MohanPublications Print Books Online store clik Here Devullu.com

భోజన నియమాలు_Bhojanavidhi


భోజన నియమాలు Bhojanavidhi food habits food habits in ayurveda ayurveda food timings food in banana leaf banana leaf with food bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


ఆయుర్వేదం నందు వివరించబడిన
భోజన నియమాలు


"అన్నం పరబ్రహ్మ స్వరూపం" కావున నియమనిష్టలతో భోజనం చేయవలెను . ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నియమ నిబంధలు పాటించకుండా మనుషులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మనం చేసే ప్రతిపని కొన్ని నియమానుసారాల ప్రకారం చేసినప్పుడే ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి నియమనిబంధనలు మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి కొన్ని , తమ అనుభవ పూర్వకంగా కొన్ని ఏర్పరిచారు. వాటిని పాటించటం వలన మనకి మంచి ఆరోగ్యం , ఆయష్షు కలుగును. కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించి వాటిలో మీకు కొన్ని తెలియచేస్తున్నాను .
భోజన నియమాలు -
* భోజనం చేయటానికి ముందే స్నానం ఆచరించి దేవతార్చన చేసి మంచి మనసుతో మంగళకరమైన వస్తు దర్శనం చేయవలెను . సూర్యుడు , అగ్ని, గోవు మొదలగు మంగళకరం అయిన వాటిని దర్శించుకొనవలెను . ఆ తరువాత చల్లని నీటితో బాగుగా కాళ్లు , చేతులు , ముఖం పరిశుభ్రం చేసుకుని తెల్లని వస్త్రం ధరించవలెను
ఎందుకనగా యోగశాస్త్రం నందు మనుషుని యొక్క శ్వాస గతి 12 అంగుళములు అనియు భోజనకాలం నందు మనుష్యుని యొక్క శ్వాసగతి 20 అంగుళములు అని తెలుపబడినది. అతిశ్వాస ఆయుఃయుక్షీణం .శ్వాసగతి తగ్గిన యొడల ఆయుర్వృద్ధి అగును. కావున భోజనకాలం నందు హస్త, పాద , ముఖప్రక్షాళన చేయనిచో శ్వాసగతి ఎక్కువ అగును. అందుకే చల్లని నీటితో ప్రక్షాళన చేసుకుని ప్రశాంత మనస్సుతో భోజనశాల కు చేరవలెను .
* తడిసిన పాదములతో భోజనం చేయవలెను దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగును. తడిసిన పాదములతో శయనించిన ఆయష్షు క్షీణించును. దీనికి ముందు పితృదేవతలను , అతిధులను , శిశువులకు , గర్భిణి స్త్రీలకు , పెంచుకున్న పశుపక్ష్యాదులకు మొదట ఆహారం మొసంగి తృప్తిపరుచుట మరువకూడదు .
* ఆహారము మనస్సుకి, తృప్తిని , బలం, ఆయష్షు , తేజస్సు , ఉత్సాహం , జ్ఞాపక శక్తి , రోగనిరోధక శక్తి కలిగించును.
* ఆయష్షు కోరువాడు భోజనం తూర్పుముఖంగా , యశస్సు కోరువాడు దక్షిణముఖంగా కూర్చొని భుజించవలెను .
* ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించిన యెడల విద్యుత్ శక్తి నరముల ద్వారా అత్యంత తీవ్రంగా ప్రవహించును. అందువలన ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించరాదు .
* పితృదేవతలు దక్షిణదిశ యందు ఉండుటచే దక్షిణదిశకు అభిముఖంగా కూర్చుని భుజించటం వలన యశస్సు లభించును.
* భోజనం పగలు దినములో ఎనిమిదో వంతు కాలం అనగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య చేయవలెను .
* ఉదయం 9 గంటలలోపు భుజించినచో ధాతువులు పూర్తిగా జనించవు . 12 గంటల తరువాత భుజించినచో బలం క్షీణించును. కావున ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యనే భుజించవలెను .
* రాత్రి భోజనం 8 గంటల లోపు ముగించవలెను . అదికూడా తేలికైన సులభంగా జీర్ణం అయ్యే విధంగా ఉండును.రాత్రి సమయాన మన శరీరంలో మెటబాలిజం రేటు బాగా తగ్గును. కావున తిన్న ఆహారం శక్తిగా మారక కొవ్వుగా మారును . రోగులు ముఖ్యంగా
ఆస్తమా రోగులు 7 గంటలకే ఆహారాన్ని భుజించవలెను .
* భోజన విషయంలో సమయపాలన గురించి నీతిశాస్త్రం చెప్తున్న విషయం మీకు తెలియచేస్తున్నాను . " నీకోసం వందమంది కాచుకుని కూర్చున్నను సమయం అయితే వారిని విడిచి భోజనం చేయాలి . వెయ్యి మంది కూర్చున్నను వదిలివెళ్ళి స్నానం చేయవలెను . లక్షమంది వద్దన్నా వెళ్లి దానం చెయ్యాలి . కోటిమంది కాదన్నా వెళ్లి భగవంతుడి ధ్యానం చేయాలి " అన్నది నీతిశాస్తం వివరించింది.
* మలమూత్రములు బాగుగా వెడలి , హృదయం నిర్మలమై , వాతాది దోషములు చక్కగా ప్రవర్తించుచు లోగడ భుజించిన ఆహారం జీర్ణమైనట్టు త్రేపులు వచ్చి బాగుగా ఆకలిపుట్టి , వాతం క్రిందివైపు పయనించి సంచరిస్తూ జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఇంద్రియములు వినిర్మములై శరీరం తేలికగా ఉన్నప్పుడు కాలం అతిక్రమించకుండా నియమం ప్రకారం ఆహారం భుజించవలెను .
* ఆకాలంలో అతిస్వల్పంగా భుజించినను అది విషంగా మారి రోగాలకు కారణం అవుతుంది. ఎల్లప్పుడు సకాలంలోనే భుజించవలెను .
* ఉదయం , సాయంకాలం నందు మాత్రమే మనుష్యులు భోజనం చేయాలని వేదం చెప్తుంది .ఆయుర్వేదం ప్రకారం "ఏకభుక్త్తోమహాయోగి , ద్వీభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి " అనగా రోజుకి ఒకసారి భోజనం చేసేవాడు మహాయోగి , రోజుకి రెండు సార్లు భోజనం చేసేవాడు మహాభోగి , రోజుకి మూడుసార్లు భోజనం చేసేవాడు మహారోగి అని అర్థం .కావున రోజుకి రెండుసార్లు మాత్రమే భోజనం చేయడం శ్రేష్టం అని మన సాంప్రదాయం చాటుతుంది.
* రెండు భోజనాల మధ్య ఫలహారం అనగా పండ్లు తినవచ్చు. జీర్ణక్రియ అయ్యే సమయంలో మరలా భుజించరాదు . అది రోగాలకు ముఖ్యకారణం . అప్పుడప్పుడు జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వవలెను.లేనిచో అవి బలహీనం చెందును
* చిన్నపిల్లలకు అన్నకోశం పెరిగి ఉండదు కనుక వారు శరీరంకి కావలసిన ఆహారం ఒక్క మారు తీసుకొనలేరు . వారు ఆటపాటలతో ఎగురుచుందురు. వారు ఒకటికి రెండు సార్లు తినినను తప్పులేదు . కష్టం చేయు శ్రామిక వర్గం వారు జఠరాగ్ని ఎక్కువుగా ఉండును. కావున వారు మూడొవసారి భోజనం చేయవచ్చు .
* మీరు తినవలసినంత మాత్రమే తినవలెను .ఎక్కువ తిన్నచో అజీర్ణం రోగం కలుగును. ఒకపూట ఎక్కువుగాను ఒకపూట తక్కువుగాను సేవించుటయు ఒక దినం తిని మరుదినం నిరాహారంగా అనగా ఏమి తినకుండా ఉండరాదు.
* మానవుడు తన పొట్ట యందలి స్థలముని నాలుగు భాగాలుగా విభజించి అందు రెండు భాగములు ఘనద్రవ రూపములు భక్ష్యములు
అనగా నమిలి తినదగినవి , భోజ్యమనగా నమలాక చప్పరించి తినతగినవి . లేహ్యం అనగా నాలుకతో చప్పరించి తినదగినట్లు కొంచెం ద్రవరూపంగా ఉండునది , పేయం అనగా మిక్కిలి ద్రవరూపం అయి త్రాగదగినది ఈ విధంగా నాలుగు రకాల ఆహారముల చేత ఒక భాగం నీటిచేత నింపి మిగిలిన ఒక భాగం వాయు సంచారం కొరకు అనగా జీర్ణక్రియ జరుగుటకై వదిలినచో ఆహారం బాగుగా జీర్ణం అగును.
* ప్రత్యేక పర్వదినములలో తీపి , నెయ్యి, నూనె పదార్దములు , సెనగ పిండితో తయారగునవి ఉపయోగించినప్పుడు మిగతా
భోజనం తగ్గించి చివర పెరుగును వాడకుండా ముఖ్యంగా చారు, మజ్జిగలతో భోజనం ముగించుట ఉత్తమం .
* భోజనం చేయుటకు తూర్పు ముఖం అలా వీలుకానిచో దక్షిణాభిముఖంగా ఉన్నతంగా , సమప్రదేశమున పీట లేక చాప మీద కూర్చొనవలెను. ఆకులమీద , ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు . ఇత్తడి మేకులు వేసిన పీటల మీద కూర్చుని తినటం ఆచారం .
* ఒక వస్త్రంని మాత్రమే ధరించి భోజనం చేయరాదు . కావున ఉత్తరీయం పైన కప్పుకొనవలెను . దానివలన శరీరం నకు బాహ్యవాయువులు తగలక సురక్షితంగా ఉండును.అది పట్టువస్త్రం అయితే మరింత మంచిది . తలపాగా ధరించి భోజనం చేయరాదు . టేబుల్ మీద భోజనం శాస్త్ర విరుద్ధం .
* ఆహారం భుజించు సమయం నందు అధికంగా మాట్లాడకుండా , అతిగా నవ్వకుండా మనుజుడు తన శరీరం నకు అనుకూలం అయిన మరియు తేలిక అయిన స్నిగ్ధగుణము , ఉష్ణగుణము కలిగి ద్రవప్రమాణం అయి మధుర , ఆమ్ల , లవణ, కటుతిక్త కషాయములు అను ఆరు రసములు గల ఆహారంను మిక్కిలి తొందరగా కాకుండా మిక్కిలి మెల్లగా కాకుండగా భుజించవలెను .
* ఆకలిగొన్నవారు, రోగులు , హీనులు , దరిద్రులు , బిక్షగాండ్రు వీరి యొక్కయూ కుక్క, కోడి మొదలగు వాని యొక్క దృష్టి భోజన కాలము న తగలకూడదు.కావున భొజనశాలకు వీరిని దూరంగా ఉండునట్లు చేయవలెను .
* బంగారు పాత్ర యందు భోజనం మంగళకరం మనోదోషములు పొగొట్టును. జఠరాగ్నిని వృద్ధిపరుచును. మంచి చూపుని ఇచ్చును.
* వెండిపాత్రల యందు శ్లేష్మాన్ని హరించును మూత్రరోగముని హరించును . ఆరోగ్యకరం . వెండి పళ్లెం మధ్యలో బంగారం తాపడం చేయుంచుట మంచిది .
* కంచుపాత్రలో భోజనం చేయుట నోటివెంట రక్తం పడు రోగముని నయం చేయును . శుభ్రంగా మరియు రుచికరంగా ఉండి నేత్రరోగములు హరించును . బుద్దిని పెంచును. అగ్నివృద్ధి పెంపొందించి శరీరానికి కాంతి ని ప్రసాదించును. ఎముకలు వృద్ది అగుటకు తోడ్పడును. హృదయ రోగములను నిగ్రహించును.
* స్టీల్ పాత్రలో భోజనం చేసిన పాండురోగం తగ్గును. కామెర్ల వ్యాధిని హరించును .
* అల్యూమినియం పాత్రయందు వండిన భోజనము వండుచున్న మరియు తినుచుండిన అతిసార వ్యాధి కలుగును.
* గాజు పాత్రలో ఆహారం తీసుకోవడం వలన ఉపయోగం ఏమియును లేదు . కేవలం దోషాలు మాత్రం కలగవు. ఆమ్లములు ఇందు ప్రభావం చూపించలేవు .
* అరటి ఆకు నందు భోజనం మిక్కిలి పరిశుభ్రం అయి శ్రేష్ఠంగా ఉండును. శరీరకాంతి , సంభోగశక్తిని పెంచును. ఆకలి దంతకాంతిని పెంచును. క్రిమినాశనకారి , ఉదరం నందు పుండ్లను తగ్గించును .
* మోదుగ ఆకుల యందు భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్త, పిత్త రోగాలు నయం అగును.మోదుగ చంద్రుడికి సంబందించిన వృక్షం . సాత్త్విక గుణాలు కలిగించును.
* మర్రి ఆకుల యందు భుజించటం వల్ల క్రిమిరోగం నివారణ అగును. నేత్రదోష నివారణ జరుగును.
* రావియాకు విస్తరి యందు భుజించిన పిత్త నివారణ జరుగును. అగ్నివృద్ధిని కలిగించును. జననేంద్రియ దోషాలు నివారణ అగును. విద్యార్జనకు మనస్సు పుట్టించును.
* పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది, పిత్తాన్ని హరించును .
* తామరాకు లో భోజనం విషహరంగ ఉండును. సరస్సులో ఉన్న తామరాకు పనిచేయదు .

