయిపోయినట్లే. కాబట్టి పొగతాగే అలవాటున్న వాళ్లే కాదు... కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పొరుగువాళ్ల... ఆయుర్దాయమూ పెరుగుతుంది. పొగమానడానికి మంచి ముహూర్తం ఈ రోజే!
డాక్టర్‌ సీహెచ్‌ మోహన వంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌
ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్‌.
ఫోన్‌: 98480 11421
కర్నూలు: 08518–273001


కర్మఫలాన్ని అనుభవించక తప్పదు_ It is wrong to experience the karmafal


కర్మఫలాన్ని 
అనుభవించక తప్పదు
‘ఓ రాజశ్రేష్ఠుడా! నీవు ప్రసిద్ధమైన ఇక్షాకు వంశంలో జన్మించావ్ఞ. నీమాటలు నీవంశ ప్రతిష్ఠకు తగినట్లే ఉన్నాయి. నీవ్ఞ ఎల్లప్ఞ్పడూ వశిష్ఠుని ఉపదేశాలను పొందుతూ ఉండటం వలన నీవ్ఞ పలికిన వినయ పూర్వకమైన మాటలన్నీ సబబుగానే ఉన్నాయి.రాజా! నేనొక సిద్ధికోసం ఒక యాగం తలపెట్టాను.ఆ యాగ నియమం ప్రకారం నేను కోపాన్ని పూర్తిగా విడవ వలసి ఉన్నది ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ ఎవరికీ శాపమీయరాదు.నేను శాపమీయలేనన్న ధైర్యంతో కామరూప్ఞలైన మారీచ సుభాహవ్ఞలనే రాక్షసులు నా యాగాన్ని విఘ్నాలు కల్పిస్తున్నారు. అని విశ్వామిత్రుడు ధశరథునికి చెప్పాడు.(ప్ఞట-29-బాలకాండము, 19వ సర్గ-శ్రీమద్రామాయణము) యాగ రక్షణ కొరకు శ్రీరాముడిని పంపమని కోరాడు. అపుడు దశరథుడు విశ్వామిత్రునితో ‘ఓ మునిశ్రేష్ఠా! పద్మముల వంటి కన్నులు కలిగిన నా రామునికి పదునారు సంవత్సరాలైనా నిండలేదు, పసి బాలుడు.. అరవైవేల సంవత్సరాల పుత్రసంతానము లేని వాడనై పుత్రకామేష్టి యాగం చేసి ఈరామున్ని పొందాను.
నా స్థితిగతులను మనుసులో ఉంచుకొని రాముని మీతో పంపమని కోరవద్దు అని చెప్పాడు. ఆ తర్వాత వశిష్ఠుతడు నచ్చచెప్పడంతో రామ లక్ష్మణులను యాగ రక్షణకుగాను విశ్వామిత్రుని వెంట పంపాడు. ఆ తర్వాత యాగం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకెళ్ళాడు. శ్రీరాముడు శివ ధనస్సును విరచటం జరిగింది. శ్రీరామలక్ష్మణ భరత శత్రఘ్నుల వివాహలు జరిగాయి.(బాలకాండము 22 నుంచి 77 సర్గ). కొంత కాలమైనా సంతోషంగా గడిచిందో లేదో అప్ఞ్పడే దశరథునికి తన ముసలితనము గుర్తుకొచ్చింది. నా శరీరమంతా పండి ఒడలిపోయింది ఇట్లాగే ఎక్కువ కాలం పరిపాలించలేను.నా శరీరం విశ్రాంతి ని కోరుకుంటుంది.(ప్ఞట 97) అని ప్రముఖులకు చెప్పాడు.
అందరి అంగీకారం తో శ్రీరాముని పట్టాభిషేకము చేయదలిచాడు. వేదపండితులు, దైవజ్ఞులు దివ్యమైన ముహుర్తాన్ని నిర్ణయించారు. పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి చివరకు కైకేయికి తాను ఇచ్చిన వరాల కారణంగా శ్రీరాముడిని 12 ఏండ్లు వనవాసం చేసిరావల్సిందిగా చెప్పవలసి వచ్చింది దశరథునికి. తండ్రి మాటను నెరవేర్చటానికి శ్రీరాముడు సీత తోను,లక్ష్మణునితోను కలిసి అడవికి వెళ్ళాడు.ఇక దశరథుని బాధ వర్ణనాతీతం. దుఃఖాన్ని భరించలేని వాడై అర్ధరాత్రి సమయం లో ప్రాణాలు విడిచాడు.ఇదీ మనకు శ్రీమద్రామాయణం చెప్పే కధ. ఇప్ఞ్పడు దశరధుని జీవితాన్ని గూర్చి కాస్త యోచిద్దాం.ఆయన రాజులలో శ్రేష్ఠుడు,మంచి వంశానికి చెందినవాడు,వశిష్ఠు ఉపదేశాలను పాటించేవాడు,ఎంతో వినయ విధేయతలుండేవాడు,మృధువ్ఞగా మాట్లాడేవాడు.మరి అంత మంచి వ్యక్తి యొక్క జీవితం చాలా మటుకు దుఃఖంతో నిండియున్నట్లు తెలుస్తుంది.
అరవైవేల సంవత్సరాలు ఆయనకు ప్ఞత్ర సంతానము లేదు. ఒకవేళ మనం దీన్ని నమ్మలేక పోయినా చాలా కాలం వరకు ఆయనకు పిల్లలు ప్ఞట్టలేదని భావిస్తాము. ప్ఞత్రులు లేకపోతే ప్ఞన్నామనరకం వస్తుందని భావించే ఆ రోజుల్లో అప్ఞత్రస్యగతిర్నాస్తి అని భావించే ఆ యుగంలో దశరథుడు ఎంత బాధపడి ఉంటాడో, ఎంత మనోవ్యధకు గురై ఉంటాడో, నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపి ఉంటాడో మనం ఊహిచలేము.సరే చాలాకాలం తర్వాత ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత సంతానం కల్గితే వారికి పదహరు సంవత్సరాలు వయస్సు కూడా వచ్చీరాకముందే యాగ సంరక్షణ కొరకు ఒకసారి, కైకేయి కోరిక తీర్చటానికి మరోసారి దట్టమైన ,భయంకరమైన అడవ్ఞల్లోకి పంపవలసివస్తే ఎంత బాధ కల్గిఉంటుంది.? చివరకు ఏడుస్తూనే ప్రాణాలు వదిలాడు. అంత మంచి వ్యక్తికి ఎందుకు అలా జరిగి ఉంటుంది.? ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదంటుంది శాస్త్రం.దశరథుడు ఏమి చేశాడు? అందరికి తెలిసిన జవాబు ఒకప్ఞ్పడు దశరథుడు వేటకు వెళ్ళి శబ్దవేధివిద్యతో బాణప్రయోగం చేయటం ,ఒక మునికుమారుణ్ణి చంపటం,మునీశ్వరుడు ”నువ్ఞ్వ కూడా నాకు మల్లేనే ప్ఞత్రశోకంతో మరణిస్తావ్ఞ. (ప్ఞట 205- అయోధ్యకాం డము- 64వ సర్గ) అని శపించటం.సరే,దశరధుడి దుఃఖానికి కారణమది,మరి దశరధుడొక్కడే దుఃకించలేదు. ఆయన భార్యలు, మంత్రులు, అయోధ్యా ప్రజలు-అందరూ దుఃకించారు. మరి దానికి కారణమేమిటి? వారందరూ చేసిన కర్మ ఏమిటి? శ్రీమద్రామాయణాన్నే మనం క్షుణ్ణంగా గాలించాలి. కారణం దొరక్కపోదు చూద్దాం. మొట్టమొదట ప్ఞత్రార్ధియై అశ్వమేధయాగాన్ని చేయ సంకల్పించినట్లు దశరథుడు చెబితే వశిష్ఠుడు మున్నగు బ్రాహ్మణోత్తములందరూ దశరథుని నిర్ణయాన్ని వేనోళ్ళ అభినందించారు. (ప్ఞట-14) అశ్వమేధ యాగాన్ని ఘనంగా జరిపించారు.
దశరథ మహరాజు రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకెయి ముగ్గురూ యాగాశ్వానికి భక్తి పూర్వకంగా ప్రదక్షిణ చేశారు. ఋత్వికుల ఆదేశాలను అనుసరించి వారంతా ఆ అశ్వాన్ని మూడు బంగారు సూదులతో గంట్లు పెట్టారు. వెంటనే ఆ అశ్వం పడిపోయింది (ప్ఞట-21). యాగ విధానాల్ని క్షుణ్ణంగా తెలిసిన ఋత్వికులు యాగాశ్వం మెదడును నేర్పుగా బయటకు తీస్తారు. మంత్రోక్తంగా హోమం చేస్తారు. తక్కిన ఋత్వికులంతా యాగాశ్వం యొక్క మిగిలిన శరీర భాగాల్ని హోమం చేస్తారు. (ప్ఞట-22) బ్రాహ్మణులందరూ గోవ్ఞలను, బంగారు నాణాలను స్వీకరిస్తారు, అందరూ సంతుష్టిగా తింటారు. అలాగే అందరూ పాలుపంచుకుంటారు. అలాంటి హింసతో కూడిన యజ్ఞం చేయటం వల్ల కల్గిన పాపంలోనూ అని మనం బాగా గ్రహించాలి ఏమిటీ? రాజర్షి చేసిన యజ్ఞంలో పాలు పంచుకుంటే పాపంతో పాలు పంచుకోవలసి వస్తుందా? అంటారేమో! రాజర్షి చేసినా,బ్రహ్మర్షి చేసినా, బ్రహ్మయే చేసినా ,పాపం పాపమే.ఎందుకంటే అది కామ్యకర్మ కాబట్టి,నిష్కామ కర్మకాదు కాబట్టి. ఆనాడు ముని కుమారుడిని చంపటమే పాప కర్మగా దశరధుడుకి అనిపించవచ్చు.
పైగా అది దశరథునికి తెలిసి చేసిన కర్మకాదు, తెలియక చేసిన కర్మ నుంచే అంత దుఃఖం కల్గితే తెలిసి తెలిసి సజీవంగా, ఆరోగ్యంగానున్న ఒక అశ్వాన్ని సూదులతో,కత్తులతో కుచ్చి కుచ్చి చంప్ఞతే పాపం రాదా? దాని ఫలితంగా వచ్చిన కర్మను అనుభవించక తప్ఞ్పతుందా?అందుకే దాన్ని ఒక సత్కార్యంగా భావించి దాంట్లో భాగస్వాములైన రాణులు,మంత్రులు,బ్రాహ్మణులు దుఃఖంని అనుభవించారని ఈనాటికీ మనం గ్రహించక పోతే ఎట్లా? పిల్లలు కల్గని ఏ విద్యావంతునికైనా నేడు అశ్వాన్ని బలివ్ఞ్వ పిల్లలు కలుగుతారంటే, నాకు పిల్లలు కలగకపోయినా పర్వాలేదు, మూగ జీవిని నా స్వార్ధం కోసం చంపను అని అనడా? అది కదా విద్యావంతుని, బుద్ధిమంతుని లక్షణం. స్వార్ధం కోసం పరజీవ్ఞలను హింసించటం తప్పని, కర్మఫలాన్ని అనుభవించుట ఎవరికో ఎంతటివారికైనా తప్పదని బోధిస్తుంది శ్రీమద్రామాయణం                                    – రాచమడుగు శ్రీనివాసులు

