MohanPublications Print Books Online store clik Here Devullu.com

చాలా మంది చాలా సరదాగా, Mobile Data

చాలా మంది చాలా సరదాగా
Mobile Data

✍🏻చాలా మంది చాలా సరదాగా
💃💃 3G ఫ్రీఅని ,
💃💃? 4G ఫ్రీ అని ,
💃💃💃పెన్ డ్రైవ్ ఫ్రీ అని,
💃💃💃1GB Data ఫ్రీ ,
💃💃💃💃10000 రూపాయల ఫోన్ ఫ్రీ అని పోస్ట్ చేస్తున్నారు.
😳ఏదో చిన్న ఆశ ఏమైనా రాకపోతుందా?. . . అని.అది మానవ సహజం.కాదనడం లేదు.
🔴కాని మనం ఆలోచించ వలసిన విషయం ఇక్కడ ఒకటుంది.మీరు ఈ ఆఫర్ పోందాలంటే ముందు మీరు తప్పనిసరిగా మీ మొబైల్ నెంబరు ,మీ ఈ మైయిల్ అడ్రస్ ను వారి వెబ్ సైట్ లో నమోదు చేయవలసి ఉంటుంది.
🔴ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసారో మీ పూర్తి వివరాలు అంటే మీ పూర్తి పేరు , అడ్రస్ , ఆధార్ వివరాలు తదితరమైన అన్ని వివరాలు ఆ వెబ్ సైట్ లో చేరిపోతాయి.
🔑🔑🔑అంటే మనకు మనంగా దొంగలకు మన సమాచారాన్ని మనం వారికి అందజేసినట్టే.🔑🔑🔑
మీరు సైబర్ నేరాలు అనే మాట వినే ఉంటారు. వారి పనంతా రకరకాల వ్యక్తుల నుండి వారి విలువైన సమాచారాన్ని దొంగిలించడం.అంటే మన వివరాలతో మరింత మన రహస్య సమాచారాన్ని కూడా తెలుసుకొని వారు వారికి నచ్చిన విధంగా వినియోగించుకుంటారు.
🔴అంటే మన ATM కార్డ్ యొక్క నకలు తయారు చేయడం,
🔴మన బ్యాంకులకు సంబందించిన సమాచారాన్ని దొంగిలించడం.
🔴ఆన్ లైన్ వ్యాపారానికి సంబందించిన సమాచారాన్ని దొంగిలించి మీ అకౌంటు ద్వార విలువైన కొనుగోళ్ళు చేయడం
🔴కాబట్టి జాగ్రత్త పడండి.మోసపోయిన వాళ్ళలో మొట్ట మొదటి వారం మనమే అవుతాం.
🙏 దయచేసి మీరు ప్రలోభాలకు గురయి
ఇటువంటి msg share చేసి గ్రూపు సభ్యులను
కూడా ప్రలోభులు గా మార్చకండి.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
కల్యాణ గ్రహం, Kalyana Graham

కల్యాణ గ్రహం
Kalyana Graham


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
ఆహార నియమాలు, Food Rulesఆహార నియమాలు
Food Rules

ఆహార నియమాలు ......
దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.
ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.
అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.
రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.
రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.
రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి) వాడకూడదు. ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.
ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు. దృష్టిదోషం పోవడానికి ఇది చదవాలి.
ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి . ( అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది )
ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి ( ఘన పదార్ధాలను త్రాగండి అంటారు . అంటే నోటిలోనే సగం నమలబడాలి . అందువలన లాలాజలం పూర్తిగా కలిసి , ముద్దా మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం ( క్షారం ) విరుగుడు గా పనిచేస్తుంది .
ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు ?
పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి
అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .
రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే మాత్రం అత్యుత్తమ మైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .
అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||
అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
అధ్యక్ష పదవికి అరహతలు, Qualifications of Presidential Post

అధ్యక్ష పదవికి అరహతలు
Qualifications of Presidential Post


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


  

చందమామ రావే , Chandamama

చందమామ రావే 
Chandamama 


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
చుండ్రు చిక్కులకు చెక్ , Check for Dantruff

చుండ్రు చిక్కులకు చెక్
 Check for Dantruff

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
మన నిఘoటువులకు మంగళారతి ఆంధ్రభారతి.కామ్, Andhrabarathi.com

