MohanPublications Print Books Online store clik Here Devullu.com

Mini Sweazerland



స్పాండిలైటిస్‌కు...Adulthood, Exercises

స్పాండిలైటిస్‌కు...
సర్వైకల్‌ ఏరియాలో సి1 నుంచి సి7 మధ్యలో ఉన్న డిస్క్‌ బల్జ్‌ హెర్నియేటెడ్‌ డిస్క్, డిస్క్‌ అరుగుదల వంటివి ఒకప్పుడు వయసు పెరిగిన తర్వాత మాత్రమే వచ్చే సమస్యలు. అయితే ప్రస్తుత జీవనశైలి కారణంగా ఈ తరహా నొప్పులు యుక్తవయసుల్లోనూ సర్వసాధారణంగా మారాయి. నిరంతరం కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసే ఒత్తిడితో కూడిన ఉద్యోగాల వల్ల ఫ్రీ రాడికల్స్‌ ఎక్కువ డిపాజిట్‌ కావడం దీనికో ప్రధాన కారణం. మెడ భుజాలు గుంజడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. దీనికి పని చేసే మధ్యలో తరచుగా విరామాలు తీసుకోవడం, అటూ ఇటూ నడవడం కొన్ని రిలాక్సింగ్‌ వ్యాయామాలు చేయడం అవసరం.
1. బ్రహ్మముద్రలు
శ్వాస తీసుకుంటూ తలను నెమ్మదిగా పైకి ఎత్తి శ్వాస వదులుతూ తలను కిందకు, గడ్డాన్ని ఛాతీ మీదకు (ఊర్థ్వ అథో ముద్రలు) తీసుకురావాలి. అదే విధంగా శ్వాస తీసుకుంటూ కుడి చెవి కుడి భుజం మీద శ్వాస వదులుతూ మధ్యలోకి, మళ్లీ శ్వాస తీసుకుంటూ ఎడమ చెవి ఎడమ భుజం మీదకు శ్వాస వదులుతూ మధ్యలోకి (వామ దక్షిణ)... తేవాలి. అలాగే గడ్డం కుడి భుజం మీద మళ్లీ నెమ్మదిగా ఎడమ భుజం మీదకు తీసుకురావాలి. తర్వాత తలను గుండ్రంగా వీలైనంత పెద్ద వృత్తంలో తిప్పాలి. గడ్డం ఛాతీ మీద ఆనించి గడ్డం కుడి భుజం మీదకు తలను వెనుకకు వాలుస్తూ ఎడమ భుజం మీదకు గడ్డం తీసుకువచ్చి తిరిగి ఛాతీ మీదకు తీసుకురావాలి. వీటిని వీలైనంత నిదానంగా కనీసం 3 సార్లు చేయాలి. కళ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తే లో సుగర్, లో బీపీ లేదా స్పాండిలైటిస్‌ వలన కనుక ఒక రౌండ్‌ క్లాక్‌ వైజ్‌ గడియారం దిశలో మరో రౌండ్‌ యాంటి క్లాక్‌ వైజ్‌ చేయాలి.
2.ఊర్థ్వ నమనాసన
దీనిని నుంచుని లేదా కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ఇంటర్‌లాక్‌ చేసి బాగా పైకి స్ట్రెచ్‌ చేయాలి. శ్వాస వదులుతూ చేతులు రిలాక్స్‌ చేయాలి. ఇలా 5 నుంచి 6 రిపిటీషన్లు చేయాలి.
3.ఊర్థ్వనమనాసన చాలన
చేతులు రెండూ ఇంటర్‌ లాక్‌ చేసి పైకి స్ట్రెచ్‌ చేసి శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు వదులుతూ మళ్లీ మధ్యలోకి తేవాలి. ఇలా 5 నుంచి 10 రిపిటీషన్లు. ఇలాగే కుడివైపు కూడా చేయాలి.
4. తాలాసన (ఎడమ, కుడి) సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ కుడిచెయ్యి పైకి (పక్క నుంచి) నెమ్మదిగా తీసుకువెళ్లి కుడి భుజం కుడి చెవికి దగ్గరగా ఉంచి చెయ్యి పైకి స్ట్రెచ్‌ చేస్తూ ఎడమ చెయ్యి నడుం పక్కన కిందకు అరచేయి కిందకు తీసుకువెళుతూ శ్వాస వదులుతూ వీలైనంతగా ఎడమవైపుకి బెండ్‌ అవ్వాలి. మళ్లీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ కుడి చేయి కిందకు.. ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి.
5. తాలాసన చాలన
శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకువెళ్లి శ్వాస వదులుతూ చేతులు కిందకు డయాగ్నల్‌గా తీసుకురావాలి. మళ్లీ కాలి మడమ తిప్పుతూ వెనుకకు తిరుగుతూ పైకి తీసుకెళ్లాలి. ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి.
6. కటి చక్రాసన చాలన
వేరియంట్‌ ఎ: కాళ్ల మధ్య రెండు అడుగుల దూరం ఉంచి ఫ్రీగా వదిలేసిన చేతులను స్వింగ్‌ చేస్తూ 360డిగ్రీల కోణంలో ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రొటేట్‌ చేయాలి. 
వేరియంట్‌ బి: అదే విధంగా చేతులను మధ్యలో ఉంచి కుడిచేయి ఎడమ భుజం మీదకు, ఎడమ చేయి వెనుక నడుం మీదకు ఉంచుతూ ఎడమ వైపునకు తిరగాలి. ఇదే విధంగా కుడి వైపునకు ఇలా కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఒక కాలి మడమను పైకి లేపి రెండవ పాదం డైరెక్షన్‌ను మారుస్తూ చేయాలి.
వేరియంట్‌ సి: ఇదే విధంగా పైనుంచి చేయాలి. పైన పేర్కొన్న ఆసనాలు అన్నీ నిలబడి చేయవచ్చు కనుక ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. ఈ ఆసనాలు నిదానంగా, చేతులు, శరీరాన్ని ఫ్రీగా వదిలేసి మనస్సుని రిలాక్స్‌డ్‌గా ఉంచి చేయాలి. శ్వాస పూర్తిగా తీసుకుంటూ పూర్తిగా వదులుతూ చేయడం, చేతుల కదలిక వలన తలలోని భాగాలకు 12 జతల క్రేనియన్‌ నాడీ వ్యవస్థకు ఆక్సిజన్‌ సరఫరా బాగా జరుగుతుంది. ఈ వ్యాయామాలు అన్నీ మెదడుకు సంబంధించిన బ్రెయిన్‌ ఎటెక్సియా, అల్జీమర్స్, సీజర్స్‌ వంటి సమస్యల పరిష్కారానికి కూడా బాగా ఉపకరిస్తాయి. ఈ ఆసనాలతో పాటు రెగ్యులర్‌గా ఈ క్రింద పేర్కొన్న ఆసనాలు కూడా సాధన చేయడం అవసరం.
నిలబడి: త్రికోణాసన, పార్శ్వకోణాసన, కూర్చుని: మార్జాలాసన, అర్థ అథోముఖ శ్వానాసన, బాలాసన/శశాంకాసన, వక్రాసన, మరీచాసన, భరధ్వాజాసన, అర్ధ మచ్చేంద్రాసన, అథోముఖ శ్వానాసన, ఉష్ట్రాసన వెల్లకిలా పడుకుని: మత్సా్యసన, సేతు బంధాసన, శవాసన బోర్లా పడుకుని: నిరాలంబాసన, స్వాలంబ భుజంగాసన, భుజంగాసన, ఊర్థ్వముఖ శ్వానాసన, మకరాసన ఈ ఆసనాలు చేయడంలో అవసరమైతే గోడ, కుర్చీ, ఇటుకరాయి... వంటి వాటి సపోర్ట్‌ తీసుకుని కూడా చేయవచ్చు. అలాగే తేలికపాటి ప్రాణాయామాలు కూడా నొప్పుల నివారణలో ఉపకరిస్తాయి.
– సమన్వయం: ఎస్‌. సత్యబాబు, సాక్షి ప్రతినిధి


ఇంద్రియాలను జయించే విద్య కావాలి!-Indriyalanu jayenche vidhyakavali


ఇంద్రియాలను జయించే విద్య కావాలి!

మహిమలు, మాయలు, మంత్రాలు, గారడీ విద్యలు... ఇలాంటి విద్యలన్నీ జ్ఞాన మార్గానికీ, ధమ్మ సాధనకీ తగినవి కావని బుద్ధుడు ప్రబోధించాడు. మూఢనమ్మకాలు, జాతకాలూ, శకునాల పేరుతో జనం దగ్గర నుంచి ధనం రాబట్టుకోవడాన్ని అనైతిక సంపాదనగా ఎంచాడు. అలాంటి జీవనం అధమాధమ జీవనంగా భావించాడు. తన శిష్యులైన బౌద్ధ భిక్షువులతో... ‘‘మీరెప్పుడూ ఇలాంటి నమ్మకాల పేరుతో జనాన్ని మోసగించకండి. ఆ సొమ్ముతో జీవించకండి’’ అని చెప్పేవాడు. దీనికి సంబంధించిన ఒక కథ... బౌద్ధ వాఙ్మయంలో కనిపిస్తుంది.

బౌద్ధ భిక్షువుల్లో పిండోల భరద్వాజుడు ఒకడు. చిన్నతనం నుంచి అన్ని రకాల విద్యలతో పాటు ఇంద్రజాల విద్యలూ నేర్చుకున్నాడు. బుద్ధుని ప్రబోధం విని బౌద్ధ సంఘంలో చేరాడు. బుద్ధుడు చెప్పే ధర్మంపై, ధార్మిక విద్యలపై శ్రద్ధ కనబరిచాడు. కానీ, వెనుకటి ఇంద్రజాల విద్య మీద మక్కువ మాత్రం చంపుకోలేకపోయాడు.
ఒక రోజు శ్రావస్తి నగరంలో.. పెద్ద కూడలి దగ్గర జనం గుమిగూడి ఉండడాన్ని చూసి అక్కడికి వెళ్లాడు భరద్వాజుడు. అక్కడ ఒక వ్యాపారి ఎర్ర చందనంతో తయారు చేసి, వజ్రాలు పొదిగిన అతి ఖరీదైన భిక్షాపాత్రను నిటారుగా నిలబెట్టిన పెద్ద కర్ర చివర ఉంచాడు. ఆ పాత్రను ఏ సాధనం లేకుండా.. ఎవరు కిందకు దించగలరో వారికే దానిని ఇచ్చేస్తానని ప్రకటించాడు. అప్పుడు భరద్వాజుడు తన ఇంద్రజాల విద్యను ప్రయోగించి.. దానిని కిందకు దించి తన చేతుల్లో పడేలా చేశాడు.
అన్న మాట ప్రకారం వ్యాపారి ఆ పాత్రను అతనికి ఇచ్చేశాడు. ఎంతో ఆనందంతో ఆ పాత్రను తీసుకుని భరద్వాజుడు ఆరామానికి వెళ్లాడు. దానిని తీసుకెళ్లి బుద్ధునికి సమర్పించాడు. ఆ భిక్షాపాత్రను భరద్వాజుడు ఎలా సంపాదించాడో తెలుసుకున్న బుద్ధుడు... ‘ధర్మాచార్యులు ధర్మ మార్గంలోనే జీవించాలి. గారడీ విద్యల జ్ఞానం ధర్మాన్ని చూపించలేదు. మీరిలాంటి ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తే... ప్రజలకు వాటి పట్ల మోజు పెరుగుతుందే కానీ, ధర్మ మార్గాన్ని గురించి ఆలోచించలేరు. ధర్మానికి దూరమవుతారు. అది మన పని కాదు. మనకు కావలసింది, మనం నేర్చుకోవాల్సింది, మనం నేర్పాల్సింది- ఇంద్రియాల్ని జయించే విద్యలే! అంతే కానీ, ఇంద్రజాల విద్యలు కాదు’’ అంటూ.. ఆ పాత్రను పగులగొట్టి.. దూరంగా పారవేయించాడు.
తన తప్పు తెలుసుకున్న పిండోల భరద్వాజుడు ఆనాటి నుంచి గారడీ విద్యలు మాని... ధర్మ విద్యలు నేర్చి.. మంచి భిక్షువుగా పేరు సంపాదించాడు.
- బొర్రా గోవర్ధన్‌


అమ్మ దేవతల ఆరాధన-Amma Devathala Aaradhana


అమ్మ దేవతల ఆరాధన
ఆషాఢం వచ్చిందంటే చాలు.. మేఘసందేశాలతో ప్రకృతి పరవశిస్తుంది. వర్షధారలతో పుడమి పులకరిస్తుంది. పచ్చకోక చుట్టుకుని మాగాణం మురిసిపోతుంది. ఊరి జనం జాతరలో.. పల్లె పదం వినిపిస్తుంది. ఇంత సందడికి కారణం... ఆ పల్లె పొలిమేరలో కొలువై ఉన్న శక్తి స్వరూపమేనని జానపదులు విశ్వసిస్తారు. ఆ తల్లి అనుగ్రహం కోరుతూ భోజనం నివేదిస్తారు. అదే బోనం. ఆషాఢ మాసంలో గోల్కొండ నుంచి లష్కర్‌ వరకు, తెలంగాణలోని మారుమూల పల్లె నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కుగ్రామం వరకు.. తెలుగునాట భక్తి ఉత్సవం వెల్లువలా సాగుతుంటుంది.