పురందరదాసు_Purandaradasa_Granthanidhi Mohanpublications Bhakti Pustakalu

పురందరదాసు Purandaradasa purandaradasu ಪುರಂದರ ದಾಸ hampi kannda lord krishna lord krishna devote Carnatic music Shivamogga Karnataka bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


పురందరదాసు


మన అందరికీ పురందరదాసు కథ తెలిసిందే . అందులో సాధ్వీమతల్లి అయిన ఆయన ధర్మపత్ని సరస్వతమ్మ గూర్చి తెలిసిందే . పురందరదాసు అసలు పేరు శీనప్ప . కన్నడ సామ్రాజ్యములో పేరుబడసిన రత్నాల వ్యాపారి . ఆయన పిల్లికి బిక్షం వేసే రకం కాదు . మరి అయన ధర్మపత్ని మాత్రం అడిగినవారికి లేదనకుండా దాన ధర్మాలు అందరికీ వారు వీరు అనిలేకుండా సకల మర్యాదలు చేసే మహా ఇల్లాలు . ఇదంతా గమనించిన శీనప్ప ప్రతీవాటినీ తన ఇంటిలో చెక్క పెట్టెలలో పెట్టించి తాళాలు వేసుకుని తాళాల గుత్తి తన దగ్గరే ఉంచుకునే వారు . ఒక సారి ఓ పేద బ్రాహ్మణుడు శీనప్ప ఇంటికి రాగా ప్రతీ రోజు రేపు రమ్మని తిప్పుకునేవాడు . అలా తిరిగీ తిరిగీ ఆ బ్రాహ్మణుడు అలసిపోయాడు గానీ విత్తం గానీ ఇంత ధాన్యం కానీ దానం చేయలేదు శీనప్ప . ఓ రోజు శీనప్ప ఇంట లేని నాడు ఆ బ్రాహ్మణుడు సరస్వతమ్మను దర్శించి తన పేదరికం బాపమని వేడుకున్నాడు . ఆమె ఇంట ఇపుడు ఏమీ ఆమె స్వాధీనములో లేదు . ఆ పేద బ్రాహ్మణుని పేదరికం చూసి జాలిపడి ఆమె తన ముక్కుకు ఉన్న రత్నం పొదిగిన ముక్కెర ఇచ్చి వేసి అమ్మి వేసి సొమ్ము తీసుకుని జీవించమంది . ఆ బ్రాహ్మణుడు అది అమ్మడానికి నేరుగా శీనప్ప కొలువై యున్న రత్నాల అంగడికి వెళ్లి అమ్మజూపాడు . ఆ ముక్కెర తానే స్వయంగా రత్నం పొదిగి చేయించింది , అత్యంత విలువైనది . అది చూసిన ఆయనకు నమ్మబుద్ధి కాక వెంటనే తన వద్ద ఉన్న నౌకరుని పంపి వెంటనే తన శ్రీమతి వద్ద యున్న రత్నం పొదిగిన ముక్కెర తీసుకురమ్మనమని చెప్పమని వ్రాసి పంపాడు . ఆమె ఆ పత్రం చదివి బెంబేలు పడిపోయి ఇంక తనకు ఇక దిక్కు తాను నిరంతరం కొలిచే పాండురంగడే అని తలచి విషం తీసుకోబోగా ఆపాత్రలో ధగ ధగ మెరిసే ముక్కెర కనబడింది దానిని తీసి శుభ్రం చేసి ఆమె ఆ ముక్కెరను నౌకరు చేత పంపింది . అది గాంచిన తరువాత శీనప్ప ఖరీదు కట్టి ఆ రత్నం పొదిగిన ముక్కెర కొని దానిని ఇంటికి తీసుకు పోయి అసలు విషయం విచారించగా అపుడు సంగతి తెల్సింది . ఆమె ఆ ముక్కెర ఆ బ్రాహ్మణునికి దానం చేసిన విషయం .. విష పాత్రలో ముక్కెర ఉండటం . అంతే అంతవరకూ కాకికి ఎంగిలి చేయి విదల్చని శీనప్పలో మార్పు వచ్చేసింది . మొత్తం తన వద్ద ఉన్న ధనాన్ని అందరికీ దాన ధర్మాలు వినియోగించారు . భక్తితో శ్రీరంగని మీద , వెంకటేశ్వర స్వామి వారి మీద కన్నడములో అనేక కీర్తనలు రచించారు . దాస సంగీతానికి ఆద్యుడు , కర్ణాటకా సంగీత పితామహుడు అయిన పురందర దాసులో మార్పు తెచ్చిన సంఘటన ఇదే . ఇటువంటి సాధ్వీమలలామలు పుట్టిన నేల ఈ భారతం .

- వీర నరసింహ రాజు

మనో నిగ్రహంతోనే మనశ్శాంతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి Granthanidhi mohanpublications bhaktipustakalu


మనో నిగ్రహంతోనే మనశ్శాంతి Mental Peace Sringeri Sarada  Peetam Sri Sri Sri Bharathi Tirtha mahaswamy 36th Sringeri Sarada Peetadipathi bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu



మనో నిగ్రహంతోనే మనశ్శాంతి

సనాతన ధర్మ పరిరక్షణ కోసం జగద్గురు ఆదిశంకరుల వారు దేశం నలుమూలలా నెలకొల్పిన పీఠాలలో దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం ప్రసిద్ధమైనది. ఆ పీఠానికి 36వ అధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వాములవారి ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి. వారి విజయ యాత్రలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌ నల్లకుంటలోని శంకరమఠంలో వేంచేసి ఉన్నారు. సాక్షికి ప్రత్యేకంగా వారు అందించిన అనుగ్రహ ఉపదేశ సారాంశం ప్రశ్నోత్తరాల రూపంలో క్లుప్తంగా....
ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం... వీటిలో ప్రస్తుతకాలానికి ఏది అనుసరణీయం?
ద్వైతం అనేది వ్యావహారికం. అద్వైతం అనేది పారమార్థికం. భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగానీ మనం భగవంతుడిని పూజించలేం. జ్ఞానం వచ్చేంతవరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చాక అద్వైతం మాత్రమే ఉంటుంది. కల కంటున్నంతవరకు అది కల అని తెలియదు.
బాహ్యస్మృతిలోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలోకి వెళ్లినా, ఆఖరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే, జగత్తు అంతా మిధ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే.  కాబట్టి ద్వైతంలోనే ఉంటూ చివరికి అద్వైతానికి చేరుకోవాలి.
ఏకేశ్వరోపాసన, బహుదేవతారాధనలలో ఏది మంచిది?
ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా, ఏ వ్యత్యాసమూ లేదు. ఎందుకంటే, భగవంతుడు ఒక్కడే. కాని, రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనకాల ఉండే చైతన్యం మాత్రం ఒకటే. మనం ఈశ్వరుణ్ణి ఆరాధించినా, విష్ణువును ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా రాదు. ఈశ్వరుడి ఎటువంటి ఫలాన్నిస్తాడో, విష్ణువూ అదే ఫలాన్నిస్తాడు. ఇతర దేవతలూ అదేవిధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.
హిందూ మతంలో ఇందరు దేవుళ్లు, ఇన్ని సంప్రదాయాలు ఎందుకు ఉన్నాయి?
మనం వినాయక చవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని,  శివరాత్రికి శివుణ్ణి... ఇలా ఏ పర్వదినానికి  తగ్గట్టు ఆ దేవుడు లేదా దేవతా రూపాన్ని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలను ఆరాధించినట్టు కాదు. ఒకే దేవుణ్ణి నాలుగుమార్లు పూజించినట్టు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు వారికి రుచించిన రూపంలో వస్తాడని, అందుకనే ఇన్ని రూపాలని ఆదిశంకరులు చెబుతారు.
మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలంటే ఏం చేయాలి?
ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడమే. అందుకోసం చిన్నప్పటినుంచి పిల్లలకు మంచి సంస్కారాన్ని అందించే రామాయణ, భారత, భాగవత కథలు చెప్పాలి. ఇలాంటి కథలవల్ల వారిలో మంచి సంస్కారం ఏర్పడుతుంది. బాల్యం నుంచి స్వధర్మాన్ని అలవరచాలి. మంచి సంస్కారం కలిగితే, అదే ధర్మాన్ని ఆచరింపజేస్తుంది. పిల్లలు కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి. వారు విననప్పుడు పెద్దలు దండన మార్గాన్ని అనుసరించి అయినా, స్వధర్మాన్ని అలవరచాలి.  
మాధవ సేవ చేస్తే పుణ్యం వస్తుంది. మరి మానవ సేవ వల్ల ప్రయోజనం ఏమిటి?
ఉపకారగుణం అనేది మనిషిలో ప్రాథమికంగా ఉండవలసిన లక్షణం. అది లేకపోతే మనిషి, తాను మనిషి అనిపించుకోవడానికి కూడా యోగ్యుడు కాడు. ప్రస్తుతం లోకంలో మానవ సేవా జరుగుతోంది, మాధవ సేవా జరుగుతోంది. భగవత్ప్రీతికరమైన కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి.
కష్టాలలో ఉన్నవాళ్లకి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మనస్సులో పరిశుద్ధమైన భావన ఉండాలి. ప్రఖ్యాతి కోసం చేయకూడదు. నాకేదో ఫలం లభించాలి, నేను చేసే ఈ పని ప్రపంచం మొత్తానికి తెలియాలి అని ఆలోచించకూడదు. అప్పుడు భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు. ఆయన అనుగ్రహ ఫలాలను ప్రసాదిస్తాడు.
మనిషికి ధర్మాధర్మ విచక్షణ ఎలా వస్తుంది?
ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలియాలంటే బాల్యం నుంచే పెద్దలు తగిన శిక్షణ ఇవ్వాలి. ధర్మాధర్మాల గురించి తెలియజెప్పాలి. రామాయణ భారత భాగవతాదుల గురించి చెప్పాలి. రామాయణంలో ఉండే 24000 శ్లోకాలు, మహాభారతంలో ఉండే లక్షశ్లోకాలు.. అన్నీ కలిపి ఏమి చెబుతున్నాయి... రాముడిలాగా ఉండాలి.
రావణుడిలాగా ఉండకూడదు. యుధిష్ఠిరుడిలాగా ఉండాలి. దుర్యోధనుడిలాగా ఉండకూడదు అనే కదా... ఆయా కథలు వారికి తెలిస్తే, ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో, ఎలా ఉంటే మంచిదో, ఏ విధంగా ప్రవర్తించడం చెడో అనే విచక్షణ వస్తుంది.
ఆదిశంకరులవారి రచనలలో ఉత్కృష్టమైనది ఏది?
ఆయన రచనలన్నీ ఉత్కృష్టమైనవే. లోకంలో ఉండే మనుషుల అర్హతను బట్టి, వారి పరిజ్ఞానాన్ని బట్టి, ఎవరికి ఏ రచన వల్ల అధిక ప్రయోజనమో, ఆ విధమైన రచనలు చేశారు ఆది శంకరులవారు. శాస్త్రజ్ఞానం ఉండి, శాస్త్రాలలో చెప్పిన గంభీరమైన విషయాలను అర్థం చేసుకోగల  మేధాశక్తి ఉన్న వారికి బ్రహ్మసూత్ర భాష్యం, ప్రస్థానత్రయం అందించారు.
సామాన్యమైన విషయాలను అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానం, మేధాశక్తి ఉన్న వారికోసం వివేక చూడామణి, శతశ్లోకి వంటి గ్రంథ రచన చేశారు. ఇక సాధారణమైన వారికోసం శ్లోకాలు, స్తోత్రాలు వంటి వాటిని అందించారు. ఈ రకంగా ఆయన రచించిన గ్రంథాలన్నీ ఉత్కృష్టమైనవే.
ఆదిశంకరుల జయంతిని ఏ విధంగా జరుపుకోవాలి?
ఆదిశంకరులవారు సాక్షాత్తూ ఈశ్వరుని అవతారం... కాబట్టి శంకర జయంతినాడు వారిని విశేషంగా పూజించాలి. వారి అష్టోత్తర శతనామాలు చెప్పుకుని, వారి సన్నిధిలో... వారి చరిత్రను చెప్పే శంకర విజయాన్ని పారాయణ చేయాలి. వారి ఉపదేశాలను జనబాహుళ్యానికి తెలిసే విధంగా చేయాలి. మహాపురుషులందరి జయంతులు, వర్థంతుల సందర్భంలో కూడా ఇదే చేయాలి.
అశాంతి తొలగి పోవాలంటే...?
మన అశాంతికి మూల కారణం మన మనస్సే. అశాంతి తొలగి పోవాలంటే బాహ్యపదార్థాల వల్ల కాదు. మానసికంగా ఒక పదార్థం కావాలి. ఆ పదార్థమే తృప్తి. భగవంతుడు మనకు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. ఒక మనిషి ఇంకో మనిషిని హింసించడమో, ఇంకేదైనా తప్పు చేయడమో చేస్తున్నాడంటే మూడు కారణాలున్నాయి. అవి ఒకటి– కామం, అంటే దురాశ. రెండవది. క్రోధం. మూడవది లోభం.
ఈ మూడూ నరకానికి వెళ్లడానికి మూడు ద్వారాలు. ఒక మనిషి ఒక వస్తువు కావాలి అనుకుంటాడు. దానికోసం ప్రయత్నం చేస్తాడు. సన్మార్గంలో అది లభించకపోవడం వల్ల తప్పుడు మార్గాన్ని అనుసరిస్తాడు. అందులో భాగంగా ఇంకొకరితో విరోధం ఏర్పడుతుంది. అప్పుడు అశాంతి చెలరేగుతుంది. కాబట్టి ఆశ అనే గుర్రాన్ని తృప్తి అనే కళ్లెంతో అదుపు చేయాలి. నాకు ఏదైనా కష్టం వస్తే భగవంతుడున్నాడు, ఆయనే ఆదుకుంటాడనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు అశాంతి అనేది ఉండదు.  
వేదాలు, స్మృతులు– వీటికి తేడా ఏమిటి? వీటిలో దేనిని అనుసరించాలి?
శాస్త్రాలన్నింటికీ మూల ప్రమాణం వేదమే. వేదం స్వతః ప్రమాణం. దానికి మించింది మరొకటి లేదు. వేదాన్ని ఆధారం చేసుకుని ఏర్పడ్డదే స్మృతి. ఇది స్వయంగా ఉపదేశం చేయదు. వేదంలో ఉన్నదాన్నే ఉపదేశిస్తుంది. ఏదైనా ఒక విషయంలో స్మృతి, వేదం వేర్వేరుగా చెప్పాయంటే, స్మృతిని వదిలేసి, వేదాన్నే అనుసరిస్తాం.
విగ్రహారాధన ఎందుకు?
భగవంతుడు అణువణువులోనూ ఉన్నాడు. కానీ, ఆయన్ని చూడగలిగే జ్ఞానం అందరికీ లేదు. అందుకే ఆలయాలు, ఆ ఆలయాలలో విగ్రహాలను ఏర్పాటు చేశారు పెద్దలు. ప్రహ్లాదుడు మహా భక్తుడు కాబట్టి అన్నింటిలోనూ దేవుణ్ణి చూడగలిగాడు, దేవుడి ఉనికిని ప్రశ్నించిన తండ్రికి స్తంభంలోనే దేవుణ్ణి చూపగలిగాడు. అందరికీ అది సాధ్యం కాదు కదా. అందుకోసమే విగ్రహారాధనలు నేటికీ వర్థిల్లుతున్నాయి.
అశాంతి, అరాచకాలను ఎదుర్కోవాలంటే...?
అశాంతి, అరాచకాలకు కారణం అపరాధాలు పెరిగిపోవడమే, లౌకికంగా చెప్పాంటే తగిన చట్టాలు రూపొందించి, కఠనంగా అమలు చేయాలి. అసలు అపరాధమే జరగకుండా ఉండాలంటే అహంకారాన్ని జయించాలి, కామాన్ని, క్రోధాన్ని పోగొట్టుకోవాలి, ప్రతి మనిషీ సద్గుణాలు అలవరచుకోవాలి. మనస్సును మలినం చేసే సాధనాలు ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి. వీటిని నిషేధిస్తే కానీ సగం చిక్కులు, చికాకులు తొలగవని మా అభిప్రాయం.