స్నాతకోత్సవం_అంతర్యామి_Antaryami



స్నాతకోత్సవం
క్షరం కానిది అక్షరం. ఆ అక్షర ఉపాసన జ్ఞాన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. విశ్వమంతటినీ చూడగలిగేలా చేస్తుంది. వ్యక్తి ఉత్తమ జీవిత లక్ష్యాలు ఏర్పరచుకొనేందుకు అది దోహదపడుతుంది. అతడి నడక, నడత ఆదర్శవంతమయ్యేలా చేయగలిగేది జ్ఞానోపాసనే!
విద్యార్జన పూర్తయ్యాక పట్టా ప్రదానం చేస్తారు. ఆ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయాల్లో ‘స్నాతకోత్సవం’ పేరిట నిర్వహిస్తారు. ఫలితంగా విద్యార్థులు పట్టభద్రులవుతారు.
స్నాతకోత్సవ సంరంభం అంటే- జీవన గమ్యాన్ని, సత్యాన్ని ఎరుకపరచే ఓ ఉపదేశ వేదిక. దీన్ని మనకు ప్రాచీన రుషి పరంపర ప్రసాదించింది. స్నాతకమే జీవితాన్ని, ధర్మనియతిని సంధానిస్తుంది. ఒకప్పుడు విద్యార్థి గురుకుల ఆశ్రమాల్లో విద్య నేర్చుకునేవాడు. అదొక దీక్షా కాలం. అతడు తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శిక్షణాలయమది. అనంతరం కలిగే గృహస్థ జీవితం అనేక బాధ్యతలతో కూడి ఉంటుంది. వంశ గౌరవాన్ని నిలబెట్టాల్సిన విధి అతడిదే!
శిష్యుడు గురుకులాన్ని వదిలే ముందే- సమాజంలో నెరవేర్చాల్సిన కర్తవ్యాల్ని, గృహస్థాశ్రమ ధర్మాల్ని వివరించేవారు. అప్పటివరకు అతడికి గురువే దైవం, విద్యే ప్రపంచం! అతడు స్నాతకుడవుతాడు. స్నాతక వ్రతం ఆచరిస్తాడు. అతడి రూపం మారుతుంది. జీవన దశ పరిణామం చెందుతుంది.
జనకుడి ఆహ్వానం మేరకు, మిథిలలో శ్రీరామచంద్రుడి కల్యాణానికి దశరథుడు తరలి వెళతాడు. విశ్వామిత్ర, వసిష్ఠ మహామునుల నేతృత్వంలో- కల్యాణానికి ముందుగా రాముడికి స్నాతకోత్సవం జరిపిస్తాడు. వివాహ వేడుకలోనూ స్నాతకం అనేది ప్రాధాన్యం గల ఓ ఘట్టం!
స్నాతకమే కాలగమనంలో స్నాతకోత్సవంగా మారింది. విద్యాలయాలు కేవలం నాలుగు అక్షరాలు నేర్పడానికే పరిమితం కాకూడదు. విద్యార్థుల్ని ఉన్నత విలువలు గల పౌరులుగా రూపొందించే బాధ్యతనూ అవి స్వీకరించాలని ‘తైత్తిరీయోపనిషత్తు’ చెబుతోంది. అందుకు ప్రాథమికంగా పన్నెండు అంశాలు అత్యవసరమవుతాయి.
విద్యార్థికి క్రమశిక్షణాయుతమైన జీవనశైలి అలవడాలి. సత్యసంధత కావాలి. అవసరాల్ని కనిష్ఠ స్థాయికి తగ్గించుకోవడం, ఉద్వేగాల్ని నియంత్రించడం, మనసు ప్రశాంతంగా ఉండేలా చూడటం, లోకం నుంచి అతడు పొందినవి తిరిగి ఇవ్వడం- ఉత్తమ లక్షణాలు. దేవతలు, రుషులు, పితృదేవతలతో పాటు సకల జీవుల ప్రీత్యర్థం అతడు యాగాలు నిర్వహించాలి. అగ్ని ఆరాధనతో పాటు అతిథి సత్కారం సాగించాలి. తోటివారికి మేలు కలిగించే గుణాల్ని విద్యార్థి తనకు తానుగా వృద్ధి చేసుకోవాల్సి ఉంది. గృహస్థుగా మంచి సంతానాన్ని పొందడం ద్వారా వారిని ఉదాత్త పౌరులుగా తీర్చిదిద్దాలి. ఆ సంకల్పం అతడికి విద్యార్థి దశలోనే ఏర్పడాలి.
ఇక రెండో పార్శ్వంలో- పట్టభద్రుడైన వ్యక్తి ప్రగతి సాధకుడిగా మారాలి. దైనందిన విధానంలో నేర్చిన విద్యను జీవితానికి అనుసంధానించగలిగే నిపుణత పుణికి పుచ్చుకోవాలి. అప్పుడే కుటుంబానికి, సమాజానికి అతడు ఘనమైన వారసత్వం అందించినట్లవుతుంది.
శాస్త్రాల్లోని తత్వాల్ని జీవితంలో ఆచరణకు తేవడం విద్యార్థి విధి. అది కొరవడినప్పుడు, అతడు ఎంత నేర్చినా నిష్ప్రయోజకం! శాస్త్రాల్ని చదివినంత మాత్రాన భగవత్‌ తత్వాన్ని నిరూపించలేరు. అలా చేయాలని చూడటం- కాశీనగరాన్ని పటంలో చూసి, ఇతరులకు వర్ణించడం వంటిదని రామకృష్ణ పరమహంస అనేవారు.
వాస్తవ జీవితం సవాళ్లు విసురుతుంటుంది. విద్యార్థి చదివినదానికి, సమాజంలో ఎదురయ్యే పరిస్థితికి సంబంధం లేదనిపిస్తుంది. అంతమాత్రాన- ఉపదేశాల్ని, సందేశాల్ని ఎన్నటికీ మరవకూడదు. నేర్చుకున్న విద్య దీపం వంటిది. ఆ వెలుతురులో ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ!
- దానం శివప్రసాదరావు

దాసరి నారాయణరావు-Dasari Narayana Rao

దాసరి నారాయణరావు
Dasari Narayana Rao
జననం మే 4, 1942
పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్, ఇండియాభారతదేశం
మరణం మే 30, 2017
హైదరాబాద్
మరణ కారణము కిడ్నీ సమస్య
ఇతర పేర్లు దాసరి,దర్శక రత్న
ప్రసిద్ధి సినిమాలు, రాజకీయం
రాజకీయ పార్టీ కాంగ్రేసు పార్టీ
మతం హిందూమతం
భార్య / భర్త దాసరి పద్మ
పిల్లలు ప్రభు,అరుణ్ కుమార్,హేమాలయకుమారి
డా. దాసరి నారాయణరావు ( మే 4, 1942 - మే 30, 2017) ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.


కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.
దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.
మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.

బాల్యం
1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. వారు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి మూడో వాడు.
వారి నాన్న తరం వరకూ మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న. దాసరి ఆరో తరగతి కొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూపాయి.
ఆరో తరగతిలో ఉత్తమవిద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకెళ్లాల్సిన దుస్థితి. కానీ ఒక మాస్టారు సాయంతో మళ్ళీ చదువు కొనసాగించాడు.
రాజకీయాలలో
హైదరాబాదునందు కేంద్ర మంత్రిగా దాసరి తెలుగు ఫాంట్స్ విడుదల సందర్భముగా ప్రసంగిస్తున్న దృశ్యం
రాజీవ్ గాంధీ పాలనాకాలములో, దాసరి కాంగ్రేసు పార్టీ తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. ఈయన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
మరణం
దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించారు.