పల్లెలను పచ్చగ చూసే తల్లి.. గ్రామ సరిహద్దులో ఉంటూ.. తన బిడ్డలను కాచే కల్పవల్లి.. గ్రామదేవత. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ.. ఏ పేరున పిలిచినా.. ఆమె శక్తి స్వరూపమే! వేద మంత్రాలు చదవకున్నా, మంత్రయుక్తంగా పూజించకున్నా, యజ్ఞయాగాదులు చేయకున్నా.. భక్తి అనే పాశానికి కట్టుబడిపోతుంది ఆ తల్లి. కోరుకున్న వారికి కొంగు బంగారమై.. భాసిల్లుతుంది. ఆ గ్రామదేవతల ఉత్సవం ఆషాఢం మాసంలో పల్లెపల్లెలో జరుగుతుంది. తెలంగాణలో ఇది ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించడం కనిపిస్తుంది. ఆషాఢ మాసంతో పాటు శ్రావణ మాసంలోనూ గ్రామదేవతల ఆరాధన విశేషంగా సాగుతుంటుంది.

మా ఇంటి మహాశక్తి
ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని భక్తుల నమ్మకం. ఆ దేవి తమ ఇంటినే పుట్టింటిగా భావించి వచ్చిందని వారు భావిస్తారు. తమ ఇంటికి విచ్చేసిన మహాశక్తికి సంతోషంతో బోనాల ఉత్సవం చేసుకుంటారు. ఆ సమయంలో అమ్మను ప్రసన్నం చేసుకుంటే.. అంతా మంచే జరుగుతుందని వారి విశ్వాసం. అందుకే బోనం సమర్పించి ఆమె అనుగ్రహం కోరుతారు.

బోనం.. భోజనం...
బోనం అంటే భోజనం. సకల జీవరాశులకు ఆహారం సమర్పించే తల్లికి భక్తులు బోనం రూపంలో భోజనం నివేదిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారాల్లో ఈ వేడుకలు జరుగుతాయి. కొత్త కుండలో బియ్యం, బెల్లం వేసి అన్నం వండుతారు. తరువాత కుండను పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. బోనానికి వేపాకులు కంకణంగా కడతారు. గుగ్గిలం పొగవేస్తారు. బోనం కుండపై చిన్న గురిగి, దానిపై బోనం జ్యోతి కంచుడు (మట్టి పాత్ర)లో వెలుగుతుంటుంది. ఇంటికో కుండతో ముత్తయిదువులు బయలుదేరుతారు. ఊరేగింపు ముందు బైయిండ్ల వాళ్లు జమిడికె వాయిస్తారు. ఊరేగింపు ముందు శివసత్తులు శివమూగుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. అట్టహాసంగా బయల్దేరి అందరూ గుడికి చేరుకుంటారు. అక్కడ పరచిన తెల్లటి వస్త్రంపై బోనాల్లోని అన్నం గుమ్మరిస్తారు. దీనిని ‘కుంభం’పోయడం అంటారు. ఇలా బోనాన్ని ఆ తల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజలు పూర్తయ్యాక కుంభంలోని కొంత భాగాన్ని అమ్మ ప్రసాదంగా బంధుమిత్రులకు పంచుతారు. మిగిలిన బోనాన్ని ఊరి పొలిమేరల్లోని పంటపొలాల్లో చల్లుతారు. తెలంగాణలో శుభకార్యాలు జరిగే సందర్భంలో కూడా చాలామంది బోనాలు నిర్వహిస్తుంటారు.

జై జై పోతురాజు
బోనాల ఉత్సవం జానపదుల భక్తికీ, వారి జీవన సరళికీ అద్దం పడుతుంది. కాలం మారుతున్నా.. బోనాల దగ్గరికి వచ్చేసరికి సంప్రదాయం వైపే మొగ్గు చూపుతారు భక్తులు. నిర్మలమైన భక్తి, నిష్కల్మషమైన ఆరాధన కనిపిస్తుంది. అంతేకాదు ఈ జనజాతరలో కొన్ని అంశాలు వింతగా, అద్భుతంగా తోస్తాయి. అలాంటి వాటిలో పోతురాజు విన్యాసాలు ఒకటి. పోతురాజును అమ్మవారి సోదరుడుగా భావిస్తారు. అందుకే బోనాల సందర్భంగా ఒక వ్యక్తి పోతురాజులా వేషం కడతాడు. కొరడాలతో కొట్టుకుంటూ, జయ జయ ధ్వానాలు చేస్తూ భక్త బృందాన్ని తన వెంట అమ్మవారి గుడికి తీసుకెళ్తాడు. పోతురాజు వేషం కట్టే వ్యక్తికి పుష్టి కలిగిన దేహం, స్ఫురద్రూపం తప్పనిసరి. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాళ్లకు గజ్జెలు ధరించి, ఎర్రని చిన్న ధోవతి కట్టుకుని భక్త బృందానికి ముందుగా చిందేస్తూ పండుగ వాతావరణాన్ని రెండింతలు చేస్తుంటాడు. పోతురాజు పూజల ఆరంభకుడిగా, భక్తుల రక్షకుడిగా
భావిస్తారు.

రంగం
బోనాల పర్వంలో మరో ముఖ్యమైన సందర్భం రంగం. ఇది పండుగ రెండో రోజున జరుగుతుంది. రంగం సందర్భంగా పోతురాజు వేషం కట్టిన వ్యక్తికి పూనకం వస్తుందంటారు. ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఆక్కడున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును పోతురాజుకు అందిస్తారు. ఆయన శాంతించిన తర్వాత యథాప్రకారంగా వేడుక కొనసాగుతుంది.

ఘటం
అమ్మవారి ఆకారంలో అలంకరించిన రాగి కలశాన్ని ఘటం అంటారు. ఆలయ పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. బోనాల పండుగ మొదటి రోజు నుంచి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మోతలు, మేళ వాద్యాల మధ్య ఊరేగిస్తారు. పోతురాజులతో పాటు, ఇతర కళాకారులు, వేలమంది భక్తుల సమక్షంలో ఘటం ఊరేగింపు సాగుతుంది. చివరగా వీటిని నీటిలో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో రంగం, ఘటం సంప్రదాయం కనబడదు.

ఎక్కడైనా ఒక్కటే...
హైదరాబాద్‌ శివారు గ్రామాల్లో శ్రావణ మాసంలో బోనాలు నిర్వహించే సంప్రదాయం ఉంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కూడా ఆషాఢ మాసంలో బోనం సమర్పించడం అనవాయితీగా వస్తోంది. రాయలసీమ ప్రాంతంలో గ్రామదేవతలకు ఆషాఢ, శ్రావణ మాసాల్లో బోనాలు చేస్తుంటారు. అట్టహాసంగా కాకపోయినా.. ఒక సంప్రదాయ పండుగగా దీనిని నిర్వహిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో శాకాంబరీ దేవిగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రాంతాలు, ఆచారాలు ఏవైనా.. అమ్మవారి ఆరాధనలో బోనాలు ప్రత్యేకమైనవి. అడుగడుగునా భక్తి కనిపించే ఈ పండుగ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ద్విగుణీకృతం చేస్తుందనడంలో సందేహం లేదు.
-కణ్వస