మన నిఘoటువులకు మంగళారతి ఆంధ్రభారతి.కామ్
Andhrabarathi.com

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
అమృతవాణి, Amruthavani

అమృతవాణి
Amruthavani


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
తెలుగెత్తి జైకొట్టు, Salute

తెలుగెత్తి జైకొట్టు
Salute


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
అంతరంగం, AnthaRangam

అంతరంగం
 AnthaRangam

+++++++++అంతరంగం ++++++++
ప్రకృతిలోని వైవిధ్యాన్ని మనం గమనించినప్పుడు, వాటి ప్రయోజనాన్ని గ్రహించినప్పుడు- దేని ప్రాధాన్యం దానిదే అనే మూలసూత్రం అర్థమై ఆశ్చర్యపోతాం. ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి మనిషంత ఉత్కృష్టత కలిగి ఉండాలంటే ఎలా? అప్పుడు అతడి మనుగడ ఆగిపోతుంది. వస్తువైనా, ఇతర ప్రాణి అయినా దేని కర్తవ్యాన్ని అది నిర్వహించినప్పుడే- మనిషి అత్యంత సౌకర్యంగా తన జన్మ ఉ ద్దేశాన్ని నిభాయించగలడు.
అలా అని, మనిషి తప్ప మిగిలిన జడాజడ వస్తుజాలమంతా అల్పమని కాదు. బంగాళదుంప కూరలో దుంపలొక్కటే కూరను రుచికరం చేయలేవు. నూనె, లవణం, మసాలాలు, మిగిలిన పదార్థాలు కలిస్తేనే ఆ కూర పూర్ణ మాధుర్యాన్ని సంతరించుకుంటుంది. తొంభై తొమ్మిది పైసలు రూపాయిలో పెద్దమొత్తమే కావచ్చు. మిగిలిన ఆ ఒక్క పైసా చేరితే తప్ప, రూపాయి పరిపూర్ణం కాదు. వైవిధ్యం, హెచ్చుతగ్గులు అన్నీ ప్రాణికోటి సౌఖ్యం, సౌలభ్యం కోసమే అని మనం గ్రహించగలిగితే- అహంకారాలు, ఆత్మన్యూనతలు ఉండవు. అవి అణగారిపోతాయి.
ఫలానావాళ్లే ఎందుకు గొప్పగా జన్మించాలి, మరికొందరు ఎందుకు అల్పులుగా జన్మించాలి? జన్మల్లోని అంతరాలు సృష్టిక్రమానికి అవసరం కావచ్చు ఫలానావాళ్లే ఎందుకు అలా, ఫలానావాళ్లే ఎందుకు ఇలా? అంటే... వారి వారి కర్మల ఫలితాలే అవన్నీ! జీవులు తమ కర్మఫలాల్ని అనుభవించే క్రమంలో, భగవంతుడి అపార కరుణ వెల్లడి అవుతుంది.