వడియాలు_Vadiyalu_Granthanidhi Mohanpublications Bhakti Pustakalu


వడియాలు Vadiyalu home made vadiyalu vadiyalu recipe recipe of vadiyalu appdalu vadiyalu orugulu ooragayalu uaragayalu bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


వేసవి ప్రత్యేకం వడియాలు

అప్పడాలు, వడియాలు, ఒరుగులు, ఊరగాయలు... తెలుగువారి శుభకార్యాలలో తప్పనిసరిఒకవైపు ఎండలు మరోవైపుపెళ్లిళ్లు ఇంటింటా వడియాలు, అప్పడాల సందడే వారేనా మనమూ పెట్టుకుందాం వడియాలు ఎర్రటి ఎండలో సూర్యుడికి నైవేద్యం పెడదాం ఆయన రుచి చూసి మరింత రుచిగా మనకు అందిస్తాడు
ఉల్లిపాయ వడియాలు
కావలసినవి
ఉల్లి తరుగు – అర కేజీ; మినప్పప్పు – 100 గ్రా.; పచ్చిమిర్చి – 5; ఉప్పు – తగినంత.
తయారి
♦ మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి
♦  మిక్సీలో మెత్తగా రుబ్బిన తరువాత, ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి
♦  పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలిపి ప్లాస్టిక్‌ పేపర్‌ మీద వడియాలు పెట్టుకోవాలి
♦  రెండు మూడు రోజులు ఎండిన తరవాత గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి
♦  నూనెలో వేయించి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.
బియ్యప్పిండి వడియాలు
కావలసినవి
బియ్యం – గ్లాసు; ఉప్పు – తగినంత; జీలకర్ర – 2 టీ స్పూన్లు; పచ్చిమిర్చి – 12; ఎండుకొబ్బరి పొడి – అరకప్పు
తయారీ
♦ ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టాలి
♦  బియ్యాన్ని మిక్సీలో వేసి దోసె పిండి మాదిరిగా రుబ్బుకోవాలి
♦  చిన్న పాత్ర తీసుకుని అందులో సగభాగం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి నీళ్లను మరిగించాలి
♦  మరుగుతున్న నీటి పాత్రపై మూత పెట్టి, దాని మీద ముందుగా రుబ్బి ఉంచుకున్న పిండి ముద్దను కొద్దిగా మందంగా చిన్న చిన్న అట్లుగా పోసుకోవాలి
♦  ఆవిరికి అవి పైకి లేస్తాయి. వాటిని ఎండలో ఆరబెట్టాలి. రెండు మూడు రోజులు బాగా ఎండిన తరవాత డబ్బాలోనిల్వ చేసుకోవాలి. నూనెలో వేయించి తినాలి.

పొట్టు వడియాలు
కావలసినవి
పొట్టుమినప్పప్పు ; – పావు కేజీ; పచ్చి మిర్చి – 10; ఉప్పు – తగినంత ; జీలకర్ర – టీస్పూను
తయారి
♦  ముందురోజు రాత్రి మినప్పప్పు నానబెట్టాలి. మరుసటిరోజు శుభ్రంగా కడగాలి. పొట్టు తీయకూడదు ∙పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి       ♦  కొద్దికొద్దిగా తీసుకుని ప్లాస్టిక్‌ పేపర్‌ మీద వడియాలు పెట్టుకోవాలి. నాలుగు రోజులు బాగా ఎండిన తరవాత గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కావలసినప్పుడు నూనెలో వేయించుకోవాలి. పులుసు, చారులలో నంచుకుంటే రుచిగా ఉంటుంది.

సొరకాయ వడియాలు
కావలసినవి
అన్నం – రెండు కప్పులు; సొరకాయ గుజ్జు – కప్పు; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – చిన్న కట్ట (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; నూనె – అర కప్పు
తయారీ
♦  ఒక పాత్రలో అన్నం, సొరకాయ గుజ్జు, జీలకర్ర, కరివేపాకు తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙ప్లాస్టిక్‌ పేపర్‌ మీద వడియాలు పెట్టుకోవాలి
♦  నాలుగు రోజులు బాగా ఎండిన తరువాత గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి
♦  నూనెలో వేయించుకుని, సాంబారు లేదా రసంతో కలిపి తింటే రుచిగా ఉంటాయి. ఉత్తగా అన్నంలో తిన్నా కూడా బాగుంటాయి.
అటుకులు దోసకాయ వడియాలు
కావలసినవి
అటుకులు – ఒక కప్పు; దోసకాయ తురుము – రెండు కప్పులు; జీలకర్ర – టీ స్పూను; ఇంగువ – టీ స్పూను; పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత
తయారీ
♦ అటుకులను ఒకసారి నీళ్లలో వేసి కడిగి తీసేయాలి
♦  దోసకాయ తురుము జత చేయాలి
♦  జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, ఉప్పు... మిక్సీలో వేసి మెత్తగా చేసి, అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలపాలి
♦  చిన్న చిన్న ఉండలుగా చేసి వడియాలు పెట్టాలి
♦  రెండు మూడు రోజులు ఎండిన తరువాత డబ్బాలోకి తీసుకోవాలి
♦  నూనెలో వేయించి అన్నంలో తింటే రుచిగా ఉంటాయి.
తెలగపిండి (ఉరుపిండి) వడియాలు
కావలసినవి:
తెలగపిండి – అర కప్పు; పచ్చిమిర్చి – మూడు; ఉప్పు – తగినంత; వాము – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి రేకలు – 6
తయారి:
♦ తగినన్ని నీళ్లల్లో తెలగపిండిని సుమారు 8 గంటలు నానబెట్టాలి
♦ పచ్చిమిర్చి, ఉప్పు, వాము, వెల్లుల్లి... మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
♦ ఈ మిశ్రమాన్ని తెలగపిండికి జత చేయాలి
♦ చపాతీపిండిలా తయారవ్వాలి ∙చిన్నచిన్న ఉండలు తీసుకుని అరచేతితో ఒత్తి వడియాల మాదిరి ఒత్తి, నువ్వులు అద్ది ఎండలో ఆరబెట్టాలి
♦ ఒక్కరోజు ఎండితే చాలు. వీటిని వేయించవలసిన అవసరం లేదు. పెరుగన్నంలో కాని, మజ్జిగతో కాని తింటే రుచిగా ఉంటాయి.
టొమాటో వడియాలు
కావలసినవి
నువ్వులు – పావు కప్పు; టొమాటో గుజ్జు – కప్పు; అటుకులు – ఒకటిన్నర కప్పులు; కారప్పొడి – ఒకటిన్నర టీ స్పూనులు; ఉప్పు – తగినంత; జీలకర్ర – టీస్పూను; పచ్చిమిర్చి – 3; ఉల్లి తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – కొద్దిగా
తయారీ
♦నువ్వులను శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి
♦ టొమాటోలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి, పచ్చిమిర్చి, జీలకర్ర జత చేసి మెత్తగా గుజ్జు చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి
♦ నీటిలో శుభ్రం చేసిన అటుకులు జత చేసి పది నిమిషాలు పక్కన ఉంచాలి
♦ నేల మీద ప్లాస్టిక్‌ పేపర్‌ వేసి, కొద్దికొద్దిగా పిండి తీసుకుని గుండ్రంగా వచ్చేలా వడియాలు పెట్టాలి
♦ బాగా ఎండిన తరవాత డబ్బాలోకి తీసుకోవాలి
♦ వీటిని అన్నంలోనే కాకుండా స్నాక్స్‌లా కూడా తింటే బాగుంటాయి.
రాగిపిండి వడియాలు
కావలసినవి: రాగిపిండి – కప్పు; నీళ్లు – 5 కప్పులు; కారంపొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఇంగువ – చిటికెడు
తయారీ:
♦ ఒకపాత్రలో రెండు కప్పుల నీళ్లు, రాగి పిండి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి
♦  మిగిలిన నీళ్లను మరిగించి ఉప్పు, కారంపొడి, ఇంగువ వేసి బాగా కలిపాక నీళ్లలో కలిపి ఉంచిన రాగిపిండి వేస్తూ బాగా కలిపి దించేయాలి
♦  ప్లాస్టిక్‌ కాగితం మీద ఈ పిండిని వడియాలుగా పెట్టుకోవాలి.
బూడిద గుమ్మడి కాయ వడియాలు
కావలసినవి
గుమ్మడికాయ – 1; పొట్టు మినప్పప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి – 100 గ్రా. ; జీలకర్ర – 50 గ్రా.; ఇంగువ – టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ
♦ మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ముందు రోజు రాత్రి నానబెట్టాలి
♦ బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. (గింజలు తీసేయాలి)
♦ ఉప్పు, పసుపు, ఇంగువ జత చేసి ఒక వస్త్రంలో గట్టిగా మూట కట్టి, దాని మీద పెద్ద బరువు పెట్టి రాత్రంతా ఉంచాలి
♦ మరుసటి రోజు ఉదయం మినప్పప్పు పొట్టు తీసి, పచ్చిమిర్చి, ఉప్పు జత చేసి మెత్తగా రుబ్బాలి
♦ బూడిదగుమ్మడికాయ ముక్కలు జత చేయాలి ∙ప్లాస్టిక్‌ కాగితం మీద నిమ్మకాయ పరిమాణంలో వడియాలు పెట్టాలి
♦ రెండు రోజులపాటు ఎండిన తరవాత, వాటిని జాగ్రత్తగా తీసి, రెండవ వైపుకి తిరగేసి, మరో రెండు రోజులు ఎండనివ్వాలి ∙గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి
♦ ఈ వేసవిలో మామిడికాయ పప్పులో వడియాలు నంచుకుని తింటే రుచిగా ఉంటుంది.
పేలపిండి వడియాలు
కావలసినవి
పేలాలు – 500 గ్రా.; సగ్గుబియ్యం – పావు కప్పు; పచ్చిమిర్చి – 30 గ్రా.; వాము –  టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత
తయారీ
♦ సగ్గుబియ్యాన్ని ఒకటిన్నర కప్పుల నీళ్లలో సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి
♦ మీడియం మంట మీద సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. (ఆపకుండా కలుపుతుండాలి) ∙వాము జత చేసి బాగా కలిపి కిందకు దించేయాలి
♦ మొత్తం పేలాలలో సగం పేలాలను ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి
♦ ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేయాలి. పేలాలు నీటిని పీల్చుకుంటూ పెద్దవిగా అవుతాయి. అప్పుడు మిగిలిన పేలాలు, కప్పుడు నీరు జత చేయాలి
♦ బాగా కలిపి పదినిమిషాలు పక్కన ఉంచాలి
♦ పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్‌ చేసి, పేలాల పిండిలో వేసి కలపాలి. ఉపు జత చేయాలి
♦ఉడికించిన సగ్గు బియ్యం జత చేసి బాగా కలపాలి
♦ ప్లాస్టిక్‌ కాగితం మీద వడల మాదిరిగా ఒత్తి వడియాలు పెట్టాలి
♦ నాలుగైదు రోజులు ఎండే వరకు ఎండబెట్టాలి.
♦ గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి
♦ నూనెలో వేయించుకుని, సాంబారుతో కలిపి తింటే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.

