MohanPublications Print Books Online store clik Here Devullu.com

About Us MOHAN PUBLICATIONS

  
MOHAN PUBLICATIONS





మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి వారు అనేక సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక గ్రంధాలను, పురాణాలను, వ్రతాలు, పూజలు, పంచాంగాలను, పుస్తక రూపంలో అతి తక్కువ ధరకు అందిస్తూ హిందూ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అంతే కాకుండా అనేక పురాతన గ్రంధాలను సేకరించి వాటి విలువలను కాపాడే సదుద్దేశ్యంతో అందిస్తూ "మోహన్ పబ్లికేషన్స్" వారు ఆధ్యాత్మిక సేవ, ఇప్పుడు మరో ముందడుగు వేసి అనేక పుస్తక రత్నాలను కంప్యూటర్ లో PDF రూపం లో నిక్షిప్తం చేసి ఇంటర్నెట్ ద్వారా మన దేశం లోని వారే కాకుండా మన తెలుగువారు ఏ దేశం లో ఉన్నా ఈ పవిత్ర గ్రంధాలను, వ్రతాలను, పూజలను ఇంటర్నెట్ ద్వారా పొందే అవకాశాన్ని ఇప్పుడు "మోహన్ పబ్లికేషన్స్" కల్పిస్తుంది.
  • హిందూ సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి తెలియచెప్పాలని సంకల్పంతో వందలాది ప్రాచీన గ్రంధాలు స్కాన్ చేసి పి.డి.ఎఫ్. ఫైల్ రూపంలో ఆధ్యామిక జ్యోతిష,వాస్తు వైద్య గ్రంధాలు,ఆలభ్య విలువగల గ్రంధాలను , మరియు విద్యార్దులకు అవసరమైన డిక్షనరీస్,వ్యాకరణాది ఎడ్యుకేషన్ కు సంబంధించిన గ్రంధాలు, అనేకం సేకరించి దొరకని గ్రంధాలను వెబ్ సైట్ లో నిక్షిప్తం చేసి ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించబడింది.

  • ఈ మధ్యకాలంలో అనేక మంది భక్తులు వివిధ కార్యక్రమాలలో అనేక రకాల పుస్తకాలను ఉచితంగా పుస్తకాలు వితరణ చేయాలంటే ఎన్ని లక్షల పుస్తకాలైన సరిపోవు.అందుచే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా 'ఇంటర్ నెట్' ద్వారా ఈ పుస్తకాలను అందించాలని సంకల్పించాం.ఇంటర్ నెట్ ద్వారా మేము కూడా ఏర్పాటు చేయడానికి వచ్చిన ఆలోచన తోనే ఈ పుస్తక రత్నాలను పి.డి.ఎఫ్. చేసి ప్రతి ఒక్కరు ఉచితంగా చదువుకునే విధంగా,ప్రింట్ తీసుకుని భద్రపరుచుకునే విధంగా ఈ వెబ్ సైట్ లో నిక్షిప్తం చేయడం జరిగింది.

  • కంప్యూటర్స్,'ఇంటర్ నెట్' లేని వాళ్ళు నెట్ సెంటర్స్ కు వెళ్లి వారికి కావలసిన బుక్స్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్స్ తీసుకుని చదువుకునే సదుపాయం కలదు.

  • కొనుగోలు చేసుకోగల స్థితిలో ఉన్న చాలా వరకు బజారులో దొరకని గ్రంధాలు ఇందు చదువుకొని అవకాశం కల్పించబడింది.ఎవరికీ ఏ ఒక్క పేజీ అవసరమైన ఆ సమాచారాన్ని మాత్రమే ప్రింటు తీసుకుని చదువుకునే అవకాశం.

  • రాబోయే పండుగల వ్రతాలు,పూజలు సంపూర్ణంగా కూడా ఎప్పటికప్పుడు అందచేస్తూ యావత్ ప్రపంచంలో ఎక్కడైన నెట్ ద్వారా ఉచితంగా పొందే అవకాశం.

  • ఇప్పటి వరకు మేము 2000 పైగా వివిధ గ్రంధాలను వెబ్ సైట్ లో నిక్షిప్తం చేయడం జరిగింది.రాబోయే నెలల్లో 3000 కి పైగా అనేక రకాల గ్రంధాలను అందిస్తామని తెలియచేయుటకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.

  • ప్రపంచంలోనే మొట్ట మొదటి తెలుగు ఉచిత ఇ.బుక్స్ వెబ్ సైట్ ఇదేనని భావిస్తున్నాం.

2 comments:

  1. అయ్యా,

    నేను internet లో మీ తెలుగు calendar, తెలుగు మాసములతో చూసాను.
    నేను ఈ calendarని కొనదలచాను.
    https://archive.org/details/mohanpublications_gmail_201801

    ధరను బట్టి ఒక 100 calendars లేదా ఎక్కువ కొన దలచాను.
    దయ ఉంచి ఎలా కొనాలో, order ఎలా పంపాలో తెలుపగలరు.

    ReplyDelete
  2. I want to download ebook of Samskara Chinthaamani part one and two. Please guide me
    D V SASTRY

    ReplyDelete

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list