విద్యారుణం.. వడ్డీ రాయితీతో!-Vidhyarunam-Siri


విద్యారుణం.. వడ్డీ రాయితీతో!
ప్రతిభ ఉండీ ఆర్థిక స్థితి అనుకూలించక పై చదువులు మానేసిన వారెందరో! స్వదేశంలో ఉన్నత విద్య లేదా విదేశీ విద్య అందని ద్రాక్షగా మారుతున్న రోజులివి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, షెడ్యూలు కులాల వారికీ, మైనార్టీలకూ ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశ పెట్టింది. ఇందులో ఒకటి ‘వడ్డీ రాయితీతో విద్యా రుణ పథకాలు’. ఇవి పేద విద్యార్థుల పాలిట వరంగా చెప్పుకోవచ్చు. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) రూపొందించిన మోడల్‌ ఎడ్యుకేషనల్‌ లోన్‌ నిబంధనల ప్రకారం వివిధ బ్యాంకులు మంజూరు చేస్తున్న విద్యా రుణాలకు ఈ వడ్డీ రాయితీ పథకాలు వర్తిస్తాయి.
స్వదేశంలో.. రూ.10లక్షల వరకూ... 
దేశీయంగా ఉన్నత చదువులు అభ్యసించాలని కోరుకునే వారికి బ్యాంకులు నిబంధనల మేరకు రుణాలను మంజూరు చేస్తాయి. ఇక ఈ రుణాన్ని తీసుకున్న వారికి వడ్డీ రాయితీ పథకం ఎలా వర్తిస్తుందంటే... 
* విద్యార్థి సామాజిక వర్గంతో సంబంధం లేకుండా అతని కుటుంబ ఆర్థిక స్థితిని అనుసరించి ఈ పథకం లబ్ది చేకూరుస్తుంది. 
* ‘సెంట్రల్‌ స్కీం ఆఫ్‌ ఇంట్రస్ట్‌ సబ్సిడీ ఫర్‌ ఎడ్యుకేషన్‌ లోన్స్‌’ (సీఎస్‌ఐఎస్‌) పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం, వృత్తి సంబంధిత, సాంకేతిక విద్యా కోర్సులలో, భారతదేశంలో విద్యనభ్యసించాలనుకునే వారికి వర్తిస్తుంది. 
* విద్యార్థుల తల్లిదండ్రుల లేదా వార్షిక కుటుంబ ఆదాయం (అన్ని ఆదాయ వనరులూ కలిపి) రూ.నాలుగున్నర లక్షల వరకూ ఉన్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వం నిర్దేశించిన అధికారులు ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అర్హత నిర్ణయిస్తారు. 
* ఇంటర్మీడియట్‌ లేదా 12వ తరగతి అర్హతతో, అనుమతి పొందిన విద్యా సంస్థలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రవేశం పొందేవారు అర్హులు. 
* బ్యాంకుల నుంచి పొందే విద్యా రుణంలో రూ.10లక్షల వరకూ విధించే మొత్తం వడ్డీని రుణ గ్రహీత తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.10లక్షల పైన విద్యా రుణం తీసుకుంటే.. ఆ పై (రూ.10లక్షల తర్వాత) మొత్తానికి బ్యాంకులు విధించే వడ్డీని రుణ గ్రహీత చెల్లించాల్సి ఉంటుంది. 
* ఇంటర్మీడియట్‌ తర్వాత చేరే తొలి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, డిప్లొమా, ఏకీకృత పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులలలో చేరాలనుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. 
* ఒక విద్యార్థి ఒక కోర్సుకు మాత్రమే వడ్డీ రాయితీ పొందడానికి అర్హుడు.
విదేశాల్లో చదువుతుంటే... 
విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే ఆర్థికంగా వెనకబడిన, ఇతర వెనకబడిన సామాజిక వర్గ విద్యార్థులకు, మైనార్టీలకు వేర్వేరు పథకాల ద్వారా వడ్డీ రాయితీ పథకాలు అందుబాటులో ఉన్నాయి.
* డా.అంబేడ్కర్‌ ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కీం ఫర్‌ ఇంట్రెస్ట్‌ సబ్సిడీ ఆన్‌ ఎడ్యుకేషనల్‌ లోన్స్‌’ పేరుతో అమలవుతున్న ఈ పథకంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇతర వెనుకబడిన సామాజిక వర్గ విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది. 
* ‘పడో పరదేశి’ పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా విదేశాలలో విద్యనభ్యసించాలనుకునే మైనార్టీ విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది. 
* ఈ పథకంలో లబ్ది పొందడానికి, వార్షిక కుటుంబ ఆదాయ పరిమితిని ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల విషయంలో రూ.ఒక లక్ష, ఇతర వెనకబడిన సామాజిక వర్గ విద్యార్థుల విషయంలో రూ.3లక్షలు, మైనార్టీలకు రూ.6లక్షలుగానూ నిర్దేశించారు. 
* విదేశాల్లో మాస్టర్స్‌, ఎంఫిల్‌ లేదా పీహెచ్‌డీ చేయాలనుకునే వారికి ఈ పథకాలు వర్తిస్తాయి. 
* బ్యాంకుల నుంచి పొందే విద్యా రుణంలో రూ.20లక్షల వరకూ విధించే మొత్తం వడ్డీని రుణ గ్రహీత తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.20లక్షల పైన విద్యా రుణం పొందిన పక్షంలో, ఆ పై మొత్తానికి బ్యాంకులు విధించే వడ్డీని రుణ గ్రహీత చెల్లించాల్సి ఉంటుంది. 
* రుణ అమలులో ఉన్న కాలంలో విద్యార్థి భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటే వడ్డీ రాయితీ వర్తించదు. 
* ఆదాయపు పన్ను ధ్రువీకరణ పత్రాలు లేదా ప్రభుత్వం నిర్దేశించిన అధికారులు ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అర్హత నిర్ణయిస్తారు. 
* ఆర్ట్స్‌, కామర్స్‌, వివిధ శాస్త్ర సాంకేతిక కోర్సులు, వైద్య విద్య, నానో టెక్నాలజీ, ఎంబీఏ, ఎంసీఏ సహా 40కి పైగా కోర్సులు ఈ పథకం ద్వారా రాయితీ పొందడానికి అర్హమైనవి. 
* ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలలో చదువుకున్న విద్యార్థులకు ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. 
* ఒకే కోర్సులో కొంత కాలం భారతదేశంలోను మరికొంత కాలం విదేశాలలోనూ చదవాల్సిన సందర్భంలో, విదేశీ యూనివర్సిటీ పట్టా ప్రదానం చేసే సందర్భంలోనే ఈ పథకం వర్తిస్తుంది.
రాయితీ ఎంత కాలానికి? 
* కోర్సు ప్రారంభం నుంచి మొదలుకొని, పూర్తయిన తర్వాత 12 నెలలు లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆరు నెలల కాలాన్ని పరిగణనలోనికి తీసుకొని, ఈ రెండింటిలో ఏది ముందయితే దాన్ని మారటోరియం అవధిగా నిర్ణయిస్తారు. కాలానికి పూర్తి వడ్డీ రాయితీని అందిస్తారు. 
* మారటోరియం అవధి దాటిన కాలానికి రుణగ్రహీత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 
* కోర్సు మధ్యలో మానేసిన వారికి, విద్యా సంస్థలు తొలగించిన విద్యార్థులకు వడ్డీ రాయితీ వర్తించదు.
నైపుణ్యం ఉండీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యావకాశాల్ని చేజార్చుకుంటున్న యువతకు ఈ ప్రోత్సాహక పథకాలు చేయూతనిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇంటి నుంచే దరఖాస్తు... 
విద్యారుణం కోసం ఇంటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తును సమర్పించే వీలుంది. దీనికోసం అందుబాటులోకి వచ్చిన వెబ్‌సైట్‌ ‘విద్యాలక్ష్మి’. కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల శాఖ, భారతీయ బ్యాంకుల సంఘం సంయుక్తంగా అందిస్తోన్న www.vidyalakshmi.co.in వెబ్‌సైట్‌ ద్వారా అల్పాదాయ వర్గాలతో సహా అన్ని వర్గాల విద్యార్థులూ విద్యారుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుల సంఘం రూపొందించిన ఉమ్మడి దరఖాస్తు పత్రాన్ని నింపి, గరిష్ఠంగా 3 బ్యాంకులకు రుణ అభ్యర్థనను పంపవచ్చు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్యాంకులు ఆ రుణ దరఖాస్తును పరిశీలించి, అర్హతననుసరించి, అభ్యర్థికి సమాచారాన్ని తెలియజేస్తాయి. విద్యార్థి తన దరఖాస్తు పరిస్థితిని ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
* అభ్యర్థి తన మొబైల్‌ నెంబరు, ఈ మెయిల్‌ ఐడీ సహాయంతో విద్యాలక్ష్మి పోర్టల్‌లో తొలుత నమోదు చేసుకోవాలి. ఉమ్మడి దరఖాస్తును పూర్తి చేసి, తండ్రి/సంరక్షకుని పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఎంపిక చేసుకున్న కోర్సు, రుణ మొత్తాన్ని నమోదు చేసి, మార్కల జాబితాను అప్‌లోడ్‌ చేయాలి. వివిధ బ్యాంకులు ఉన్నత విద్యాభ్యాసం కోసం అందించే విద్యా రుణ పథకాల సమగ్ర సమాచారాన్ని కూడా ఈ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు.
ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కరూర్‌ వైశ్యా బ్యాంకుతో సహా అనేక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులను అంగీకరిస్తున్నాయి.
పున్న‌మ‌రాజు