భావనారాయణ స్వామి గుడి_Bhavanarayanaswamy Temple_Granthanidhi Mohanpublications Bhakti Pustakalu


భావనారాయణ స్వామి గుడి Bhavanarayanaswamy Temple kakinda sarpavaram bhavanarishi temple sarpavaram temple kakinada temples bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu ఆ ఆరు వికారాలూ లేనిదే.. శివ  చాగంటి కోటేశ్వరరావు శర్మ Lord shiva Chaganti Koteswara Rao Koteswara Rao garu lord siva lord parameswara parameswara tatvam యోగాసన గ్రంథాలు Yoga Books,Yoga Sarvasvam Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI
.

భావనారాయణ స్వామి గుడి





ఆ ఆరు వికారాలూ లేనిదే.. శివ చాగంటి కోటేశ్వరరావు శర్మ granthanidhi mohanpublications bhaktipustakalu


ఆ ఆరు వికారాలూ లేనిదే.. శివ  చాగంటి కోటేశ్వరరావు శర్మ Lord shiva Chaganti Koteswara Rao Koteswara Rao garu lord siva lord parameswara parameswara tatvam యోగాసన గ్రంథాలు Yoga Books,Yoga Sarvasvam Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


ఆ ఆరు వికారాలూ లేనిదే.. శివ

‘శామ్యతి, పరమానందరూపత్వాన్నిర్వికారో భవతి యితి శివః’ అంటుంది అమర్చకోశం. శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో సమస్తప్రాణులకు, సమస్త జీవులకు ఆరు వికారాలుంటాయి. వాటిని షడ్వికారాలంటారు. కాలంలో ఏదైనా కొత్తగా వచ్చినట్లయితే దానికి పుట్టినతేదీ అని ఒకటి ఉంటుంది. పుట్టినతేదీ ఉన్నదీ అంటే.. అది షడ్వికారాలకు లోనయిపోతుందన్నమాట. జీవుడు పుట్టడంతోనే వానికి జన్మము అనే తేదీ కాలంలో వచ్చింది. ఒక జన్మతేదీ ఏర్పడింది. అంతకుముందు లేనిది ఇప్పుడు పుట్టింది. ఆ జీవి ఇప్పుడు భూమిపై ఉంది. తర్వాత ఆ జీవి పెరుగుతుంది. పెరిగి కొంతకాలానికి మళ్లీ తరగడం ప్రారంభిస్తుంది. కొంతకాలానికి శరీరం వడిలిపోయి క్షీణించడం ప్రారంభిస్తుంది. ఇంకా కొంతకాలం గడిచేటప్పటికి ఆ శరీరం నశించిపోతుంది. అంత్యేష్టి సంస్కారం చేయబడుతుంది. ఈ ఆరు వికారాలూ సమస్త ప్రాణులకూ ఉండి తీరుతాయి. ఈ ఆరు వికారాలూ లేనిది ఏదైనా ఉందా? ఉన్నది. అదే శివ. అది కాలంలో పుట్టలేదు. కాలంలో పెరగలేదు. కాలంలో ఉండలేదు. కాలంలో నశించదు. జీవి ఎవరి నుండి వచ్చిందో ఎవరియందు పెరిగిందో ఎవరియందు లయించిందో.. వాడు మాత్రం అలాగే ఉండిపోతున్నాడు. అలా ఉండిపోయినవాడు ఎవడు? వాడు పరబ్రహ్మం. వానికి కదలిక లేదు. వాడు ముందరా ఉన్నాడు. చివరా ఉన్నాడు. అలా ఉన్నవాడు ఎవడో వాడు నిర్వికారుడు. వానికి వికారములు లేవు. కాబట్టి వాని జుట్టు తెల్లబడదు. వానికి ముసలితనం లేదు. వానిని కాలం లొంగదీయలేదు. కాబట్టి వాడునిత్యయౌవనుడు. అందుకే మనం శివుని గురించి చెప్పినా, అమ్మవారి గురించి చెప్పినా.. ‘నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం’ అంటాం. వారికి వార్థక్యం రాదు. ఎందుచేత? మనం కాలమునకు వశులవడం చేత కాలమునందు మనకు మార్పు వస్తుంది. కాలస్వరూపంలో మనయందు మార్పులు తెచ్చేవాడు ఎవడున్నాడో వాడు మార్పునకు అతీతుడిగా సాక్షిగా ఉన్నాడు. కదిలే వస్తువుకు కదలని వస్తువు ఆధారమై ఉంటుంది. వికారాలు కలిగిన జగత్తుకు.. ఏది వికారాలకు అతీతమై ఉన్నదో అది ఆధారమై ఉన్నది. దానియందే ఈ సమస్త జగత్తూ పుట్టి పెరిగి లయిస్తున్నది. అటువంటిది ఏదో అది వికారాతీత స్థితి కలిగిన పరబ్రహ్మం. దానిని ఒక నామవాచకంతో పిలవాలని అనుకుంటే ‘శివ’ అని పిలువవచ్చు. కాబట్టి శివ శబ్దం పరబ్రహ్మం గురించి చెబుతోంది.ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. అమరకోశంలో అమరసింహుడు ఆయన్ను ‘పరమానందరూపత్వ’ అంటాడు. అంటే.. నిత్యానందాన్ని రాశీభూతం చేస్తే అదే ‘శివ’.

 చాగంటి కోటేశ్వరరావు శర్మ

నేరేడు పండ్లను తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలివే..! _Jamun Fruit Granthanidhi Mohanpublications Bhakthi Pustakalu


నేరేడు పండ్లను తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలివే..!  Jamun Fruit neredu pandu neredu benifits to eat Jamun fruit bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu యోగాసన గ్రంథాలు Yoga Books,Yoga Sarvasvam Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


నేరేడు పండ్లను తిన‌డం వ‌ల్ల
క‌లిగే లాభాలివే..!

నేరేడు పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో విరివిగా ల‌భిస్తాయి. నిగనిగలాడుతూ.. నోరూరించే వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి దాదాపుగా అన్ని ర‌కాల పోష‌కాలు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. నేరేడు పండ్ల‌ను తిన‌డం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నేరేడు పండ్ల‌ నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరోటిన్లు లభిస్తాయి.

2. మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి. డ‌యబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. వీటిలోని ఔష‌ధ గుణాలు.. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. రక్తశుద్ధి జరుగుతుంది.

3. రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ పండ్ల‌ను ఎంత తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఐర‌న్‌ అందుతుంది.

4. వందగ్రాముల నేరేడు పండ్లలో యాభై ఐదు శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు వీటిని తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

5. చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

6. ఈ కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఈ పండు తీసుకోవడం వల్ల విటమిన్‌ సి అంది.. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

చాణక్యుడు_Chanakya


చాణక్యుడు Chanakya Kauṭilya Vishnugupta Arthashastra Maurya Empire Chandragupta Chanakya Dhamana Niti Chanakya Niti bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu



చాణక్యుడు

మన చుట్టూ ఉన్న మంచిని గమనించుకొని మన జీవితాల్లోకి మంచి మనసుతో ఆహ్వానించుకోవాలని కుతంత్రాన్నీ కుటిలనీతితోనే నిర్మూలించాలనీ, కేవలం నిర్మూనిస్తే చాలదు, కూకటి వేళ్ళతో సహా పెకిళించివేయాలనే విషయాన్నీ ఎంతోమంది చారిత్రకులు తెలియపరిచారు. చెడుకు దూరంగా ఉంటే అది మనల్ని అంటుకోదనుకోవడం అమాయకత్వం. అది పూర్తిగా నశిస్తేనే మంచికి అస్తిత్వం అని తెలియజెప్పిన వారూ ఉన్నారు. తెగింపు, బుద్ధిబలం, ఆత్మవిశ్వాసం, అపారమైన విజ్ఞానం కలగలిస్తే, అదీ కుటిలనీతిగా పరిణమిస్తే చాణక్యుని రూపుదాలుస్తుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని ఆచరించి చూపించిన ఘనుడు చాణక్యుడు. అపజయమన్నదే ఎరుగని ధీరశాంతుడూ, విజ్ఞానంలో విలువలెరిగిన వాడు. కోపంలో అగ్రేసరుడు చాణక్యుడు. ఈతని జీవితంలో స్వంతలాభం ఉండదు. కానీ, మంచిని నిలబెట్టే ప్రయత్నంలో కుటిలత్వాన్ని అస్త్రంగా చేసుకున్నాడు.

ఒకే కుటుంబానికి చెందిన నందవంశీయులూ చంద్రగుప్తమౌర్యుని మధ్యలోని విభేదాన్ని ఛేదించడానికీ అన్యాయంగా చంద్రగుప్తుని నిరాదరణ పాలు చేసిన నంద వంశీయులను సమూలంగా నాశనం చేయడానికీ కుటిల రాజనీతిని ప్రయోగించిన సద్బ్రాహ్మణుడు చాణక్యుడు. ఋషి వంటివాడైన చాణక్యుడు ఏనాడూ భోగాలకు అలవాటు పడలేదు. పూరిగుడిసెలో బతికేవాడు. తన బుద్ధి కుశలతతో రాజులను గద్దె దింపి మరో రాజ్యానికి నాంది పలికే సత్తా చాణక్యుడిదే అయినా తన సామాన్య కుటీరాన్నే అపార అసాధారణ సంపదలా భావించాడు. విచిత్రమైన వ్యక్తిత్వం చాణక్యునిది. ఒకనాడు చాణక్యుని కాలుకు ముల్లు గుచ్చుకుంటుంది. ఆ ముల్లును కాలి నుంచి తీసి, దానిని కాల్చి బుదిద చేసి, ఆ బూడిదను నీళ్ళలో కలుపుకొని తాగి మరీ ముల్లుపై ప్రతీకారం తీర్చుకుంటాడు.
చాణక్యుని ఆలోచన ప్రకారం మూర్ఖులు మాత్రమే అదృష్టాన్ని నమ్ముతారు. బుద్ధిబలం గలవారు తమ సామర్థ్యమే సాధనంగా చేసుకొని ముందుకు సాగుతారనీ విశ్వసించేవాడు. చాణక్యునికి తన ఆత్మగౌరవమంటే అమితమైన ప్రేమ. ఎవరైనా దానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ప్రళయకాల రుద్రుడిలా మారి మరీ పగ తీర్చుకునేవాడు. చాణక్యుని పరిచయ చిహ్నమంటేనే కోపమని చెప్పవచ్చు.