ఎనభై నాలుగు లక్షల జీవరాసులం... మనమంతా ఒక చెట్టులోని భాగాలం. మట్టిలోని కణాలం. ఇసుక మేటలోని రేణువులం. చెట్టులో వేర్లు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పుప్పొడులు ఎన్నో ఉంటాయి. ఆ అన్నీ కలిస్తేనే చెట్టు. వాటిల్లో దేని పని దానిదే. దేని కర్తవ్యం అది నెరవేరిస్తేనే, చెట్టు పచ్చగా ఫలవంతంగా ఉంటుంది. లోకానికి తన వంతు ఫలసాయాన్ని అందజేస్తుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువు, ప్రతి జీవి అంతే.
సమాజం సంతోషంగా, సజావుగా నడవాలంటే నిమ్నోన్నతాలతో సంబంధం లేకుండా మనిషి తన కర్తవ్య పాలన తాను చేయడం అవసరం. కాళ్ల పని కాళ్లుచేయాలి. అలా చేయకపోతే, మిగిలిన శరీరం స్తబ్ధంగా ఉండిపోతుంది. నోరు తన వంతు పనిగా ఆహారం తీసుకోకపోతే, మనిషి శరీర ప్రక్రియ స్తంభించిపోతుంది. ఇక్కడ పని విభజనే తప్ప, జీవుల ప్రాధాన్యాల ప్రసక్తే లేదు.
మనం ఎవరైనా ఎలాంటివాళ్లమైనా, ప్రాధాన్యక్రమంలో ఎంతగా ముందున్నా, లేదా చివరన ఉన్నా- అది సృష్టి సౌకర్యం కోసమే! అదంతా భగవంతుడి విభజనలోని దూరదృష్టి ఫలితం. అంతేకానీ, మనిషి సొంత శక్తిసామర్థ్యాలో, నైపుణ్యాలో కారణాలు కావు. అందువల్ల అతడు తన స్థాయి చూసుకొని సిగ్గుపడాల్సిన అవసరం, గర్వపడాల్సిన అగత్యం- రెండూ లేవు.
అమ్మ ప్రేమలోని సమానత్వమే తప్ప, ఆమె పంపకాల్లోని తేడాలేవీ మనిషి జీవితంలో ప్రాధాన్యం వహించవు. ఆమె తనకు ఎంతమంది సంతానమున్నా, అందరికీ తగినంత ఆహారాన్ని అందిస్తుంది. అంతేకానీ ఆ ఆహారంలోని విలువల్ని, రుచుల్ని ఎంతమాత్రం పరిగణించదు. బిడ్డల అభిరుచిని, అవసరాన్ని, ఆరోగ్యాన్ని తల్లి అంచనా వేస్తుంది. వారికి పంచే ప్రేమ విషయంలో, అవసరమైతే శిక్షించే విషయంలోనూ ఆమె ఈ నియమాన్నే పాటిస్తుంది. బిడ్డల శ్రేయం తప్ప అమ్మ దృష్టిలో మరో కోణం ఉండదు. భగవంతుడైనా అంతే!
సృష్టిని సౌందర్యభరితంగా, సౌకర్యవంతంగా రూపొందించేందుకు భగవంతుడు చేసిందే ఇదంతా! ఆయన రూపుదిద్దిన ఈ అన్ని తత్వాల వైరుధ్యాన్ని మనిషి సవ్యదృష్టితో చూడాలి. అడవిలోని ఉసిరికాయను, సముద్రంలోని ఉప్పును కలిపిన దేవుడి ఆలోచన ఏమిటో; అది ఏ రుచిని ఆవిష్కరించడానికో- గ్రహించాలి. సూర్యుడు ఉదయిస్తే తప్ప కమల హృదయం వికసించదు. అంతటి అనుబంధాన్ని కల్పించిన అంతర్యామి అంతరంగంలోకి మనిషి తొంగిచూడగలిగితే- ఈ సృష్టిలో అంతరం లేశమైనా లేదని అర్థమవుతుంది!
- చక్కిలం విజయలక్ష్మి