అవార్డులు
1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నారు.
స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందారు.
1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు.
1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు.
1986లో తెలుగు సంస్కృతి మరియు తెలుగు చిత్ర రంగం నకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు.
ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళా సాగర్, శిరోమణి ఇన్స్టిట్యుట్ మొదలైనవి. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు.
జ్యోతి చిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డ్ ను 3 సార్లు పొందారు.
పాత కాలం నాటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యారు.
ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డ్ లను గెలుచుకున్నాయి.
చిత్రసమాహారం
1970 దశాబ్దం
తాత మనవడు (1972) (మొదటి సినిమా)
సంసారం సాగరం (1973)
బంట్రోతు భార్య (1974)
ఎవరికి వారే యమునా తీరే (1974)
రాధమ్మ పెళ్ళి (1974)
తిరుపతి (1974)
స్వర్గం నరకం (1975)
బలిపీఠం (1975)
భారతంలో ఒక అమ్మాయి (1975)
దేవుడే దిగివస్తే (1975)
మనుషులంతా ఒక్కటే (1976)
ముద్దబంతి పువ్వు (1976)
ఓ మనిషి తిరిగి చూడు (1976)
పాడవోయి భారతీయుడా (1976)
తూర్పు పడమర (1976)
యవ్వనం కాటేసింది (1976)
బంగారక్క (1977)
చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
ఇదెక్కడి న్యాయం (1977)
జీవితమే ఒక నాటకం (1977)
కన్యాకుమారి (1978)
దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)
కటకటాల రుద్రయ్య (1978)
శివరంజని (1978)
స్వర్గ్ కరక్ (హిందీ, 1978) (Story, Screenplay and Director)
గోరింటాకు (1979)
కళ్యాణి (1979)
కోరికలే గుర్రాలైతే (1979)
నీడ (1979)
పెద్దిల్లు చిన్నిల్లు (1979) (actor and director)
రాముడే రావణుడైతే (1979)
రంగూన్ రౌడీ (1979)
ఊఫ్ఫేణా (1980)
1980 దశాబ్దం[మార్చు]
జ్యోతి బనే జ్వాల (హిందీ, 1980)
బండోడు గుండమ్మ (1980)
భోళా శంకరుడు (1980)
బుచ్చిబాబు (1980)
సర్కస్ రాముడు (1980)
దీపారాధన (1980)
ఏడంతస్తుల మేడ (1980)
కేటుగాడు (1980)
Natchatiram (1980)
పాలు నీళ్ళు (1980)
సర్దార్ పాపారాయుడు (1980)
సీతారాములు (1980)
శ్రీవారి ముచ్చట్లు (1980)
స్వప్న (1980) (Director)
యే కైసా ఇన్సాఫ్ (1980)
ప్యాసా సావన్ (1981) (Director)
అద్దాల మేడ (1981)
ప్రేమాభిషేకం (1981)
ప్రేమ మందిరం (1981)
ప్రేమ సింహాసనం (1981)
బొబ్బిలి పులి (1982) (Story, Dialogues, Screenplay and Director)
గోల్కొండ అబ్బులు (1982)
జగన్నాథ రథచక్రాలు (1982)
జయసుధ (1982)
కృష్ణార్జునులు (1982)
మెహిందీ రంగ్ లాయేగీ (హిందీ, 1982)
ఓ ఆడది ఓ మగాడు (1982)
రాగదీపం (1982)
స్వయంవరం (1982)
యువరాజు (1982)
ప్రేమ్ తపస్య (హిందీ, 1983)
బహుదూరపు బాటసారి (1983)
మేఘసందేశం (1983)
ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు (1983)
పోలీస్ వెంకటస్వామి (1983)
రాముడు కాదు కృష్ణుడు (1983)
రుద్రకాళి (1983)
ఊరంతా సంక్రాంతి (1983)
యాద్గార్ (హిందీ, 1984)
ఆశాజ్యోతి (1984)
Aaj Ka శాసన సభ్యులు. Ram Avtar (1984)
అభిమన్యుడు (1984)
హైసియత్ (హిందీ, 1984)
జగన్ (1984)
జస్టిస్ చక్రవర్తి (1984)
పోలీస్ పాపన్న (1984)
యుద్ధం (1984)
జఖ్మి షేర్ (హిందీ, 1984)
వఫాదార్ (హిందీ, 1985) (Director)
బ్రహ్మముడి (1985)
ఏడడుగుల బంధం (1985)
లంచావతారం (1985)
పెళ్ళి మీకు అక్షింతలు నాకు (1985)
తిరుగుబాటు (1985)
ఆది దంపతులు (1986)
ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
తాండ్ర పాపారాయుడు (1986)
ఉగ్ర నరసింహం (1986)
ఆత్మ బంధువు (1987)
బ్రహ్మ నాయుడు (1987)
మజ్ను (1987)
నేనే రాజు – నేనే మంత్రి (1987)
హిట్లర్ (1997) (Actor)
విశ్వనాథ నాయకుడు (1987)
బ్రహ్మ పుత్రుడు (1988)
ఇంటింటి భాగోతం (1988)
కాంచన సీత (1988)
ప్రజా ప్రతినిధి (1988)
లంకేశ్వరుడు (1989) (Writer and Director)
బ్లాక్ టైగర్ (1989)
మాత్ కీ లడాయి (హిందీ, 1989)
నా మొగుడు నాకే సొంతం (1989)
టూ టౌన్ రౌడీ (1989)
1990 దశాబ్దం[మార్చు]
అహంకారి (సినిమా)
మా అల్లుడు (1990)
అమ్మ రాజీనామా (1991) (actor and director)
నియంత (1991)
రాముడు కాదు రాక్షకుడు (1991)
అహంకారి (1992)
సూరిగాడు (1992)
సుబ్బారాయుడి పెళ్ళి (1992)
మామగారు (1991)
వెంకన్నబాబు (1992)
సంతాన్ (1993)
అక్క పెత్తనం చెల్లెలి కాపురం (1993)
కుంతీ పుత్రుడు (1993)
మామా కోడలు (1993)
బంగారు కుటుంబం (1994)
నాన్నగారు (1994)
కొండపల్లి రత్తయ్య (1995)
మాయా బజార్ (1995)
ఒరే రిక్షా (1995)
విశ్వామిత్ర (1995)
కళ్యాణ ప్రాప్తిరస్తు (1996)
ఒసే రాములమ్మ (1997)
గ్రీకువీరుడు (1998)
2000 దశాబ్దం[మార్చు]
అడవి చుక్క (2000)
కంటే కూతుర్నే కను (2000) (story, dialogues, lyrics, screenplay and direction)
సమ్మక్క సారక్క (2000)
చిన్నా (2001)
కొండవీటి సింహాసనం (2002) (Producer and Director)
రైఫిల్స్ (2002)
ఫూల్స్ (2003)
మైసమ్మ IPS (2007) (Story Writer)
ఆదివారం ఆడవాళ్లకు సెలవు (2007)
మేస్త్రీ 2009
యంగ్ ఇండియా 2010
పరమ వీరచక్ర 2011


శ్రీ లక్ష్మి ధ్యానం-Sri Lakshmi Dyanam


శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం-Sri Lakshmi Astottara Shathanama Stotram



షోడశ దానాలు: 

దానాలన్నిటిలో ముఖ్యమైనవి షోడశదానాలు, అవి వరుసగా :: 

(1) కన్యా దానం = దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
(2) సువర్ణ దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
(3) దాసీజనం దానం = దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
(4) వాహన దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
(5) అశ్వ దానం = దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది.
(6) గజ (ఏనుగు) దానం = దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది.
(7) గ్రుహ దానం = తీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది.
(8) నాగలి దానం = దీనివల్ల క్రుష్ణ ప్రీతి కలుగుతుంది.
(9) కాలపురుష దానం = దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది.
(10) కాలచక్ర ప్రతిమ = దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.
(11) భూ దానం = దీనివల్ల శివలోకం నివాసం కలుగుతుంది.
(12) మేక దానం = దీనివల్ల శివ ప్రీతి కలుగుతుంది.
(13) వ్రుషభ దానం = దీనివల్ల మ్రుత్యుంజయం కలుగుతుంది.
(14) పాన్పు దానం = దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది.
(15) గో దానం = దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
(16) నువ్వురాశి దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

*దశ, షోడశ దానాలేవి?
గో, భూ, తిల, హిరణ్య, రత్న, విద్య , కన్యా దాది పదహారు దానాలు షోడశ దానాలు.
గో, భూ, తిల, హిరణ్య, ఆజ్య, వస్త్ర, ధాన్య , గుడ, రౌష్య, లవణ దానాలు దశ దానాలు.
మహాఋషులు, దేవతలు దశ,షోడశ దానాలలో అన్నదానాన్ని చేర్చలేదు. అందుకే అన్ని దానాల కంటే అన్నదానం మహొన్నతమైనది.
దానాలు దశదానాలని, షోడశ దానాలని రకరకాలుగా ఉంటాయి. దశదానాలంటే - గో, భూ, తిల, హిరణ్య, ఆఙ్య, వస్త్ర, ధాన్య, గుడ, రౌష్య, లవణ దానాలు. షోడశ దానాలంటే - గోదానము, భూదానము, తిల దానము, హిరణ్యదానము, రత్నదానము, విద్యాదానము, కన్యాదానము, దాసీదానము, శయ్యాదానము, గృహదానము, అగ్రహారదానము, రథదానము, గజదానము, అశ్వదానము, చాగదానము, మహిషిదానము.
1 గోదానము, 2 భూదానము, 3 ధన దానము, 4 రత్న దానము, 5 గృహ దానము, 6 రథ దానము, 7 గజ దానము, 8 అశ్వ దానము, 9 కన్యా దానము, 10 విదా దానము, 11 వస్త్ర దానము, 12తిలా దానము, 13 హిరణ్య దానము, 14 రజత దానము, 15 శయ్యా దానము, 16 శయ్యా దానము.
పోతన తెలుగు భాగవతం
ఈలోకములొగాని , పరలోకములోగాని .. ఏమీ ఆశించకుండా ఉదారముగా ఇవ్వడాన్నే దానము అనాలి.
16 దానాల పేర్లు :
గావ (ఆవులు) దానము
సువర్ణ (బంగారము ) దానము
రజిత (వెండి) దానము
రత్నాని (నవరత్నాలలో ఏదోఒకటి లేదా అన్నీ) దానము
సరస్వతీ (పుస్తకం) దానము
ధాన్యము (ఏ ధాన్యమైనా సరే) దారము
పయస్వినీం (పాలిచ్చే శక్తి ఉన్న ఈనని గోవు) దానము
చత్రము (గొడుగు) దానము
గృహము (ఇల్లు) దానము
తిలా (నువ్వులు) దానము
కన్య (అల్లునికి వివాహంలో కూతురు) దానము
గజ (ఏనుగు) దానము
అశ్వ (గుర్రము) దానము
శయ్యా (మంచం, దుప్పటి, దిండు) దానము
వస్త్రము (బట్టలు) దానము
మహి (భూమి) దానము

శీఘ్రముగా (పురుషులకు) వివాహ యోగమును ప్రసాదించే "శ్రీ కౌమారీ అమ్మవారు" GentsMarregeREMIDE