క్రాంతీ.. మీ ఆర్థిక ప్రణాళిక ఇలా!
ఆర్థిక ప్రణాళిక అంటే.. ఒక్క రోజులో పూర్తయ్యే విషయం కాదు. ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ.. భవిష్యత్తు లక్ష్యాల కోసం లెక్కలు వేసుకోవాలి. అప్పులు తగ్గించుకుంటూ.. ఆస్తులను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఉన్న ఆర్థిక వనరులతో.. అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుంది.
క్రాంతి కుమార్‌.. హైదరాబాద్‌లోని ఒక బహుళ జాతి సంస్థలో మార్కెటింగ్‌ ఉద్యోగి. భార్య మహాలక్ష్మి. వీరికి నాలుగేళ్ల అబ్బాయి... ఆదిత్య. 
వీరి ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తే.. ఇద్దరికీ కలిపి రూ.63వేల వరకూ వస్తున్నాయి. ఇందులో నుంచి నెలకు ఇంటి ఖర్చులు రూ.12,000; ఆదిత్య స్కూలు ఫీజు రూ.3,300; క్రాంతి తల్లిదండ్రులకు పంపే మొత్తం రూ.10,000; ఇంటి రుణం వాయిదాలు, ఇతర అప్పులకు సంబంధించిన నెలవారీ వాయిదాలు కలిపి రూ.20,206 వరకూ చెల్లిస్తున్నారు. ఇవన్నీ మొత్తంగా రూ.45,506 వరకూ అవుతున్నాయి.
అతను తీసుకున్న అప్పుల విషయానికి వస్తే... 
* గృహరుణానికి నెలకు రూ.14,683 వాయిదా చెల్లిస్తున్నారు. ఇంకా రూ.15,00,000వరకూ చెల్లించాల్సి ఉంది. 
* వ్యక్తిగత రుణానికి నెలకు రూ.3,313 చెల్లిస్తున్నారు. ఇంకా మిగిలిన మొత్తం రూ.1,50,000 
* ఇతర రుణాలకు నెలకు రూ. 2210 వాయిదా కడుతున్నారు. మిగిలిన మొత్తం రూ.1,00,000. అంటే.. క్రాంతిపై దాదాపు రూ.17,50,000 రుణ బాధ్యత ఉంది.
సంపాదన, ఖర్చు విషయానికి వస్తే.. అతని మొత్తం అప్పులకు చెల్లిస్తున్న వాయిదాలు అతని సంపాదనలో దాదాపు 32శాతం వరకూ ఉన్నాయి. ఈ నిష్పత్తిని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉంది.
ఇక ఖర్చులు, రుణ వాయిదాలు పోను దాదాపు 21శాతం వరకూ మిగులు కనిపిస్తోంది.
ఏం చేయాలంటే... 
ముందుగా బీమా: కుటుంబానికి ఆధారంగా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జీవిత బీమా తీసుకోవాలి. ఒకవేళ జరగరానిది జరిగినా కుటుంబానికి ఏ ఆర్థిక ఇబ్బందీ రాకుండా, సాధించాల్సిన లక్ష్యాలకు ఇది ఒక రక్షణగా ఉపయోగపడుతుంది. ఇక క్రాంతి విషయానికి వస్తే.. అతని బాధ్యతల దృష్ట్యా కనీసం రూ.కోటి జీవిత బీమా పాలసీని టర్మ్‌ పాలసీ రూపంలో తీసుకోవాలి. మార్కెటింగ్‌ ఉద్యోగ రీత్యా ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి, కనీసం రూ.50లక్షల వ్యక్తిగత ప్రమాద, డిజేబిలిటీ బీమా పాలసీలు తీసుకోవాలి.
అత్యవసర నిధి: అనుకోని ఖర్చులు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో చెప్పలేం. కొన్నిసార్లు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయమూ ఆగిపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా అట్టి పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం ఉత్తమం.
ఆదిత్య చదువు.. 
ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి ఉన్నత చదువులకు అవసరమ్యే మొత్తం గురించి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. లేకపోతే.. వారు ఉన్నత చదువులకు వచ్చే నాటికి అది పెద్ద భారంగా మారుతుంది. 
* ఆదిత్య ఏ ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నాడు అనే విషయంలో రెండు, మూడింటిని పరిశీలించండి. 
* ప్రస్తుతం ఆ కోర్సును అభ్యసించడానికి ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని తెలుసుకోండి. పెరుగుతున్న ఖర్చులను చూసుకుంటూ భవిష్యత్తులో ఆదిత్య ఆ కోర్సు చదివే నాటికి అయ్యే మొత్తం ఖర్చు ఎంతో లెక్క వేసుకోవాలి. 
* ఆ దిశగా మీరు నెలవారీ పెట్టుబడులు ప్రారంభించండి. మీ దగ్గర మిగులు పెరిగినప్పుడు పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచండి. మదుపు కోసం డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు.
పదవీ విరమణ కోసం... 
ప్రస్తుతం ఉన్న మీ ఖర్చులు, ఇతర బాధ్యతలను పరిశీలిస్తే.. క్రాంతి పదవీ విరమణ చేసేనాటికి దాదాపు రూ.3కోట్ల నిధి చేతిలో ఉండాలి. దీనిని సాధించాలంటే.. ఇప్పటి నుంచే నెలకు రూ.16,500 వరకూ మదుపు చేయాలి. అయితే, ఇప్పుడు ఇంత పొదుపు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, వెంటనే రూ.5వేలను పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడం మేలు. వ్యక్తిగత రుణం తీరిన తర్వాత దానికి చెల్లిస్తున్న వాయిదా మొత్తాన్ని కూడా పెట్టుబడుల వైపు మళ్లించాలి. పదవీ విరమణ పెట్టుబడి కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో ‘సిప్‌’ ప్రారంభించాలి. 
* క్రాంతి ప్రస్తుత వయసు 34ఏళ్లు. మహాలక్ష్మి వయసు 28. క్రాంతి పదవీ విరమణ 60ఏళ్ల వయసులో చేస్తారనుకుందాం. అప్పుడు మహాలక్ష్మికి 54 ఏళ్లు ఉంటాయి. క్రాంతి పదవీ విరమణ తర్వాత 25ఏళ్లు లెక్కలోకి తీసుకుందాం. 
* పదవీ విరమణ చేసిన తర్వాత అతనికి నెలవారీ కావాల్సిన మొత్తం రూ.1,13,735 
* ఎన్ని నెలలపాటు అవసరం (మహాలక్ష్మికి కూడా 85ఏళ్ల వయసును లెక్కలోకి తీసుకుంటే) 372నెలలు 
* మొత్తం కావాల్సిన నిధి రూ.3,16,43,836 
* పెట్టుబడి పెట్టేందుకు మిగిలిన నెలలు 312 
* రాబడి అంచనా 12శాతం 
* నెలకు అవసరమయ్యే పెట్టుబడి రూ.16,488
- సాయి కృష్ణ పత్రి, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌
వరద వచ్చినా... నష్టం లేకుండా!
గట్టిగా ఒక్క వాన పడితే చాలు.. అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకు పోవడం.. ఇళ్లలోకి ఆ నీరు చేరడం.. విలువైన వస్తువులు పాడవటం ఇప్పుడు సర్వసాధారణమైంది. విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులతో గృహోపకరణాలు కాలిపోవడమూ చూస్తుంటాం. మరి, ఇలాంటి ఆర్థిక నష్టాల గురించి గట్టెక్కించే ‘హౌస్‌ హోల్డర్స్‌’ పాలసీని మీరు తీసుకున్నారా?
ప్రకృతి వైపరీత్యాలు.. దొంగతనాలు... అనుకోని ప్రమాదాల కారణంగా ఎంతో విలువైన ఇంటికే కాదు... అందులోని ఖరీదైన వస్తువులకూ వాటిల్లే ఆర్థిక నష్టం నుంచి కాచుకోవాలంటే ఏకైక సాధనం హౌస్‌హోల్డర్స్‌ పాలసీ. న్యూ ఇండియా, ఓరియంటల్‌, యునైటెడ్‌ ఇండియా, నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌, బజాజ్‌ అలియాంజ్‌, రాయల్‌ సుందరం, రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో తదితర బీమా సంస్థలన్నీ ఈ పాలసీని ఇస్తున్నాయి.
ఇంటితో బాటు అందులో నివసించే వ్యక్తులు, ఉండే వస్తువులకు కూడా బీమా రక్షణ కల్పించటం ఈ పాలసీ ప్రత్యేకత. వారు వీరు అన్న తేడా లేకుండా సొంతిల్లు ఉన్న వారంతా హౌస్‌హోల్డర్స్‌ పాలసీ తీసుకోవచ్చు. గ్రామాలు, పట్టణాలన్న తేడా ఏమీ ఉండదు.
* హౌస్‌హోల్డర్స్‌ పాలసీలో పది సెక్షన్లు ఉంటాయి. ఒకో సెక్షన్‌ ఒకో రకం నష్టానికి పరిహారం ఇస్తుంది. మీ అవసరాలను బట్టి కావాల్సిన సెక్షన్లను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, సెక్షన్‌ 1ఎ ఇంటికి వర్తిస్తుంది. సెక్షన్‌ 1బి ఇంట్లోని వస్తువులకు వర్తిస్తుంది. ఇందులో సెక్షన్‌ 1బి తప్పనిసరి. మిగిలిన సెక్షన్లలో మీకు కావాల్సిన వాటినే ఎంచుకోవచ్చు.
వివిధ సెక్షన్ల కింద... 
* ఇంటికి, ఇంట్లోని వస్తువులకు 
* దొంగలు పడి ఇల్లంతా దోచుకున్నా 
* అగ్నిప్రమాదం సంభవించి గృహోపకరణాలు ధ్వంసమైనా 
* షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల టీవీ, వీసీడీ, కంప్యూటర్‌ వంటి వస్తువులు పాడైతే 
* మీరెంతో ముచ్చటపడి కొనుక్కున్న సైకిల్‌ అపహరణకు గురైనా (బైకుకు వాహన బీమా ఉంటుంది) 
* ప్రయాణ సమయాల్లో లగేజీని అపహరించినా పరిహారం లభిస్తుంది. ప్రకృతి ప్రకోపాల నుంచి ఉగ్రవాదుల దాడుల వరకూ కారణం ఏదైనప్పటికీ బీమా అండగా నిలుస్తుంది.
ఖర్చు తక్కువే.. 
గృహ బీమా పాలసీకి ప్రీమియం నామమాత్రంగానే ఉంటుంది. ప్రీమియాన్ని లెక్కించేప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుంటారు. ఇంటి వైశాల్యం, భౌగోళిక పరిస్థితులు, నిర్మాణం తీరు తదితర వాటి ఆధారంగా ప్రీమియం ఉంటుంది. ఇంటికీ, ఇంట్లోని వస్తువులకూ కలిపి రూ.లక్ష బీమా పాలసీ తీసుకుంటే.. ఏడాదికి ప్రీమియం రూ.50-100కు మించదు. టీవీ, ఫ్రిజ్‌, ఎల్‌ఈడీ టీవీ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు కలిపి రూ.లక్ష వరకూ పాలసీ తీసుకుంటే.. రూ.1100 వరకూ ఉంటుంది. అన్ని సెక్షన్లనూ కలిపి తీసుకున్నా.. రూ.లక్షకు ప్రీమియం ఖర్చు రూ.2,000 దాటదు. కంపెనీలను బట్టి ప్రీమియం రేట్లు మారవచ్చు. (జులై 1 నుంచి జీఎస్‌టీ అదనం)
తీసుకునేప్పుడు చూడాలివీ! 
పాలసీని ఎంచుకునేముందు పాలసీ నిబంధనలను ఒకటికి రెండుసార్లు పరిశీలించండి. ఏదో కొన్నింటికే కాకుండా సాధ్యమైనన్ని ఎక్కువ నష్టాలకు క్లెయిం ఇచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాలి.
* ఇంటి నిర్మాణం విలువ, ఇంటిలోని వస్తువుల విలువను కచ్చితంగా లెక్కించి, దానికి అనుగుణంగా పాలసీ మొత్తాన్ని ఎంచుకోవాలి.
* పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వేటికి వర్తిస్తుంది.. వేటికి వర్తించదు అనే వివరాలు సేకరించాలి. చాలావరకు పాలసీలు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో పరిహారం ఇస్తుంటాయి. అయితే, యుద్ధ సమయంలో జరిగిన నష్టానికి మాత్రం ఇవి పరిహారం ఇవ్వవు.
* ప్రీమియం మాటేమిటి? ఏమైనా రాయితీలు ఇస్తున్నారా? ఒకే వ్యక్తి రెండు మూడు హోం ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకుంటే ఏమైనా అదనపు ప్రయోజనాలు ఉన్నాయా అనేది చూసుకోండి.
క్లెయి కోసం..
పాలసీ తీసుకున్న తర్వాత ఇంటికిగానీ, ఇంట్లోని వస్తువులకు గానీ నష్టం జరిగినప్పుడు పరిహారాన్ని క్లెయిం చేసుకునేముందు పాలసీదారుడు చేయాల్సిన పనులేమిటంటే... 
* సాధ్యమైనంత తొందరగా జరిగిన నష్టం, కారణం గురించి బీమా కంపెనీకి తెలియజేయండి. ఆలస్యం చేస్తే క్లెయిం ఇవ్వకపోవచ్చు. 
* నిర్ణీత గడువులోగా క్లెయిం కోసం లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేయండి. ఇందులో ఏయో వస్తువులకు నష్టం కలిగింది? వాటి అసలు విలువ ఎంత? ఎంత పరిహారం కోరుతున్నారు? తదితర పూర్తి వివరాలు పొందుపర్చండి. 
* బీమా సంస్థ సర్వేయరును పంపిస్తే.. అతను అడిగిన అన్ని వివరాలనూ ఓపిగ్గా చెప్పండి. అవసరమైన పత్రాలను సమర్పించండి.

ఆషాఢమాసంలో చేసి తీరాల్సిన పనులు!_Ashadamasam



ఈ నాలుగు నెలలూ పవిత్రం!
ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో! తొలి ఏకాదశి, గురు పౌర్ణమి వంటి పర్వాలు ఈ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసం మొదలు నాలుగు నెలలను చాతుర్మాసాలని పిలుస్తుంటారు. ఈ కాలంలో చాతుర్మాస్య వ్రతం ఆచరించడం ఒక సంప్రదాయం. మనిషి జీవన విధానాన్ని గాడిలో పెట్టే సాధనం... చాతుర్మాస్య వ్రతం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకూ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తుంటారు. కొందరు ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయన ఏకాదశి) నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ పాటిస్తుంటారు.
చాతుర్మాస్య వ్రతాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్న్యాసులు.. అందరూ ఆచరించే సంప్రదాయం ఉండేది. అయితే కాలక్రమంలో సన్న్యాసులు, సనాతన ధర్మాన్ని నిష్ఠగా ఆచరించే కొద్ది మంది మాత్రమే పాటిస్తున్నారు. ఆషాఢ మాసం నుంచి వర్షాలు మొదలవుతాయి. వాతావరణం ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయేలా ప్రేరేపిస్తుంటుంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే రక్షణ కవచమే చాతుర్మాస్య వ్రతం. దీనిని ఆచరించేవారు నాలుగు మాసాలు తానున్న ప్రదేశం పొలిమేర దాటకూడదు. రెండో నియమం నాలుగు నెలలూ ఒకే పూట భోజనం చేయాలి. అది కూడా తానే స్వయంగా వండుకోవాలి. విస్తట్లోనే తినాలి. అన్నింటి కన్నా.. చేయదలచిన భోజనం ఒకేసారి విస్తట్లో వడ్డించుకోవాలి. అంటే మారు వడ్డన పనికిరాదు. ఈ నాలుగు నెలలూ మధ్యాహ్నం పూట నిద్రించకూడదు. రాత్రి కూడా రెండో జాము వరకు భగవన్నామ స్మరణ చేసి అప్పుడు పడుకోవాలి.
ఈ నియమాలన్నీ మనిషిని సన్మార్గంలో నడిపించడానికి దోహదం చేసేవే. మితాహారం ఆరోగ్య కారకం. ఇంద్రియ నిగ్రహం ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేస్తుంది. నాలుగు నెలలు ఈ నియమాలు పాటించడం ద్వారా.. ఆ తర్వాతి కాలంలోనూ మనో నిగ్రహంతో ఉండగలుగుతారనే ఉద్దేశంతోనే చాతుర్మాస్య వ్రతాన్ని సూచించారు మన పెద్దలు.
ఆషాఢమాసంలో
      చేసి తీరాల్సిన పనులు!
వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢమాసంతో తనతో కొన్ని ఆచారాలనూ తీసుకువస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చుగాక, ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చుగాక! కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనకా ఓ కారణం కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి...

పేలాల పిండి

ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫసంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే! ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తికి మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం, యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలిఏకాదశి రోజున తప్పకుండా పేలాలపిండి తినాలని చెబుతూ ఉంటారు.

మునగాకు

మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది. లేత మునగాకు తింటే కంటిసమస్యలన్నీ తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ మునగాకు చేదుగా ఉంటుంది. పైగా విపరీతమైన వేడి. అలాంటి మునగాకుని తినేందుకే ఇదే అనువైన కాలం. లేత మునగాకు దొరకాలన్నా, ఒంట్లో వేడి పెరిగినా ఫర్వాలేదనుకున్నా... వర్షాకాలమే అనువైన సమయం. మునగాకుతో బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడినీ పెంచినట్లవుతుంది. అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశమూ దక్కుతుంది.

దానాలు

ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం, పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతుంటారు. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు. ముఖ్యంగా గొడుకు, చెప్పులు దానం చేయమని సూచిస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ రెండు వస్తువులూ ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా!

సముద్రస్నానాలు

ఆకామావై పేరుతో సముద్రస్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢమాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకూ సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్షరుతువుతో పాటుగా అందులోకి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోకి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాలలో ఉన్న ఔషధగుణాలని తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సముద్రస్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది.

గోరింటాకు

ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయన్న విషయం తెలిసిందే! అలా తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు. ఇక పొలం పనులలో పాల్గొనేవారైతే రోజూ నీటిలో తడవక తప్పదు. దాంతో గోళ్లు సందున నీరు చేరి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గోళ్లు కూడా పెళుసుబారిపోతాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసే సత్తా గోరింటాకుకి ఉంది. పైగా గోరిటాకుని పెట్టుకోవడం వల్ల కఫసంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెబుతుంటారు.