నందరాజులు ప్రజలను హింసా ప్రక్రియలో పరిపాలన చేసేవారు. ప్రజల తిరుగుబాటుతో రక్తపాతం జరుగుతుందనీ, అలా జరుగకుండానే తన కుటిల రాజనీతితో చంద్రగుప్తుని ఆసరాగా చేసుకొని నందవంశాన్ని నిర్మూలించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నందులు నమ్మిన విశ్వసనీయ మంత్రి బుద్ధిమంతుడూ, యోగ్యవ్యక్తి అయిన రాక్షసుని ఎత్తులను చిత్తు చేసి, చివరకు చంద్రగుప్తుని మంత్రిని రాక్షసున్నే నియమంచి తను నిర్లిప్తుడుగా అడవులకు వెళ్ళిపోయిన మహావ్యక్తిత్వం గలవాడు చాణక్యుడు.
కోపానికి నిదర్శనంగా, ఆలస్యాన్ని సహించని వ్యక్తిగా, ఆత్మ విశ్వాసిగా, కుటిల రాజనీతిజ్ఞుడిగా, అర్థశాస్త్ర రచయితగా ప్రపంచానికి తెలిసిన చాణక్యుని జీవితంలోని మరోకోణం అతని విశాల హృదయం, ఉదారత, సడలని సంకల్పం. కానీ ప్రపంచం ముందు మాత్రం భావుకత, దయ అనేవే ఎరుగని కఠిన హృదయుడుగా చాణక్యుడు చిత్రీకృతమైనాడు.

ప్రజల శ్రేయస్సు కోసం ప్రపంచం తనని ఎలా భావించినా సరే, తాననుకున్నది చేసి తీరాలన్న దృఢ నిశ్చయంతో జీవించాడు చాణక్యుడు. తన పన్నాగాల విషయంలోనూ ఎవ్వరినీ నమ్మేవాడు కాదు. స్వార్థంలేని తన మహత్వాకాంక్షలో తానే సర్వం అయి విజయం సాధించాడు. ఆ విజయం తన బుద్ధి కుశలతతోనే తన నిర్ణయాత్మక వివేచనతోనే సాధ్యపడిందనీ, దైవానికి అందులో భాగస్వామ్యం లేదని తేల్చిచెప్పిన చాణక్యుడు తన విజయాన్ని ప్రజాశ్రేయస్సుకై ధారపోశాడు.
చాణక్యుడు విచారశీలుడు. ఇతరులను తాను విశ్వసించడు కానీ అందరితో విశ్వసింపబడతాడు. తొందరపాటు, తొట్రుపాటు అతనికి తెలియదు. ఆలోచన చేసాడంటే అది సత్ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. అద్భుతమైన పరాక్రమం తనదైనా ఎల్లప్పుడూ తన బుద్ధినే నమ్ముకున్నాడు. ఉత్సాహశీలి అయిన చాణక్యుడు ఎదురుదెబ్బలెన్ని తగిలినా లెక్క చేయనివాడు. ఎంత చెబుతాడో అంత చేసి చూపిస్తాడు చాణక్యుడు. సకల శాస్ర్తాలకూ నిధిలాంటి వాడు. అన్ని గుణాలూ ఇతనిలో ఉన్నాయి. దురాత్ముడిలా కనిపించే మహాత్ముడు చాణక్యుడు. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ రాజునీతికృతమై మహారథి చాణక్యుడు.

ప్రజల శ్రేయస్సు గురించిన ఆలోచన ఒకవైపు, అన్యాయం అయిపోయిన చంద్రగుప్తునికి అభయమిచ్చిన మాట మరోవైపు. అతిథి మర్యాదలు పాటించక తనను అవమానించిన నందులను నాశనం చేస్తానని శిఖముడి విప్పి చేసిన ప్రతిజ్ఞ మరొకవైపు చాణక్యుని జీవితాన్ని లోకవిదితం గావించాయి. చాణక్యుని వంటివారు ఎన్ని తరాలు మారినా, తరం ఉద్ధరించబడాలంటే మళ్ళీమళ్ళీ పుట్టాలేమో!

బిల్వ వృక్షాల వనంలో వెలసిన.. వనపర్తి శివాలయం_Wanaparthi Lord Shiva


బిల్వ వృక్షాల వనంలో వెలసిన.. వనపర్తి శివాలయం Wanaparthi Lord Shiva wanaparthi wanaparthi samstanam wanaparthi district wanaparthi mandal kakathiyulu srikrishna devarayulu lord shiva temple in wanaparthi wanaparthi lord shiva temple bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu



బిల్వ వృక్షాల వనంలో వెలసిన.. వనపర్తి శివాలయం!

పరమ శివుడు వెలసిన అతి ప్రాచీన ఆలయం వనపర్తి ఆలయం. దీనిని 13వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు నిర్మించారు. సింహద్వారం వద్ద శిలా శాసనం శివాలయం ప్రాశస్త్యాన్ని.. కాకతీయుల కళా తృష్ణను సూచిస్తుంది. నాటి చరిత్రకు, ఆధ్యాత్మిక వైభవానికి, కట్టడాలకు ఈ ఆలయం ఆనవాలుగా నిలుస్తున్నది. రామప్ప గుడి తర్వాత చెప్పుకోదగ్గ కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా వరాలనిచ్చే వనపర్తి శివాలయం ఒక ఉదాహరణ. ఈ ఆలయ విశేషాలే ఈవారం దర్శనం.

ఎక్కడ ఉన్నది?:

జనగామ జిల్లా లింగాల ఘనాపురం మండలం వనపర్తిలో ఉంది.

ఎలా వెళ్లాలి?:

హైదరాబాద్ నుంచి యాదాద్రి భువనగిరి మీదుగా జనగామ చేరుకోవాలి. అక్కడ్నుంచి సూర్యాపేట వెళ్లేదారిలో వనపర్తి చౌరస్తా నుంచి వెళితే శివాలయం వస్తుంది. జనగామ నుంచి 17 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఘనపురం నుంచి 7 కిలోమీటర్ల దూరం.
Lingam

పేరెలా వచ్చింది?

పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన వనంతో నిండి ఉండేదట. శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వ పత్రాన్ని ఈ అటవీ ప్రాంతం నుంచే తీసుకెళ్లేవారట. అందుకే దీనిని వనపత్రిగా పిలిచేవారు. కాలక్రమేణా వనపత్రి కాస్తా వనపర్తి అయింది. శివాలయ మంటపంలో నందీశ్వరుడు సజీవంగా ఉన్నట్లు కనిపించడంతో నందివనపర్తిగా కూడా పిలుస్తుంటారు.

ప్రత్యేకత:

అపురూపాల సృష్టిగా వనపర్తి శివాలయాన్ని పేర్కొంటున్నారు స్థానికులు. క్రీస్తుశకం 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. ఆలయంలో నందీశ్వరుడు రామప్పగుడిలోని నంది విగ్రహంతో పోలి ఉన్నది. ఆలయం ముందు రెండంతస్థుల గాలి గోపురం అద్భుత నిర్మాణంతో ఉట్టిపడుతున్నది. ఈ కట్టడం విశిష్టతను సంతరించుకున్నది. ఈ ఆలయ పరిసరాలలో కాకతీయుల కాలం నాటి వీరగల్లు శిలల ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఆలయ నిర్మాణం 16 స్తంభాలతో మంటప నిర్మాణ శైలిలో చాలా అద్భుతంగా ఉన్నది. ఎటుచూసినా ఆశ్చర్యమనిపించే శిల్ప సృష్టి, కాకతీయుల వైభవాన్ని, చారిత్రాత్మక విశిష్టతను, నాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకలుగా కనిపిస్తున్నాయి. గర్భాలయంలో శివుడి లింగం ప్రత్యేకతను సంతరించుకున్నది. పైకప్పు మీది శిల్ప కళారీతి చూడ చక్కగా ఉన్నది. అద్భుతమైన మంటపం, ఆధ్యాత్మికతను వెదజల్లే చారిత్రక కళా సంపద, ప్రశాంత వాతావరణం, రాతి కట్టడాల నిర్మాణం నాటి కాకతీయ రాజులకే సాధ్యమైంది.

విశిష్టత :

శివాలయం ముందున్న రెండంతస్థుల నిర్మాణం మరెక్కడా లేదంటున్నారు స్థానికులు. కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన వనపర్తి శివాలయం సూర్య చంద్ర రాజులు దర్శించి తరించారని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది. భక్తుల కోరికలు తీరుస్తూ వరాలనిచ్చే వనపర్తి శివుడు భక్తల కొంగు బంగారమై ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. యుద్ధ సమయంలో విజయప్రాప్తికి స్వామివారిని నాటి రాజులు దర్శించుకొని వెళ్లేవారట. శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. కాకతీయుల కళావైభవం మరుగున పడిపోకుండా ఈ కట్టడాన్ని కాపాడుకోవాలి. తద్వారా మన చరిత్రను, సంస్కృతిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉన్నదని వారంటున్నారు.


మేటి ఆలయం:

మా తాత ముత్తాతల కాలం నుంచీ వనపర్తి శివాలయం అర్చకులుగా పనిచేస్తున్నాం. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉన్నది. దీనిని పునరుద్ధరిస్తే తెలంగాణలోనే మేటి ప్రాచీన శివాలయంగా, నాటి కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతీకగా విరాజిల్లుతుంది.
సోమేశ్వర స్వామి, ఆలయ పూజారి

శివుడితో అనుబంధం:

చిన్నప్పట్నుంచి ఆలయాన్ని చూస్తున్నాం. దీనికి చాలా గొప్ప నేపథ్యం ఉన్నది. పరమశివుడికి దీనికి ప్రత్యక్ష అనుబంధం ఉన్నది. ఇలాంటి ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది.
-వంగ వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మన్

పుస్తకమేరా శాశ్వతం!_Books_Granthanidhi Mohanpublications Bhakti Pustakalu


పుస్తకమేరా శాశ్వతం! Books library book publishers uses of library library uses and importance importance of library in education bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


పుస్తకమేరా శాశ్వతం!

ఎన్ని మాధ్యమాలు వచ్చినా, ఎంత అభివృద్ధి జరిగినా.. మనిషికి పుస్తకం ఇచ్చే జ్ఞానమే అంతిమం. అదే.. శాశ్వతం. చీకట్లో ఉన్న మనిషి మస్తిష్కంలో పుస్తకం వెలుగుపూలు పూయిస్తుంది. కానీ నేటి తరం ఆ పుస్తకాలకు ఇస్తున్న ప్రాధ్యానం ఎంత? సోషల్ మీడియా, టీవీ, సినిమా లాంటి వినోద మాధ్యమాలకు ఎందుకు అలవాటు పడిపోతున్నది. శాశ్వతంగా మనల్ని వెలుగుబాటలో నడిచేలా చేసే పుస్తకంతో ఎందుకు దోస్తీ కట్టడం లేదు? ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్ ఈ తరం మాధ్యమాలు. అవీ ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ అవి శాశ్వతం కాదు. పుస్తకమే శాశ్వతం. పుస్తకం పంచే వెలుగే.. శాశ్వతం. రండి.. ఈ పుస్తక దినోత్సవం నుంచి పుస్తకాలతో దోస్తీ చేద్దాం. 

పుస్తకం.. చీకట్లో ఉన్న మనిషి మస్తిష్కంలో వెలుగుపూలు పూయిస్తుంది. కొత్త ప్రపంచానికి దారి చూపే దీపం పుస్తకం. నువ్వు చదివే పుస్తకాన్ని బట్టి నీ వ్యక్తిత్వమేంటో చెప్పొచ్చు అంటారు. నిజమే పుస్తకం మనుషుల వ్యక్తిత్తాలను, వ్యక్తుల మనస్తత్తాలను చెప్పకనే చెప్పేస్తుంది. మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అలాంటి పుస్తకం కోసం ఎంతమంది సమయం కేటాయిస్తున్నారు? ఎంతమంది రెగ్యులర్‌గా పుస్తకాలు చదువుతున్నారు? నేటి తరానికి మార్గదర్శకమవ్వాలని నాటి తరం ఎన్నో పుస్తకాలు చదివి, శోధించి, మధించి ఎన్నో పుస్తకాలు, విజ్ఞాన భాండాగారాలు సృష్టించారు. మరి నేటి తరం ఆ పుస్తకాలతో చెలిమి చేస్తున్నదా? పుస్తకం గొప్పతనం ఏంటి? ఈ నెల 23న ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈ సందర్భంగానే ఈ వారం ముఖచిత్ర కథనం.
BOOK1

ఒక కథ..