శీఘ్రముగా (పురుషులకు)

 వివాహ యోగమును ప్రసాదించే 

 "శ్రీ కౌమారీ అమ్మవారు"

వివాహ ఆటంక సంబంధమైన సమస్యలను తొలగించి 

అత్యంత శీఘ్రముగా (పురుషులకు) వివాహ యోగమును ప్రసాదించే

"శ్రీ కౌమారీ అమ్మవారు"

షడాననాతు కౌమారీ పాటలాభా సుశీలకా ।
రవిబాహుః మయూరస్థా వరదా శక్తిధారిణీ ।

ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన (పురుషులకు) వివాహ సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహముయందు, నివాస స్థలములయందు ఈ మూర్తిని దక్షిణ దిశలో ఉత్తర ముఖముగా ఉంచి ఎర్ర గన్నేరు పుష్పములతో ఆరాధించిన త్వరితముగా దోషాదులు తొలగి వివాహ అనుకూలత కలుగునని శాస్త్రవచనము.
శీఘ్రముగా (స్త్రీలకు) "వివాహ యోగమును",
"దీర్ఘ సౌభాగ్యమును" ప్రసాదించే 
"శ్రీ ఇంద్రాణీ అమ్మవారు" 
వివాహ ఆటంక సంబంధమైన సమస్యలను తొలగించి
అత్యంత శీఘ్రముగా (స్త్రీలకు) "వివాహ యోగమును", "దీర్ఘ సౌభాగ్యమును" ప్రసాదించే
"శ్రీ ఇంద్రాణీ అమ్మవారు"
ఐంద్రీ సహస్రదృక్ సౌమ్యా హేమాభా గజ సంస్థితా ।
వరదా అభయం దేవీ సౌభాగ్యం దేహిమే సదా ।।
ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన (స్త్రీలకు) వివాహ సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహముయందు, నివాస స్థలములయందు ఈ మూర్తిని వాయవ్య దిశలో ఆగ్నేయ ముఖముగా ఉంచి మందార పుష్పములతో ఆరాధించిన త్వరితముగా దోషాదులు తొలగి వివాహ అనుకూలత, దీర్ఘ సౌభాగ్యము కలుగునని శాస్త్రవచనము.


అన్నీ నోటి మాటలే!-Today Important Posts 30th May 2017



అన్నీ నోటి మాటలే! 

పూర్వం ఒకానొక పట్టణంలో కాళీదేవి ఆలయం ఉండేది. అమ్మవారి దర్శనార్థం వేలమంది భక్తులు తరలివస్తుండేవారు. అందరూ అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చి.. ‘అమ్మా! ఈ పాపపు లోకంలో ఉండలేక పోతున్నాను. ఈ మాయాకూపం నుంచి నన్ను బయట పడేలా చూడు తల్లి. నీ భక్తుడికి మోక్షం ప్రసాదించు’ అని వేడుకుంటూ ఉండేవారు. భక్తులు పదే పదే అదే కోరుకోవడంతో ఆలయ పూజారికి విసుగు పుట్టింది. అసలు ఈ భక్తుల మాటల్లో విశ్వసనీయత ఎంతో తెలుసుకోవాలనుకున్నాడు. మార్నాడు భక్తులు వచ్చేసరికి అమ్మవారి విగ్రహం వెనుక ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు పూజారి. కాసేపటికి భక్తులంతా వచ్చారు. అందరూ తమకు ముక్తి ప్రసాదించాల్సిందిగా కోరుకుంటున్నారు. అమ్మవారి వెనక దాక్కున్న పూజారి సన్నని గొంతుకతో.. ‘భక్తులారా! మీ భక్తికి మెచ్చాను. మీలో మోక్షం కావాలని అనుకుంటున్న వారంతా.. నా విగ్రహం దగ్గరికి రండి. నాలో అంతర్ధానం చేసుకుంటాను’ అన్నాడు. ఆ మాటలు అమ్మవారే పలికిందని భావించిన భక్తులు ఒక్కసారిగా మిన్నకుండిపోయారు. ఒక్కొక్కరుగా అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. కాసేపయ్యాక పూజారి బయటకు వచ్చి చూస్తే.. ఆలయంలో ఒక్క భక్తుడూ లేడు. ఈ భక్తుల మాటలు మనసులో నుంచి వచ్చినవి కావని, కేవలం నోటి మాటలే అని పూజారికి అర్థమైంది. అమ్మవారికి ప్రణమిల్లి.. ‘నీ బిడ్డలను చల్లగా చూడు తల్లి’ ప్రార్థించాడు.


అంతా ‘ఫెయిర్‌’ ఏనా? 

దేశంలో యేటా 3 వేల కోట్ల ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ల వ్యాపారం జరుగుతోందంటే వీటికున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. అయితే తెల్లనివన్నీ పాలు కానట్టే! చర్మాన్ని తెల్లగా మార్చే ఈ క్రీములన్నీ సురక్షితమైనవి కావు. వీటిలో దాదాపు 10 శాతం క్రీమ్‌లలో హానికారక స్టిరాయిడ్లు ఉంటున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

చర్మపు రంగు గురించిన స్పృహ పెరిగిపోతోంది. ఈ తీరుతో కొత్త కొత్త ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ల తయారీ పెరిగింది. వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌తో పని లేకపోవటం, మార్కెట్లో తేలికగా దొరుకుతుండటంతో వీటి వాడకం కూడా పెరిగిపోతోంది. చర్మాన్ని తెల్లబరుస్తాయని అంటే చాలు! ఎంత డబ్బైనా వెచ్చించి వాటిని కొనుగోలు చేసే యువత శాతం క్రమేపీ పెరుగుతోంది. అయితే...ఇలా దొరికే ఫెయిర్‌నెస్‌ క్రీములన్నీ సురక్షితం కావు. చర్మం మీద ప్రభావం చూపించి తెల్లగా మార్చటం కోసం వీటిలో స్టెరాయిడ్లు, బ్లీచింగ్‌లు కలుపుతున్నారు. వీటి వల్ల తాత్కాలికంగా చర్మం తెల్లబడినట్టు అనిపించినా దీర్ఘకాలంలో తిరిగి సరిదిద్దలేని చర్మ సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్యులు.

స్టెరాయిడ్లు, బ్లీచింగ్‌లు దుష్ప్రభావాలు
ఇవి చర్మం పై పొర తొలగిపోయేలా చేస్తాయి. దాంతో చర్మం అడుగునున్న తెల్లని పొర బయటపడి చర్మం తెల్లబడినట్టు అనిపిస్తుంది. కానీ తిరిగి తొలగిపోయిన చర్మపు పొర తయారయ్యే సమయం ఇవ్వకుండానే పదే పదే స్టిరాయిడ్‌లతో తయారైన ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ వాడటం వల్ల చర్మపు పొరలు తొలగిపోయి పుండ్లు పడతాయి. ఇన్‌ఫెక్షన్లు బాధిస్తాయి. చర్మం పలుచగా తయారై మరింత సున్నితమవుతుంది. ఎండకు గురైతే కమిలిపోవటం, సన్‌ ట్యాన్‌ సమస్యలు ఎక్కువవుతాయి. దీర్ఘకాలం వాడటం వల్ల చర్మం నల్లబడిపోతుంది.

సహజసిద్ధంగా తెల్లబడాలంటే?
ఫెయిన్‌నెస్‌, వైటెనింగ్‌ క్రీముల దుష్ప్రభావాలను లోనుకాకుండా ఉండాలంటే వీటి వాడకం పూర్తిగా మానేయాలి. మచ్చలు, మొటిమలు, సన్‌ట్యాన్‌తో చర్మం నల్లబడిన వారు చర్మ వైద్యుల్ని సంప్రతించి తమ చర్మ తత్వానికి తగిన చికిత్స తీసుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన స్కిన్‌ క్రీమ్స్‌ వాడితే చర్మం సహజసిద్ధమైన మెరుపుదనం సంతరించుకుంటుంది. చర్మపు తత్వానికి తగిన సబ్బు, సన్‌స్ర్కీన్‌, మాయిశ్చరైజింగ్‌ లోషన్లను వాడుతూ.. ఈ క్రింది జాగ్రత్తలు కూడా పాటిస్తే ఎలాంటి స్టిరాయిడ్‌ బేస్‌డ్‌ క్రీమ్‌లతో పని లేకుండానే ఆరోగ్యకరమైన రీతిలో తెల్లబడొచ్చు.

ఎండలోకి వెళ్లేటప్పుడు చర్మాన్ని కవర్‌ చేసుకోవాలి.
రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి.
7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి.
తాజా పళ్ల రసాలు, ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవాలి.
చక్కెర వాడకం తగ్గించాలి.
16 ఏళ్ల లోపు యువతులు ఎలాంటి ఫేస్‌ క్రీమ్స్‌ వాడకూడదు.
ఇంట్లో తయారు చేసుకుని వేసుకునే ప్యాక్స్‌ వల్ల తాత్కాలిక ఫలితం మాత్రమే ఉంటుంది.
చర్మానికి సంబంధించిన ఎలాంటి సమస్య వచ్చినా సొంత వైద్యం మాని చర్మ వైద్యులను సంప్రతించాలి.

నిగారింపు కోసం...!

చర్మం కాంతిమంతంగా ఉండాలంటే రోజూ పాలు తీసుకోవాలి. పాలు తాగడం ఇష్టం లేకపోతే పాల ఉత్పత్తులను తీసుకున్నా స్కిన్‌ టోన్‌ మెరగవుతుంది. రాత్రివేళ చల్లటి పాలు తాగితే చర్మసౌందర్యం మెరుగవుతుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ డైట్‌ తప్పనిసరి. సోయా పాలు, ఎరుపు, పసుపు రంగు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
ఈ రోజుల్లో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటోంది. బయటకు వెళ్లి వచ్చిన తరువాత తప్పనిసరిగా నేచురల్‌ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
వారమంతా బిజీగా ఉన్నా వీకెండ్‌లో తప్పనిసరిగా ఫేస్‌ప్యాక్‌ను అప్లై చేసుకోవాలి. ఇంట్లో లభించే పదార్థాలతో చేసుకున్న ఫేస్‌ప్యాక్‌ అయితే మరీ మంచిది.
స్కిన్‌ టోన్‌ పెరగాలంటే తేయాకులను మరిగించి ఆ నీరు చల్లారిన తరువాత ఒక స్పూన్‌ తేనె కలిపి ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖకాంతి పెరుగుతుంది.
రెండు, మూడు టేబుల్‌స్పూన్ల పచ్చిపాలు, అందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది.
ఫేస్‌ప్యాక్‌లు, ఆహారంతో పాటు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అప్పుడే చర్మం ఆరోగ్యంగా, నిగారింపుతో ఉంటుంది.