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
ఇలా చేస్తే...మీ ఫోను భద్రం, Protect Your Phone Like this-Care Your Cell Phone Battery

Care Your Cell Phone Batteryఇలా చేస్తే...మీ ఫోను భద్రం
Protect Your Phone Like this 

++++++++ఇలా చేస్తే...మీ ఫోను భద్రం+++++++
స్నేహితులతో ఛాటింగ్‌, బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌, సమాచారాన్ని భద్రపరుచుకోవడం... ఇలా అన్నింటికీ స్మార్ట్‌ఫోనే ఆధారమైపోయింది. పాకెట్‌లో ఇమిడిపోయే ఈ చిన్న గ్యాడ్జెట్‌ రోజువారీ జీవితంలో కీలకమైపోయింది. అలాంటి స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సౌకర్యాలు అవసరమే అయినా వాటిని ఎంత దూరంగా ఉంచితే మీ ఫోన్‌కు అంత రక్షణ. బ్యాకప్‌, ఎన్‌క్రిప్షన్‌, పర్మిషన్లు, జీపీఎస్‌... ఇలా చాలా ఆప్షన్లు అవసరమే... అయినా వాటిని కొన్ని సందర్భాల్లో ఆఫ్‌ చేస్తే మీ ఫోన్‌ రక్షణ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు.
కొన్ని కావాలంటే... కొన్ని వదులుకోక తప్పదు. ఇది స్మార్ట్‌ఫోన్‌ల విషయంలోనూ వర్తిస్తుంది.రక్షణ కావాలంటే కొన్ని ఉపయోగకరమైన ఆప్షన్లు వదులుకోక తప్పదు.ఆప్షన్లు, ప్రైవసీని బ్యాలెన్స్‌ చేస్తేనే స్మార్ట్‌ఫోన్‌ వినియోగం సవ్యంగా సాగుతుంది.
జీపీఎస్‌ ఉండాలా?
మొబైల్‌ ఫోన్లలో జీపీఎస్‌ ఆప్షన్‌ను విరివిగా వాడుతున్నాం. గూగుల్‌ మ్యాప్స్‌, క్యాబ్‌ బుకింగ్‌లు ఇలా ఏదైనా జీపీఎస్‌ ఆప్షన్‌ బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌ చోరీకి గురైన పక్షంలో అది ఎక్కడుందో తెలుసుకోవడానికీ ఈ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది. ఇందులో హై యాక్యురసీ, బ్యాటరీ సేవింగ్‌ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. హై యాక్యురసీ ఆప్షన్‌ వాడటం వల్ల జీపీఎస్‌ ఫలితాల్లో స్పష్టత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. మీ ఫోన్‌ చోరీకి గురైతే దీని వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ సేవింగ్‌ మోడ్‌లో జీపీఎస్‌ను వాడితే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు.
* దీని కోసం ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో ‘లొకేషన్‌’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ జీపీఎస్‌లోని రకాలు కనిపిస్తాయి. దాంట్లో ‘బ్యాటరీ సేవింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి.
యాడ్‌లు మన ఇష్టం
ప్లేస్టోర్‌లో ఉచిత ఆప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకొని వాడుతుంటే మధ్యలో యాడ్‌లు వస్తుంటాయి. ఆ ఆప్‌లు వాడాలంటే యాడ్‌లను భరించాల్సిన పరిస్థితి. అలా వచ్చే యాడ్‌లలో మీరు గూగుల్‌లో తరచుగా వెతికే విషయాలకు సంబంధించిన యాడ్‌లు రావడం గమనించారా? అంటే మీ సెర్చ్‌ వివరాలపై గూగుల్‌ ఓ కన్నేసిందని అర్థం. గూగుల్‌ మీ ఆసక్తులను తెలుసుకోకుండా నిరోధించాలంటే గూగుల్‌ సెట్టింగ్స్‌లోని ‘యాడ్స్‌’ ఆప్షన్‌లో ‘ఇంట్రెస్ట్‌ బేస్డ్‌ యాడ్స్‌’ ఆప్షన్‌ను ఆఫ్‌ చేయాలి. అలా మీ సమాచారం బయటకు వెళ్లకుండా చూసుకోవచ్చు.
* దీని కోసం మీ ఫోన్‌లోని గూగుల్‌ సెట్టింగ్స్‌ ఆప్‌లోకెళ్లండి. అందులో సర్వీసెస్‌ ట్యాబ్‌లో ‘యాడ్స్‌’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఒత్తితే Optout interest -based ads అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఆన్‌ చేసుకుంటే సరి.