మొబైల్‌ వేగం...మీ చేతుల్లోనే ఉంది!-Mobiles in Hand


మొబైల్‌ వేగం...మీ చేతుల్లోనే ఉంది!
చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉన్నా, అది వేగంగా పని చేయకపోతే విసుగొస్తుంది. మరి మీ మొబైల్‌ వేగం మందగించినప్పుడల్లా కొన్ని చిట్కాలతో దాన్ని పెంచవచ్చని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం.
వాల్‌పేపరే కదా అనుకోవద్దు! 
మొబైల్‌ స్క్రీన్‌ మీద అక్వేరియంలోని చేపలు, ఎగిరే గాలి పటాలు లాంటి కదలాడే వాల్‌పేపర్లు పెడుతుంటారు. ఇవి చూడటానికి బాగున్నా మొబైల్‌ వేగాన్ని తగ్గించేస్తాయి. తక్కువ ర్యామ్‌, పాత తరం ప్రోసెసర్లు ఉన్నవాటిలో అయితే మరీ ఇబ్బంది. మూవింగ్‌ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతుంటాయి. లేకపోతే తెర మీద ఆ కదలికలు కుదరవు. కాబట్టి వీలైనంతగా సాధారణమైన వాల్‌పేపర్లు వాడుకోవడం మంచిది. ఉదాహరణకు ర్యామ్‌ను ఎక్కువగా ఉపయోగించే క్రోమ్‌ లాంటి ఆప్‌ను ఎక్కువసేపు వాడిన తర్వాత మినిమైజ్‌ చేస్తే మొబైల్‌ స్క్రీన్‌ కాసేపు ‘లోడింగ్‌’ అని వచ్చి ఆగుతుంది. మీ ర్యామ్‌ స్క్రీన్‌సేవర్‌, క్రోమ్‌ను ఒకేసారి రన్‌ చేసి డౌన్‌ అవ్వడమే కారణం.
ఇచ్చిన లాంచరే ఎందుకు? 
స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ కనిపించే విధానం, ఐకాన్లు, నోటిఫికేషన్లు, మెనూ .. ఇవన్నీ మొబైల్‌ లాంచర్‌ కిందకే వస్తాయి. ప్రతి మొబైల్‌లో ఇన్‌బిల్ట్‌గా ఓ లాంచర్‌ ఉంటుంది. అది మొబైల్‌ ప్రత్యేక ఫీచర్లను తెలిపేలా ఎక్కువ సైజులో ఉంటూ ఎక్కువ ర్యామ్‌ను వినియోగిస్తుంటుంది. కాబట్టి తక్కువ యానిమేషన్లతో ర్యామ్‌ యూసేజ్‌ మితంగా ఉండే లాంచర్లను వాడితే మంచిది. ప్లేస్టోర్‌లో రకరకాల ఫీచర్లతో లాంచర్లు ఉన్నాయి. గూగుల్‌ నౌ, ఈవ్‌, నోవా, మైక్రోసాఫ్ట్‌ యారో అంటూ ప్రతి సంస్థ లాంచర్లను రూపొందించింది.
ఉన్న బ్రౌజర్‌ బెటరా? 
కంప్యూటర్‌లో బ్రౌజర్‌ అనగానే మనకు ఫైర్‌ఫాక్స్‌, క్రోమ్‌ గుర్తుకొస్తాయి. అదే మొబైల్‌లో అయితే ఒక డీఫాల్ట్‌ బ్రౌజర్‌ ఉంటుంది. అందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లున్నా... వాటి వల్ల ర్యామ్‌ యూసేజ్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్లే స్టోర్‌లో ఉన్న మరికొన్ని బ్రౌజర్లు వేగంగా పని చేస్తాయి. సమాచార శోధన చేసేటప్పుడు త్వరితగతిన ఫలితాలు పొందడానికి ఇవి ఉపయోగపడతాయి. గూగుల్‌ క్రోమ్‌ ఈ విషయంలో ముందుంది. ఒపెరా బ్రౌజర్‌ కూడా మంచి ఎంపికే. అందులో ఉన్న పాప్‌అప్‌ బ్లాకర్‌, డేటా సేవర్‌ ఆప్షన్లు బ్రౌజర్‌ వేగంగా స్పందించడానికి ఉపకరిస్తాయి.
వేరే ఏమన్నా ఉన్నాయా?
ఫేస్‌బుక్‌ ఆప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే... మీ ఫోన్‌ 15 శాతం తక్కువ వేగంగా పని చేస్తుంది. ఇదీ అంతర్జాతీయ టెక్‌ నిపుణుల మాట. సుమారు 80 ఎంబీ ఉండే ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే డేటాతో కలిపి అది 500 ఎంబీ ఆక్రమిస్తుంది. స్నాప్‌ చాట్‌ ఆప్‌ విషయంలోనూ ఇదే పరిస్థితి. అందుకే ఇలాంటి ఆప్స్‌ అవసరం లేదు అనుకుంటే తొలగించడం మంచిది. ఫేస్‌బుక్‌కు బదులు ఫేస్‌బుక్‌ లైట్‌ ఉంది. ప్రధాన ఆప్‌లో ఉండే చాలా సౌకర్యాలను దీంట్లోనూ పొందొచ్చు. ఇది తక్కువ ర్యామ్‌ యూసేజీతో పని చేస్తుంది. అలా మిగిలిన ఆప్స్‌కు ఏవైనా ప్రత్యామ్నాయాలు చూసుకొని వాటిని వినియోగించండి.
యాంటీ వైరస్‌కు యాంటీ
స్మార్ట్‌ఫోన్లలో యాంటీవైరస్‌ ఆప్‌లు వినియోగించే విషయంలో చాలా రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువమంది యాంటీ వైరస్‌ ఆప్‌లు మొబైల్‌ వేగాన్ని తగ్గిస్తాయని అంటున్నారు. ప్రతి మొబైల్‌లోనూ డీఫాల్ట్‌గా దీని కోసం ఓ ఆప్‌ను ఇస్తున్నారు. అది మీ అవసరాలకు తగ్గట్టు పని చేస్తుంది. దీనికి అదనంగా మరో యాంటీ వైరస్‌ అవసరం లేదు. ప్లేస్టోర్‌లో యాంటీవైరస్‌ పేరుతో చాలా ఆప్‌లు ఉన్నాయి. ప్రముఖ సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. ఇవి కంప్యూటర్లలో ఉపయోగపడినంతగా మొబైల్స్‌లో ప్రభావం చూపలేకపోతున్నాయి.
సింక్‌ అయితే
మనకు సోషల్‌ నెట్‌వర్క్‌ ఆప్స్‌, వాతావరణ వివరాలు తెలిపే ఆప్స్‌ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు పంపిస్తుంటాయి. ఆ ఆప్స్‌ ఆటోమేటిక్‌ సింక్‌ అయినప్పుడే ఆ వివరాలు వస్తాయి. ఫోన్‌ వేగం మందగించడానికి ఇవీ ఒక కారణమే. అనవసరం అనుకున్న ఆప్స్‌ సింక్‌ టైమింగ్‌ను మార్చేయండి. ఉదాహరణకు గూగుల్‌ మ్యాప్స్‌ ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ వివరాలు నోటిఫికేషన్ల రూపంలో పంపిస్తుంటుంది. అంటే దీని కోసం మ్యాప్స్‌ ఆప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతున్నట్లే. దీన్ని ఆఫ్‌ చేస్తే ఫోన్‌ మీద భారం తగ్గినట్టే. అలాగే వైఫై వినియోగిస్తున్నప్పుడే మొబైల్‌ ఆటో సింక్‌ అయ్యేలా మార్పులు చేసుకోవచ్చు. దీని కోసం మొబైల్‌ సెట్టింగ్స్‌లో సింక్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయండి. అందులో ‘ఆటో సింక్‌ ఆన్‌ వైఫై ఓన్లీ’ ఆప్షన్‌ను ఎంచుకోండి. లేదంటే ఆటో సింక్‌ను పూర్తి ఆఫ్‌ చేయండి.
ఇబ్బంది పెడితేనే కాదు
మొబైల్‌లో సమస్య వచ్చినప్పుడు ఫ్యాక్టరీ రీసెట్‌ చేస్తుంటాం. అలా కాకుండా అప్పుడప్పుడు రీసెట్‌ చేస్తే మొబైల్‌ పని చేసే తీరులో మార్పు ఉంటుంది. అయితే ప్రతిసారి డేటాను బ్యాకప్‌ తీసుకోవాలి. తర్వాత రెస్టోర్‌ చేసుకోవాలి. దీనికి మీరు సిద్ధమైతే.. కుదిరినప్పుడల్లా మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేయడం మంచిదని టెక్‌ నిపుణుల సూచన. దీని కోసం సెట్టింగ్స్‌లోని బ్యాకప్‌ అండ్‌ రీసెట్‌ ఆప్షన్‌లోకి వెళ్లండి. అందులోని ఫ్యాక్టరీ రీసెట్‌ ఆప్షన్‌ను ఒత్తితే సరి.
స్పీడ్‌ కిల్లర్స్‌
బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అయ్యే ఆప్స్‌ను క్లియర్‌ చేయడం కోసమని కొన్ని, బ్యాటరీని అధికంగా వినియోగించే ఆప్స్‌ను ఆపేయడానికని ఇంకొన్ని ఆప్‌లు ప్లే స్టోర్‌లో ఉన్నాయి. టాస్క్‌ కిల్లర్స్‌గా పిలిచే ఈ ఆప్స్‌ను మొబైల్‌ స్పీడ్‌ కిల్లర్స్‌ అంటున్నారు నిపుణులు. ఈ ఆప్‌లు మొబైల్‌ వేగాన్ని పెంచకపోగా మరింత తగ్గిస్తాయిట. కొత్త తరం మొబైల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఆప్స్‌ను క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక ఆప్‌ను మినిమైజ్‌ చేస్తే కాసేపటికి అది నిద్రావస్థలోకి వెళ్లిపోతుంది. తర్వాత దాన్ని మళ్లీ ఓపెన్‌ చేస్తేనే యాక్టివేట్‌ అవుతుంది.
వాటిని నమ్మకండి
మొబైల్‌లో ఈ చిన్న మార్పు చేసుకోండి, మీ ఫోన్‌ వేగం అమాంతం పెరిగిపోతుంది. కాకపోతే మీ ఫోన్‌ను రూట్‌ చేయాలని కొంతమంది చెబుతుంటారు. ఇది నిపుణులకు, ప్రయోగాలు చేసేవాళ్లకు ఓకే కానీ సాధారణ వినియోగదారులకు కాదు. డెవలపర్‌ మోడ్‌ కూడా ఇలాంటిదే. ర్యామ్‌ బూస్టర్‌, ఎస్డీ కార్డు స్పీడ్‌ అప్పర్‌ అంటూ కొన్ని సాఫ్ట్‌వేర్ల గురించి అంతర్జాలంలో కథనాలు వస్తున్నాయి. వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకునే బదులు పై చిట్కాలు వాడుకుంటే మంచిది.