సిసింద్రీల కోసం...

వేసవిలో పిల్లల ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే పిల్లల కోసం ఈ పది వస్తువులు ఇంట్లో కచ్చితంగా ఉండాలి.
సబ్జా గింజలు: వేడికి దూరంగా ఉంచి... శరీరానికి చల్లదనాన్ని అందించాలంటే ఈ గింజలు బెటర్‌ ఆప్షన్‌. వీటిని తీసుకోవడం వల్ల పోషకాలతో పాటు పీచుపదార్ధం కూడా అందుతుంది. వేసవిలో పిల్లలు డీ-హైడ్రేషన్‌, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యల బారిన పడతారు. ఈ సమస్య రాకుండా నివారిస్తాయి సబ్జా గింజలు. వీటినే తింటే రుచిగా అనిపించవు. అందుకని పళ్ల రసాల్లో, నిమ్మకాయ నీళ్లు, పాలు లేదా ఫలుదా వంటి పానీయాల్లో కలుపుకుని తాగొచ్చు.
పుచ్చకాయ: వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా పోషకాలను కూడా అందిస్తుంది. ఇందులో 92 శాతం నీళ్లు ఉంటాయి. అందుకని వీటిని తినడం వల్ల డీ-హైడ్రేట్‌ అయ్యే సమస్యే ఉండదు. చర్మాన్ని తాజాగా ఉంచడమే కాకుండా శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపేస్తుంది. వేసవిలో పిల్లలకు రోజుకి రెండుసార్లు పుచ్చకాయ తినిపిస్తే డీ-హైడ్రేషన్‌కి గురికారు. అలసిపోరు. రోజూ పుచ్చకాయ ముక్కలే తినాలా అనే పిల్లల కోసం పుచ్చకాయ రసం, స్మూతీ వంటివి తయారుచేయొచ్చు.
కొకమ్‌ షర్బత్: ఈ పానీయం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేలా చేసి.. ఆకలి పెంచుతుంది. విటమిన్‌ - సి మెండుగా కలిగి ఉన్న ఈ పండు యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. దీనివల్ల చర్మంపై చెమటపొక్కులు రావు. కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఉండే ఈ డ్రింక్‌ను పిల్లలు ఇష్టంగా తాగుతారు కూడా.
పెరుగు: ఇందులో విటమిన్లు, ప్రొటీన్లతో పాటు శరీరానికి కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి. పెరుగు తేలికగా జీర్ణం అవ్వడం కూడా ఎంతో తేలిక. వేసవిలో పిల్లలకి పొట్టకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. అందుకని పెరుగు తినిపిస్తే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచొచ్చు. పెరుగులో పండ్లు కలిపి తినడం వల్ల పండ్ల నుంచి లభించే పోషకాలు కూడా అందుతాయి వాళ్లకు.
పుదీనా: అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న పుదీనాలో పోషకాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తుంది. పుదీనాతో చేసిన తినుబండారాలు, డ్రింక్స్‌ పిల్లలకు క్రమం తప్పకుండా ఇస్తుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. అలసిపోకుండా తాజాగా ఉంటారు.

వసంత నీర్‌

(మ్యాంగో కోకోనట్‌ వాటర్‌ డ్రింక్‌)
కావలసినవి:
కొబ్బరి బోండాం నీళ్లు - ఒకటింబావు కప్పులు, నిమ్మచెక్క - సగం(రసం), మ్యాంగో నెక్టార్‌ - పావు కప్పు, తేనె - ఒక టేబుల్‌ స్పూన్‌, పుదీనా కట్ట - ఒకటి.

తయారీ:
పుదీనా ఆకుల్ని తరగాలి. గోరు వెచ్చని నీళ్లలో తేనె కలపాలి.
తరువాత ఒక జగ్‌లో పోసి ఫ్రిజ్‌లో అరగంటపాటు పెడితే వసంత నీర్‌ రెడీ.
టిప్స్‌:
మ్యాంగో నెక్టార్‌(సూపర్‌ మార్కెట్‌లో లభిస్తుంది)కు బదులు మామిడి గుజ్జు లేదా ముక్కలు వాడొచ్చు. మామిడి కలపకపోయినా పర్వాలేదు. కానీ... కలిపితే రుచి బాగుంటుంది.
తేనెను గోరువెచ్చని నీళ్లలో కలిపితే త్వరగా కరిగిపోతుంది. మిగతా పదార్ధాలతో సులభంగా కలిసిపోతుంది.


కాలిన బొబ్బలు మానేందుకు 

నిప్పు రవ్వలు పడటం వల్లగానీ, తీవ్రమైన ఎండలో తిరగడం వల్లగానీ, శరీరం మీద బొబ్బలు రావచ్చు. రసాయన పదార్థాలు, రేడియేషన్‌ వల్ల కూడా ఒంటి మీద బొబ్బలు రావచ్చు. ఒక స్థాయి వరకు వీటిని గృహవైద్యంతోనే నయం చేసుకోవచ్చు. అందుకు

గృహ చిట్కాగా.....
చర్మం కాలినప్పుడు కనీసం 10 నిమిషాల పాటు కాలిన చోట చల్లని నీటిని ధారలా పడేలా ఉంచాలి. ఒకవేళ పొక్కులు వస్తే వాటిని తొలగించే ప్రయత్నం చేయకూడదు. అలా తొలగిస్తే అందులో ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ప్రమా దం ఉంది.
కలబంద గుజ్జును తమలపాకు మందంగా, కాలిన గాయాలపై రాయాలి. గుజ్జుకాకపోతే, కలబంధ రసాన్ని ఆ గాయాలపైన రాయవచ్చు. రోజుకు రెండుసార్లు ఈ రసాన్ని రాస్తే ఎంతో ఫలితం కనిపిస్తుంది. కలబంద వెంటనే లభించని పక్షంలో పసుపు పొడిలో శుద్ధమైన తేనె కలిపి కూడా రాయవచ్చు. ఇదే కాకుండా కొబ్బరి టెంకెను బాగా కాల్చి దాని చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాస్తే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.
గోరింటాకు ముద్దలో వెనిగెర్‌ గానీ, నిమ్మరసాన్ని గానీ కలిపి గాయాలపై పూస్తే కాలిన గాయాల తాలూకు మంట తగ్గుతుంది.
కోడిగుడ్డులోని తెల్లని సొనలో తుమ్మబంక పొడి , కొబ్బరి నూనె కలిపి పూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
అయితే కాలిన గాయాలు శరీరంలో 10 శాతం కన్నా మించితే వెంటనే ఆసుపత్రిలో చేర్పించి తక్షణమే అవసరమైన చికిత్సలు ఇప్పించాలి.


ఊపిరాడదు.. ఎందుకని? 

మా నాన్నగారికి 69 ఏళ్లు. గత కొంత కాలంగా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నారు. అయినా ఈ పరిస్థితికి గల కారణాలేమిటి? బ్రాంకైటిస్‌ అనుకోవడానికి ఆయనకు పొగతాగే అలవాటు కూడా లేదు. రిటైరైనా మొన్నటిదాకా ఏవో పనుల్లో బిజీగా ఉండేవారు. ఇప్పుడు ఏ చిన్న పనిచేసినా ఆయాసం వస్తోంది. ఒక్కోసారి అడుగు తీసి అడుగు వేసినా ఆయాసం వస్తోంది.అందుకే ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో చెప్పండి.
- ఎల్‌. వికాస్‌, రాజమండ్రి

గుండె సక్రమంగా పనిచేయని వారిలో కనిపించే ఒక సాధారణ లక్షణమిది. ఏదైనా శ్రమ చేస్తున్నప్పుడు గానీ, నడుస్తున్నప్పుడు గానీ, చివరికి విశ్రాంతిగా పడుకున్నప్పుడు కూడా కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆయాసం ఉంటాయి. ఇది వారి గుండె ఏ స్థాయులో పనిచేస్తోందో తెలియజేసే సంకేతం. గుండె పనితనం తగ్గిపోతున్న కొద్దీ ఊపిరి ఆడని సమస్య మరింత ఎక్కువవుతుంది. సమస్య ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఏదైనా శ్రమ చేస్తున్నప్పుడు మాత్రమే ఊపిరి ఆడని పరిస్థితి ఉంటుంది. సమస్య తీవ్రమయ్యాక చిన్నచిన్న పనులకే ఊపిరి ఆడటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్కోసారి పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా ఊపిరి ఆడక గబాల్న లేచి కూర్చుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే శ్వాసపరమైన సమస్యలన్నింటికీ గుండె పనితనం లోపమే కారణం కాకపోవచ్చు. కొందరిలో ఇది తీవ్రమమైన రక్తహీనత వల్ల కూడా శ్వాసపరమైన సమస్యలు తలెత్తవచ్చు. ఎంఫిసీమా అనే మరో సమస్య వల్ల కూడా ఈ శ్వాస సమస్యలు రావచ్చు. అందువల్ల డాక్టర్‌ను సంప్రతిస్తే మీ నాన్నగారి సమస్యేమిటో కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఆ తర్వాత అవసరమైన చికిత్సలు తీసుకుంటే ఆ సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటపడవచ్చు.
-డాక్టర్‌ ఎన్‌. కార్తీక్‌, పల్మనాలజిస్ట్‌