పూర్వం ఒక మారుమూల పల్లెటూర్లో రాము, సోము అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారిద్దరూ చదువు సంధ్యలు మాని, అల్లరిచిల్లరగా తిరుగుతుండేవారు. వారిని చూసి తల్లిదండ్రులు నిత్యం బాధపడేవారు. వారిలో ఎప్పుడు మార్పు వస్తుందో అని ఆలోచించేవారు. అలా ఒకరోజు పొరుగూర్లో ఒక సాధువు వచ్చాడని, ఆయన ఎలాంటి వారినైనా మార్చేస్తాడని ఊర్లో మాట్లాడుకుంటుంటే విన్నాడు. తన ఇద్దరు కొడుకులను తీసుకొని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లాడు ఆ తండ్రి. తన సమస్య చెప్పుకున్నాడు. సాధువు రాము, సోము ఇద్దరినీ చూసి చెరొక పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం నిండా నేను మంచి బాలుడను అని ఒకే వాక్యం పేజీల కొద్ది రాసి ఉంది. ఆ పుస్తకాలు వారిద్దరికీ ఇస్తూ చూడండి బాబూ.. ఈ పుస్తకం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూర్తిగా చదువాలి. క్రమం తప్పకూడదు అని చెప్పాడు. నాలుగు రోజులు చదివేసరికి రాముకు విసుగు పుట్టింది. అయినా.. ఈ పుస్తకంలో పెద్దగా చదువాల్సిన విషయం ఏముందీ? ఒకే వాక్యం తిప్పి తిప్పి రాశాడు. ఒకవేళ ఈ పుస్తకంలోంచి ఏదైనా ప్రశ్న అడిగినా సమాధానం ఒకటే నేను మంచి బాలుడను అని. అది నాకు గుర్తుంది. ఇక ఈ పుస్తకం చదువాల్సిన అవసరం లేదు అని పుస్తకం పక్కకు పడేసి ఎంచక్కా ఎప్పట్లాగే ఆటపాటల్లో మునిగిపోయాడు. సోము మాత్రం ప్రతిరోజూ సాధువు చెప్పినట్టు ఆ పుస్తకాన్ని చదువుతున్నాడు. ఒకరోజు చదువుతూ చదువుతూ మధ్యలో ఇలా ఆలోచించాడు ఈ పుస్తకంలో నేను మంచి బాలుడను అని రాసి ఉంది. అదే నేను రోజూ చదువుతున్నాను. కానీ నేను మా అమ్మానాన్న చెప్పినట్టు వినడం లేదు. బడికి వెళ్లడం లేదు. జులాయిగా తిరుగుతున్నాను. ఒకవేళ నేను ఈ పుస్తకంలో ఉన్న వాక్యాన్ని నిజం చేసి మంచి బాలుడిగా మారిపోతే నాకు ఈ పుస్తకం చదువాల్సిన అవసరం రాదు అనుకున్నాడు. అంతే మరుసటి రోజు నుంచి ఉదయాన్నే లేవడం, బడికి వెళ్లడం, సాయంత్రం ఇంటికి వచ్చాక చదువుకోవడం ఇలా తన దినచర్య మొత్తం మార్చేసుకున్నాడు. రాము వచ్చి ఆడుకుందాం రారా.. అంటూ పిలిచినా సోము వెళ్లేవాడు కాదు. కొన్నిరోజుల తర్వాత వారి తండ్రి మళ్లీ ఆ ఇద్దరినీ సాధువు దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు సాధువు ఇద్దరి ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించాడు. సోముకు మరో పుస్తకం ఇచ్చాడు. రాముకు అదే పుస్తకం మళ్లీ ఇచ్చాడు. ఈ కథలో నీతి ఏంటంటే.. పుస్తకంలో ఏం రాసి ఉంది అనేది కాదు. మనం ఆ పుస్తకాన్ని చదివామా లేదా? చదివితే అందులో ఉన్న విషయాన్ని ఎంతవరకు ఆచరించాం అనేది ఈ కథ సారాంశం. ఒక పుస్తకం జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని మార్చేస్తుందనడానికి ఇదే నిదర్శనం.
BOOK2

టైమ్ ఉండదు

పుస్తకాలు పెద్దగా చదువను. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే టీవీ, ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్‌తో టైమ్‌పాస్ చేస్తా. ఒక పుస్తకం చదువడం మొదలుపెడితే దాన్ని పూర్తి చేస్తేనే అందులో ఏముందో తెలుస్తుంది. దానికి కొన్ని రోజులు పడుతుంది. అదే సోషల్ మీడియా, టీవీ అయితే టైమ్‌పాస్‌కి టైమ్‌పాస్, ప్రపంచంలో ఏం జరుగుతుందో, దేన్ని ఫాలో అవాలో తెలుస్తుంది. అందుకే పుస్తకాల జోలికి పెద్దగా వెళ్లను. పుస్తకం చదివే అంత టైమ్ ఉండదు కూడా.
- ఎ.నూతన, విద్యార్థిని, హిమాయత్‌నగర్

పుస్తకం తెరిస్తే...

శ్రీశైలం బాగా డబ్బున్న వ్యక్తి. పాలవ్యాపారంలో కలిసొచ్చి కోట్లు కూడబెట్టాడు. కష్టపడి పైకొచ్చాడు కాబట్టి, తన కొడుకు ఆరుష్ కూడా కష్టపడి పైకి రావాలని కోరుకుంటాడు. ఆరుష్ ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రతీ పుట్టినరోజు నాడు కొడుకుకు ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చేవాడు శ్రీశైలం. అలా ఆరుష్ ఇంటర్‌కి వచ్చాడు. ఆరుష్ తండ్రి దగ్గరికెళ్లి నాన్నా.. ఈ పుట్టినరోజుకు నాకు పుస్తకం వద్దు. బజాజ్ పల్సర్ బైక్ కొనివ్వు అని అడిగాడు. కొన్నిరోజులు గడిచాక మరొక బర్త్ డే వచ్చింది. ఆరోజు శ్రీశైలం ఉదయాన్నే లేచి పూజ చేసుకొని ఆరుష్ గదికి వెళ్లాడు. కొడుకును నిద్రలేపి ఎప్పటిలాగే మంచి పుస్తకాన్ని పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు. ఈసారి కూడా పుస్తకమే గిఫ్టుగా ఇవ్వడంతో ఆరుష్‌కి కోపం వచ్చి ఆ పుస్తకం తండ్రి మీదకు విసిరేసి విసురుగా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆరుష్‌కి ఉస్మానియా యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. ఆ కార్యక్రమానికి మిగిలిన వారంతా తల్లిదండ్రులతో వచ్చారు. ఆరుష్ మాత్రం ఒక్కడే వెళ్లాడు. డాక్టరేట్ తీసుకున్న మిగతా వారంతా తల్లిదండ్రులతో తమ సంతోషాన్ని పంచుకోవడం చూసి ఆరుష్ కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని బయల్దేరాడు. ఊళ్లోని ఇంటికి వెళ్లి చూస్తే తాళం ఉంది. పక్కింటి వాళ్లను అడిగాడు. మాకు తెలియదు అన్నారు. చుట్టుపక్కల వాళ్లందరినీ అడిగి చూశాడు. ఆరుష్ వాళ్ల ఇంటి వెనుకాల ఉండే మహిళ పదేళ్ల క్రితం వాళ్ల కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు తట్టుకోలేక శ్రీశైలం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి ఆయన భార్య గుండె ఆగి చనిపోయింది అని చెప్పింది. ఏడ్చుకుంటూ ఆరుష్ ఆ ఇంటికెళ్లి తాళం పగులకొట్టి చూశాడు. ఇల్లంతా చెత్త, బూజుతో నిండిపోయి ఉంది. భయపడుతూనే పైన ఉండే తన గదికి వెళ్లాడు. తలుపు తెరిచి చూశాడు. పదేళ్ల క్రితం తండ్రి ఇస్తే కింద పడేసిన పుస్తకం అక్కడే ఉంది. ఏడ్చుకుంటూ వణుకుతున్న చేతులతో పుస్తకం తెరిచి చూశాడు. కొన్ని పేజీల తర్వాత ఆ బుక్‌లో బజాజ్ షోరూంలో పల్సర్ 220 బైక్ కొన్న లక్ష రూపాయల రశీదు ఉంది. తొందరపడి పుస్తకం తెరువనందుకు అప్పుడు బాధపడ్డాడు. తల్లిదండ్రులను కోల్పోయాడు. తండ్రి ఇచ్చిన బహుమతి అందుకోలేపోయాడు. చూశారుగా.. ఈ కథలో కేవలం పుస్తకం తెరువకపోవడం వల్లనే ఆరుష్ తిరిగి పొందలేనంతగా నష్టపోయాడు. అదే జీవితాంతం పుస్తకానికి దూరమైతే ఇంకా ఎంత కోల్పోవాల్సి వస్తుందో ఆలోచించండి.

మీకు తెలుసా!

ప్రపంచ ప్రఖ్యాత తత్తవేత్త అరిస్టాటిల్ పుస్తకాల పురుగు. ఆయనను అందరూ నడిచే విజ్ఞాన సర్వస్వంగా భావించేవారు. ఒకవైపు పుస్తకాలు చదువుతూ, నడుస్తూ శిష్యులకు పాఠాలు చెప్పేవాడట. అందుకే ఆయన ఏర్పాటు చేసిన విద్యాలయానికి పెరిపిటాటిక్ అకాడమీ అంటే నడిచే విద్యాలయం అని పేరొచ్చింది. పుస్తకాల మీదున్న ప్రేమతో ఆయన ప్రపంచం నలుమూలల నుంచి పుస్తకాలు తెప్పించేవాడు. ఆయన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ గుట్టలుగుట్టలుగా పేరుకుపోయేవట. ఆ తర్వాత వాటిని వర్గీకరించి ఒక లైబ్రరీగా సెట్ చేశారట ఆయన శిష్యులు. ఆ తర్వాత అరిస్టాటిల్ తన పుస్తకాలన్నింటినీ తన ప్రియ శిష్యుడు తియోప్రాస్ట్రస్‌కి వారసత్వంగా ఇచ్చేశాడు. తియోప్రాస్ట్రస్ అరిస్టాటిల్ ద్వారా సంక్రమించిన పుస్తకాలతో పాటు తాను సంపాదించుకున్న పుస్తకాలన్నింటినీ కలిపి తన శిష్యుడు నెలియస్‌కి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఏథెన్సులోని రాజకీయ పరిస్థితులకనుగుణంగా నెలియస్ ఆ పుస్తకాలన్నింటినీ తీసుకొని ఏథెన్స్ పట్టణం వదిలి స్కెప్సిస్‌కి మకాం మార్చాడు. అయితే దురదృష్టవశాత్తు నెలియస్ వారసులంతా నిరక్షరాస్యులు. వారికి పుస్తకాల విలువ తెలియదు. ఫలితంగా పుస్తకాలు, లైబ్రరీ నిర్లక్ష్యానికి గురైనాయి. నెలియస్ శిష్యులు అట్టాలిడ్ రాజులు అలెగ్జాండ్రియా లైబ్రరీకి పోటీగా పెరగామమ్‌లో తాము నెలకొల్పిన లైబ్రరీ కోసం తమ దగ్గరున్న పుస్తకాలన్నీ స్వాధీనం చేసుకుంటారని భయపడి ఆ పుస్తకాలను ఒక నేలమాలిగలో దాచారు. చాలారోజుల తర్వాత అపెల్లికాన్ అనే లైబ్రేరియన్ ఎంతో డబ్బు వెచ్చించి నెలియస్ వారసుల నుంచి అరిస్టాటిల్ పుస్తకాలన్నింటినీ కొన్నాడు. అప్పటికే అందులో చాలా పుస్తకాలు జీర్ణావస్థలో ఉన్నాయి. వాటికి ఆయన నకళ్లు రాయించాడు. ఆ తర్వాత మిగతా పుస్తకాలన్నీ స్కెప్సిస్ నుంచి రోమ్ నగరానికి చేరాయి. అదీ పుస్తకానికి ఉన్న విలువ. ఒక పుస్తకం విలువ తెలియాలంటే ఆ పుస్తకం చదివైనా ఉండాలి. లేదంటే.. ఒక పుస్తకం చదివి తన జీవితాన్నే మార్చుకున్న వ్యక్తిని కలిసైనా ఉండాలి.