గుండె, ఊపిరితిత్తుల మార్పిడితో పీపీహెచ్‌కు చెక్‌! హార్ట్‌ అండ్‌ లంగ్‌ కౌన్సెలింగ్‌-Chest pain, Lungs


గుండె, ఊపిరితిత్తుల మార్పిడితో పీపీహెచ్‌కు చెక్‌!
హార్ట్‌ అండ్‌ లంగ్‌ కౌన్సెలింగ్‌
మా అబ్బాయి వయసు 22 ఏళ్లు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసి కాంపస్‌ సెలక్షన్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ అంతలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీలో నొప్పి– తీవ్రమైన అసౌకర్యం, గుండెదడ, శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఇక్కడి డాక్టర్లకు చూపిస్తే ఏవో పరీక్షలు చేసి వాడికి పీపీహెచ్‌ అనే వ్యాధి ఉందని చెప్పారు. గుండె, ఊపిరితిత్తులు రెండూ చెడిపోయాయయని చెబుతున్నారు. ఏవో మందులు రాశారుగానీ ప్రాణానికి ప్రమాదం అంటున్నారు. గుండె, ఊపిరితిత్తులు రెండింటి మార్పిడితోనే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందంటున్నారు. ఈ వ్యాధి ఏమిటి? ఎందుకు వస్తుంది? వాడు మా ఒక్కగానొక్క కొడుకు. వాడిని రక్షించుకునే మార్గం సూచించండి. – పి. అంజమ్మ, నకిరేకల్‌
మీ అబ్బాయికి వచ్చిన వ్యాధి ప్రైమరీ పల్మునరీ హైపర్‌టెన్షన్‌. దీని సంక్షిప్త రూపమే ఈ పీపీహెచ్‌. అరుదైన ఈ వ్యాధిలో ఊపిరితిత్తుల్లో రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి రక్తనాళాల వెడల్పు తగ్గి ఇరుకుగా తయారవుతాయి. తీవ్రమైన ఈ వ్యాధి కారణంగా గుండె, ఊపిరితిత్తులు రెండూ దెబ్బతింటాయి. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరిగిపోయి, ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి కలుగుతుంది. అయితే అంతమాత్రం చేత ఆశలన్నీ వదులుకోనవసరం లేదు. ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనల వల్ల, కొత్త మందుల ఆవిష్కరణ వల్ల, అవయవ మార్పిడిలో నూతన శస్త్రచికిత్స మెళకువలు అభివృద్ధి చెందడం వల్ల పీపీహెచ్‌కు ఇప్పుడు నమ్మకమైన చికిత్స అందుబాటులో ఉంది. దాని ద్వారా రోగి జీవితకాలాన్ని పొడిగించవచ్చు.
పీపీహెచ్‌ రావడానికి స్పష్టమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ కొన్ని కుటుంబాలలో పీపీహెచ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. మన దేశంలో ఏటా పది లక్షల మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. పీపీహెచ్‌ మొదటిదశలో డాక్టర్లు నిర్వహించే సాధారణ వైద్యపరీక్షల్లోనే ఈ వ్యాధి బయటపడుతుంది. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రం పీపీహెచ్‌ లక్షణాలు... గుండె జబ్బులు, శ్వాసకోశ రుగ్మతల్లాగా కనిపించి కాస్త తికమకపెడతాయి. కానీ మీరు తెలిపిన విషయాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి సాధారణ వైద్యపరీక్షలతోనే ఈ వ్యాధి నిర్ధారణ అయ్యిందని తెలుస్తోంది. దీన్ని బట్టి బహుశా అది ప్రాథమిక దశలోనే ఉండి ఉండాలి. అలాగైతే మందులతోనే దానికి చికిత్స చేయివచ్చు. కొన్ని జాగ్రత్తలతో అతడు సాధారణ జీవితం గడపవచ్చు.
ఒకవేళ ఇందుకు భిన్నంగా మీ అబ్బాయికి వ్యాధి ముదిరి ఉన్నా నిరాశపడాల్సిన పనిలేదు. గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే అవయవ మార్పిడితో ప్రాణాలు కాపాడవచ్చు. పైగా మీ అబ్బాయి యువకుడు అయినందువల్ల గుండె, ఊపిరితిత్తులు రెండింటి మార్పిడికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే పీపీహెచ్‌ వల్ల ఒక బాలిక గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా తిన్నా... కంబైన్‌డ్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా ఆమెకు మా హాస్పిటల్‌లోనే అవయవమార్పిడి చేసి రక్షించగలిగాం. మూడు నెలల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న ఆ బాలిక ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. కాబట్టి మీరు మీ అబ్బాయి విషయంలో నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు పెద్ద ఆసుపత్రికి వెళ్లి చూపించుకోండి. అక్కడ ఛాతీ ఎక్స్‌రే, ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, పల్మునరీ ఫంక్షన్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు నిర్వహించి వ్యాధి ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేస్తారు. పరిస్థితిని చూసి చికిత్స ప్రారంభించవచ్చు. ఒకవేళ గుండె, ఊపిరితిత్తులు మార్చాల్సిన అసవరం వస్తే డాక్టర్లు గుర్తించిన వెంటనే ఆ అవయవాల కోసం ప్రభుత్వ నిర్వహణలో ఉన్న జీవన్‌దాన్‌ సంస్థలో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దాత లభించేంతరకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆందోళన చెందకుండా మీరు మీకు దగ్గర్లోని పెద్ద హాస్పిటల్స్‌లోని గుండెనిపుణులకు చూపించుకొని వారి సూచన మేరకు అవసరమైన తదుపరి ఏర్పాట్లు చేసుకోండి.
డాక్టర్‌ పి.వి. నరేశ్‌ కుమార్
సీనియర్‌ కార్డియో–థొరాసిక్, హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌.
పాపకు తరచూ జలుబు.... ఎందుకిలా?
పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌
మా పాప వయసు ఏడేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఇటీవల ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కులు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాఫీగా జరగడం లేదంటూ ఏడుస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం కేవలం తాత్కాలికమే. మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి.
– రమాసుందరి, శ్రీకాకుళం
మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్‌ అనేది ముక్కు లోపలి పొర ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్‌ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి. మరికొందరిలో సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండానూ, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్‌ ఇన్ఫెక్షియస్‌ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు.
అంటే... అలర్జెన్స్‌ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్‌సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్‌ డిస్టర్బెన్సెస్‌) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక మీ పాప విషయంలో ఇది ఇడియోపథిక్‌ అలర్జిక్‌ రైనైటిస్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టమే అయినప్పటికీ– కంప్లీట్‌ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్‌ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్‌ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్‌ నేసల్‌ డ్రాప్స్‌), యాంటీహిస్టమైన్‌ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్‌ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్మూ ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.
డా. రమేశ్‌బాబు దాసరి,
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్,
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌


సాయిహారతులు_SaiHaratulu










శ్రీ షిరిడి సాయినాధుని మ‌ధ్యాహ్నహార‌తి 
ఘేఉని పంచారతీ కరూ బాబాన్సీ ఆరతీ
కరూ సాయిసీ ఆరతీ కరూబాబాన్సీ ఆరతీ
ఉఠా ఉఠాహో బాన్‌ధవ ఓవాళూ హరమాధవ
సాయిరామాధవ ఓవాళూ హరమాధవ
కరూనియా స్థీరమన పాహూ గంభీర హేద్యాన
సాయిచేహేధ్యానపాహు గంభీర హేధ్యాన
కృష్ణనాథ దత్తసాయి జడోచిత్త తుఝే పాయీ
చిత్తబాబాపాయీ జడోచిత్త తుఝే పాయీ
ఆరతీ సాయిబాబా
సౌఖ్యదాతార జీవా చర ణారజతాలీ
ద్యావా ద్యాసావిసావా భక్తా విసావా ఆరతి సాయిబాబా
జాళునియా ఆనంగ స్వస్వరూపీ రాహేదంగ
ముముక్ష జనా దావీ నిజడోళా శ్రీరంగ డోళా శ్రీరంగ ఆరతిసాయిబాబా
జయామనీ జైసా భావ తయతైసానుభావ
దావిసీ దయాఘనా ఐసీ తుఝీ హి మావ తుఝీ హిమావ ఆరతి సాయిబాబా
తుమచే నమధ్యాతా హరే సంసృతి వ్యథా
అగాధ తవ కరణీ మార్గ దావిసీ అనాథా
దావిసీ అనాథా ఆరతిసాయిబాబా
కలియుగీ అవతార సద్గుణ పరబ్రహ్మసాచార
అవతీర్ణ ఝాలాసే స్వామీ దత్తాదిగంబర
దత్తాదిగంబర ఆరతి సాయిబాబా
ఆఠా దివసా గురువారీ భక్త కరీతివారీ
ప్రభుపద పహావయా భవభయానివారి
భయానివారి ఆరతిసాయిబాబా
మాఝా నిజద్రవ్యఠేవ తవ చరణరజసేవా
మాగణ హేచి ఆతా తుహ్మా దేవాధిదేవా
దేవాధిదేవా ఆరతిసాయిబాబా
ఇచ్చితా దీనచాతక నిర్మలతో య నిజసూఖ
పాజవే మాధవాయ సంభా అపూళిభాక
అపూళిభాక ఆరతిసాయిబాబా
సౌఖ్య దాతారజీవచరణా రజతాలీ
ధ్యావాదాసావిసావా భక్తా విసావా ఆరతిసాయిబాబా
జయదేవ జయదేవ దత్తా అవధూతా ఓ సాయి అవధూత
జోడుని కరతవ చరణీ ఠేవితో మాథా జయదేవ జయదేవ
అవతరసీ తూ యేతా ధర్మాన్‌ తే గ్లానీ
నాస్తీకానాహీ తూ లావిసి నిజభజనీ
దావిసి నానాలీలా అసంఖ్య రూపానీ
హరిసీ దీనాన్‌చేతూ సంకట దినరజనీ
జయదేవ జయదవేవ దత్తా అవధూతా ఓ సాయీ అవధూతా
జోడుని కరతవ చరణీ ఠేవితోమాధా జయదేవ జయదేవ
యవనస్వరూపీ ఐక్యాదర్శన త్వాధిధలే
సంశయ నిరసునియా తద్ద్వెతాఘాలవిలే
గోపీచందా మందాత్వాంచీ ఉద్దరిలే
మోమినవంశీ జన్మునిలోకా తారియలె
జయదేవ జయదేవ దత్తా అవధూతా ఓ సాయీ అవధూతా
జోడుని కరతవ చరణీఠేవితోమాధా జయదేవ జయదేవ
భేదనతత్త్వీ హిందూ యవనాన్‌చా కాహీ
దావాయాసీ ఝాలా పునరపి నరదేహీ
పాహసి ప్రేమానేతూ హిందూ యవనాహీ
దావిసి ఆత్మత్వానే వ్యాపక్‌ హాసాయీ
జయదేవ జయదేవ దత్తా అవధూతా ఓ సాయీ అవధూతా
జోడుని కరతవ చరణీఠేవితోమాధా జయదేవ జయదేవ
దేవా సాయినాథా త్వత్పదనత హ్వావే
పరమాయా మెహిత జనమోచన ఝణిహ్వావే
త్వత్కృపయా సకలాన్‌చే సంకట నిరసావే
దేశిల తరిదే త్వద్యుశ కృష్ణానే గావే
జయదేవ జయదేవ దత్తా అవధూతా ఓ సాయీ అవధూతా
జోడుని కరతవ చరణీఠేవితోమాధా జయదేవ జయదేవ
షిరిడీ మారే పండరపుర సాయిబాబా రమావర
బాబా రమావర సాయిబాబా రమావర
శుద్ధభక్తీ చంద్రభాగా భావపుండలీక జాగా
పుండలీకజాగా భావపుండలీకజాగా
యాహో యాహో అవఘేజన క రూబాబాన్సీ వందన
సాయీసీ వందన కరూబాబాన్సీ వందన
గణూహ్మణ బాబాసాయీ దావపావ మాఝే ఆఈ
పావమామాఝే ఆఈ దావపావ మాఝే ఆఈ
ఘాలీన లోటాంగణ, వందీన చరణ,
డోళ్యానీ పాహీన రూపతుఝే
ప్రేమే ఆలింగన, ఆనందేపూజిన్‌
భావే ఓవాళీనహ్మణే నామా
త్వమేవ మాతా పితాత్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమదేవదేవ
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్‌
కరోమి యద్యత్సకలం పర స్మై
నారాయణాయేతి సమర్పయామి
అచ్యుతం కేశవం రామానారాయణం,
కృష్ణ దామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికా వల్లభం,
జానకీ నాయకం రామచంద్రం భజే
హరేరామ హరేరామ రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
శ్రీ గురుదేవదత్త
హరి: ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి
ప్రథమాన్యాసన్‌ తేహనాకం మహిమాన్‌: సచంత
యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః
ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే
నమోవయంవై శ్రవణాయ కూర్మహే
సమేకామాన్‌ కామకామాయ మహ్యం
కామేశ్వరోవై శ్రవణో దధాతు
కుబేరాయవైశ్రవణాయ మహారాజాయనమః
ఓం స్వస్థి సామ్రాజ్యం భోజ్యం
స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం
మహారాజ్య మాధిపత్యమయం సమంతపర్యా
ఈశా సార్వభౌమః స్సార్వాయుషాన్‌
త్రాదాపదార్థాత్‌ పృథివ్యై సముద్ర పర్యంతాయా
ఏకరాళ్ళితి తదప్యేష శ్లోకో భిగితో మరుతః
పరివేష్ఠారో మరుత్తస్యావసన్‌ గ్రహే
అవిక్షితస్య కామప్రేర్‌ విశ్వేదేవాః సభాసద ఇతి
శ్రీనారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహారాజ్‌కీ జై
అనంతా తులాతే కసేరే స్తవావే
అనంతాతులాతే కసేరే నమావే
అనంతా ముఖాచా శిణ శేషగాతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా
స్మరావే మనీ త్వత్పదా నిత్యభావే
ఉరావేతరీ భక్తీసాఠీ స్వభావే
తరావే జగా తారునీ మాయతాతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా
వసే జోసదా దావయా సంతలీలా
దిసే ఆజ్ఞలోకాపరీ జో జనాల
పరీఅంతరీ జ్ఞానకైవల్యదాతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా
భరాలాధలా జన్మహా మానవాచా
నరాసార్ధకా సాధనీభూత సాచా
ధరూసాయి ప్రేమాగళాయా అహంతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా
ధరావే కరీసాన అల్పజ్ఞబాలా
కారావే ఆహ్మాధన్య చుంబోని గాలా
ముఖీఘాల ప్రేమే ఖరాగ్రాస ఆతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా
సురాదీక జ్యాంచ్యాపదా వందితాతీ
శుకాదీకజాంతే సమానత్వదేతీ
ప్రయాగాది తీర్థేపదీ నమ్రహోతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా
తుఝాజ్యాపదా పాహతా గోపబాలీ
సదారంగ ళీ చిత్స్వరూపీ మిళాలీ
కరీ రాసక్రీడా సవేకృష్ణనాథా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా
తులా మాగతో మాగణ ఏక ద్యావే
కరాజోడితో దీన అత్యంత భావే
భవీమోహనీ రాజ హాతారి ఆతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా
ఐసా యే ఈబా సాయీ దిగంబరా
అక్షయరుప అవతారాసర్వహి వ్యాపక తూ
శృతిసారా అనసూయా త్రికుమారా బాబాయే ఈబా
కాశీస్నాన జప, ప్రతిదీవశీ కొల్హాపుర భిక్షేసీ
నిర్మల నదితుంగా, జలప్రాశీ నిద్రామాహురదేశీ ఐసా యే ఈబా
ఝోళిలోంబతసే వామకరీ త్రిశూల ఢమరూధారీ
భక్తావరద సదా సుఖకారీ దేశిల ముక్తీచారీ ఐసా యే ఈబా
సాయిపాదుకా జపమాలా కమండలూ మృగఛాలా
ధారణ కరిశీబా నాగజటా ముకుట శోభతోమాథా ఐసా యే ఈబా
తత్పర తుఝ్యూయా జేధ్యానీ అక్షయత్యాంచే సదనీ
లక్ష్మివాసకరీ దినరజనీ రక్షసి సంకట వారుని ఐసా యే ఈబా
యాపరిధ్యాన తుమాఝే గురురాయా దృశ్యకరీ నయనాయా
పూర్ణానంద సుఖే హీకాయా లావిసి హరిగుణగాయా
ఐసా యే ఈబా సాయి దిగంబరా అక్షయ రుప అవతారా
సర్వహివ్యాపక తూ శ్రుతిసారా అనసూయాత్రికుమారా బాబాయే ఈబా
సదాసత్య్వరూపం చిదానందకందం
జగత్సంభవస్థాన సంహార హేతుమ్‌
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురం సాయినాథమ్‌
భవధ్వాంత విధ్వంస మార్తాండ మీడ్యం
మనోవాగతీతం ముని ర్‌ధ్యాన గమ్యం
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌
భవాంబోధి మాగ్నార్దితానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తిప్రియాణాం
సముద్ధారణార్థం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌
సదానింబవృక్షస్య మూలాది వాసాత్‌
సుధాస్రావిణం తిక్తమప్య ప్రియంతమ్‌
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌
సదాకల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భావ బుద్ధ్యా సపర్యాది సేవామ్‌
నృణాంకుర్వతాం భుక్తిముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌
అనేకాశృతా తర్క్యలీలా విలాసైః
సమావిష్కృతేశా నభాస్వత్ప్రభావమ్‌
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌
సతాం విశ్రమారామ మేవాభిరామం
సదాసజ్జనైః సంస్తుతం సన్నమద్భిః
జనామోదదం భక్త భద్రప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
అజన్మాద్యమేకం పరబ్రహ్మసాక్షాత్‌
స్వయం సంభవం రామమేవాతీర్ణం
భవద్దర్శనాత్సంపునీతః ప్రభోహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
శ్రీ సాయీశకృపానిధే ఖిలనృణాం సర్వార్థసిద్ధిప్రద
యుష్మత్పాదరజః ప్రభావమతులం ధాతాపి వక్తాక్షమః
సద్బక్త్యా శరణం కృతాంజలిపుటః సంప్రాపితోస్మిప్రభో
శ్రీమత్సాయి పరేశ పాదకమలా న్నాన్యచ్ఛరణ్యం మమ
సాయి రూపధర రాఘవోత్తమం
భక్తకామ విబుధద్రుమం ప్రభుం
మాయయోపహత చిత్తశుద్దయే
చింతయామ్యహ మహర్నిశం ముదా
శరత్సుధాంశు ప్రతిమం ప్రకాశం
కృపాతపత్రం తవసాయినాథ
త్వదీయ పాదాబ్జ సమాశ్రితానాం
స్వచ్ఛాయయాతాపమపాకరోతు
ఉపాసనా దైవత సాయినాథ
స్తవైర్మయోపాసనినాస్తుతస్త్వమ్‌
రమేన్మనోరమే తవపాదయుగ్మే
భృంగోయదాబ్జే మకరంద లుబ్దః
అనేక జల్మార్జిత పాపసంక్షయో
భవేద్భవత్పాద సరోజ దర్శనాత్‌
క్షమస్వసర్వాందపరాంధ పుంజకాన్‌
ప్రసీద సాయీశ సద్గురోదయానిథే
శ్రీసాయినాథ చరణామృతపూతచిత్తాస్‌
తత్పాదసేవనరతాః స్సతతం చ భక్త్యా
సంసార జన్యదునితౌర్థ వనిర్గతాస్తే
కైవల్యధామ పరమం సమవాప్నువంతి
స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యోనర స్తన్మనాః సదా
సద్గురోః సాయినాథస్య కృపాపాత్రం భవెధృవమ్‌
కరచరణకృతం వాక్కాయజం కర్మజంవా
శ్రవణ నయనజం వా మానసంవా పరాధం
విహితమ విహితం వా సర్వమేతత్‌ క్షమస్వ
జయజయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహారాజ్‌కీ జై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్‌మహారాజ్‌
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌ కీ జై


కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు!Kumaraswamy



కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు_KumaraSwamy

దక్షిణభారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం అంతాఇంతా కాదు. తమిళనాడులో మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకున్నా, తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్నా... ఆ షణ్ముఖునికే చెల్లింది. అందుకే ఆయనను ఆరాధించేందుకు ఎన్నో పర్వదినాలను ఏర్పరుచుకున్నారు. వాటిలో ఒక ముఖ్యమైన పండుగే ‘కుమార షష్ఠి’. ఆ పండుగ సందర్భంగా ఆయన వైభవాన్ని ఓసారి తల్చుకుందాం!!!

విజయాలకు – కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే! రెల్లుగడ్డిని ‘శరం’ అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ ‘శరం’ అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టులావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే... ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారట!

సంతానానికి - ఈ సృష్టిలో పార్వతీపరమేశ్వరులని ఆదిదంపతులకి చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ‘కుమార’ స్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రాతిపదిక!

జ్ఞానానికి – సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుందట! పరమేశ్వరుని దయతో, ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేథస్సు కుమారస్వామికి అలవడిందని చెబుతారు. ఇక ఆయన చేతిలో ఉండే శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవడం కద్దు. ఈ శూలం పదునైనా ఆయుధానికే కాదు, సునిశితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తుంటారు.

ఆధ్మాత్మిక ఉన్నతికి – శివుని తేజం రేతస్సుగా మారి గంగానదిలో పడిందనీ, అది ఆరుభాగాలుగా మారిందనీ.. కుమారస్వామి జననం గురించి చెబుతుంటారు. ఆ ఆరు భాగాలనూ ఆరుగురు కృత్తికలనే అక్కచెళ్లెళ్లు పెంచారట. అందుకనే కుమారస్వామిని ‘షణ్ముఖుడు’ అని పేర్కొంటారు. అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందని చెబుతుంటారు. ఆరు అనే సంఖ్య ఆరు దిక్కులకు (తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఊర్థ్వం, పాతాళం) సూచన. పురుష శక్తికి, స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే రెండు త్రికోణాల కలయికలో కూడా ఆరు కోణాలు కనిపిస్తాయి. ఇలా రెండు త్రికోణాలు కలిసిన షట్కోణం గుర్తుని హిందువులతో పాటుగా క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు కూడా పవిత్ర చిహ్నంగా భావిస్తుంటారు. ఆ పవిత్ర సంఖ్యకు, పవిత్ర చిహ్నానికి ప్రతీకగా షణ్ముఖుని భావించవచ్చు!

యోగసాధనకు – కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలినిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతం అయిన రోజున, మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందకే కుండలిని మేల్కొల్పడం అన్నది మన యోగశాస్త్రపు అంతిమలక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటుని అందించేలా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు!

జాతక దోషనివారణకు – వివాహం, సంసారం, సంతానం... వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిషుల మాట! ఆ కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహజీవితంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. సుబ్రమ్మణ్యేశ్వరుని కనుక పూజిస్తే... ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మిక!

వర్షాకాలం ఆరోగ్యానికి గొడుగు పడదాం_RAIN SEASON TIPS




వర్షాకాలం ....ఆరోగ్యానికి గొడుగు పడదాం

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఏ మూలనో పడేసిన గొడుగును దుమ్ముదులిపి పట్టుకెళతాం. వానచినుకుల్లో రక్షణకు అదొక్కటే సరిపోదు. బ్యాక్టీరియా, వైర్‌సలు విజృంభించే ఈ తడి కాలంలో ఆరోగ్యానికీ ఛత్రిక పట్టాలి. లేకపోతే అనారోగ్యం ముసురుకుంటుంది. ముందు జాగ్రత్తలతో మేలుకొంటే వానాకాలం జబ్బుల నుండి బయటపడొచ్చు. అదెలాగంటే..

ఈ కాలంలోనే వ్యాధులెక్కువ..
ఈ కాలంలో వాతావరణం తేమగా, తడిగా తయారవటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గటంతో అన్నిరకాల సూక్ష్మక్రిములు బలం పుంజుకుని వృద్ధి చెందుతాయి. దీనికితోడు వర్షాకాలంలో మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ కారణంగా వర్షాకాలంలో తేలికగా వ్యాధులబారిన పడుతుంటాం.

ఆ రెండు జ్వరాలతో జాగ్రత్త
నిల్వ నీటితో దోమలు, ఈగలు ఈ కాలంలో విపరీతంగా పెరిగిపోతాయనే విషయం అందరికీ తెలిసిందే! ఇంటి పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నా ఈ కాలంలో దోమల బెడదను ఎదుర్కోక తప్పదు. దోమల వల్ల ప్రధానంగా బాధించే జ్వరాలు.. డెంగ్యు, టైఫాయిడ్‌.

డెంగ్యు
వానాకాలం విజృంభించే డెంగ్యు వ్యాధికారక వైరస్‌ ‘టైగర్‌ మస్క్యుటో’ల వల్ల మనుషులకు సోకుతాయి. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మం మీద దద్దుర్లు, కనుగుడ్డు వెనక ప్రదేశంలో నొప్పి, జ్వరం... ఈ వ్యాధి లక్షణాలు. కొన్ని సందర్భాల్లో లక్షణాల తీవ్రతను బట్టి ఈ వ్యాధిని ఫ్లూ జ్వరం లేదా ఇతరత్రా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌గా పొరబడే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం పసిపిల్లలు, మొదటిసారి డెంగ్యుకు గురైన వారిలో జ్వర తీవ్రత తక్కువగా ఉండటమే కారణం. అయితే వానాకాలంలో డెంగ్యు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఎంత చిన్న జ్వరాన్నైనా తీవ్రంగానే పరిగణించి చికిత్స తీసుకోవాలి. లేదంటే మెదడులో రక్తస్రావం, లింఫ్‌ గ్రంథులు, రక్తనాళాలు దెబ్బతినటం, కాలేయం పెద్దదవటం, షాక్‌కు గురవటంలాంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవచ్చు.