ఆడేద్దాం.. తాడాట
అందంగా కనిపించాలంటే పైపై పూతలే కాదు శరీరానికి చక్కని వ్యాయామం కూడా అవసరం. అప్పుడే చర్మం నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఆరోగ్యమూ మీ సొంతమవుతుంది. అదెలా అంటే.. రోజూ కాసేపు తాడాట ఆడేయడమే.
* రోజూ కనీసం పదిహేను నిమిషాలైనా సరే తాడాట కోసం కేటాయించి చూడండి. ఇది గుండెకు రక్తప్రసరణ, ప్రాణవాయువు సరిగ్గా అందేలా చూసి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు వూపిరి తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. 
* కాళ్లకూ, శరీరం కింది భాగానికి తగిన వ్యాయామం అందాలంటే చక్కనిమార్గం తాడాటే. మొదట్లో కాస్త నొప్పిగా అనిపించినా సరే! కాళ్ల కదలిక చురుగ్గా ఉంటుంది. 
కండరాలు దృఢంగా ఉంటాయి. 
* బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలే చేస్తున్నా.. త్వరగా ప్రయోజనం అందాలంటే ఎంచుకోవలసిన వ్యాయామ సాధనం ఇది. రోజూ అరగంట ఈ వ్యాయామం చేస్తే చాలు.. దాదాపు మూడువందల కెలొరీలు కరుగుతాయి. అదనంగా శరీరంలో పేరుకునే కొవ్వు కూడా తగ్గుతుంది. 
* తాడాట మెదడుకీ, శరీరానికి మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ, ఏకాగ్రతను పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రయాణాల్లో ఇవీ తప్పనిసరి!
విహార యాత్రలకు వెళ్తున్నారా... అలా వెళ్లినప్పుడు చర్మసంరక్షణ అస్సలు మర్చిపోకూడదు. అందుకే ఇవి వెంట ఉంచుకోవడం తప్పనిసరి.
మాయిశ్చరైజర్‌ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఎలాంటి వాతావరణంలో ఉన్నా చర్మం నిర్జీవంగా మారకుండా తేమ ఉండటానికి ఇది తోడ్పడుతుంది. దాంతోపాటు లిప్‌బామ్‌, ఓ క్రీం కూడా తెచ్చుకోవాలి. 
* ప్రయాణం సమయంలో కళ్లు వూరికే అలసిపోతుంటాయి. అందుకే కళ్లకు కట్టుకునే రిలాక్స్‌ ప్యాడ్లు అందుబాటులో పెట్టుకోవాలి. వీలుంటే ఆ ప్యాడ్లలో కీరా, బంగాళాదుంపలని సన్నని స్లైసులుగా తరిగి ఉంచుకున్నా కళ్లకు మేలు జరుగుతుంది. 
* ఫౌండేషన్లూ, జిడ్డుగా ఉండే క్రీములు తీసుకెళ్లకపోవడం మంచిది. వాటిని రాసుకోవడం వల్ల చర్మంపై ఇంకా దుమ్మూధూళి చేరుకుంటాయి. ఇందుకు సంబంధించి వాడే బ్రష్‌లూ, ఐబ్రో పెన్సిళ్ల వంటివి మితంగా తీసుకెళ్లడం మంచిది. 
* వీటిని ప్యాక్‌ చేసుకోవడం అంత సులువు కాదు. ఏ మాత్రం కారినా దుస్తులకు అంటుకుపోతాయి. అందుకే బయట తక్కువ పరిమాణంలో ఉండే సౌందర్యోత్పత్తుల శాంపిళ్లని వాడితే సరిపోతుంది. ఇవి బరువుగా ఉండవు. ఉపయోగించుకున్నాక పారేయొచ్చు. 
* ప్రయాణాల్లో ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులైన స్ట్రయిట్‌నర్లూ, డ్రయ్యరు తీసుకెళ్లడం సరికాదు. వీటిని ఈ సమయంలో వాడితే ఇంకా జుట్టు ఎండు గడ్డిలా మారిపోతుంది. బ్యాగుల్లో కూడా వీటికి ఎక్కువ స్థలం కావల్సి ఉంటుంది. కాబట్టి వదిలేయడం మంచిది.


వెదురులా కాదు.. వేణువులా...
ఆత్మీయం

అడవిలో ఎన్నో వెదురు చెట్లు ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే వేణువులవుతాయి. అన్ని వెదురు చెట్లకూ వేణువు అయ్యే అర్హత ఉంది. కానీ వాటిలో కొన్నే సహకరిస్తాయి వేణువు కావడానికి. ఏది గాయాలు భరించి గాలితో కలిసేందుకు ద్వారాలు తెరచుకుంటుందో అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏది మూసుకుంటుందో అది ఫలితాన్ని ఇవ్వదు. మనుషులలో కొందరు వెదురు చెట్లలా ఉన్నారు. వారిలో కొందరు వేణువులవుతున్నారు. గాయపడి పాడేందుకు సహకరించే వారు కొందరే. జీవితం గుప్పెట్లో వారు వేణువు అవుతారు. వారి నుంచి మంచి సంగీతం పుడుతుంది. కానీ చాలామంది తమ హృదయ కవాటాలను మూసే ఉంచుతున్నారు.
వారు తమను తెరవని పుస్తకంగానే ఉంచుకుంటారు. అటువంటి వారికి వాకిలి ఉన్నా లేనట్లే. కిటికీలు ఉన్నా లేనట్లే. కనుక వారి నుంచి సంగీతం పుట్టడం అసాధ్యం. జీవన సంగీతం ఓ వరం. అందుకు పెట్టి పుట్టాలి. గాయాలు పడిన వెదురు వేణు గానమవుతుంది. మనుషులూ అంతే. గాయపడి నలిగినా, వారు ఆ బాధలో నుంచి పాటలు కడతారు. ఆలపిస్తారు. మనసుల్ని ఆకట్టుకుంటారు. ఊరట చెందుతారు. రంధ్రాలు వేయించుకోవడానికి గాయాలు భరిస్తూ సహకరించిన వెదురు అందాన్ని కోల్పోవచ్చు. కానీ ఫలితాన్ని ఇస్తుంది.

ఆరోగ్యం నవ్వాలంటే.. నువ్వులు
ఇప్పుడంటే మనం వంటకు రకరకాల నూనెలు ఉపయోగిస్తున్నాం. కానీ ఒకప్పుడు వంట నూనె అంటే నువ్వులనూనే. అంటే... తిలల నుంచి తీసిందే ‘తైలం’ అన్నమాట. మన భారతీయ సంస్కృతిలో నువ్వులు అంతగా ఇమిడిపోయాయి. నువ్వులలో ఉన్న మంచి ఆరోగ్యకరమైన పోషకాల జాబితాకు అంతే లేదంటే అతిశయోక్తి కాదు. గుండెజబ్బుల నిరోధానికి నువ్వులు ఎంతగానో మేలు చేస్తాయి. నువ్వుల్లో ప్రొటీన్లు ఎక్కువ. ఇందులో విటమిన్‌–ఇ, క్యాల్షియమ్‌లు కూడా ఎక్కువ. కాబట్టి శరీరంలో అయ్యే గాయాల రిపేర్‌కు ఇది బాగా తోడ్పడుతుంది.

నువ్వుల్లో ఐరన్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రుతుస్రావం అయ్యే మహిళలు నువ్వులను ఏ రూపంలో తీసుకున్నా వాటివల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.నువ్వులలో విటమిన్‌–బి కాంప్లెక్స్‌లోని పోషకాలైన నియాసిస్, రైబోఫ్లేవిన్, థయామిన్‌ వంటివి మరింత ఎక్కువ. నువ్వుగింజల్లోని బరువులో 50 శాతం మేరకు నూనె పదార్థమే ఉంటుంది. అందులో విటమిన్‌–ఇ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యానికి, మేని ఛాయ మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది.







పోషణం.. పోషణం.. సంపూర్ణ పోషణం-Worlds Milk Day on 1st June


పోషణం.. పోషణం.. సంపూర్ణ పోషణం! 
పుడుతూనే తల్లి పాల కోసం తల్లడిల్లుతాం. కాస్త పెరిగాక ఆవు పాలో, గేదె పాలో గుటకలేస్తాం. అన్నప్రాశన కూడా పాలతో చేసిన పరమాన్నంతోనే మొదలెడతాం. అమ్మ తినిపించే పెరుగన్నం గోరుముద్ద నోట్లో పడగానే స్వర్గాన్ని అందుకున్నంత సంబరపడతాం. ఇక పెద్దయ్యాక చెప్పాల్సిన పనే లేదు. చిక్కటి పాలతో చేసిన వేడి వేడి టీనో, కాఫీనో గొంతులో దిగకపోతే రోజే ఆరంభం కాదు. నెయ్యితో ఆరంభించి.. పెరుగుతోనో మజ్జిగతోనో ముగిస్తేనే గానీ భోజనం చేసినట్టూ ఉండదు. పరిచితులైనా, అపరిచితులైనా.. అతిథి దేవుళ్లు ఎవరైనా సరే.. ఎండన పడి ఇంటికి వచ్చారంటే గ్లాసు మజ్జిగ ఇచ్చి మన దాహమే తీరినట్టుగా తృప్తి పడతాం. భక్తితో పాయసమో, పరమాన్నమో వండి దేవుడికి నైవేద్యం పెట్టి సృష్టికర్త బొజ్జనే నింపినట్టు పరవశిస్తాం. ఇలా బాల్యం నుంచీ వృద్ధాప్యం వరకూ.. మర్యాదల నుంచి ఆచార, సంప్రదాయాల వరకూ.. అడుగడుగునా ఏదో ఒకరూపంలో పాలు మన జీవితంతో పెనవేసుకుపోయాయి. 
పోషకాల పరంగా చూసినా పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. ఒకవైపు ఎముక పుష్టికి అవసరమైన క్యాల్షియం, కండర నిర్మాణానికి తోడ్పడే మాంసకృత్తులు, శరీరానికి సత్తువ నిచ్చే కొవ్వులు.. మరోవైపు కంటి చూపును కాపాడే విటమిన్‌ ఎ, నాడీ ఆరోగ్యాన్ని పెంపొందించే బి విటమిన్లు.. ఒకటేమిటి పాలతో లభించే పోషకాలు బోలెడు. అయినా కూడా మనలో చాలామంది తగినన్ని పాలు తాగటం లేదు. పాల లభ్యత కొండంత పెరిగినా వినియోగం మాత్రం ఇంకా గోరంతే. పాలపై లేనిపోని అపోహలూ అపనమ్మకాలూ ఎన్నెన్నో. అందుకే జూన్‌ 1న ప్రపంచ పాల దినం సందర్భంగా పాల ప్రాముఖ్యతపై సుఖీభవ అందిస్తున్న సమగ్ర కథనం ఈ వారం మీకోసం.