ప్లేస్టోర్‌లోనివే
మీ స్నేహితుడి ఫోన్‌లో ఉన్న ఆప్‌ను మీ ఫోన్‌లోకి షేర్‌ ఇట్‌ లాంటి ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్‌ల ద్వారా తీసుకున్నారు. ఆ తర్వాత ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. అలాగే థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్ల నుంచి కొన్ని ఆప్స్‌ను డౌన్‌లోడ్‌ చేస్తుంటారు. మీ సౌకర్యం కోసం ఇలా చేస్తారు... కానీ ఇది మీ ఫోన్‌కు శ్రేయస్కరం కాదు. ప్రతి ఆప్‌ ప్లేస్టోర్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. బయటి నుంచి వచ్చే ఆప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం వల్ల మీ సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఉంది. మీ ఫోన్‌ సెట్టింగ్స్‌లో Unknown Sources ఆప్షన్‌ ఆన్‌లో ఉంటేనే ఆ ఆప్‌లు ఇన్‌స్టాల్‌ అవుతాయి. కాబట్టి ఈ ఆప్షన్‌కు దూరంగా ఉండి మీ ఫోన్‌కు రక్షణ కల్పించుకోవచ్చు.
* దీని కోసం మీ ఫోన్‌ సెట్టింగ్స్‌లో సెక్యూరిటీ ఆప్షన్‌కు వెళ్లండి. అక్కడ డివైజ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో Unknown Sources ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఆఫ్‌లో ఉంచాలి.
బ్యాకప్‌ చేయాలా?
ఫోన్‌లోని వీడియోలు, ఫొటోలు దాచుకోవడానికి గూగుల్‌ డ్రైవ్‌, వన్‌ డ్రైవ్‌ లాంటి క్లౌడ్‌ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు ఫోన్‌లోని సెట్టింగ్‌లు, ఆప్‌ ప్రిఫరెన్స్‌లు, పాస్‌వర్డులనూ బ్యాకప్‌ ఆప్షన్‌ ద్వారా గూగుల్‌ డ్రైవ్‌లో భద్రపరుచుకోవచ్చు. ఫోను పోయినప్పుడు లేదంటే కొత్త ఫోన్‌ తీసుకున్నప్పుడు డ్రైవ్‌ నుంచి వాటిని పునరద్ధరించుకోవచ్చు. అయితే ఫోను దొంగతనానికి గురైతేనో లేదంటే హ్యాక్‌ అయితేనో డ్రైవ్‌ బ్యాకప్‌ పెట్టుకున్న మొత్తం డేటా అవతలి వాళ్ల చేతిల్లోకి పోతుంది. వీలైనంతవరకు క్లౌడ్‌ సర్వీసు బ్యాకప్‌ ఆప్షన్‌ను తక్కువగా వినియోగిస్తే మంచిది.
* దీని కోసం సెట్టింగ్స్‌లోని బ్యాకప్‌ అండ్‌ రీసెట్‌ ఆప్షన్‌లోకెళ్లండి. అక్కడ ‘గూగుల్‌ బ్యాకప్‌ అండ్‌ రీసెట్‌’ విభాగంలో Back up my data ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఆఫ్‌ చేసుకుంటే సరి.
తెరకు తాళం
స్మార్ట్‌ఫోన్లలో ముఖ్యమైన సమాచారాన్ని దాచుకుంటున్నాం. ఫోన్‌ నంబర్లు, క్రెడిట్‌ కార్డు పాస్‌వర్డ్‌లు, ప్రైవేట్‌ దస్త్రాలు, ఈమెయిళ్లు ఇలా అన్నీ అందులోనే ఉంటున్నాయి. ఫోన్‌ చేతులు మారితే ఆ సమాచారం కూడా చేతులు మారుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే స్క్రీన్‌ లాక్‌ ప్రాథమిక రక్షణ మంత్రం. ఇందులో ప్యాట్రన్‌, పాస్‌వర్డ్‌, పిన్‌, ఫింగర్‌ సెన్సార్‌ ఆప్షన్లు ఉన్నాయి. మీకు అనువైన లాక్‌ ఆప్షన్‌తో మీ ఫోన్‌కు రక్షణ కల్పించుకొండి. అయితే ప్రతిసారీ ఫోన్‌ చూడాలంటే స్క్రీన్‌ లాక్‌ అడ్డం అనుకునేవాళ్లూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఫోన్‌ చోరీకి గురైనా, ఎక్కడైనా పడేసుకున్నా మీ సమాచారం ఇతరుల చేతికి చేరకుండా స్క్రీన్‌లాక్‌ కాపాడుతుంది.
* సెట్టింగ్స్‌లోని స్క్రీన్‌లాక్‌ ఆప్షన్‌లో కెళ్లండి. అక్కడ మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకుంటే సరి. కొత్త తరం ఫోన్లకు ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా స్క్రీన్‌ లాక్‌ చేసుకునే అవకాశం కూడా వచ్చింది.