మనల్ని గుచ్చి, గాయపరిచి, ఇబ్బందిపెట్టే రచనలు, పుస్తకాలే మనం చదువాలి. మనం చదువుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొల్పాలి. మనల్ని ప్రభావితం చేయాలి. పుస్తకం మనలో గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిలాగ పగులకొట్టాలి అన్నాడు జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. నిజమే అలాంటి పుస్తకాలు చదివినప్పుడే మనలో ఒక మార్పు మొదలవుతుంది. ఒక మధనం పురుడుపోసుకుంటుంది. కానీ నేటి తరం ఆ పని చేస్తున్నదా? పుస్తకాలంటే కేవలం స్కూల్లో, కాలేజీలో పాఠాలు నేర్చుకునేవి గానో, లేదంటే అవి చదివితే పరీక్షల్లో మార్కులు తెచ్చే సాధనాలుగానో భావిస్తున్నారు. సమాజాన్ని, జీవితాన్ని, సాహిత్యాన్ని, కొత్త ఆలోచనా విధానాన్ని నూరిపోసే పుస్తకాలు కదా నేటి యువతరం చదువాల్సింది. పుస్తకం కన్నతల్లి పాత్ర పోషిస్తుంది అంటాడు మాక్సిం గోర్కీ. అవును.. ఏది మంచో, ఏది చెడో వేలు పట్టి నేర్పిస్తుంది అమ్మ. పుస్తకం కూడా అలాంటిదే.. కాకపోతే వేలు పెట్టి మనం చదువుకోవాలి. అక్కడ ఉన్న విషయమంతా మెదడులో తిష్ట వేసుకొని కూర్చొని ఏం చేయాలో, ఏం చేయొద్దో విచక్షణ నేర్పిస్తుంది. కన్నతల్లితో మాట్లాడే సమయం కూడా కేటాయించలేని ఈ కాలం యువతరం పుస్తకాలకు సమయం కేటాయించగలదా? దీనికి కారణాలు కూడా లేకపోలేదు. మారుతున్న అలవాట్లు, వినోద మాధ్యమాలు, సోషల్ మీడియా ప్రభావం నేటి తరాన్ని పుస్తకాలకు దూరం చేస్తున్నాయి. యువతరం పుస్తకంతో దోస్తీ చేయాల్సిన అవసరం ఉంది.
BOOK3

కాలగమనానికి పుస్తకాలే పునాది. నిన్నటి చరిత్రను, నేటి వర్తమానాన్ని రేపటి తరానికి అందించే మాధ్యమమే పుస్తకం. అలాంటి పుస్తకం పట్ల అందరికీ అభిమానం, ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. ప్రేమ కూడా ఉండాలి. పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలుగాలంటే ముందుగా బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులే. లక్ష్య నిర్దేశానికి, జీవన మనుగడకు, మానసిక ఉల్లాసానికి ప్రేరణగా నిలిచేవి పుస్తకాలే. సోషల్ మీడియా, ఓపికలేని తత్తం, స్పీడు యుగానికి అలవాటు పడడం, తక్కువ సమయంలో ఎక్కువ సంతోషాన్ని ఆస్వాదించే తత్తం పెరగడం వల్ల నేటి యువతలో పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిపోతున్నది. ఇది వారి మానసిక ఎదుగుదలకు ప్రమాద సూచిక. ఏది మంచో, ఏది చెడో స్వయంగా తెలుసుకునే శక్తి కేవలం పుస్తక పఠనం వల్ల మాత్రమే అలవడుతుంది. తల్లిదండ్రులు ఒక దశలో, గురువులు ఒక దశలో, స్నేహితులు, తోటివారు ఒక దశలో తోడుండినా... ఎల్లప్పుడూ తోడుండేది కేవలం పుస్తక పఠనం వల్ల వచ్చిన విజ్ఞానమే. మానవ విలువలు పెంపొందించడానికి పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయి. వేడుకలు, బహుమతి ప్రధానోత్సవాలు, పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా మంచి పుస్తకం ఇచ్చే సంప్రదాయానికి ఇప్పటికే తెరలేసింది. కాకపోతే ఆ పుస్తకాలను అటకెక్కించకుండా అందులోని సమాచారాన్ని, విషయాన్ని బుర్రలోకెక్కిస్తే మంచిది. స్నేహితులు లేకపోయినా పర్వాలేదు. కానీ పుస్తకం చదివే అలవాటు లేకపోతే ఆ వ్యక్తికి, సమాజానికి రెండింటికీ చేటే అంటారు పెద్దలు. యూరప్, అమెరికా, సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్, ప్లాస్మా టీవీ, వర్చువల్ రియాలిటీ గేమ్‌లతో పాటు గదిలో ఓ అల్మారా నిండా పుస్తకాలుంటాయి. రోజులో అంతో ఇంతో పుస్తక పఠనానికి కేటాయిస్తారు వారు. మన దేశంలో కూడా ప్రతీ ఇంట్లో ఎన్నో కొన్ని పుస్తకాలున్నప్పటికీ చదివే ఆసక్తి వేగంగా తగ్గుతున్నది.

చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. ఎందుకంటే నిజంగా జ్ఞానవంతుడైన వాడు మీ చొక్కాను చూడడు. ఆ వ్యక్తిలోని జ్ఞానాన్ని గమనిస్తాడు. మాటను, రాతను ఒక ఇరుసులో కలుపుకొని ముందుకుసాగే జోడెడ్ల బండి భాష. ఆ భాషను తన కడుపులో దాచుకొని ప్రపంచానికి పంచేదే పుస్తకం. అక్షరం మనిషిని అద్భుతమైన శ్రవణ ప్రపంచం నుంచి తటస్థమైన దృశ్యంలోకి బదిలీ చేస్తుంది. అందుకే ఒక సరికొత్త లోకంలో విహరించాలన్నా, విజ్ఞానపు రెక్కలు కట్టుకొని అనంత లోకాల్లోకి ఎగిరి పోవాలన్నా పుస్తక పఠనాన్ని మించిన మార్గం లేదు.

గైడెన్స్ కావాలి..

మా దగ్గరికి ఎక్కువగా నలభై ఏళ్ల వయసు వాళ్లే వస్తుంటారు. 25 నుంచి 35 వయసు పాఠకులు కూడా వస్తారు. కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. మా దగ్గర అన్ని వయసుల వారికి కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. నిజానికి యువతను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు పుస్తకాలు అప్‌డేట్ చేస్తుంటాం. కానీ వారు ఎక్కువగా పోటీ పరీక్షల కోసం మాత్రమే పుస్తకాలు కొంటున్నారు. చాలా తక్కువమంది నవలలు, సాహిత్యం పుస్తకాలు కొంటున్నారు. అది వాళ్ల తప్పు కాదు. ఏ పుస్తకాలు చదువాలో, అసలు పుస్తకాలు ఎందుకు చదువాలో వారికి సరైన గైడెన్స్ లేదు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ కూడా పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గడానికి ఒక ప్రధాన కారణం. తక్కువ సమయంలో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ దొరికే మాధ్యమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఇప్పటి తరం. అది పుస్తకంలో దొరకదు. దీనికి తోడు పని ఒత్తిడి, ఖాళీ సమయం దొరకకపోవడం, పోటీ జీవితాలు, లైబ్రరీలు కావల్సినంత లేకపోవడం, యువతను ఆకట్టుకునే పుస్తకాలు అన్నిచోట్ల అందుబాటులో లేకపోవడం పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. పుస్తకం వల్ల వచ్చే జ్ఞానం తప్పితే, మిగతావన్నీ తాత్కాలికమే అన్న విషయం గుర్తుపెట్టుకుంటే మళ్లీ కచ్చితంగా అందరూ పుస్తకాలు చదువుతారు.
-సాంబశివరావు, నవోదయ బుక్‌హౌజ్ యజమాని, కాచిగూడ

నిబంధన విధించాలి!

నేను చాలా పుస్తక ప్రదర్శనల్లో గమనించాను. వస్తే చాలా పెద్దవయసు వారు, అంటే.. నలభై, యాభై పైబడిన వయసు వారు, లేదంటే బొమ్మల పుస్తకాలు కొనుక్కోవడానికి తొమ్మిది, పదేళ్ల పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. సరిగ్గా పాతిక సంవత్సరాలున్న వాళ్లెక్కడైనా కనిపిస్తారా అంటే చుక్కల్లో చంద్రుడిగా ఎక్కడో ఒకరు కనిపిస్తున్నారు. దీనికి కారణం నేటి యువతంతా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాకు అడిక్ట్ అయింది. స్పీడు కోరుకుంటున్నారు. గంటలు గంటలు చదివేదంతా క్షణాల్లో యూట్యూబ్‌లో చూసేద్దామన్న ఆలోచన పెరిగిపోయింది. దీనికి కారణం టెక్నాలజీ అభివృద్ధి చెందడం కూడా. ఒకప్పుడు రేడియోలో ప్రతిరోజూ పుస్తక పఠనం కార్యక్రమం ఉండేది. కొంతకాలానికి అది తీసేసి పుస్తక పరిచయం అనే కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు అసలు పుస్తకం ఊసే లేదు. ఇదిలాగే కొనసాగితే కొంతకాలం తర్వాత పుస్తకమంటే ఏంటి? అనే తరం మన కళ్ల ముందు తిరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రాథమిక స్థాయి నుంచే పుస్తక పఠనం నిబంధనగా, విధిగా పెట్టాలి. మా కాలంలో అలా ఉండేది కాబట్టే.. ఎన్నో పుస్తకాలు చదువగలిగాం. నేటి యువతకు ఫలానా కవి, రచయిత రాసిన పుస్తకం చదవండయా అని చెబితే.. ఓ నాలుగైదు పేజీలు చదువుతారు. ఆ తర్వాత బద్దకిస్తారు. అదే చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం తప్పనిసరి చేస్తే చదువుతూ ఎదుగుతారు. ఎదుగుతూ చదువుతారు.
-తనికెళ్ల భరణి, నటుడు, రచయిత, దర్శకుడు
tanikella-bharani

-గొప్ప పుస్తకాలలో గొప్ప వ్యక్తులు మనతో మాట్లాడతారు. అత్యంత విలువైన వారి ఆలోచనలను అందిస్తారు. వారి ఆత్మలను మనలో ప్రవేశపెడతారు.

-పుస్తకమనేది నువ్వు నిజం చేసుకోవాలనుకున్న ఒక కల. దాన్నెప్పుడూ నువ్వు చేతిలోనే పట్టుకుంటావు.

-పుస్తకాలను, స్నేహితులను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవాలి. వాటి ప్రభావం జీవితమంతా ప్రతిబింబిస్తుంది.

-మంచి పుస్తకం మన దగ్గరుంటే మనకు మంచి మిత్రులు వెంట లేని లోటు కనిపించదు.

-డిజిటలైజేషన్‌లో భాగంగా పుస్తకాలు, గ్రంథాలను పీడీఎఫ్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నారు.

-తెలుగు భాషలోనే 23, 257 పుస్తకాలు డిజిటలైజ్ చేయబడ్డాయి. ఈ పుస్తకాలు పీడీఎఫ్ రూపంలో www.dli.ernet.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో
ఉన్నాయి.

-ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకోట్ల మంది పుస్తకం ముట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపట్లేదట.

-ప్రతీ ఏడాది ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని ఏదో ఒక నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంటారు.

-2017లో రిపబ్లిక్ ఆఫ్ గినీలోని కొనాక్రీ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించారు.

-ఈ ఏడాదికి గ్రీస్‌లోని ఏథెన్స్ నగరాన్ని ఎంపిక చేశారు.

-ప్రపంచంలో ఎక్కువగా పుస్తకాలు చదివేవారు భారతీయులే.

-భారతీయులు వారానికి సగటున 10.2 గంటల పాటు పుస్తకపఠనం చేస్తున్నారు.

-మారుతున్న క్రమంలో పుస్తక పఠనంపై మోజు తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పుస్తక పఠనంలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు.

-మొట్టమొదటి పుస్తకం 8వ శతాబ్దంలో ప్రింట్ చేశారు. ఈ పుస్తకానికి ఉడ్‌బ్లాక్స్ వాడారు.

-ఆ తర్వాత రెండో పుస్తకం 14వ శతాబ్దంలో చైనా, కొరియా పుస్తకాలు ప్రింట్ చేయడం ప్రారంభించాయి.

-దీని బరువు 1500 కేజీలు. ఈ పుస్తకంలో 429 పేజీలున్నాయి.

-ప్రపంచంలో అతి చిన్న పుస్తకం కూడా ఉంది. ఇందులో కేవలం 30 పేజీలే ఉంటాయి.ఈ పుస్తకం చదువాలంటే మైక్రోస్కోప్ ఉండాల్సిందే.

-ఎంతటి క్లిష్టమైన సమస్యలకైన సులభంగా పరిష్కారాలు సూచించగలరు.