పాలు మన జీవితంతో అనాదిగా ముడిపడిపోయాయి. మనిషికి వ్యవసాయం చేయటం తెలియకముందే పశుపోషణ ఒంటపట్టింది. అప్పట్నుంచే ఆవు పాలు, గేదె పాలు తాగటమూ అలవడింది. పూర్వకాలంలో ఇంటికి ఎవరైనా వస్తే పలకరింపుగా ‘మీకు పాడి ఉందా?’ అనీ అడుగుతుండేవారు. ఇంట్లో పాడి ఉండటాన్ని గౌరవానికీ, హోదాకు చిహ్నంగానూ భావించేవారు. రాన్రానూ ఈ పరిస్థితి మారిపోయింది. ఒకవైపు జనాభా పెరుగుతుండటం.. మరోవైపు పశువుల పెంపకం కుదరకపోవటం వంటివన్నీ పాల కొరతకు దారితీశాయి. అయితే ‘క్షీర విప్లవ పిత’ కురియన్‌ పుణ్యమాని పరిస్థితి మళ్లీ గాడిన పడింది. పాల ఉత్పత్తి, లభ్యత గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం తలసరి పాల లభ్యత 337 గ్రాములతో మనం ప్రపంచంలోనే ప్రథమస్థానం ఆక్రమించాం. కానీ వినియోగంలో మాత్రం చాలా వెనకబడి పోయాయి. మన తలసరి పాల వినియోగం 80 గ్రాములు మాత్రమే. ఇంట్లో పాడి పశువులు ఉన్నవాళ్లు కూడా తగినన్ని పాలు తాగటం లేదు. ఒకట్రెండు లీటర్ల పాలిచ్చే పశువులున్నవారైతే మొత్తం పాలన్నీ అమ్మేసుకోవటమూ చూస్తున్నాం. పాలను ఆదాయ వనరుగానే చూస్తున్నారు గానీ ఆరోగ్య వనరుగా చూడటం లేదు.
క్యాల్షియం గని 
పాలలోని పోషకాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాల్షియం గురించే. ఈ విషయంలో పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. ఆకుకూరల్లో క్యాల్షియం అత్యధికంగా ఉన్నా దీన్ని మన శరీరం అంతగా గ్రహించలేదు. అదే పాల ద్వారా లభించే క్యాల్షియమైతే బాగా ఒంటపడుతుంది. తగినన్ని పాలు తాగితే రోజుకు అవసరమైన క్యాల్షియంలో 91 శాతాన్ని పొందినట్టే. ఎముకలను పటుత్వం చేయటంతో పాటు శక్తి విడుదల కావటానికీ తోడ్పడే పాస్ఫరస్‌ సైతం దీంతో లభిస్తుంది. ఎముకల్లో క్యాల్షియం గట్టిపడగానికి దోహదం చేసే విటమిన్‌ డి కూడా పాలలో కొంతవరకు ఉంటుంది.
సంపూర్ణ ఆహారం
పాలు సంపూర్ణ ఆహారం. రోజువారీ పనులకు కావాల్సిన శక్తినిచ్చే చక్కెర, ప్రోటీన్‌, కొవ్వులన్నీ దీంతో లభిస్తాయి. 150 మిల్లీలీటర్ల పాలలో సుమారు 130 కిలో కేలరీల శక్తి, 4.5 గ్రామలు కొవ్వు, 6 గ్రాముల పిండి పదార్థం, 5 గ్రాముల ప్రోటీన్‌ ఉంటాయి. బియ్యంలో లేని లైసిన్‌, త్రియోనైన్‌ అనే అమైనో ఆమ్లాలనూ పాలతో భర్తీ చేసుకోవచ్చు. కాబట్టి చిన్నప్పటి నుంచే పాలు తాగటం అలవాటు చేసుకుంటే జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్టే.
ఎన్నెన్నో ప్రయోజనాలు
పాలతో ఎముకల పటుత్వం ఒక్కటే కాదు.. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 
* గుండె ఆరోగ్యం: క్యాల్షియం అనగానే ఎముకల పటుత్వమే గుర్తుకొస్తుంది గానీ ఇది గుండెజబ్బు, పక్షవాతం ముప్పులనూ తగ్గిస్తుంది. అందువల్ల పాలు తాగటం ద్వారా గుండె, రక్తనాళాల సమస్యలనూ దూరం చేసుకోవచ్చు. ఇక వీటిలోని పొటాషియం, మెగ్నీషియం, పెప్టైడ్‌లు రక్తపోటు తగ్గటానికీ తోడ్పడతాయి. 
* దంతాలు దృఢం: పాలు దంతం మీదుండే గట్టిపొర దెబ్బతినకుండా చూస్తాయి. పాలు తాగేవారిలో కూల్‌డ్రింకుల అలవాటూ తక్కువే. ఇదీ దంతాలకు మేలు చేసేదే. 
* చర్మం నిగనిగ: పాలలోని ల్యాక్టిక్‌ ఆమ్లం మృతకణాలను తొలగించి చర్మం కళకళలాడేలా చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండానూ కాపాడతాయి. 
* అసిడిటీ తగ్గుముఖం: తరచుగా తాజా పెరుగు, మజ్జిగ తీసుకుంటే ఛాతీలో మంట వంటి లక్షణాలూ తగ్గుతాయి. ముఖ్యంగా చల్లటి పాలతో మంచి ఉపశమనం లభిస్తుంది. 
* క్యాన్సర్‌ నుంచి ఉపశమనం: పెద్దపేగు క్యాన్సర్‌ బాధితులకు పాలతో మంచి ఉపశమనం కలుగుతుంది. పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడేవారు పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటే జీవనకాలం పెరుగుతున్నట్టూ అధ్యయనాలు చెబుతున్నాయి. 
* కంటిచూపు మెరుగు: విటమిన్‌ ఎ లోపం వల్ల తలెత్తే రేచీకటి, తెల్లగుడ్డు మీద మచ్చలు, నల్లగుడ్డు కుంగిపోవటం వంటి సమస్యలు పాలతో దూరమవుతాయి. 
* నోటిపూత దూరం: పాలలోని రైబోఫ్లేవిన్‌ నోటిపూత బారినపడకుండా కాపాడుతుంది. పెరుగులో రైబోఫ్లేవిన్‌ మోతాదు మరింత పెరుగుతుంది. అయితే ఎండ తగిలితే రైబోఫ్లేవిన్‌ దెబ్బతింటుంది. కాబట్టి పాలకు ఎండ తగలకుండా చూసుకోవాలి. ఆరుబయట పాలు పితికేవారు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత పితకటం మంచిది. 
* రోగనిరోధకశక్తికి వూతం: మిగతా ఆహార పదార్థాల్లో లేని ఇమ్యూనో గ్లోబులిన్లు పాలలో ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. జున్నుపాలతో రోగనిరోధక్తి మరింత పెరుగుతుంది. వీటిలో మెదడు అభివృద్ధికి తోడ్పడే జింక్‌ కూడా ఎక్కువే. అలాగే పాలలోని ల్యాక్టోబాసిలస్‌ సూక్ష్మక్రిములు మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి.. జబ్బుల బారినపడకుండా కాపాడతాయి.
తేలికగా జీర్ణం
ఆవు పాలలో ప్రోటీన్‌ తక్కువగా ఉండటం వల్ల వీటి పెరుగు కూడా కాస్త పలుచగా, మెత్తగా ఉంటుంది. అందువల్ల దీన్ని జీర్ణించుకోవటం తేలిక. గేదెపాలలో ప్రోటీన్‌ కాస్త ఎక్కువగా ఉండటం వల్ల పెరుగు కూడా కొంచెం చిక్కగా ఉంటుంది. అయినా కూడా ఇదీ బాగానే జీర్ణమవుతుంది. ఘనాహారం తీసుకోలేని వారికి, ఆహారం సరిగా జీర్ణం కాని వారికి పాలు, పెరుగు, మజ్జిగ వంటివి ఎంతో మేలు చేస్తాయి.
ల్యాక్టోజ్‌ పడకపోవటం
ల్యాక్టోజ్‌ను విడగొట్టే లాక్టేజ్‌ ఎంజైమ్‌ ఉత్పత్తి కాకపోవటం వల్ల కొందరికి పాలలోని ల్యాక్టోజ్‌ పడదు. దీంతో కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, త్రేన్పులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వాళ్లు పాలు, పాల పదార్థాలను తీసుకోకపోవటమే మంచిది. బదులుగా రాగులను నానబెట్టి.. రుబ్బి తీసిన పాలు, రాగి పిండితో చేసిన జావ, రాగి మాల్ట్‌, సోయా పాల వంటివి తీసుకోవచ్చు. కొందరికి ఎప్పుడైనా పాలు, పదార్థాలతో అలర్జీ రావొచ్చు. దీంతో చర్మం మీద దద్దుర్లు వస్తాయి. ఇది తాత్కాలికమే. అప్పుడు పాలు మానేసి కొంతకాలం తర్వాత తిరిగి ఆరంభించొచ్చు. ఎలాంటి పాల పదార్థాలతో అలర్జీ వస్తుందో గమనించి.. వాటికి దూరంగా ఉండాలి.