ఎన్‌క్రిప్షన్‌ అస్త్రం
ఫోన్‌ ఇతరుల చేతుల్లోకి వెళ్తే అందులోని సమాచారం చూడకుండా ఉండాలంటే ఎన్‌క్రిప్షన్‌ అనేది మరో మార్గం. ఎన్‌క్రిప్షన్‌ అంటే మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు చూడకుండా పాస్‌వర్డ్‌ రక్షణగా దాచేయడం అన్నమాట. స్క్రీన్‌లాక్‌కు అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్‌ అనుకోవచ్చు. స్క్రీన్‌ తెరచినా ఆ ఫోన్‌ ఎన్‌క్రిప్ట్‌ అయ్యుంటే సమాచారాన్ని యాక్సెస్‌ చేయడం కుదరని పని. ఎన్‌క్రిప్ట్‌ చేస్తే ఆ ఫోన్‌ సెట్టింగ్‌లు, ఆప్స్‌, ఫొటోలు, వీడియోలు... ఇలా అన్నీ రక్షణ కవచంలోకి వస్తాయి. పాస్‌వర్డ్‌ సహాయంతోనే ఆ సమాచారాన్ని చూడగలం. ఎన్‌క్రిప్షన్‌కు సుమారు గంట సమయం పడుతుంది. ఆ సమయం మీ పోన్‌లోని సమాచారం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
* ఎన్‌క్రిప్ట్‌ చేయడానికి ఫోన్‌ సెట్టింగ్స్‌లోని ‘ప్రైవసీ’ ఆప్షన్‌కు వెళ్లండి. అక్కడ ‘ఎన్‌క్రిప్ట్‌’ అనే విభాగం కనిపిస్తుంది. అందులో ‘ఎన్‌క్రిప్ట్‌ ఫోన్‌’ అనే ట్యాబ్‌ ఉంటుంది. దాన్ని ఒత్తితే మీ ఫోన్‌లోని సమాచారం ఎన్‌క్రిప్ట్‌ అవుతుంది.
పర్మిషన్‌ ఇవ్వండి
మీరు ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఆప్‌ మీ ఫోన్‌లో ఏయే సమాచారాన్ని యాక్సెస్‌ చేస్తుందో తెలుసా? తెలుసుకోవడం తప్పనిసరి. ఉదాహరణకు మీ ఫోన్‌లోని ఒక ఆప్‌కు కాంటాక్ట్స్‌ తెలియకూడదనుకుంటున్నారు. వెంటనే ఫోన్‌లోని సెట్టింగ్స్‌ ఆప్షన్‌కు వెళ్లి ఆప్స్‌ ట్యాబ్‌లో పర్మిషన్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ఆ ఆప్‌ను ఒత్తితే ఇది ఏయే పర్మిషన్లు యాక్సెస్‌ చేస్తుంది అనే వివరాలు వస్తాయి. అక్కడ కాంటాక్ట్స్‌ ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే సరి. ఇలా కాల్స్‌, కెమెరా, నోటిఫికేషన్లు... లాంటి విషయాలకూ పరిష్మన్‌ తొలగించొచ్చు. ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో నుంచి ఈ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది.
పరిశోధన చేయండి
ప్లేస్టోర్‌లో ఎలాంటి ఆప్స్‌ ఉంటున్నాయనే విషయంపై గూగుల్‌ అంతగా దృష్టిసారించదు. కాబట్టి ‘ప్లేస్టోర్‌లోని ఆప్‌నే కదా డౌన్‌లోడ్‌ చేస్తున్నా’ అని ఏది పడితే అది డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది కాదు. ఓ ఆప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నప్పుడు అందులోనూ కొత్తగా ప్లేస్టోర్‌లోకి వచ్చిన ఆప్‌ ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు కొన్ని అంశాలు పరిశీలించాలి.
* ఆ ఆప్‌ను ఇప్పటి వరకు ఎంతమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు, రెగ్యులర్‌గా అప్‌డేట్స్‌ ఇస్తున్నారా అనేది తెలుసుకోవాలి.
* మీ ఫోన్‌లో ఆ ఆప్‌ ఏయే వివరాల్ని యాక్సెస్‌ చేస్తుందనేది తెలుసుకోవడం తప్పనిసరి. దీనికి క్లూఫుల్‌ ఆప్‌ ఉపయోగపడుతుంది.
* ఆప్‌ల ప్రైవసీ వివరాలను తెలిపే కార్నేజ్‌ మెల్లన్‌ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లోనూ ఆ ఆప్‌కు సంబంధించిన వివరాలు పరిశీలించాలి.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---
mohan publications price list