-పుస్తకం చదివితే.. పుస్తక పఠనం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. టీనేజ్‌లో గనుక పుస్తకం చదువడం అలవాటైతే అది జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది.

-ఏ విషయం గురించి ఎంత మాట్లాడాలన్న అవగాహన, విషయ పరిజ్ఙానం అభివృద్ధి చెందుతుంది.

-సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుంది. సామాజిక స్పృహ పెరిగి బాధ్యత గల పౌరులుగా ఎదుగుతాం.

-పుస్తకపఠనం మనిషికి శ్వాసక్రియలాంటిది. పుస్తకం వల్ల ఆరోగ్యకర ప్రయోజనాలే తప్ప నష్టాలేవీ ఉండవు.

-వారి మాటల్లో ఎదుటివారిని కట్టి పడేసే పదజాలం, నైపుణ్యం పెరుగుతుంది.

-పుస్తకం చదువడం అనేది ఆహ్లాదకరంగా, మనసుకు నచ్చిన పనిగా భావించే వారి ఆలోచనలు మిగతా వారి ఆలోచనల కంటే భిన్నంగా ఉంటాయి.

ముంజలు_IceApple_granthanidhi_mohanpublications_bhaktipustakalu

ముంజలు_IceApple_granthanidhi_mohanpublications_bhaktipustakalu


మురిపాల ముంజలు

వేసవిలో మాత్రమే దొరికే చల్లటి పండు ముంజలు. తాటి కాయ నుంచి వచ్చే ఈ ముంజలలో ఉండే నీళ్లు కొబ్బరి నీళ్లలా తియ్యగా ఉంటాయి. వీటిని తాజాగానే తీసుకోవాలి. వేసవిలో మాత్రమే పుష్కలంగా లభించే ముంజల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముంజలను ఐస్‌ ఆపిల్‌ అంటారు.
♦ దాహార్తిని తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.♦ ఇందులో విటమిన్‌ బి, ఐరన్, క్యాల్షియమ్‌ వంటివి పుష్కలంగా ఉంటాయి.

♦ తాటిముంజల గుజ్జులో కొద్దిగా పాలపొడి కలిపి కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు మీద పూస్తే ఉపశమనం లభిస్తుంది.
♦ ముఖానికి పూసుకుని, ఐదు నిమిషాల తరవాత కడిగేసుకుంటే, చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
♦ వేసవిలో ముంజల ద్వారా శరీర బరువు తగ్గించుకోవచ్చు. వీటిలో నీటిశాతం అధికంగా ఉండటం వల్ల త్వరగా పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో తేలికగా బరువు తగ్గవచ్చు.
♦ ఎండకు వికారంగా అనిపించినప్పుడు ఒక్క ముంజ తిన్నా వెంటనే ఉపశమనం కలుగుతుంది.
♦ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎసిడిటీని నివారిస్తుంది.
♦ చికెన్‌పాక్స్‌ నివారించడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది.
♦ వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది
♦ గర్భిణీలు తాటిముంజలు తినడం ద్వారా మలబద్దకం సమస్య తగ్గుతుంది.
♦ తాటిముంజల పొట్టును తీసి చర్మానికి మర్దన చేయడం వల్ల చెమటకాయలు తగ్గడంతో పాటు, చర్మానికి చల్లదనం అందుతుంది.

















నృసింహ_జయంతి_Lord_Narasimha

నృసింహ_జయంతి Lord_Narasimha lord narasimha swamy lord lakshmi narasimha swamy prahlada bhakthi pustakalu bhakti pustakalu narasimha jayanthi
 
 నృసింహస్వామి జయంతి

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీవరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీమహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు.

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవదానవమనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు.

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపములను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు - "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" - అని వారికి అభయమిచ్చాడు. హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని అప్పగించాడు.

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు. ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడుహిరణ్య కశిపుడు మండి పడ్డాడు.

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాద కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు. అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.
శ్రీ నరసింహావిర్భావం :

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. "
ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.
నృసింహస్తుతి
Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more


లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం
వందే కృపానిధిం అహోబలనారసింహం

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం 
వందే కృపానిధిం అహోబలనారసింహం

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం
కేయూరహారమణికుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం
వందేకృపానిధిం అహోబలనారసింహం

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం 
వందేకృపానిధిం అహోబలనారసింహం

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం
మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబలనారసింహం 

Information about Shri Narasimha Jayanti Festival.Narasimha Swamy Jayanti Date Narasimha Swamy Jayanthi Celebrations and more

తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందేకృపానిధిం అహోబలనారసింహం

పరమ పావనం.. మద్దిలేటిస్వామి దర్శనం Granthanidhi mohanpublications bhaktipustakalu



పరమ పావనం.. మద్దిలేటిస్వామి దర్శనం
ఆధ్యాత్మిక ఒడిలో కొలువుదీరిన క్షేత్రం

కొండకోనలు.. సెలయేటి గలగలలు.. ప్రకృతి అందాల మధ్య ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోంది క‌ర్నూలు జిల్లాలోని మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రం.

స్థల పురాణం 
మద్దిలేటి నరసింహస్వామి మొదట కదిరి నరసింహస్వామి. ఒకరోజు ఆనంద సమయంలో అమ్మవారితో పాచికలు ఆడి స్వామివారు ఓటమి పొందుతారు. విజయగర్వంతో స్వామిని అమ్మవారు హేళన చేయడంతో ఆయన ఆ అవమానం భరించలేక ప్రశాంత స్థలంలో కొలువుతీరాలని నిశ్చయించుకుంటారు. ఎర్రమల, నలమల అడవులను సందర్శించి చివరికి యాగంటి ఉమామహేశ్వరుడి సలహా అడుగుతారు. ఆయన సూచనమేరకు మద్దిలేరు వాగు పక్కన కొలువుదీరాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో మద్దిలేరుకు మూడు కి.మీ దూరంలోని మోక్ష పట్టణాన్ని కన్నప్పదొర అనే రాజు పరిపాలిస్తుండేవారు. ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవారు. ఓరోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తళతళ మెరుస్తూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాంటూ తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తారు. అది కోమలి పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భటులు వెనక్కి వస్తారు. అదేరోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనబడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది తానేనని.. అర్చక వేదపండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే పదేళ్ల బాలుడి రూపంలో వెలుస్తానని సెలవిస్తారు. అలా రాజు పూజలు చేయడంతో స్వామి ప్రత్యక్షమై భక్తుల కోర్కెలు తీర్చేందుకు వెలిశానని చెప్పి అదృశ్యం అవుతారు. అలా మద్దులేరు పక్కన కొలువై ఉండటంతో మద్దులేటి స్వామిగా, మద్దిలేటి నరసింహ స్వామిగా నిత్యపూజలు అందుకుంటున్నారు.బేతంచెర్ల మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామానికి 6 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రతి శుక్ర, శనివారాల్లో జరిగే పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. భక్తులు తాము అనుకున్న కోర్కెలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. జిల్లాలో స్వామివారి పేరుతో మద్దయ్య, మధు, మధుకిరణ్‌, మద్దిలేటి, మద్దిలేటమ్మ, మద్దమ్మ, మంజుల, మధనేశ్వరి, మయూరి ఇలా రకరకాలుగా పేర్లు పెటుకొని తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.

2008 నుంచి ఉత్సవాలు 
ఆలయ ఉనికి, పవిత్రతకు ఉత్సవాలు అద్దం పడుతున్నాయి. క్షేత్రంలో 2008 నుంచి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం అశేషభక్తుల మధ్య జరుగుతుంది. మూడురోజులపాటు పలు ఉత్సవాలు, క్రీడలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.

దినదినాభివృద్ధి 
మద్దిలేటిస్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. చాలాకాలం ఈ ఆలయం ఎలాంటి మౌలిక సదుపాయాలకు నోచుకోలేదు. 1985 తర్వాత అప్పటి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఉన్న చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి హయాంలో ఆలయం అభివృద్ధికి నోచుకుంది. ఆయన తన సొంత నిధులతో రహదారుల ఏర్పాటు, తాగునీటి వసతి, భక్తులు వెళ్లేందుకు మెట్లు తదితర వాటిని ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం ఆలయం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడుస్తుండగా దాతల సహకారంతో నిర్మించిన 150 గదులు అందుబాటులో ఉన్నాయి. భక్తులు సమర్పించిన కానుకలు, వేలాలు, దుకాణ సముదాయాలు ఇతర రూపాల్లో దేవస్థానానికి ఏటా రూ.4 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది.

ఇలా వెళ్లాలి
కర్నూలుకు 65 కి.మీ దూరంలో క్షేత్రం ఉంది. బేతంచెర్ల, డోన్‌ నుంచి ఆర్‌ఎస్‌ రంగాపురం వరకు బస్సు, రైలు సౌకర్యం ఉంది. నంద్యాల, డోన్‌ రైలు మార్గంలో రంగాపురం స్టేషన్‌లో దిగి ఆలయానికి చేరుకోవచ్చు.

శ్యామలా దండకం_Syamala Dandakam | RajaShyamalaTantram | రాజశ్యామలతంత్రం |devullu.com | mohanpublications bhaktipustakalu


శ్యామలా దండకం_Syamala Dandakam granthanidhi mohanpublications bhaktipustakalu


శ్యామలా దండకం_Syamala Dandakam granthanidhi mohanpublications bhaktipustakalu


శ్రీ రాజ శ్యామల తంత్రం 

Sri Raja Shyamala Tantram

  Raja Shyamala Chandhi Yagam 

 RajaMatangi



చల్లని చూపుల తల్లి! కాళిదాసు రచించిన ‘శ్యామలాదండకం’ అర్థాన్ని, విశేషంగా, విశ్లేషణాత్మకంగా, జీవితానికి ఉపయోగపడే విధంగా తెలుసుకుందాం.   మాణిక్యవీణా ముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసామ్‌! మాహేన్ద్ర నీలద్యుతి కోమలాంగీమ్‌ మాతంగకన్యాం మనసా స్మరామి!! శ్యామలాదేవి మాతంగ కన్య. మాతంగుల జీవనవిధానం ఎలా ఉంటుందంటే రెక్కాడితేగానీ డొక్కాడదు. గంటలు గంటలు పూజలు చేయడానికి వారికి సమయం ఉండదు. అందుకే శీఘ్రఫల దేవతలను వాళ్లకు అప్పగించారు. వాళ్ల జీవనశైలి ఉంటుందో దేవతల జీవనశైలి అలాగే ఉంటుంది. శ్యామలా దేవి చేతిలో చూడండి. వీణ ఉంటుంది. దాన్ని ‘ఏకతార’ అంటారు. ‘మాణిక్యవీణ’ అంటే అదే. భక్తిపారవశ్యంలో ఎప్పుడూ మత్తు ఎక్కువ ఉండాలి. మత్తు అంటే సేవించడం వల్ల వచ్చే మత్తుకాదు. మాతంగులు బాగా శ్రమపడతారు. ఆ శ్రమ వల్ల అలసట చెందుతారు. అదే రూపంలో అమ్మవారు ఉంటారు. ఇంద్రనీలమణిలా కోమలమైనటువంటి కాంతులు కలిగి ఉంటారు.   చతుర్భుజే చన్ద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే! పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస్తే నమస్తే జగదేకమాతః!! అమ్మవారిని స్మరించడంలో మనస్సు ప్రధానం. లలితాదేవి సహా అమ్మవారి రూపాలన్నింటిని చూడండి. నాలుగు భుజాలుంటాయి. చతుర్విధ పురుషార్థాలను మనం సాధించాలని చెప్పడానికే ఆ నాలుగు భుజాలు. శ్రీమహావిష్ణువుకు కూడా నాలుగు భుజాలుంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో నువ్వు ధర్మంగా ఉండు. ఆ ధర్మంతోనే ధనాన్ని సంపాదించుకో. ధర్మంగా సంపాదించిన దాంతో నీ కోరికలు తీర్చుకో. ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకు. అదే మోక్షం! నాలుగు దిక్కుల నుంచి నీకు ఏ ఆపద వచ్చినా కాపాడతాను! అని అమ్మవారు చెప్పడానికే నాలుగు చేతులు. మాతంగీదేవి అమ్మవారికి నెత్తిన చంద్రుడు ఉంటాడు. ఆ తల్లి చల్లని చూపులు మనందరినీ రక్షించు గాక! డా. గరికిపాటి నరసింహారావు

----------------------------------------
శ్యామలా దండకం

ధ్యానమ్-
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||
చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||

వినియోగః-
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |

కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||

స్తుతి-

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |

జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||


దండకమ్-

జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే,సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,

సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ

మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,

తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,


పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,

సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,

సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||

mohan publications price list