పాల పోషకాలపై అవగాహన పెంచటానికి, పాల లభ్యతను పెంచటానికి, పాడి పరిశ్రమను ప్రోత్సహించటానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ 2001లో జూన్‌ 1ని ప్రపంచ పాల దినంగా ప్రకటించింది.
ఉత్పత్తిలో అగ్రస్థానం మనదే
మొత్తం పాల ఉత్పత్తిలో ప్రస్తుతం మనదేశానిదే అగ్రస్థానం. దీన్ని 2012 నుంచీ నిలబెట్టుకుంటూ వస్తున్నాం. దీనికి మూల కారణం ‘క్షీర విప్లవ పిత’ డాక్టర్‌ వర్గీస్‌ కురియన్‌ కృషే. మనదేశంలో 1940-50ల్లో పేదరికంతో పాటు పోషణ లోపం కూడా ఎక్కువగా ఉండేది. తగినంత పాలు అందుబాటులో ఉండేవి కావు. దీన్ని దృష్టిలో పెట్టుకునే డాక్టర్‌ కురియన్‌ పాల సహకార సంఘాల ఏర్పాటుతో క్షీర విప్లవానికి నాంది పలికారు. ఇది దేశమంతా విస్తరించింది. దీంతో పాల లభ్యత, రైతుల ఆదాయం గణనీయంగా పెరిగాయి. అందుకే ఆయన జన్మదినమైన నవంబరు 26న జాతీయ పాల దినంగానూ జరుపుకొంటున్నాం.
అన్ని వయసుల వారికీ..
శిశువుల దగ్గర్నుంచి వృద్ధుల వరకూ పాలు అన్ని వయసుల వారికీ అవసరమే. ఎదిగే పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు, వృద్ధులకు మరింత ఎక్కువ కావాలి. పిల్లలు రోజుకు కనీసం 500 మిల్లీలీటర్లు.. పెద్దవాళ్లు 300 మిల్లీలీటర్ల పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. 
* శిశువులకు: శిశువులకు ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టాలి. ఒకవేళ పోతపాలు పట్టాల్సి వస్తే ఆవు పాలు ఇవ్వటం మేలు. అయితే ఇవి తల్లిపాల కన్నా చిక్కగా ఉంటాయి కాబట్టి నీళ్లు కలిపి పలుచగా చేసి పట్టాలి. ఆవుపాలు లేకపోతే గేదె పాలు ఇవ్వొచ్చు. పిల్లలకు రెండేళ్ల వరకు తల్లిపాలు ఇవ్వాలి. అయితే తల్లిపాలలో ఐరన్‌ ఉండదు కాబట్టి ఆరు నెలల తర్వాత తప్పకుండా ఘనాహారం ఆరంభించాలి. లేకపోతే రక్తహీనతకు దారితీస్తుంది. ఈ అదనపు ఆహారంలో పాలు కూడా ఇవ్వాలి. 
* ఎదిగే పిల్లలకు: పిల్లలు 18-19 ఏళ్ల వరకూ ఎత్తు పెరుగుతుంటారు. ఈ దశలో కండర నిర్మాణం, ఎముకల ఎదుగుదల చురుకుగా సాగుతుంది. ఇందుకు పాలలోని నాణ్యమైన ప్రోటీన్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌ బాగా ఉపయోగపడతాయి. అరలీటరు పాలు తీసుకుంటే పిల్లలకు రోజుకు అవసరమైన 800 మి.గ్రా. క్యాల్షియం అందుతుంది. 
* గర్భిణులకు: గర్భిణుల్లో పిండం ఎదుగుదలకూ క్యాల్షియం చాలా అవసరం. తగినంత క్యాల్షియం తీసుకోకపోతే తల్లి ఎముకల నుంచి పిండానికి క్యాల్షియం వెళ్తుంది. అలాగే కాన్పు సమయంలోనూ క్యాల్షియం చాలా పోతుంటుంది కూడా. అందువల్ల పాలు విధిగా తీసుకోవాలి. కాన్పు తర్వాత బాలింతలకు పాలు బాగా పడటానికి అదనంగా పాలు తీసుకోవటం మంచిది. 
* మహిళలకు: ముట్లుడిగే (మెనోపాజ్‌) దశలో ఈస్ట్రోజెన్‌ స్థాయులు పడిపోతుంటాయి. ఫలితంగా శరీరం క్యాల్షియంను గ్రహించుకోవటమూ తగ్గుతూ వస్తుంది. ఇది ఎముక క్షీణతకు దారితీస్తుది. రోజూ పాలు తీసుకోవటం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చు. 
* వృద్ధులకు: వృద్ధులు ఎక్కువగా కదల్లేరు. చాలావరకు ఇంటిపట్టునే ఉంటుంటారు. ఇలా కదలికలు తగ్గటం వల్ల కూడా ఎముకల్లో క్యాల్షియం క్షీణించటమూ పెరుగుతుంది. పాలు తాగటం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు.
అపోహలూ చాలానే..
* ప్యాకెట్‌ పాలు అంత మంచివి కావని కొందరు భావిస్తుంటారు. ఇది నిజం కాదు. డెయిరీల్లో పాలను ముందుగానే శుభ్రం చేసి కొవ్వు శాతం సమానంగా ఉండేలా హోమోజినైజేషన్‌ చేస్తారు. కొద్దిసేపు అత్యధిక ఉష్ణోగ్రతకు గురిచేసి ఆ వెంటనే చల్లబరుస్తారు. దీంతో బ్యాక్టీరియా వంటివేమైనా ఉంటే చనిపోతాయి. అందువల్ల ప్యాకెట్‌ పాలు సురక్షితం. పోషకాలూ తగ్గవు. 
* పచ్చిపాలు తాగటం మంచిది కాదన్నది మరికొందరి భావన. నిజానికి ప్యాకెట్‌ పాలు ఒకరకంగా కాచిన పాలే. కాబట్టి వీటిని వేడి చేయకుండా అలాగే తాగేయొచ్చు. బయట దొరికే పాల విషయంలో గేదెలు, పాలు పితికేవారి చేతులు, పాత్రలు, పరిసరాలు శుభ్రంగా లేకపోతే పాలు కలుషితం కావొచ్చు. కాబట్టి వీటిని వేడిచేసి తాగటమే మంచిది. పాలను కొంచెం సేపు బయట ఉంచినా వెంటనే సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయని గుర్తుంచుకోవాలి. 
* గేదెలకు, ఆవులకు ఇచ్చే యాంటీబయోటిక్స్‌, ఆక్సిటోసిన్‌ హార్మోన్ల వంటివి పాలలో కలిసి ఆరోగ్యానికి హాని చేస్తాయని కొందరు భయపడుతుంటారు. ఒకవేళ అలాంటి అవశేషాలు ఉన్నా.. సమయం గడుస్తున్నకొద్దీ వాటి మోతాదులు తగ్గుతూ వస్తాయి. ఇవేవీ హాని కలిగించే స్థాయిలోనూ ఉండవు. 
* పాలతో బరువు పెరుగుతామని కొందరి భయం. మితంగా తీసుకుంటే వీటితో ఇబ్బందేమీ లేదు. కానీ చిక్కటి పాలు, గడ్డ పెరుగు, ఛీజ్‌, వెన్న, నెయ్యి వంటివి ఎక్కువెక్కువ తీసుకుంటూ.. వ్యాయామం, శారీరకశ్రమ వంటివేవీ చేయకపోతే మాత్రం ఒంట్లో కొలెస్ట్రాల్‌ పెరిగే ప్రమాదముంది. పాలు తాగితే జలుబు చేస్తుందన్నదీ అపోహే. నిజానికి పాలతో రోగనిరోధకశక్తి పెరిగి జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఎప్పుడు తాగాలి?
పాలు ఉదయం పూట తాగటం మంచిది. నిద్ర బాగా పడుతుందని కొందరు రాత్రిపూట పాలు తాగుతుంటారు. ఇలాంటివాళ్లు పాలు తాగిన రెండు గంటల తర్వాత పడుకోవటం మేలు. ఎందుకంటే పాలు జీర్ణమయ్యే సమయంలోనూ ఆమ్లం బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో పుల్లటి త్రేన్పుల వంటివి రావొచ్చు. తగినంత ఆహారం తీసుకోలేనివారు, ఒకేసారి పెద్దమొత్తంలో ఆహారం వద్దనుకునేవారు రాత్రిపూట పాలు తాగొచ్చు గానీ వెంటనే పడుకోవటం మంచిది కాదు.
పాలు ఇష్టం లేకపోతే..
కొందరు పిల్లలు పాలు తాగటానికి ఇష్టపడరు. ఇలాంటివారికి ఇష్టమైన రుచులను కలిపి పాలు ఇవ్వొచ్చు. మామిడి, సపోటా, అరటి, కర్బూజా, స్ట్రాబెర్రీ వంటి పండ్లను గుజ్జులాగా చేసి పాలలో కలిపి (మిల్క్‌ షేక్‌లు) ఇవ్వొచ్చు. పైనాపిల్‌, యాపిల్‌ వంటి పండ్లను కాసేపు వేడి నీటిలో వేశాక గుజ్జు తీసి పాలలో కలిపితే షేక్‌లకు మరింత రుచి వస్తుంది. కొందరు కార్న్‌ ఫ్లేక్స్‌, ఓట్స్‌ వంటివి పాలలో వేసుకొని తింటుంటారు. ఇప్పుడు జొన్నలు, రాగులు, సజ్జల వంటి చిరుధాన్యాల అటుకులూ వస్తున్నాయి. వీటిని పాలతో ఉడికించి తీసుకోవచ్చు. దీంతో చిరుధాన్యాల ప్రయోజనాలూ లభిస్తాయి. పాలతో చేసే పనీర్‌, కోవా, రసగుల్ల, సందేశ్‌ వంటి పదార్థాల్లో ప్రోటీన్‌, కొవ్వు, క్యాల్షియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పాలు ఇష్టపడనివారు.. క్యాల్షియం మరింత ఎక్కువ అవసరమైనవారు ఇలాంటివి తీసుకోవచ్చు. పెరుగు నుంచి నీటిని వడగట్టి కుంకుమపువ్వు, చక్కెర, యాలకుల పొడి కలిపి శ్రీఖండ్‌ తయారుచేసుకోవచ్చు.
పాలలోని ల్యాక్టోజ్‌ అనే చక్కెర మనం వాడుకునే చక్కెరలా మరీ తీయగానూ.. అలాగని మరీ చప్పగానూ ఉండదు. నిజానికి మనకు ఈ తీపి చాలు. అదనంగా చక్కెర కలుపుకోవాల్సిన పనిలేదు.


mohan publications price list