జాగ్రత్తలు:
డెంగ్యు జ్వరానికి వ్యాక్సిన్‌ లేదు. కాబట్టి ఈ జ్వరం రాకుండా ఉండాలంటే దోమకాటుకు గురవకుండా ఉండటమొక్కటే మార్గం. ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి.
ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగే అవకాశం లేకుండా చూసుకోవాలి.
ఒంటిని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి.
దోమలను చంపే మందులు వాడాలి.
కిటికీలు, తలుపులకు మెష్‌లు ఉపయోగించాలి.
రాత్రిపూట ఓపిక చేసుకుని దోమతెరలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
టైఫాయిడ్‌ 
వానాకాలం కనిపించే మరో జ్వరం టైఫాయిడ్‌. ‘సాల్మనొల్లా టైఫై’ అనే బ్యాక్టీరియాతో విజృంభించే ఈ వ్యాధి అపరిశుభ్ర ఆహారం, నీటి ద్వారా రోగుల నుంచి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకిన 3 వారాల తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ముందుగానే ఈ వ్యాధిని నియంత్రించటం కొంత కష్టం. విపరీతమైన జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల నొప్పులు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే పేగుల్లో రకస్రావం, మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌లాంటి తీవ్రమైన రుగ్మతలకు దారితీయొచ్చు.

జాగ్రత్తలు :
టైఫాయిడ్‌కు వ్యాక్సిన్లు ఉన్నా అవి నూటికి నూరుశాతం వ్యాధి నుంచి రక్షణ కల్పించలేవు. కాబట్టి ఈ బ్యాక్టీరియా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...
చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఆహారం తినేముందు, మలమూత్ర విసర్జన తర్వాత తప్పనిసరిగా సబ్బునీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైతే హ్యాండ్‌ శానిటైజర్‌ దగ్గర ఉంచుకోవాలి.
వేడిచేసి చల్లార్చిన నీరు తాగాలి.
స్నానం చేసేటప్పుడు, పళ్లు తోమేటప్పుడు పొరపాటున కూడా నీటిని మింగేయకూడదు.
కూరగాయలు గోరువెచ్చని నీటిలో కడిగి వాడాలి.
ఈ కాలంలో ఆకుకూరలు వాడకం మానేస్తే మంచిది.
అప్పటికప్పుడు వండుకున్న వేడి పదార్థాలే తినాలి.
బయటి ఆహారం పూర్తిగా మానేయటం సురక్షితం.
కలరా
కలుషిత ఆహారం, కలుషిత నీటి వల్ల వ్యాపించే మరో వ్యాధి కలరా. కలరా సర్వసాధారణంగా కనిపించే వానాకాలం వ్యాధి మాత్రమే కాదు. విపరీతంగా బాధించి, వేధించి, ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేసే తీవ్రమైన వ్యాధి కూడా! శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవటంతోపాటు, అపరిశుభ్ర అలవాట్లన్నిటినీ ఈ కాలంలో వదిలించుకోవాలి. ‘విబ్రియో కలరే’ అనే బ్యాక్టీరియాతో వ్యాపించే ఈ వ్యాధి లక్షణాలు... తెలుపు రంగు విరేచనాలు, వాంతులు, ఒంటినొప్పులు, లో బిపి, చర్మం ముడతలు, నోరు ఎండిపోవటం, డీహైడ్రేషన్‌. యాంటిబయాటిక్స్‌తోపాటు, ఫ్లూయిడ్‌, ఎలకొ్ట్రలైట్‌ రిప్లే్‌సమెంట్‌ ఈ వ్యాధికి సమర్ధమైన చికిత్స. వైద్యం ఆలస్యమైతే అరుదుగా డీహైడ్రేషన్‌ కారణంగా షాక్‌కు గురై ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది.

జాగ్రత్తలు:
కలరాకు వ్యాక్సిన్‌ ఉన్నా అది కొందరికే, కొన్ని నెలల మేరకే పనిచేస్తుంది. కాబట్టి వ్యాధికి గురవకుండా ఉండాలంటే కొన్ని మెలకువలు పాటించటం తప్పనిసరి. అవేంటంటే...
పచ్చి కూరగాయలతో చేసే సలాడ్స్‌ తినకూడదు.
కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
బయటి పదార్థాలు, చిరుతిళ్లను మానేయాలి.
పళ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే వాడాలి.
చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి.
పాల ఉత్పత్తులు తగ్గించాలి.
శ్వాసకోశ సమస్యలు
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో వైర్‌సలు, బ్యాక్టీరియాలు మరింత తేలికగా దాడిచేస్తాయి. దాంతో జలుబు రోజుల తరబడి వేధించవచ్చు. జలుబుకు దగ్గు తోడవవచ్చు. అయితే ఈ రుగ్మతలన్నిటికీ ఒకే రకం వైరస్‌ కూడా కారణం కాకపోవచ్చు. ముక్కు నుంచి నీరు కారటం, దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ లాంటి లక్షణాలన్నీ ఒకే రకంగా ఉన్నా వీటికి వేర్వేరు వైర్‌సలు కారణమై ఉండొచ్చు. కాబట్టి లక్షణాలతోపాటు, సమస్య కాలపరిమితినిబట్టి చికిత్స తీసుకోవాలి. అలాగే రోగనిరోధక వ్యవస్థ బలవర్ధకంగా ఉండే జీవనశైలిని అనుసరించాలి. ఇందుకోసం ఈ జాగ్రత్తలు పాటించాలి.
విటమిన్‌ సి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
అతి చల్లని నీరు, పదార్థాలకు దూరంగా ఉండాలి.
తగినంత నిద్ర అవసరం.
పోషకాహారం తీసుకోవాలి.
వీలైనంత ఎక్కువ ద్రవాహారం తీసుకోవాలి.
చల్లని గాలి, నీరు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి.
వేడి ద్రవాహారం, సూప్‌లు తీసుకోవాలి.
కళ్ల ఇన్‌ఫెక్షన్లు
ఎండాకాలంలో వాడే సన్‌గ్లాసెస్‌ ఎండతోపాటు ఇన్‌ఫెక్షన్ల నుంచి కూడా కళ్లకు రక్షణ కల్పిస్తాయి. అయుతే వానాకాలంలో ఈ కాస్త రక్షణ కొరవడటం, వాతావరణంలో పెరిగే తేమ వల్ల కళ్లకలక, స్టై, కళ్లు పొడిబారటం, కార్నియా అల్సర్లు ఈ కాలంలో బాధిస్తాయి. అందుకని..
మురికి చేతివేళ్లతో కళ్లు తాకకూడదు.
కళ్లకలక లక్షణాలు కనిపించిన వెంటనే కళ్లను శుభ్రమైన నీటితో కడిగి వేడి కాపడం పెట్టాలి. వీలైనంత త్వరగా వైద్యుల్ని కలవాలి.
కళ్లకలక అంటువ్యాధి కాబట్టి వ్యాధిగ్రస్థులకు దూరంగా ఉండాలి. కుటుంబసభ్యులకు ఐడ్రాప్స్‌ వేసిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
కళ్లు ఎర్రబడటం, దురదలు, మంట వానాకాలంలో సహజంగా కనిపించే కంటికి సంబంధించిన సమస్యలు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం మాని వైద్య చికిత్స తీసుకోవాలి.
వానాకాలం బ్యాక్టీరియా కారణంగా కంటి కింది కనురెప్ప లోపల పుండు ఏర్పడుతుంది. దీన్నే స్టై అంటారు. దీనికి వేడి కాపడం పెట్టటంతోపాటు తక్షణ వైద్య చికిత్స తీసుకోవాలి.
కంటి సమస్య తగ్గేవరకూ గ్లాసెస్‌ వాడాలి. కాంటాక్ట్‌ లెన్స్‌ ఆపేయాలి.
చర్మ సమస్యలు
వానాకాలం ఎక్కువగా నీటిలో నడవటం, తడిలో నానటం, మురికి నీళ్లలో తడిచిన కాళ్లను వెంటనే శుభ్రం చేసుకోకపోవటం వల్ల చర్మ సమస్యలు బాధిస్తాయి. ఈ కాలంలో వేధించే స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లకు పలురకాల బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగ్‌సలే కారణం.

అథ్లెట్స్‌ ఫుట్‌
పాదాల మీద, వేళ్ల మధ్య దురదపెట్టే ఎర్రటి ర్యాష్‌ అథ్లెట్స్‌ ఫుట్‌. బ్యాక్టీరియా కారణంగా తలెత్తే ఈ ఇన్‌ఫెక్షన్‌ మొదట కాలి బొటనవేళ్లతో మొదలై క్రమేపీ పాదం మొత్తం వ్యాపిస్తుంది. 
జాగ్రత్తలు: వాన నీటిలో తడిసిన పాదాలను బాగా రుద్ది కడిగి శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా వదిలిపోతుంది. తడిచే వీలులేని గమ్‌బూట్స్‌ ధరించాలి.

ఎగ్జిమా
చర్మం మీద ప్యాచ్‌లుగా దురదతో కూడిన నీరుకారే ఎర్రని బొబ్బలు కనిపిస్తే ఎగ్జిమాగా భావించాలి. ఉష్ణోగ్రతలో మార్పు, తేమకు గురికావటం వల్ల ఈ రుగ్మత తలెత్తుతుంది.
జాగ్రత్తలు: యాంటీ బ్యాక్టీరియల్‌ సోప్స్‌, పౌడర్లు వాడుతూ చర్మాన్ని పొడిగా ఉంచుకోవాలి.

రింగ్‌ వార్మ్‌
గుండ్రటి ఆకారాల్లో తలెత్తే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఇది. బాహుమూలలు, అరికాళ్లు, చెవుల వెనక ఎర్రగా, దురదతో కూడిన గుండ్రటి రింగుల్లా ఈ ఇన్‌ఫెక్షన్‌ మొదలవుతుంది.
జాగ్రత్తలు:వానలో తడిచిన వెంటనే స్నానం చేసి పొడి బట్టల్లోకి మారాలి. తడి బట్టల్లోనే ఉంటే ఫంగస్‌ చర్మంపై దాడి చేస్తుంది. యాంటి ఫంగల్‌ పౌడర్‌ వాడాలి. వైద్య చికిత్స తీసుకోవాలి.

మాన్‌సూన్‌ సేఫ్టీ
ఆహారంలో అల్లం, నిమ్మ, మిరియాలు, పసుపు వాడకం పెంచాలి.
బయట నుంచి రాగానే పాదాలు, చేతులు వెంటనే శుభ్రం చేసుకోవాలి.
పొడి దుస్తులే ధరించాలి.
వేడి పదార్థాలే తినాలి.
సాధ్యమైనంత వరకూ వాన నీటిలో తడవకూడదు. గొడుగు, రెయిన్‌ కోట్‌ వెంట ఉంచుకోవాలి.
టవల్స్‌, కర్చీఫ్స్‌ ఇతరులతో షేర్‌ చేసుకోకూడదు.
ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.
వదులుగా, తేలికగా ఆరే దుస్తులు ధరించాలి.
నిల్వ పదార్థాలకు, రోడ్‌సైడ్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం_vurmila sleep


ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం

రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.

’14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,’ అని ఎవరో గుర్తుచేశారు.

ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ‘’14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,’ అని అడిగారు.

‘‘మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,’’ అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. ‘‘లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!’’ అని పరిహాసంగా అడిగారట రాములవారు.

‘‘అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,’’ అని బదులిచ్చాడు లక్ష్మణుడు.

లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ‘‘తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!’’ అన్నారట రాములవారు.

రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ‘‘ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,’’ అని వేడుకుందట ఊర్మిళ.

‘‘కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,’’ అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.

mohan publications price list